లింగ మహా పురాణము

Table of Contents

33 -  మహాదానపంచమమగు కల్ప వృక్షదానమును నిరూపించుట

కల్పవృక్షాకారమును - అనేకశాఖలు, శాఖా గ్రములయందు ముత్తెముల హారములు, పైభాగమున మరకతమణులు, పగడములు చిగురుగాను, పద్మరాగమణులు ఫలములుగాను, నీలరత్నము మూలముగాను, వజ్రము స్కంధము (చెట్టుబోదె) గాను, వైడూర్యము వృక్షాగ్రముగాను, పుష్పరాగము వృక్షముస్తకముగాను, యథాశక్తి సువర్ణముతో - చేయించవలెను. చంద్రకాంతమణితో లేక స్ఫటికముతో వృక్షమును నెలకొలుపుటకు వేదికను నిర్మింపవలెను. చెట్టు ఎత్తు జానెడు, కొమ్మలు ఎనిమిది
యుండవలెను.

వృక్షమూలమున - లోకపాలురతో కూడ - శివలింగము నర్చింపవలెను. లోకపాలురను పూజింపవలెను. జప హోమాదులను ప్రణవషడక్షర మహామంత్రముతో నాచరించి - వృక్షమును పరమేశ్వరునకు నివేదించియు భస్మ రుద్రాక్ష మంత్ర  లింగధారులగు బ్రాహ్మణులకు అథవా శివయోగియైన ఆచార్యునకు సమర్పించినచో - మరుసటి జన్మమున చక్రవర్తియగును.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (33)వ  ధ్యాయము.