లింగ మహా పురాణము
88 - మోక్షమునకు మరియు అణిమాద్యష్టసిద్ధి ప్రాప్తికిని సాధనమును నిరూపించుట
సూత ఉవాచ -
సూత మహాముని - శౌనకాది మహర్షుల యొక్క జిజ్ఞాసను గుర్తించి చెప్పు చున్నవాడు. సామాన్యులకు ఆదరంపనలవి గాని మోక్షప్రాప్తి యోగమెట్టి చనఁగా ? శివుని చిత్తమునందు నిలిపి - సధ్యోజాత కామదేవ అఘోర తత్పురుష, ఈశానములు అను పంచ బ్రహ్మరూపములతో నున్నవానిగా హృదయకమలమున చింతింపవలెను.
మరియు అష్టమూర్తులు గలవాని గాను శివుని ధ్యానింపవలసియుండును. ఇట్టి ధ్యానమున కంటె ముందు - శుచియై భస్మరుద్రాక్షలను ధరింపవలెను. ఇదియే మోక్షసిద్ధి ప్రదముగు పాశుపరయోగము. ఈ యోగము నభ్యసించు వానికే - అణిమాద్యష్టసిద్ధులు - ఈ లోకముననే సంభవించును.
అష్ట సిద్ధులను వివరించుచున్నాను. ఎట్లనగా ?
అణిమ = అన్నిటికంటె చిన్నగా నుండుట,
గరిమ = సమస్తమును మంచిన పెద్దరూపము కలిగి యుండుట.
లఘిమ = వస్తువులన్నిటి కంటె చులకనగా నుండుట
మహిము = ఆకాశగమనామలతో గొప్పవాడై యుండుట
ప్రాప్తి = భోగములన్నియు లభించినట్లు తృప్తితో నుండుట
ప్రాకామ్యము = కోరికలన్నియు మనస్సులో తీరియుండుట
వశిత్వము = సమస్తమును శాసించు సమర్థత కలిగియుండుట.
వశిత్వము = ఇంద్రియములను శరీరము: నడుపులో నుండులు.
శబ్ద స్వర్య రూప రస గంధముల యనుభవము - శివయోగి యొక్క ఇష్టము ననుసరించియే ప్రవర్తించును. ప్రకృతి మహిమ శివయోగియందు నిరర్ధకమగును. జీవాత్మ అణువగులుచే సూక్ష్మాతి సూక్ష్ముడై ముక్తదశయందు విభువగును. ప్రభువు మాత్రము కాడు.
పాశుపతయోగపరిపూర్ణతకై - మొదటి శివలింగము నర్చింపవలసియుండును. ఐతే తన వయస్సును శరీరదార్ధ్యమును గమనించి శిపు సాధింపవలెనని ఇట ద్యోతకమగుచున్నది.
శుక్రము (రేతస్సు) ఉద్భవించు క్రమము ఎట్లనగా ?
ఆకాశము నుండి ఏతెంచు వాయువువలన నేర్పడు జలము యొక్క సారాంశము శుక్రముగా పరిణమించను.
పురుషుని శుక్రము స్త్రీ రక్తము కూడి గర్భమగును. తొమ్మిది నెలలు కరచరణాదులతో చుట్టబడి క్రింది ముఖము గల శిశువు యోని చ్ఛిద్రమునుండి బయటపడును. జన్మించి కొన్నాళ్లు జీవించి పాపముల నాచరించినచో మరణానంతరము నరకగామి యగును. ప్రపంచమున నొకడే మహా ప్రయాణము జేయును. ఒకడే కర్మఫలము ననుభవించును గాన బలవంతముగా నైనసు పుణ్యముల నొనర్పవలసియుండును.
జీవాత్మ స్థూలదేహమును విడనాడి వెళ్లునపుడు వాని నెవడు ననుసరింపడు గదా ! చేయబడిన కర్మయే వెంటాడును.
కర్మచేతను మనస్సుచేతను వాక్కు చేతను ఎల్లకాలము ఆచరించుటయే అభ్యాసమగుసు. అట్టిది దురభ్యాసమైనచో తనను భ్రష్టుఁజేయును. అందువలన సాధ్యమైనంత వరకు దాన ధర్మ జప పూజన ధ్యానాది శుభకార్యముల (జేయుచుండవలెను. సంసారము అనునది తామసమైనచో మానవత్వము నుండి పశుత్వము, మృగజన్మయు, పక్షిత్వము, సర్పజన్మయు, వృక్షాది స్థావరత్వంబు క్రమముగా
తారసిల్లును.
స్థావరములలో బిల్వతులస్యాది వృక్షజన్మలు సంఘటించినచో జీవాత్మ ప్రబుద్ధుడై
పూర్వపూర్వపుణ్యశేషముచే ఉత్తమమానవుడుగా జన్మించి శివభక్తుడై పాశుపత యోగము నవలంబించి శివధ్యాన పరుడై ముక్తుడగును.
బ్రహ్మాచుల యొక్క సంసారము సాత్త్వికమగును. సంసార సముద్రసేతువగు పరమేశ్వరుడే మముక్షుధ్యేయు డగువాడు.
హృదయమున వైశ్వానరాగ్నెగా శివుడున్నవాడని భావించి ప్రాణాది పంచవాయువుల ద్వారా ఘృతాన్నమును పంచాహుతులుగా సమర్పించవలెను. వస్త్రపూతమైన ఉదకమును త్రాగవలెను. ఆ పిమ్మట తన ఇష్టానుసారము ఆహారమును భుజింపవలెను. భోజనానంతరము ఆచమనముఁజేసి హృదయమును తాకి “ప్రాణానాం గ్రంధిరసి రుద్రో మా విశాంతకః” అను మంత్రము జచువుచు “రుద్రుడే నా ప్రాణము” అని మరియు “సర్వజగత్ర్పభువగు సదాశివుడు సంప్రీతుడగుగాక !” అనియు శరీరము అను పురమునందు శయనించి పురుషుడనబఱుగుదువు !” “నేను భుజించు ఆహారమంతయు నీకు హులమగుగాక !” అనియు భావింపవలెను,
ఇట్లు అణిమాద్యష్టసిద్ధులు,మోక్షంబు లభించుటకు పరమసాధనమగు పాశుపతయోగమును ప్రబోధించితిని.
భస్మస్నాతుడు భస్మలిప్రుడునై శివుని ధ్యానించుటయే పాశుపత యోగలక్షణమై యున్నది. దీనిని చదువువాడు వినువాడు నుత్తమగతి నొందుదురు.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (88)వ అధ్యాయము.
