లింగ మహా పురాణము

Table of Contents

51 - వజ్ర వాహనికా విద్యను సేతిహాసముగ నిరూపించుట

వజ్ర వాహనికావిద్య సర్వశత్రు భయంకరమైనది. విధాన మెల్లనఁగా?

వజేశ్వరీ మంత్రముతో వజ్రము నభిషేకించి రాజునకొసఁగవలెను. వజ్రముపై బంగారుపుల్లలో వజేశ్వరీ మంత్రమును వ్రాసి, అక్షరలక్షగా జపించవలెను. వజ్రాకారకుండము నందు ఘృతాదులతో దశాంశము హవనము నొనర్చి - తద్దశాంశములుగా తర్పణమార్జన అన్నలదానములను చేయించిన
పిమ్మలు - రాజు అట్టి వజ్రమును తన చెంత రహస్యముగా నుంచుకొని రణరంగమునకు
వెళ్లినచో - శత్రువులు పరాజితులగుదురు. 5,00,000 జపము, 50,000 హవనము, 5,000  తర్పణ మార్జనములు, 500 బ్రాహ్మణ భోజనంబునని అసుష్ఠానక్రమము.

పూర్వము పితామహుఁడీ వజ్రేశ్వరీ విద్యను సంపాదించి దేవేంద్రున కుపకరింపఁజేసెను. ఆ ఎట్లనఁగా?

త్వష్ట యనువాడు - దేవేంద్రుఁడు తన కుమారుని వధించినందున - వైరముతో గావించిన సోమ యాగమునందు “నీకు హవిస్సు నీయనని దేవేంద్రుని నిరాకరించెను. అంత డేవేంద్రుఁడు బలాత్కారముగ యాగవాటికఁ బ్రవేశించి సోమలతారసముఁ దైవగా త్వష్ట ప్రజాపతి క్రోధముతో ‘‘ఇంద్రస్యశత్రో! వర్ధస్వ” అనుచు సోమలతా రసశేషమును హవనముఁజేసెను. అంత నా అగ్నికుండము నుండి కాలాగ్ని సమానుడగు వృత్రుడు ఉద్భవింపగా - దేవేంద్రుడు తన పరివారముతో గూడ భయపడి పారిపోయెను.

 అంత బ్రహ్మవిష్ణుమహేశ్వరులు వజ్రేశ్వరీ విద్య నుపదేశింపగా దేవేంద్రుడా విద్య (మంత్రము) ననుష్ఠించి వృత్రాసురుని వధింపగలిగెను. సూర్యరథము నడ్డగించు మందేహరాక్షసులీ విద్య చేతనే నిత్యము తొలగింపఁబడుచుందురు.

 “ఓం భూ ర్భువస్స్వః ఓం తత్సవితు ర్వరేణ్యం - భర్గో దేవస్య ధీమహి - ధియో యో నః ప్రచోదయాత్ - ఓం ఫట్ జహి హుం ఫట్ ఛింది భింది జహి హన హన స్వాహా” అనునది - వక్రేశ్వరీ మంత్రము;

ఈ మంత్రము నుపయోగించియే పరమేశ్వరుఁడు ప్రళయము నొనర్చును.

ఇయ్యది
 “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (51)వ యధ్యాయము.