లింగ మహా పురాణము

Table of Contents

40 - పన్నెండవ కన్యాదానమును వర్ణించుట

కన్యాదానము - సర్వదానములలో ఉత్తమమైనది. ఎట్లనగా? , రూపము మంచి గుణములు అవయవసౌష్టవంబు గల కన్యను – “తలిదండ్రులను సంప్రదించి కన్యాదాన సమయమును నిర్ణయించివారికి గొప్పగా సువర్ణాది ధనమునొసంగీయు” తన కూతురుగా కన్యాదాత ఎన్నుకొని కన్నకు మంగళ స్నానమును చేయించి నూతన వస్త్రమును కట్టించియు బంగారు కొమ్ములఁబెట్టించి సుగంధ పుష్పమాలికును ధరింపజేసియు -  శుభశకునములను కనిపెట్టి గోత్రనక్షత్రాలను పరిశీలించి సంతోషింపజేసి - వధువును - వేదాధ్యయన సంపన్నుడు సదాచారపుండు బ్రహ్మచారియు నగుబ్రాహ్మణునకు సమర్పింపవలెను. కూతురునకు అల్లునకును - విశేషధనమును భూమిని పరిచారకుల నీయవలెను.

ఇట్లు కన్యాదానముఁజేయువాడు - కన్యకు కన్యాసంతతికిని ఎన్ని కంట్రుకలుండునో అన్ని వేలసంవత్సరములు రుద్రలోకమున సుఖపడును,

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక”  అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (40)వ యుధ్యాయును.