లింగ మహా పురాణము

Table of Contents

44 - మహాదానములలో పదునారవ త్రిమూర్తి దానమును నిర్దేశించుట

సమాచీన ప్రదేశమున సుసమయమునందు మండపమున పీఠముపై – “వామభాగమున విష్ణుమూర్తి దక్షిణ భాగమున బ్రహ్మదేవుఁడు, మధ్యన శివవిగ్రహము - లేక - శివలింగంబు నుండునటుల - త్రిమూర్తులను యథాశక్తి సువర్ణముతో చేయించి’’ ఉంచవలెను.

స్థండిలమున రుద్రవిష్ణు బ్రహ్మ మంత్రములతో ప్రత్యేకము 108 పర్యాయములు ఘృతచరు సమిధాదుల నగ్నియండు హవనమును ముగ్గురు బ్రాహ్మణులతో చేయించి - శివలింగమును బ్రహ్మవిష్ణుమూర్తుల నతిశయభక్తితో పూజించి - దానముఁజేయవలెను.

ముగ్గురు విప్రులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి - వారికి దక్షిణగా - సువర్ల వస్త్రాదులను సమర్పింపవలెను. బ్రాహ్మణులకు ధీనాంధ కృపణాదులకు నన్నదానముఁజేయవలెను.

ఇల్లొనర్చువానికి - సత్యలోక వైకుంత కైలాసముల యందు చిరకాలము దివ్యసుఖములు సంప్రాప్తములగును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక”  అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (44)వ యథ్యాయము.