లింగ మహా పురాణము
70 - ఆది సృష్టి కథనము
శౌనకాదులు ఆచిసృష్టిని ఎవరింపుముని ప్రశ్నింపగా సూళుఁడు చెప్పదొడంగెను.
శ్లో॥ మహేశ్వరో మహాదేవః ప్రకృతేః పురుషస్య చ । పరల్వే సంస్థతో దేవః -- పరమాత్మా, మునీశ్వరాః ॥
మునీశ్వరులారా ! మహేశ్వరుఁడు మహాదేవుఁడు నగు పరమాత్మ - ఆడిసర్గమున ప్రకృతిని పురుషుని నియమించువాడై స్వయం ప్రకాశమాసుఁడునై యుండెను. అట్టి పరమేశ్వరుని వలన జగచుపాదాన కారణమగు అవ్యక్తమనఁబులుగు ప్రధానము (ప్రకృతి) వేరుపడినది. మహాదేవాఖ్యమగు పర బ్రహ్మము- గంధము వర్ణము రసము స్పర్యము శబ్దంబులేనిదియై - అజరము, ‘ధ్రువము, అక్షయము, నిత్యము, జీవాత్మయండుండునది, జగUరణము, మహా ప్రాణము, సనాతనంబునై యుండెను.
పరబ్రహ్మము (దగు సంకల మువలన -- సమస్త ప్రాణి సముప్పుడూ సము: గం ఆద్యంతములు సులు సత్త్వరజస్తమోగుణాత్మకంబు నగు పురు వసు రూప వచ్చును. ఈ బడు విశ్నము నడిపించాడు.
సత్త్వరజస్తమో గుణముల యొక. సమాన స్థితి గల కాలమున నామరూ భాగము అను గాఢమైన తమసేర్పడెను. సృష్టికాలము, సామరూపవిభాగము గల జకరు సంభవించెను. గుల తయును యొక. హెచ్చు తగ్గులవలన సృష్టి కొనసాగుచుండును. ముహర్తత్వము, అహంకారము, తను బుద్ధి, చిత్తము ననునవి ఆవిర్భవింపగా సూక్ష్మశరీరములు జీవాత్మలకు సంయుక్తము చేవ మానవ పశు పక్ష్యాది స్థూల శరీరములు సంలగ్నములైనవి.
పరమేశ్వరుఁడే ఖ్యాత యనియు జ్ఞానమనియు సర్వేశ్వరుఁడనియు వ్యవహరింపబడును. మనస్సు వలన సంకల్పము; బుద్ధివలన నిశ్చయము, చిత్తము వలన ఆలోచనయు సంభవించును. జీవాత్మలకు సూక్ష్మ స్థూల శరీర సంయోగము:నకు మున్ను పంచీకృతములు కొనవీ అనగారి ఒక దానిలో మరియొకటి కలియని తన్మాత్రలు - ఆ పేడప పంచీకృతములైన ఆకాశ వాయు తేజు! సుల పథి అత్యములు, శబ్ద స్పర్శ రూప తన గంధములు సంభవించినవి. ఆ తరువాత పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు సంసీడములైనవి.
ము, వ్యక్, (చర్మ) నే క్రమును, నాలుక, నాసిక యను జ్ఞానేంద్రియములు ,
రూప రస గంధములను స్వీకరించునవి కాగా, పాదములు, గుదము, ఉపస్థము, హస్తములు:నను కర్మేంద్రియములు గమన విసర్గ ఆనంద శిల్ప జాహ్యములు రాపాదించును ,
ఆకాశమున ఉన్న రెండింతలు వాయువు, నాయువునకంటే మూడు కోట్లు అని, అన్ని కు నడుము నాలిగింతలు, ఉడకముల కన్న భూమి ఐదు రెట్లు అధికముగా నుండును”
పంచభూతములు ఒకదానిలో మరియొకటి కూడినవై ఒక చాం ::
ఆధారణ సలగుచున్నవి. లోకాలోకపర్వతముల వరకు గల సమస్తము భూమిపై ఆధారపడి అను ది.
ఇట్టే ప్రపంచమునకు మూలమగు ప్రకృతిని పుచుఁషుడధిస్ట్రించుటచే బ్రహ్మండము ఉరు. ఉరమునందుండగా బ్రహ్మాండము నావరించిన ఉడకము పదిరెట్లు పంచుతుండెను. ఉడుము నును పదిరెట్లు మించిన తేజస్సు ఆవరింపగా తేజస్సుకు పదింతలు వాయువు ఆక్రమించెను. వాయువును, పదింతలు అధికముగా ఆకాశము చుట్టుముట్టెను. ఆకాశమును ఆహంకారము అవరింపగా కాం కొరమును మహత్తత్త్వము అధిష్ఠించెను. మహాతత్వమును అవ్యక్తము ఆవరించెను,
సదాశివుడు బ్రహ్మాండము యొక్క రెండు కపాల (భేద) ములలో శప్పుడుగాను,
ఉడకమునందు భవుండుగాను. అగ్నియందు రుద్రుడుగాను; వాయువులో ఉగ్రవుండును ప్పథినిని భీముఁడు గాను, అహంకారమున మహేశ్వరుఁడు గాను, బుద్ధి (మహత్తత్త్వము) యందు ఈ శుఁడుగాను; అంతట పరమేశ్వరుడుగా నుండువాడు.
ఇట్లు ఏడు ప్రాకృత ఆవరణములతో బ్రహ్మాండము చుట్టఁబడియుండునది.
శ్లో॥ మహేశ్వరః పరోవ్యక్తా డండ మవ్యక్తసంభవం ।
అండా జైజై సఏవేశః - పురుషోర్కసమప్రభః ॥
తస్మిక్ కార్యస్య కరణం-సంసిద్ధం స్వేచ్ఛయైవ తు ।
సవై శరీరీ ప్రథమః సవై పురుష ఉచ్యతే
తస్య వామాంగజో విష్ణుః సర్వదేవనమస్కృతః ।
లక్ష్మ్యా దేవ్యా హ్యభూ దైవ- ఇచ్ఛయా పరమేష్ఠినః ॥
దక్షిణాంగభవో బ్రహ్మా-సరస్వత్యా జగద్గురుః ॥
అవ్యక్తమును మించినవాడు మహేశ్వరుఁడు కాగా బ్రహ్మాండము అవ్యక్త (ప్రధాన) మునుండి సంభవించినది. బ్రహ్మాండమునందు మహేశ్వరుడే - సూర్యసమానకాంతి గల పురుషుడుగా ఆవిర్భవించెను. మహేశ్వరునకు జగత్సృష్టికి వలయు సాధనములు సహజములుగా లభించెను. మహేశ్వరుఁడే మొదటి శరీరియై పురుషుఁడని పేర్కొనబడుచున్నవాడు. మహేశ్వరుని వామాంగము నుండి సర్వదేవతాపంద్యుడగు విష్ణువు లక్ష్మీదేవితో గూడ పరమేశ్వరుని సంకల్ప వశమున నుదయింపగా జగద్గురువైన బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో గూడ దక్షిణాంగము నుండి యుద్భవించెను.
బ్రహ్మాండమునందే పదునాలుగు లోకములు, లోకాలోకాచలములు, సూర్యచంద్రులు, నక్షత్రములు, గ్రహములు మొదలగు విశ్వమంతయు ఇమిడియున్నది.
సృష్టికాలమంతయు పరమేశ్వరునకు ఒక దినము కాగా ప్రళయ కాలము రాత్రి యగును. వస్తుతః పరమేశ్వరునకు దివారాత్రవిభాగముతో కాలపరిమితి లేకున్నను దేవ మానవుల వ్యవహారముఁబట్టి దివారాత్రకాలముఁ దగు విభాగము ఉపచరింపబడినదని తెలియవలెను.
ధీమంతుఁడగు పరమేశ్వరుని దినములో ఇంద్రియములు, విషయములు, పంచ
మహాభూతములు, ప్రాణులండరు, అహంకారము ఇత్యాది సమస్తము ప్రవర్తించుచుండును.
రాత్రియందు అవ్యక్తము పరమేశ్వరునిలో దాగియుండును గాన ప్రధానమయొక్క
సృష్టియంతయు ఉపసంహరింపబడును. ప్రధాన (ప్రకృతి) పురుషులు సంతరించెడరు. సత్త్వ రజస్తమోగుణముల యొక్క సమానత్వము ఇత్యాది పరిస్థితియే ప్రళయమగును.
సత్త్వరజస్తమోగుణముల యొక్క హెచ్చుతగ్గులచే - సృష్టియగునది. నువ్వులలో నూనె వలె, పాలలో నెయ్యివలె, సత్త్వరజస్తమోగుణములయందు జగత్తు ఇమిడియున్నది, సృష్టికాలములో మహేశ్వరుఁడు “తననుండి విడిబడిన ప్రకృతి పురుషులను తన మహిమచే ఒకరియందు మరి యొకరు ఆసక్తి కలవారగునట్లు ప్రేరేపించును.
మహేశ్వరా త్రయో దేవా-జరే జగదీశ్వరాత్ । శాశ్వతాః పరమా గుహ్యాః - సర్వాత్మనః శరీరిణః ॥
జగన్నాథుఁడైన మహేశ్వరుని వలన -- శాశ్వతకాలముండువారు, సర్వ దేవతా శ్రేష్ఠులు, భక్తులను పరోక్షముగ ననుగ్రహించువారు, ప్రాణులందరు సన్మార్గులగునట్లు నియమించువారు, దివ్య శరీరధారులు నగు బ్రహ్మవిష్ణురుద్రులు - ఆవిర్భంచిరి.
వీరే త్రిమూర్తులుగాను రజస్సత్త్వతమోగుణ సంపన్నులు గాను, స్వర్గ మర్త్య
పాతాళాధీశ్వరులుగాను, గార్హపత్య ఆహవనీయ త్రేతాగ్నులుగాను వ్యవహరింప బడుచుందురు. మరియు నీ బ్రహ్మ విష్ణురుద్రులు ఒకరి నొకరు ఆశ్రయించి పరస్పరము అనుకూలురై ఒకరికి మరియొకరు సహకరించుచుందురు. వీరికి ఎన్నటికిని ఎడబాటు లేదు. రుద్రుడు శ్రీహరిని మించిన వాడు కాగా విష్ణువు బ్రహ్మకంటె నధికుడుగా చతుర్ముఖుడు ప్రకృతికన్న పరుఁడుగా నుందురు.
అనుపమాన లేజస్వి యగు రుద్రుఁడు-మొదట మహేశ్వరుని మహిమ గలవాడై ఉదయింపగా రుద్రుని వలన నారాయణుడు సంభవించెను. శ్రీహరి యొక్క నాభికమలము నుండి బ్రహ్మదేవుడు జన్మించెను. చతుర్ముఖుడు బహ్మరూపమున సృష్టి ఁజేయుచుకొల రూపమున ప్రళయమునొనర్చుచు పురుషరూపమున ఉదాసీనుడై యుండును.
బ్రహ్మదేవుఁడు కమలగర్భముఁబోలియుండును. రుద్రుఁడు కాలాగ్ని సదృశుఁడై యుండును. నారాయణుఁడు పురుషుఁడై యుండును. ఈ మువ్వురును తరతమభావముతో మహేశ్వరుని రూపాంతరములగువారని తెలియవలెను.
సమస్తమును పొందుటయు, సర్వమును గ్రహించుటయు (ఇంద్రియ సుఖముల
ననుభవించుటయు, ఎల్లకాలముండుటయు కారణములుగా మహేశ్వరుఁడు ఆత్మ యనఁబడును.
మరియు సర్వగతుఁడగుటచే ఋషియనియు, దేవమానవాది శరీరములను
జీవాత్మలకంటగట్టుట వలన శరీరి యనియు, సమస్తము తనదే గావున స్వామి యనియు;
చరాచరప్రాణులలో చోటబడుట వలన విష్ణు వనియు; సర్వజత్వాది దివ్యగుణములు గలిగియుండుట యను భగవద్భావము కలవాడగుటచే భగవానుడనియు; ఆణవ మాయిక కార్మికమలములు బొత్తుగా లేనివాడగుటఁ జేసి శివుడనియు; సర్వ శ్రేష్ఠాతి శ్రేష్ఠుడగుట వలన - పరముడనియు జగత్తును రక్షించుటచే “ ఓమ్ “ అనియు, వస్తుగత ములైన రూపరస గంధపరిమాణాదుల నొకేసారి గుర్తించువాడగుటవలన
సర్వజ్ఞుడనియు; సర్వాత్మకు డగుటచే సర్వుడనియు; తనను మూడు విధములు విభజించినందున త్రైలోక్యాధీశ్వరుడై సృష్టి స్థితిలయకర్తయనఁబడుజుఁగుననియు; సమస్తమున కంటే ముందుండుటచే ఆదిదేవుఁడనియు; జన్మలేని వాడగుట వలన అజుడనియు; ప్రజలందరు అధోగతులు కాకుండ కాపాడును గాన ప్రజాపతి యనియు, హరి బ్రహ్మాద్యమరులను మించినవాడు గాన మహాదేవుఁడనియు; దేవతలకు వశుఁడు గానివాడగుటచే ఈశ్వరుఁడనియు; జగత్తునకంటే మూడు పాళ్లు ఆధిక్యము కలిగియుండుటచే బ్రహ్మదేవుఁడనియు; ప్రాణిమాత్రుడగుటచే మహాప్రాణి (మహద్భూతము)
యనియు;
శరీరము అను క్షేత్రనంతయు కనుగొనువాడగుటఁజేసి క్షేత్రజ్ఞుడనియు; ఆది సృష్టికి మున్ను ఒంటరిగా నుండుటచే కేనలుఁడనియు; సూక్ష్మశరీరము అను పట్టణమునందు శయనించు వాడు గాన పూరుషుఁడనియు; అనాదియై సర్వపూర్వుడగుటచే స్వయంభువనియు, ప్రకృతి యొక్క వికారమగు ప్రపంచమునంతయు పరిశీలించువాడు గాన కవి యనియు; ముల్లోకముల యందు అడుగిడుటచే క్రమణుడనియు, కరుణించువాడగుటవలన - పాలకుఁడనియు; ఆదిత్యుడనియు; కపిలుడనియు; అగ్రజుఁడనియు; అగ్నియనియు, హిరణ్మయుడైన పంకజాసనుని గర్భము తన వలన జన్మించుట కారణముగా హిరణ్యగర్భుఁడనియు;
ఇవ్విధము మహేశ్వరుడు ముప్పది యొక (31) ముఖ్యనామధేయములు గలిగి
లోకవేదములయందు ప్రసిద్ధుడయ్యెను.
ప్రస్తుతము ప్రవర్తిక’ను బ్రహ్మదేవునకు పరార్థము అనగా సగం దినము గడచినది ఇంకనొక పదార్థము మిగిలియున్నది. ద్వితీయ పరార్ధకాలము ముగిసిన తటి దిన (ఆవాంతర) ప్రళయమగును.
ఒక పదార్థకాలములో సంభవించు మహాయుగములను సంవత్సరాదులను పరిగణింప నేరికిని
బ్రహ్మదేవుని యొక్క దివారాత్ర (కల్ప)ములు కోట్లకొలది గడిచినవి. ఇంకను కోట్లకొలది గడువనున్నది. మహాయుగ సహ సమువరకు సప్తద్వీపములు గల పృధివి మున్నగు జగత్తును బ్రహ్మ విష్ణురుద్రులు పరిపాలింపవలసినదేను.
అవాంతర ప్రళయమున పు థిపి ఉదకములో ముసుగును. మరియు నక్షత్రాదులు
అంతరించును. ఆ సమయమున ఏమియు గోచరముకాదు. అట్టి ఏకార్లవమునందు స్థావర జంగమములు నశింపగా బ్రహ్మదేవుడు -
సహస్రశీర్షా పురుషారుక్మవర్ణ స్వతీం ద్రియః । బ్రహ్మా నారాయణాఖ్యస్తు -సుష్వాప సలిలే తదా ॥
సహస్రశీర్షుఁడు, పురుషుఁడు, ఇంద్రియాగోచరుఁడు, సువర్ణకాంతిగల వాడునై ఉదకమునందు శయనించుటచే నారాయణుఁడన బఱఁగెను.
అట్టి ఉదకమునందు బ్రహ్మదేవుఁడు వాయురూపమున సంచరించి భూమి -
జలనిమగ్నమైనదని గుర్తించి జల క్రీడకు ఆసువగు వరాహరూపమును ధరించి పాతాళమున (బ్రవేశించి. లోకహితమునకై తన కోజులతో పృథివిని లేవనెత్తి బ్రహ్మాండ మధ్యస్థానమున నెలకొలిపినందున భూమి జలముపై నాపవలె నున్నడై గొప్ప శరీరము గలదియునై; మరల నుదకములో నిమగ్న-కొకుండుటకు పర్వతములను భూమికి ఆధారములు నేర్పరచెను. అట్టితటి భూప్రదేశమంతయు చాపవలె సమానమైనది.
పూర్వ సృష్టి సంవర్తకాగ్నిచే కాల్చబడినతటి -- అగ్నికణములు - ఎగిరిపడగా నయ్యని వాయువుచే నొకచో చేర్పఁబడినవై పర్వతములుగా ఏర్పడి భూమికి ఆధారములైనవి.
చతుర్ముఖుని ఆద్యసృష్టిలో మొదట తమస్సు, మోహము, మహామోహము, తామిస్రము, అంధతామిస్రము నను అవిద్యాభాగములు ఉదయింపగా సమస్తము తమస్సుచే ఆవరింపబడుటచే ప్రకాశము లేనిదాయెను. ఈ తమస్సు సృష్టిసాధకము కాదని బ్రహ్మదేవుఁడు చింతించుచుండగా - వెలుపల ఇంద్రియ ప్రవాహములు గల పశుపక్ష్యాదులు జన్మించెను. ఆ పిదప ఊర్ఘ్యప్రోతస్కులగు దేవతలు - క్రిందికి ఇంద్రియసంచలనము గల మానవులు ఉదయించిరి. ఆ తరువాత భూతములు పుట్టెను.
మహత్తత్త్వము పంచతన్మాత్రలు ఇంద్రియములు వృక్షలతాదులు, మానవులు క్రమముగా స్వజింపఁబడిరి. ఋభువు సనత్కుమారుఁడు నను ఊర్ధ్వరేతస్కులు ప్రప్రధమము జన్మించినవారై సంతానేచ్ఛను, కర్మాచరణమును, అర్ధకాంక్షను విడనాడి విరాగులునై నిరంతరము కుమారులయ్యే యుండిరి. అనంతరము సనందుఁడు, సనకుఁడు, సనాతనుఁడు ననువారు ఉడయింప గా మరికొందరిని మానసపుత్రులను బ్రహ్మదేవుఁడు జన్మింపఁజేసెను. వీరందరు అమాంతం ప్రళయము పరకు స్థిరమైన భూమిని రక్షించువారు, ఉచకములు, అగ్ని, పథివి, వాయువు, ఆకాశము, పువ్యాకాశ
మధ్య భాగము, సముద్రములు, నదులు, పర్వతములు వనస్పతులు, ఓషధులు, లతలు, వృధాములు, లవ-కాషా- కలా-ముహూర్త సంధ్యాసమయరాత్రి-దిన --పక్ష-మాస- ఆయన-వత్సర యుగములు అనువానికి అధిపతులుగా బ్రహ్మమానసపుత్రులు- ప్రవర్తించుచుందును.
మరీచి, భృగువు, ఆంగిరస్సు, పులస్త్యుఁడు, పులహుడు, క్రతువు, దక్ష ప్రజాపరి, ఆత్ర,
వసిష్ఠుఁడునను తొమ్మండుగురు బ్రహ్మమానస పుత్రులగువారు, వీరు నవ బ్రహ్మలుగా పురాణము నందు నిర్ణయింపఁబడిరి. వీరందరికి పంకజాసనుడు వేరువేరు స్థానముల నేర్పరచెను.
ఆ తరువాత సంకల్పము, ధర్మము, ఉచయించినవి. భృగ్పాదులు లోకమున ధర్మమును ప్రవర్తింపజేసిరి. ఆ పేపప అసురులు జన్మించిరి. ప్రతిదినము రాత్రియందు ప్రజలు తమస్సుచే ఆవరింపబడుచుకు గాననిద్రించుచుందురు. తరువాత దినము ఉచముంపగా ధర్మయుక్తమగు దినమును డేవతలు కాంక్షించువారగుదురు.
దివారాత్రసంధిసమయమున దివ్య పితరులు జన్మించిరిగాన సంధ్యాకాలమునండు దేవతలు, ఆసురులు, ఋషులు, మానవులు, పరమాత్మను ప్రార్ధించుచుందురని తెలియవలెను. ఇదియే సంధ్యావందన మనఁబడును. ఆ పిమ్మలు- వెన్నెల (చంద్రిక) ఉదయింపగా దినమున దేవతలు, రేయి నసురులు బలవంతులగుచురు. ఈ జన్మలన్నియు ప్రతిమన్వంతరమునంచుండుననేను, చెన్నైల, రాత్రి, దినము, సంధ్యాకాలము అను నాలుగు ఉదకము నాశ్రయించి యుండును. రాత్రియందు రాక్షసులు ఆకళి (దీర్చుకొనుటకు సంచరించుచుందురు గాన నిశాచరులనఁబడిరి.
ఆ పిదప యక్షులు, గుహ్యకులు, సర్పములు ఉచయింపగా బ్రహ్మకోపోచ్ఛవంబగు విషము సర్పములయందు వ్యాపించెను. అనంతరము గూడా బ్రహ్మక్రోధము శాంతింపనందున అద్దానినుండి మాంసాహారులగు పిశాచ (భూతములు ఆవిర్భవించెను. తరసంతరము సంతోషముతో పొడుచున్న బ్రహ్మనుండి గంధర్వులుడయించిరి. ఆ పిమ్మట గోవులు అశ్వములు, గజములు, గార్డభములు ఒంటెలు, తదితర జంతువులును జన్మించెను. ఓషధులు యజ్ఞము కొరకు ఉపయోగింపఁ దగినవైనవి.
ఆవు, మేక, గుఱ్ఱము, కంచరగాడిడ, యనునవి గ్రామ్య పశువులనఁ బడును, శ్వాపడ (వ్యాఘ్ర)ము, ద్విఖరము (రెండు డెక్కలు గల జంతువు) ఏనుగు, వానరము, పక్షి, ఆడకమన బడు పశువు, పాము, ఎనుబోతు, గురుపోతు (గవయము) శరభ (మీగండ్లమెక)ము, తోడేలు (వృకము) సింహము ననునవి - ఆటవిక పశువులనఁ బడును.
గాయత్రి - ఋక్, త్రివృత్, సామ రథంతరము, అనునవి- ఛందస్సులనఁబడును. సృష్టిలో దేవతలు, అసురులు, దివ్యపితరులు, ఆ తరువాత స్థావరజంగమ ప్రాణులు, యక్షులు, పిశాచములు, గంధర్వులు, అప్సరసలు, కిన్నరులు, నరులు, రక్కసులు, పక్షులు, పశువులు, మృగములు, సర్పములును జన్మించినవి.
స్థావరజంగమ ప్రాణులలో కొన్ని నశించునవిగా, మరికొన్ని వినాశము లేనివిగా సంభవించి పూర్వ సృష్టి గతవిధముగా తమ కర్తవ్యములయందు ఆసక్తి గలవైనవి.
హింసాహింసేమృదు క్రూరే - ధర్మాధర్మే ఋతానృతే । తద్భావితాః ప్రపద్యంతే తస్మాత్తత్తస్య రచతే ॥
“హింస, అహింస, మృదుత్వము, క్రూరత్వము, ధర్మము, అధర్మము, సత్యము, అనృతము నను భావములను పరమేశ్వరుని ప్రేరణ ననుసరించి ప్రాణులు పొందుచుందురు గాన లట్టి భావమే ఆ యా ప్రాణికి రుచించును.”
కొందరు ప్రయత్నమే సాధకమనియు, మరికొందరు దైవమే ప్రబలమనియు, ఇంక కొందరు, స్వభావమే-ముఖ్యమనియు భావింతురు. కాని ప్రయత్నము, దైవము, స్వభావము ఇత్యాదులు కూడినచో కార్యము సిద్ధించునని తెలియజాలరు. ప్రయత్నాదులను సిద్ధింపఁజేయువాడు మహేశ్వరుఁడే ననియు, ప్రయత్నాడులు మాయాకల్పితములనియు దేవమానవాదులు గుర్తింపకున్నవారు.
బ్రహ్మదేవుఁడు సృష్టి పెంపొందుటు లేదని దుఃఖించుచుండగా స్త్రీ పురుషుల జంట ఆతనికి సాక్షాత్కరించెను. అందువలన విధాత తన శరీరములో సగంభాగము పురుషుడుగాను, సగంభాగము శతరూప యను స్త్రీగాను పరిణమింపజేయగా శతరూప భూమ్యాకాశముల నధిష్టించినదై పరమదుశ్చరమైన తపస్సు నాచరించి పురుషుని భర్తగా పొందెను. ఆ పురుషుడే స్వాయంభువమనువుగా వ్యవహరింప ఁబడెను. ఆతని డెబ్బది మహాయుగముల కాలము మన్వంతరమనబడును. స్వాయంభువమనువు శతరూపయందు రతిక్రీడను సలుపులుచే శతరూపకు రతియను మరియొక పేరు కలిగినది. స్వాయంభువమనువువలన శతరూపయందు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు నను కుమారులు - ఆకూతి, ప్రసూతి యను కుమార్తెలు నుదయింపగా స్వాయంభువమనువు ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఆకూతిని రుచియను ప్రజాపతికి సమర్పించెను.
ఆకూతికి రుచివలన యజ్ఞము దక్షిణయను కవల పిల్లలుదయించిరి. యజ్ఞునకు దక్షిణయందు యాములు అనుపండ్రెండుగురు దేవతలు ఉదయింపగా చక్షుడు ప్రసూతియందు ఇరువదినలుగురిని జన్మింపజేసెను. ఈ ఇరువది నలుగురు కన్యలు సుందరమణులుగా నుండిరి. వీరిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి యను పదముగ్గురిని ధర్ముడు, భార్యలుగా స్వీకరించెను. సతి, ఖ్యాతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్ణ, స్వాహా, స్వధాయను పదకొండు గురిలో సతీదేవిని శంకరునకు; ఖ్యాతిని భృగుమహర్షికి; సంభూతిని మరీచికి; స్మృతిని అంగిరస్సునకు, ప్రీతిని పులస్త్యునకు; క్షమను పులహునకు; సన్నతిని క్రతువునకు,
అనసూయను అత్రిమహర్షికి; ఊర్జను వసిష్ఠమహర్షికి; స్వాహాను అగ్నిదేవునకు; స్వధను పితరులకు దక్ష ప్రజాపతి వివాహవిధిని సమర్పించెను.
శ్రద్ధా దేవి-కాముని, లక్ష్మీదేవి- దర్పుని; ధృతిదేవి నియముని; తుష్టిదేవి సంతోషుని, పుష్టిదేవి లోభుని; మేధాదేవి శ్రుతుని; క్రియాదేవి - దండుని, సమయుని, సమయుని, బుద్ధిదేవి- బోధుని, ప్రమాదుని; లజ్జాదేవి- వినయుని; వసుదేవి వ్యవసాయుని; శాంతిదేవి- క్షేముని; సిద్ధిదేవి సుఖుని; కీర్తిదేవి-యశస్సును; ధర్మదేవతవలన - పుత్రులుగా బడసిరి.
కామునకు హర్వుడు అను కుమారుఁడు సంభవించెను. ఇద్ది- ధర్ముని సంతానము. హింసయనునది అధర్మునివలన నికృతి అనృతుడు అను కుమారుల (గనగా ఒకృతియందు భయము, నరకుఁడు అను పుత్రులు జన్మించిరి. భయునకుమాయ, నరకునకు వేదన యను భార్యలు లభింపగా మాయాదేవి ప్రాణుల నపహరించు మృత్యువు (గనెను. వేదనాదేవి దుఃఖుడు, రౌరవుడు అను కుమారులను ప్రసవింపగా మృత్యువునకు వ్యాధి, జర, శోకము, క్రోధము, అసూయ అను కుమారులు దుఃఖభూయిష్టులై అధర్మాత్ములుగా నుదయించిరి.
ఇడ - బ్రహ్మదేవుఁడు- ప్రజలను పుట్టింపుమని తనను ప్రార్థింపగా - రుద్రుఁడు రూపతేజో బలాదులయందు తనతో సమానులైన వారిని పుట్టించెను. వారు దశలక్ష సంఖ్యాకులుగాను, గజచర్మాంబరులు గాను, జటాధారులు గాను, కపాలధారులుగాను, సహస్రశతబాహువులుగాను, ఆకాశ సంచారులుగాను, భూసంచారులుగాను, త్రిలోచనులు గాను, అన్నాహారులు గాను, మాంసాహారులు గాను, ఘృతపానులుగాను, సోమపానులుగాను, నీలగ్రీవులుగాను, ప్రాణులందరికి అదృశ్యులు గాను నుండిరి.
ఇట్టి ప్రజలను పుట్టింపకుము! మరణధర్మము గల వారిని జన్మింపజేయుము !” అని
చతుర్ముఖుఁడు విన్నవింపగా “నేను జరా వ్యాధి మృత్యుసంపన్నులైన ప్రజలను పుట్టించువాడను గాను. అట్టి వారిని నీవే సృజింపుము ! “అని రుద్రుడు ప్రత్యుత్తరించెను.
“స్థితోఽస్మి” యని పలుకుటచే మహేశ్వరుఁడు స్థాణువనఁబజగెను. మరియు నిట్లు
నుడివెను.
శ్లో॥ ఏతే దేవా భవిష్యంతి రుద్రా నామ మహాబలాః । పృథివ్యా మంతరిక్షే చ దిక్షు చైవ పరిశ్రితాః । శ్లో॥ శతరుద్రాః సమాత్మానో భవిష్యం తీతి యాజ్జికాః । యజ్ఞభాజో భవిష్యంతి సర్వదేవగణైః సహ ॥
“నా వలన సంభవించిన వీరందరు అమరులై రుద్రులనఁబఱఁగుదురు. మహాబలవంతులు శతరుద్రనామధేయులు సమానశరీరులు యజ్ఞములను చేయించువారు దేవతలందరితో సమానముగ యజ్ఞాహతులను స్వీకరించువారు నగుదురు.
పరమేశ్వరుఁడు సూర్యసమాన కాంతి గలవాడై పురుషుఁడుగా సగము స్త్రీగా సగము శరీరము గలవాడునై ఏకాదశరూపములతో నుండెను. మహేశ్వరుని వామార్ధమగు శక్తియే దక్షునిచే ఆరాధింప బడినందున సతీదేవియై - మహేశ్వరుఁడాదేశించినందున స్వాహా, స్వధ, మహావిద్య, మేధ, లక్ష్మి సరస్వతి, విద్య, అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటల, ఉమ, హైమవతి, కల్యాణి, ఏకమాతృక, ఖ్యాతి, ప్రజ్ఞ, గౌరి, గణాంబిక, మహాదేవి, నందిని,జాతవేదసి, సావిత్రి, వరద, పుణ్య, పావని, ఆజ్ఞ, ఆవేశని, కృష్ణ, శివ, ప్రకృతి, వికృతి, రౌద్రి, దుర్గ, భద్ర, ప్రమాథిని, కాలరాత్రి, మహామాయ, రేవతి, రాతనాయిక, గౌతమి, కౌశికి, ఆర్య, చండి, కొత్యాయని, కుమారి, యాదవి, కృష్ణపింగళ, బిధ్వజ
శూలధర, పరమ, బ్రహ్మచారిణి, మహేంద్రోపేంద్ర భగిని, దృషద్వతి, అపరాజిత, బహభుజు, ప్రగల్భ, సింహవాహి?, శుంభాది దైత్యహంత్రి, మహామహిషమర్దిని, అమోఘ, వింధ్యనిలయ, విక్రాంత, గణనాయిక, అసురూపములు గలదయ్యెను.
మః దేవీ నామములను పఠించువారి పాపములు నశించుటే గాక అరణ్యమునండు గాని, పర్వతముపై గాని, పట్టణమున గాని, గృహమునందు గానీ,
జలమునండు గాని, స్థలమునందు గాని, వ్యాఘ్రచారాచులనుండి భయము ఉండదు. ఆపదలన్నిటియందు నీ దేవి నామములను కీర్తించినచో కష్టములన్నియు తొలగును. బాలురకు బాళికలకు నీ నామములతో మంత్రింపఁబడిన విభూతి నిడినయెడల భూత ప్రేత పిశాచబాధలు నివారించును.
పరమేశ్వరి యొక్క రూపములలో ప్రజ్ఞ, శ్రీః, అనునవి ముఖ్యములగునవి. ఈ
ద్వివిధరూపముల నుండి వేలకొలది దేవీ రూపములు ఉద్భవించి జగత్తు నంతయు వ్యాపించినవి.
పరమేశ్వరుడు లోకహితార్థము అనేకరూపమూలముగు ఆదిశక్తిలో నెల్లకాలము
కూడియుండువాడు.
ఇక నీ రుద్రుఁడే పూర్వము త్రిపురాసురులను సంహరించుతటి పశుపతి గాను
హరి బ్రహ్మాద్యమరులు పశువులుగా వ్యవహరింపబడిరి.
ఈ అధ్యాయమున ఆదిసృష్టి క్రమమును తదితరాంశములను పఠించువారు వినువారు ఎనుపించువారును బ్రహ్మలోకమున నొకకల్పమువరకు నివసించి చతుర్ముఖ బ్రహ్మానందము ననుభవించెదరు.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (70)వ అధ్యాయము.
