లింగ మహా పురాణము
22 - సూర్య పూజా నిరూపణము
నందికేశ్వరుఁడు చెప్పఁదొడఁగెను.
రవి మండలమున శివు నర్చింప నధికారము సంభవించుటకు - సూర్యునారాధింపవలసి యుండును. ఎట్లనఁగా?
స్నానము భస్మరు ద్రాక్షధారణ నిత్య దేవతార్చ నాదులను నెరవేర్చి భస్మ నుద్ధూళనము (జేసికొని సూర్యుని పూజింపవలెను. “ఓం తపః” అను మంత్రముతో మట్టి దీసికొని నేలపై ఉంచి “ఓంభునః” అనుచు మంత్రముతో ఉదకము చల్లి “ఓం సువః” అనుచు మట్టిని శుభ్రపరచి “ఓం మహః” అనుచు మట్టిని విభజించి “ఓంభూః’’ అనుచు మట్టిలోని ఇసుక బూడిద మొదలగు వానిని తీసివేసి “ఓంజనః” అనుచు మట్టిని ఒంటినిండ పూసికొనవలెను. అట్లు చేయగా మిగిలిన మట్టితో “ఓం తపః” అనుచు వామహస్తమును మూల మంత్రము నుచ్చరించుచు ఏడు పర్యాయములు శోధింపవలెను.
ఆ తరువాత నదీ తటాక కూపాన్యతర జలముతో స్నానము నొనర్చి సూర్యునారాధింపవలెను.
“ఓం భూర్భువః సువః - ఓం తత్సవితు ర్వరేణ్యం -
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్”
ఈ మంత్రము భర్గశబ్దఘటితమగుటచే శివపరము కాగా సవితృ శబ్దఘటితమగుట - జేసి సూర్యపరము కావచ్చును.
“ఓం నమః సూర్యాయ ఖభోల్కాయ నమః” అను నది - సూర్యుని మూలమంత్రము.
ఓం భూః బ్రహ్మణే - హృదయాయ నమః
ఓం భువః విష్ణువే శిరసేస్వాహా
ఓం స్వఃరుద్రాయ శిఖాయై వషట్.
ఓం మహః మహేశ్వరాయ కవచాయ హుం
ఓం జనః సదాశివాయ నేత్రత్రయాయ వౌషట్.
ఓం తపః పరశివాయ అస్త్రాయ ఫట్.
భూర్భువస్సువరోమితి దిగ్బంధః
ధ్యానం “ద్వాదశాత్మస్వరుపాయ కాశ్యపేయాయ కర్మణాం ।
సాక్షిణే జగతో ముఖ్య - చక్షుషే రవయే నమః”
తరువాత సూర్యుని మూలమంత్రమును యథాశక్తి జపించి “ఓం భూః” ఇత్యాది
అంగమంత్రములతో శుద్ధోదకమును తనపై చల్లుకొని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రము రాగి చెంబులో ఉదకమును నింపి - దానిలో దర్భను పుషముల నునిచి అట్టి కలశోదకమును సూర్యునివైపు ప్రోక్షించవలెను.
సూర్యారాధముఁడు రక్త (ఎర్రని) వస్త్రధారియై విధిపూర్వకముగా “సూర్యశ్చ” ఇత్యాది మంత్రముతో పగలు; “అగ్నిశ్చ, ఇత్యాది మంత్రముతో రాత్రి; “ఆపః పునంతు” ఇత్యాది
మంత్రముతో నుఛ్యాహ్నమున మంత్రాచమనము (జేసి “ఓం తపః“ అను నుంత్రముతో కరశుద్ధి. గావించియు “ఓం జనః - సదాశివాయ” అను మంత్రములో కూడ - సూర్యుని మూలమంత్రమును యథాశక్తి జపించవలెను. రవి మూల మం త్రాక్షరములతో రన్యాసము నొనర్చి - శ్రీ గంధాములతో కూడిన శుద్ధోదకమును “ఆపోహిష్ఠాది” మంత్రముల నుచ్చరించుచు - శిరస్సు పై వల్లుకొనగా మిగిలిన జలమును - ఎడమ ముక్కుతో నా ఘ్ర్రాణించి కుడి ముక్కు నుండి వెళ్లినట్లు, ఎడమ పక్కన శిలాతలమున్నట్లును భానించుచు శిరాతలముపై కొట్టినట్లు విడువవలెను. (ఇయ్యది పాప పురుషజలవిసర్జన మనఁబడును.)
తదనంతరము గాయత్రీ మంత్రముతో సూర్యునకు అర్ఘ్యమును ముమ్మారు నొసఁగి
కాలాతి క్రమణమైనచో చతుర్థార్ఘ్యమును సమర్పించవలెను.
తూర్పుముఖము గలవాడై తాగిపళ్లెరములో శ్రీ గంధము రక్త చందనము ఎర్రనిపూలు తిలలు దర్భ అక్షతలు గఱక గన్నేరు పువ్వులు ఘృతము అనువానితో కూడిన ఉదకమును మోకాళ్లు నేల నుండునట్లు కూర్చుండి - అర్ఘ్యసౌత్రమును శిరస్సు వరకు లేపి మరల క్రిందికి తీసికొని సూర్యుడు కెదురుగా మరియొక పళ్లెరముతో విడువవలెను.
తదనంతరము శివుని పూజింపవలెను. లేక సద్యోజాతాది పంచ బ్రహ్మము త్రములతో భస్మస్నానము నొనర్చి – జలసమీసమున - విఘ్నేశ్వరుని, వరుణుని, గురువు నర్పించియు పద్మాసనస్థుదై నదీ తటాకాది జలమును పూజించి పూజతో దకము గైకొన పూర్వమువలె కరాంగన్యాసము నొనర్చియు “ఆదిత్యో వైతేజ ఊర్జోబలం యశో వివర్ధతి” ఇత్యాది మంత్రము నుచ్చలంమమ సూర్యునకు సమస్కరింపవలెను.
సిందూరారుణగ్రహునిగా, పద్మహస్తునిగా, అమృతవదనునిగా, పద్యాసమునిహగా,
ద్విహస్తునిగా, నేత్రద్వయునిగా, రక్తాభరణధారిగా, రక్తపుష్ప మాలికాధరునిగా, రక్తగంధాములేపనుని గాను సూర్యుని ధ్యానించి సూర్యాసనమగు కమలమునకు వెలుపల మండలములలో చంద్రుని అంగారకుని, బుధుని, బృహస్పతిని, శుక్రుని, కేతువును - నేత్రద్వయము భుజచ్చయంబు గలవారిగాను, రాహువును ఊర్ధ్వశరీరముమాత్రము గలవానిగాను, శనైశరుని - నోరుతెలుచి చోసిలి పట్టుకొనినవానిగాను, కోఱలు వరదాభయహస్తంబులు గలవానిగాను ధ్యానించి “ఓం చంద్రాయ నమః“ ఇత్యది ఆష్ట గ్రహమంత్రములతో పూజించియు - సూర్యదేవుని ముందు - ఋషులను దేవగంధర్సులను పన్నగములను అప్పరో గణములను, గ్రామణీ దేవతలను, నిర్పతిరాక్షసులను, యక్షులను పూజింపవలెను. అంతకు ముందు సప్తచ్ఛందోమయములగు సప్తాశ్వములను వారఫల్యగణము పూజించియు సూర్యమంత్రమును 1000, 500, 108 ఏడేనొక సంఖ్యగా జపించి తద్దశాంశములుగా హవనాదుల నొనర్పవలెను. జయాది స్విష్టకృత్ పర్యంతము హవనము, తత్పూర్వము ఇధ్మాధానములు ముఖ్యములుగా పూజాహోమాదికము నంతయు సూర్యునకు సమర్పించి హృదయమున సూర్య దేవుని
నిలుపుకొనియు ప్రణమిల్లవలెను.
తదనంతరము - ధర్మార్థకామమోక్షములు సిద్ధించులు - శివుని. యథోక్తవిధానమున భక్తితో నర్చింపవలెను. ఇట్లు సూర్యుని సూర్యాంతర్వర్తియగు పరమేశ్వరు నారాధించువాడు- సర్వపాప వినిర్ముక్తుడై సర్వైశ్వర్య సంపన్నుఁడై - అసమాన వర్చస్సు గలవాడునై పుత్ర పౌత్రాదులతో దను ప్రియబాంధవుల తోడను విపులభోగముల ననుభవించి - యీ జన్మయందే ధనధాన్య సమృద్ధి గలవాడై గుజాశ్వాది వాహనములు గలవాడై - అనేకసువర్ణాభరణధారియు నగును. మరియు మరణానంతరము సూర్య లో కమున చిరకాలము సూర్యుని సన్నిథానమున ఆనంచము ననుభవించిన పిదప నీ లోకమున ధార్మికుఁడైన రాజుగా జన్మించును. అథవా – వేదవే దాంగాభిజ్ఞుడైన బ్రాహ్మణుడుగా జన్మించి - పూర్వజన్మ వాసనచే సూర్యునే పూజించి - శాశ్వతమోక్షము నొందును.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (22)వ ధ్యాయము.
