లింగ మహా పురాణము
102 - శివుఁడు పార్వతి తపస్సునకు సంతోషించి యనుగ్రహించుట, హరీంద్రాదులను పరీక్షించుటయు
పరమేశ్వరుఁడు బ్రహ్మదేవుని ప్రార్చన నామోదించి పార్వతీదేవిలో విహరించి దేవమానవాది లోకకల్యాణార్ధము వివాహవిధిని స్వీకరింపవలె నని నిశ్చయించుకొనెను.
అట్టితఱి చతుర్ముఖుఁడు మరీచ్యాది ప్రజాపతులను వెంటనిడికొని హిమాలయోపరి తపోవనముఁజేరి అమ్మవారికి ప్రదక్షిణముఁజేసి నమస్కరించియు “దేవీ! తపస్సుచే లోకములను తపింప జేయుచున్నావెందుకు? సర్వదేవేశ్వరుడైన శంకరుడు స్వయముగా నేతెంచి నిన్ను భార్యగా స్వీకరించును. నీవు లేనిది శివుడు వ్యక్తుడు కాజాలను.“ అని విన్నవించి వెళ్లగా - పరమేశ్వరుడు వృద్ధి బ్రాహ్మణ రూపముతో గిరిజాదేవిఁ జేరినవాడై నిలచెను.
అంత పార్వతీ దేవి “పరమేశ్వరుఁడే బ్రాహ్మణ రూపములో నేతెంచినాడని గుర్తించి
నమస్కరించియు పూజింపగా మహేశ్వరుఁడు సంతోషించి హిమవంతుని కులధర్మమును
కాపాడదలచిన వాడై “నీ తండ్రి యేర్పాటుచేయు స్వయంవరమున సామ్యసుంద రూపమున నిన్ను పరిగ్రహింపగలనని ప్రవచించి దివ్యదృష్టితో మరల నొకసారి పార్వతిని పరివీక్షించియు నిజనివాసమునకు నేగెను.
ఆ పిదప హిమవంతుడు తన పుత్రిక శంకరు ననుగ్రహీముఁబడసి తపోవనమునుండి యేతెంచినదని చెలికత్తెల ద్వారా తెలసికొని “ పరమేశ్వరుడు పార్వతీ పాణి గ్రహణంముఁజేయునని స్ఫుటముగా తెలియనందున స్వయంవరమును ప్రపంచమంతకు సాటింప జేసెను.
ఆ సమయమున బ్రహ్మదేవుఁడు, విష్ణుమూర్తి, దేవేంద్రుఁడు, అగ్నిదేవుడు,
సూర్యభగవానుఁడు, భగుఁడు, త్వష్ట, అర్యముఁడు, వివస్వంతుఁడు, యమధర్మరాజు, వరుణదేవుఁడు,వాయువు, సోముఁడు, ఈశానుఁడు, ఏకాదశరుద్రులు, మునులు, అశ్వినీదేవతలు, ద్వాదశాదిత్యులు,అష్టవసువులు, గంధర్వులు, గరుత్మంతుఁడు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు, దైత్యులు, కింపురుషులు,సర్పరాజులు. అమ్మవారి స్వయంవరములో పాలుగా “న నేతెంచిరి. మరియు వేదములు నదములు సముద్రపులు మంత్రములు స్తోత్రములు క్షణాది కాలభేదములు పర్వతములు యజ్ఞములు గ్రహములున్ను మూర్తిమంతములై యుయుదెంచెను.
ఆట్టితఱి - పార్వతీదేవి బంగారు రథముపై బయలుదేరుతుండగా అప్సరసలు నాట్యమాడుచుండిరి. గంధర్వులు సిద్ధు మంది మగధులను వివిధ సంగీతములలో దేవిని సుతించుచుండిరి. సమాలియు నను నమె సంధ్యా పూర్ణేందును సులువు సన్నిధము రత్నాంశు మిశ్రితంబు నగు శ్వేతచ్ఛత్రమును అమ్మవారి పై పట్టుకొనీ యుండెను. చేపతారమణులు ఇరుప్రక్కలండు వింజామరలను పట్టుచుండిరి. జయ జూరు చెయ్య పుష్పమాలికలు వేసి చేత బట్టుకొని యుండి- విజయ తాళవృంతము (విసనకఱ్ఱ)తో వీచుచుండెను.
ఇట్టిదేవ సభా స్థానమున పార్వతీదేవి పుష్పమాలికను సుకేలడుచ్చియుండగా పరమేశ్వరుడు చిన్నపిల్ల వాడై తన లావిలాసముఁ జూ పెట్టుటకు అమ్మవారి తొడపై వుండను.
ఈ బాలుఁడెవడు? అని అమరులందరు ఆర్భాలముంజేయుచుండగా దేవేంద్రుఁడు
వజ్రాయుధమును లేవనెత్తినందున నాతని భుజము స్తంభించెను. అగ్ని శక్తిని ప్రయోగింపఁజాలలేదు. యముని దండము, నిఋతి యొక్క ఖడ్గము, వరుణుని నాపాశము, వాయువు యొక్క బెత్తము, సోముని గదయు, కుబేరుని దుడ్డుకఱ్!రయు, శాసుని యొక్క మరియు నే కాదశరుద్రుల యొక్క త్రిశూలములు, అష్టవసువుల ముద్గరము ( ఇనుపగుబియ) ద్వాదశాదిత్యుల ముసలంబు (రోకలి) కుంఠితములయ్యెను. అంత కేశవుడు కోపముతో తల సూపుచు సుదర్శన చక్రమును ప్రయోగింప నుద్యుక్తుడగుతఱి - శిశురూపుడైన పరమేశ్వరుడు విష్ణు శిరస్సును కదలనీయక సుదర్శన చక్రమును బాహువులను స్తంభింపజేసినండున శ్రీహరి నిశ్చేష్టుడై నిలువబడెను.
పూషయను సూర్యుఁడు పండ్లు కొరుకుచు బాలుని చూడగా నాతని దంతములూడి పడెను. ఇంతియే గాక బాలుఁడు అమరులందరి బలమును తేజస్సును ఉపాయము నాకర్షించి యవ్వారిని తన చూపుతోడనే బలహీనులఁగావించెను. ఇట్లు దేవతలందరు క్రోధావిష్ణులై యుండగా బ్రహ్మదేవుఁడు వ్యాకుల మనస్కుఁడై శివుని ధ్యానించి పార్వత్యుత్సంగగత బాలుడు శివుడే నని గుర్తించి వడిగా లేచియు విస్మయముతో బాలుని చరణములకు మ్రొక్కియు సామవేదీయములు పుణ్యప్రదములు వేదాంత సారంబులు నగు నామములతో ప్రార్థించెను.
ఎట్లనఁగా ?
మహాదేవా! లోకముల నన్నిటిని సృజించు ప్రకృతిని ప్రవర్తింపఁజేయువాడవు; ప్రాణులందరి బుద్ధి నీవేను; అహంకారంబు నీవేయై జీవాత్మలకు దేహేంద్రియముల నేర్పరచుచుందువు; నీ కుడివైపు నుండి నేను, నారాయణుఁడు ఎడమదిక్కునుండి జన్మించితిమి. ఈ పార్వతీదేవి మూల ప్రకృతిగా జగత్సృష్టి హేతువగుచు నీకు భార్యగా యిచ్చోటున కేతెంచినది.
మహేశ్వరా! నీకు నమస్కారము. ఈ మహాశక్తికి వందనము. నీ యనుగ్రహమువలన నీ శాసనమును పురస్కరించుకొని దేవమానవాది ప్రజలను పుట్టించితిని. ఐనను వీరు నీ మహిమ తెలియని మూఢులైరి గాన వీరినందరికి పూర్వస్థితిని ప్రసాదింపుము !
అని దేవదేవుని ప్రార్థించి మహాదేవుఁడే శిశువై ఇటకు విచ్చేసెఁనని తెలియక నపచారముల గావించితిరి. గాన నేను శ్రీహరి దేవేంద్రాదులు నందరము భపునకు శరణాగతుల మగుదము అని వచింప సురలందరు మానసికముగా విధేయులైనందున శంకరుడు ప్రసన్నుడై బ్రహోక్తమును పాటించి దేవతలందరికి పూర్వరూపముల నొసగగా వారందరు దివ్యదృష్టిని ప్రసాదించుమని వేడుకొనినందున హరుడు నవ్వారికి మరియు భవానికి హిమవంతునకు దివ్య నేత్రముల నొసఁగెను అందువలన హరీంద్రాదులందరు మహేశ్వరుని దివ్య తేజః పరిపూర్ణ రూపమును చూడఁగలిగిరి. పార్వతీ దేవి హిమవంతుఁడు నారదాది మహర్షులు గణాధిపతులందరును శంకరుని మనోహర రూపముఁగాంచి యానందాబ్ధి నోలలాడిరి.
ఖేచరులైన సిద్ధచారణులు పుష్పములఁగుఱపించిరి. దేవదుందుభులు మ్రోగింపఁబడినవి. మునులు స్తోత్రములను పఠించిరి. గంధర్వులు పాడిరి. అప్సరసలు ఆడిరి. గణాధిపతులు సంతోషించిరి. విశేషించి పార్వతీ దేవి సద్యఃపరనిర్వృతి నందెను.
ఆ శుభసమయమున అమ్మవారు అయ్యవారి పాదములపై సుగంధ పుష్పమాలికను సమర్పించి బాగు బాగని లోలోన మరియుచు శివుని పాదముల సర్చించెను. హరి బ్రహ్మాదులందరు సాష్టాంగ నమస్కారముల నొనర్చిరి.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (102)వ అధ్యాయము.
