లింగ మహా పురాణము
65 - సూర్యచంద్రవంశవర్ణనము శివసహస్రనామ నిరూపపణమున్ను
సూర్యచంద్ర సంచలన నింపుమని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుఁడు
చెప్పదొడఁగెను.
అదితిదేవి కశ్యపునివలన కనినట్టే సూర్యునకు సంజ్ఞ, రాష్ట్ర, ప్రభ, ఫాయ యను నలుగురు భార్యలుండిరి. త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రిక యగు సంజ్ఞాదేవికి మనువు జన్మించెను. గాజి యను నామె యమధర్మరాజును, యమునాదేవిని రేవతుని కనెను. ప్రభయను నామె- ప్రభాసునకు జనని యైనది. పెద్దభార్యయగు సంజ్ఞాదేవి రవిప్రతాపమును సహింపనిదై తన ప్రతిరూషము గల ఛాయాదేవిని కల్పించగా- ఛాయాదేవి సావర్ణి మనువును, శనైశ్చరుని, తపతిని, విష్టిని కనినది. నాయాదేవి తన కుమారుల నధిక ప్రేమలో పోషించుచుండగా సంజ్ఞాదేవికుమారుఁడైన - వైవస్వతమనువు ఛాయాదేవి యొక్క పక్షపాత మునోర్చుకొనెను. కాని రెండవ భార్యయగు రాష్ట్రీదేవి యొక్క.. ప్రథమపుత్రుఁడైన యముఁడు సహింపక క్రోధమూర్చితుఁడై కుడికాలితో తనను తన్నిసందున ఛాయాదేవి యముని ‘‘ నీ కుడికాలు- చీము నెత్తురుతో నిండి పురుగులు కలదగుగాక!” అని శపించెను.
శ్లో॥ సోపి గోకర్ణ మాశ్రిత్య ఫలమూలా నిలాశనః । ఆరాధయ న్మహాదేవం యావద్వర్ణాయుతా యుతమ్ ॥
అంతయముఁడు గోకర్ణ క్షేత్రమున ఫలమూలములను మాత్రము భక్షించుచు- చివరన గాలినే పీల్చుచు లక్ష సంవత్సరములు తపించుచు మహాదేవు నారాధించెను.
అందువలన యముఁడు శివానుగ్రహమువలన శాపమును పోగొట్టుకొనినవాడై -
పితృదేవతాధిపతియునై - దక్షిణదిశయందు లోకపాలుడుగ విరాజిల్లఁ గలిఁగెను.
సంజ్ఞాదేవి బడబా (ఆడు గుఱ్ఱము) రూపముతో నుండగా సూర్యుడామెను కనుగొని అశ్వరూపములో రమించగా అశ్వినీ దేవతలు అను అమరవైద్యులుద్భవించిరి. సంజ్ఞాదేవి యొక్క జనకుడైన త్వష్ట సూర్యుని తేజస్సును తగ్గింపగా అందునుండి శివానుగ్రహమువలన ఆవిర్భవించిన సుదర్శనచక్రమును విష్ణుభగవానుడు పరిగ్రహించెను.
వైవస్వతమనువునకు- ఇక్ష్వాకుఁడు, నభగుఁడు, ధృష్ణువు, శర్యాతి, వరిష్యంతుఁడు, నాభాగుఁడు, అరిష్టుఁడు, కరూషుఁడు, పృషధ్రుఁడు నను తొమ్మండుగురు (9) కుమారులు సంభవించిరి. ఇలయను మనుపుత్రిక మిత్రావరుణుల యొక్క కృపవలన పురుషరూపము గలడై ఒకప్పుడు శరవణము అను పార్వతీ పరమేశ్వర విహార స్థానము నందడుగిడినంతనే స్త్రీ రూపము కలదయ్యెను. ఎందుకనఁగా ? పూర్వము దేవికి ప్రియము కావలెనని - శరవణమునండు ప్రవేశించిన పు షుఁడు-బడునుగాక ! యని otఁడు వరము నొసఁగియుండెను. అందువలన ఇలాదేవి ఒక నెల సుద్యుమ్నుఁడు అను పేరుతో పురుషుఁడు గొను, మరియుకనెల స్త్రీగాను ప్రవర్తించుచుండెను. ఇది యిట్లుండగా ఇలాదేవి బుధుని ప్రేమించి సురతమున కియ్యకొనఁగా ఉత్కలుడు, గయుఁడు, వినతాశ్వుఁడు నను ముగ్గురు కుమారులు జన్మించిది. ఉత్కలుఁడు- ఉత్కలరాష్ట్రాధిపతి కాగా వినతాశ్వుడు పశ్చిమ రాజ్యాధికారి యయ్యెను. గయునకు పితృదేవతా ప్రియమైన “గయ” యను రాజధాని నగరము లభించెను. సుద్యుమ్నుఁడు స్త్రీ భావము గలవాడగుటచే వానికి భాగము సంప్రాప్తము కానులేదు. కాని వసిష్ఠవాక్యము వలన తనకు లభించిన ప్రతిష్టానపురము రాజధానిగా గల దేశమును తనయందు బుధని వలన సంభవించిన పురూరవునకు నిచ్చెను.
ఇంక ఇక్ష్వాకునకు కలిగిన నూర్గురు కొమరులలో ధర్మాత్ముఁడగు వికుక్షి -- జ్యేష్ఠుఁడు కాగా వికుషుని పదునైదుగురు తనయులలో కకుస్థడనువాడు ప్రథముడై యుండెను. కకున్టుని కుమారుడు సుయోధనుడు; సుయోధనుని తనయులు- పృథువు; విశ్వకుడు, పార్ధివుడు ననువారు, విశ్వకుని కుమారుడు ఆర్ధకుడు; ఆర్ధకుని తనయుడు యవనాశ్వుడు; శాబస్తియను వాడు యవనాశ్వుని పుత్రుడై గౌడదేశమున “శాబస్తి” యను రాజధానిని నిర్మింపజేసెను. యువనాశ్వుని రెండవ కుమారుడగు వంశకుడు బృహదశ్వునకు జనకుడయ్యెను. బృహదశ్వుని కుమారుఁడగు కువలాశ్వుడు ధుంధువు అను మహాబలవంతుని సంహరించి - ధుంధుమారుడనబడిగెను. ధుంధుమారునకు
దృఢాశ్వుఁడు, చండాశ్వుఁడు, కపిలాశ్వుఁడు నను ముగ్గురు. కుమారులై ముల్లోకములయందు పేరు ప్రతిష్ఠలను సంపాదించిరి.
దృథాశ్వతనయుఁడు ప్రమోడుడు కాగా ప్రమోదుని కుమారుఁడు హర్యశ్వుడాయెను. హర్యశ్వనకు నికుంభుడు, నికుంభునకు సంహతాశ్వుడు, కుమారులు కాగా కృశాశ్వుడు, రణాశ్వుడు నను ఇరువురు సంహతాశ్వతనయులుగా జన్మించిరి. కణాశ్వుని కుమారుడు యువనాశ్వుడు కాగా యువనాశ్వునకు మాంధాతయను కుమారుడు కలిగెను. మాంధాతకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు నను ముగ్గురు కుమారులు జన్మించిరి.
అంబరీషుని కుమారుఁడు యువనాశ్వుఁడు, యువనాశ్వుని కుమారుఁడు హరితుఁడు; పురుకుత్సునకు నర్మదాదేవియందు త్రసదస్యుఁడు అను కుమారుడు జన్మించెను. త్రసదస్యుని కుమారుడు సంభూతి కాగా- సంభూతితనయులు విష్ణువృద్ధుడు, అనరణ్యుఁడు నను ఇరువురు సంభవించిరి.
రావణాసురుఁడు త్రైలోక్యవిజయ యాత్రలో అనరణ్యుని సంహరించి యుండెను.
అనరణ్యుని కుమారుఁడు బృహదశ్వుఁడు, బృహదశ్వుని తనయుఁడు హర్యశ్వుఁడు కాగా హర్యశ్వునకు దృషద్వతియందు వసుమనస్కుఁడు జన్మించెను. వసుమనస్కునకు త్రిధన్వుడు అనువాడు కుమారుడై శివుని యందు భక్తి కలిగి బ్రహ్మపుత్రుడగు తండి మహర్షికి శిష్యుడై అశ్వమేధయాగమును సంకల్పించి ‘ధనహీనుఁడను గాన నెట్లు చేయ గలుగుదు” నని చింతించి తండి మహర్షి వలన శివసహస్రనామములను స్వీకరించి పారాయణము (జేయుచు మహేశ్వరుని మెప్పించినందున శివుఁడు కరుణించి. గణాధిపత్యమును త్రిధన్వునకు ప్రసాదించెను. అని వచింపగా శౌనకాదులు “సర్వవేదార్థ సారమగు శివ సహస్ర నామ స్తోత్రమును పక్కాణింపు “ మని ప్రశ్నించిరి. అంత-సూత మహాముని శివుని స్మరించి సావధానుడై దిగువవిధము చెప్ప నారంభించెను.
సూత ఉవాచ:
శ్లో॥ సర్వ భూతాత్మ భూతస్య - హరస్యామిత తేజసః । అష్టోత్తర సహస్రం తు - నామ్నాం శృణుత సుప్రతాః ॥
“సువ్రతులారా! ప్రాణుల నందరి నంతర్యామి, లెక్కింపనలవిగాని మహిమ గలవాడు నగు హరునియొక్క వేయి నెనిమిది నామములను వినుడు ! “
శ్లో ॥ ఓం స్థిరః స్థాణుః ప్రభు ర్భానుః ప్రవరో వరదో వరః ॥ శ్లో॥ సర్వాత్మా సర్వ విఖ్యాతః సర్వః సర్వకరో భవః । జటీ దండీ శిఖండీ చ సర్వగ స్సర్వభావనః ॥
(శిఖండి = నెమిలి పింఛము గలవాడు)
హరిశ్చ హరిణాక్షశ్చ- సర్వభూతహరః స్మృతః । ప్రవృత్తి శ్చ నివృత్తి శ్చ - శాంతాత్మా శాశ్వతో ధ్రువః ॥ శ్లో॥ శ్మశానవాసీ భగవా? ఖచరో గోచరో ఒర్దనః । అభివాద్యో మహాకర్మా తప స్వీభూతధారణః ॥
(శ్మశాన మన ఁదగు సుషుమ్నానాడియందుండువాడు, లేక మహాశ్మశాన మనబడు కాశీక్షేత్రమున నివసించువాడు -- శ్మశానవాసి యనబడును).
శ్లో॥ ఉన్నత్త వేషః ప్రచ్చన్నః సర్వలోకః ప్రజాపతిః । మహారూపో మహాకాయః సర్వరూపో మహాయశాః । శ్లో॥ మహాత్మా సర్వభూతశ్చ - విరూపో వామనో నరః ।
(వామనః = చిన్నరూపముతో హృదయమున నివసించువాడు వామనుడు; )
లోకపాలో త్వరితాత్మా ప్రసాదో భయదో విభుః ॥ పవిత్రశ్చ మహాంశ్చైవ నియతో నియతాశ్రయః । స్వయంభూ స్సర్వకర్మా చ- ఆది రాదికరో నిధిః ॥ శ్లో॥ సహస్రాక్లో విశాలాక్షః సోమో నక్షత్రసాధకః । చంద్రః సూర్యః శనిః కేతు-హో గ్రహపతి ర్మతః ॥
(గ్రహః = అంగారుకుఁడు; గ్రహపతిః = బృహస్పతి; మతః= బుధుఁడు)
రాజా రాజ్యోదయః కర్తా --- మృగబాణార్పణో ఘనః ।
(రాజా = శుక్రుడు, రాజ్యోదయః = రాహువు;)
మహాతపా దీర్ఘతపాః = అదృశ్యో ధనసాధకః ॥ సంవత్సరః కృతో మంత్రః ప్రాణాయామః పరంతపః । యోగీ యోగో మహాబీజో మహారేతా మహాబలః ॥ సువర్ణరేతా స్సర్వజ్ఞః సుబీజో వృషవాహనః । దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః ॥ విశ్వరూపః స్వయం శ్రేష్టో బలవీరో బలాగ్రణీః । గుణకర్తా గణపతి-ద్విగ్వాసాః కామ్య ఏవచ ॥ మంత్రవిత్ పరమో మంత్రః సర్వభావకరో హరః । కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ ॥ శరీ శతఘ్ని కడ్డీచ పట్టిసీ చాయుధీ మహాక్ । అజశ్చ మృగరూప శ్చ తేజ స్తేజస్కరో విధిః ॥ ఉషీసీ చ సువక్షశ్చ ఉదగ్రోవినత స్తథా । దీర్ఘశ్చ హరికేశశ్చ - సుతీర్థః కృష్ణ ఏవ చ ॥
(హరేః = విష్ణువునకు; కస్య = బ్రహ్మకు; ఈశః = ప్రభువు = హరికేశుడన (బడును)
శృగాలరూప స్సర్వారో ముండః సర్వశుభంకరః ।
(శృగాల మనగా జంబుకము (నక్క) అను పేరు గల రాక్షసుని సంహరించి
నందున శృగాలముగా ప్రశంసింపబడినవాడు శృగాలరూపుడు;)
సింహశార్దూల రూపశ్చ గంధకారీ కపర్యపి ॥ శ్లో॥ ఊర్ధ్వరేతోర్ధ్వలింగీ చ ఊర్వశాయీ నభస్తలః । త్రిజటీ చీరవాసా శ్చ రుద్రః సేనాపతి ర్విభుః ॥ అహోరాత్రం చనక్తం చ తిగ్మమన్యుః సువర్చసః । గజహా దైత్యహా కాలో లోకధాతా గుణాకరః ॥ సింహశార్దూలరూపాణా మార్దచర్మాంబరంధరః ।
(సింహశార్దూల రూపములతో నుండు తన భక్తుల యొక్క తత్కాలమున
తీయబడిన (ఆర్టీ) చర్మను వస్త్రముగా కట్టుకొనువాడు;
కాలయోగీ మహానాదః -- సర్వావాస శ్చతుష్పథః ॥ నిశాచరః ప్రేతచారీ – సర్వదర్శి మహేశ్వరః ।
(బ్రహ్మేంద్రాదులను తన యనుగ్రహముచే ప్రభువుల జేయువాడు - మహేశ్వరుడు)
బహుభూతో బహుధనః సర్వసారో ఆ మృతేశ్వరః ॥ నృత్యప్రియో నిత్యనృత్యో నర్తనః సర్వసాధకః । సకార్ముకో మహాబాహు ర్మహాఘోరో మహాతపాః ॥ మహాశరో మహాపాశో నిత్యో గిరిచరో ఽ మతః । సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిందితః ॥
(శ్రీ రామునకు అర్జునునకును తనవలన జయము నొనగూర్చినవాడు విజయుడు;)
శ్లో॥ అమర్షణో మర్షణాత్మా-యజ్ఞహా కామనాశనః । దక్షహా పరిచారీ చ ప్రహసో మధ్యమస్తథా ॥ శ్లో॥ తేజో ఽ పహారీ బలవా? - విదితో అభ్యుదితో బహుః । గంభీర ఘోషో యోగాత్మా-యజ్ఞహా కామనా ఽ శనః ॥ శ్లో॥ గంభీర రోషో గంభీరో- గంభీరబలవాహనః । న్యగ్రోధరూపో న్యగ్రోధో-విశ్వకర్మా చ విశ్వభుక్ తీక్లో ఽ పాయశ్చ హర్యశ్వః సహాయః కర్మ కాలవిత్ ।
(భక్తులు కాని వారికి ధనాదాయము లేకుండ జేయువాడు అపాయుడు)
(విష్ణువు వాహనముగా గలవాడు హర్యశ్వుడు)
విష్ణు(:) ప్రసాదితో యజ్ఞః సముద్రో బడబాముఖః ॥ హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః । ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవిత్ ॥ జ్యోతిషా మయనం సిద్ధిః సంధి ర్విగ్రహ ఏవ చ । ఖడ్లీ శంఖీ జటీ జ్వాలీ ఖచరో ద్యుచరో బలీ ॥ వైణవీ పణవీ కాలః కాలకంఠః కటంకటః ।
(కటం = గజాననమస్తకమును-కబతీతి ప్రేమతో
నను సంధించువాడు కటంకటుడు.)
నక్షత్రవిగ్రహూ భావో నిభావః సర్వతో ముఖః ॥
(నితరాం భావో నిభావః జగత్తునకు మిక్కిలి యునికిని
కల్పించువాడు నిభావుడు)
విమోచనస్తు శరణ్ - హిరణ్యకవచోద్భవః I మేఖలాకృతిరూప శ్చ - జలాచారః స్తుత స్తథా ॥
(మేఖల యనగా శివలింగము యొక్క పానవట్టముగా నుండు వాడు)
వీణీ చపణవీ తాలీ నాలీ కలికటు స్తథా ।
(పణమనగా లోకవ్యవ హారము; దాని ననుసరించువాడు పణవి;)
సర్వతూర్య నినాదీ చ సర్వవ్యా వ్యపరిగ్రహః ॥ వ్యాల రూపీ బిలావాసీ- గుహావాసీ తరంగవిత్ । వృక్షః శ్రమాల కర్మా చ-సర్వబంధవిమోచనః ॥
(వృక్షః = బిల్ప వృక్ష స్వరూపుడు; ) శ్రీమాలం- లక్ష్మీ క్షేత్రమగు
కర్మ= స్వపూజనాది కర్మ గలవాడు - శ్రీమాలకర్మ;)
బంధనస్తు సురేంద్రాణాం యుధి శత్రువినాశనః ।
సఖా ప్రవాసో దుర్వాపః సర్వసాధునిషే వితః ॥
ప్రస్కందో ఆ ప్య విభావ శ్చ - తుల్యో యజ్ఞవిభాగవిత్ ।
సర్వవాసః సర్పచారీ దుర్వాసా వాసవో మతః ॥
శ్లో॥ హైమో హేమకరో యజ్ఞః సర్వధారీ ధరోత్తమః ॥
ఆకాశో నిర్విరూప శ్చ వివాసా ఉరగః ఖగః ॥
శ్లో॥ భిక్షుశ్చ భిక్షురూపీ చ-రౌద్రరూపః సురూపవా ? ।
వసురేతాః సువర్చస్వీ - వసువేగో మహాబలః ॥
శ్లో॥ మనో వేగే నిశాచార:- సర్వలోక శుభప్రదః ।
సర్వావాసీ త్రయీవాసీ-ఉపదేశకరోడి ధరః ॥
ముని రాత్మా ముని శ్లోకః - సభాగ్యశ్చ సహస్ర భుక్।
(మునిః = అగెసె (అగస్తి) చెట్టుగ నుండువాడు)
పక్ష్మి చపక్ష రూపశ్చ ఆతిదీప్తా నిశాకరః ॥
శ్లో॥ సమీరో దమనాకారో- హ్యరో హ్యర్థకరో వశః ।
వాసుదేవ శ్చ దేవ శ్చ-వామదే వశ్చ వామనః ॥
సిద్ధియోపహారీ చ-సిద్ధః సర్వార్థసాధకః ।
అక్షుణ్ణః క్షుణ్ణరూప శ్చ - వృషణా మృదు రవ్యయః ॥
(వృషణుడనగా సర్వ స్వరూపుడు 14 సర్వోవై రుద్రః’’ అను శ్రుతి- దీనకి ప్రోద్భలకము)
శ్లో॥ మహాసేనో విశాఖ శ్చ - షష్ఠిభాగో గవాంపతిః । చక్రహస్తస్తు విష్టంభీ - మూలస్తంభన ఏవ చ ॥ ఋతు ఋతుకరస్తాలో - మధు ర్మధుకరో వరః । వానస్పత్యో వాజసనో - నిత్య మాశ్రమపూజితః ॥ బ్రహ్మచారీ లోకచారీ- సర్వచారీ సుచారవిత్ । ఈశాన ఈశ్వరః కాలో-నిశాచారీ హ్యనేకదృక్ ॥ నిమిత్తస్తో నిమిత్తం చ నంది ర్నందికరో హరః । నందీశ్వర స్సునందీ చ నందనో విషమర్దనః ॥
(కాలకూటవిషమును పనికిరాని దానిగా నొనర్చువాడు విషమర్దనుడు;)
భగహారీ నియంతా చ -- కాలో లోకపి తామహః । చతుర్ముఖో మహాలింగ శ్చారులింగ స్తథైవ చ ॥
(జగత్తు అను రథమునకు సారధివంటివాడు- నియంత యన బడును.)
లింగాధ్యక్షః సురాధ్యక్షః కాలాధ్యక్షో యుగావహః । బీజాధ్యక్షో బీజకర్తా అధ్యాత్మా _నుగతో బలః ॥ ఇతిహాస శ్చ కల్ప శ్చ దమనో జగదీశ్వరః । డంభో దంభకరో దాలా వంశో వంశకరః కలి: ॥ లోకకర్తా పశుపతి -ర్మహాకర్తా హ్యధోక్షజః । అక్షరం పరమం బ్రహ్మా- బలవారి శ్చుక్ర ఏవ చ ॥ శ్లో॥ నిత్యో హ్యనీశః శుధాత్మా- శుదౌ మానో గతిర్లవి: । ప్రాసాదస్తు బలో దర్పో- దర్పణో హవ్య ఇంద్రజిత్ ॥
(బలము అనగా గొప్పస్థానము అట్టి మహాకైలాసస్థానము గలవాడు - బలుడు)
వేదకార స్సూత్రకారో- విద్వాం శ్చ పరమర్దనః । మహామేఘ నివాసీ చ - మహాఘోరో వశీకరః ॥
(మహామేఘరూపుడగు విష్ణువులో నివసించువాడు మహామేఘ నివాసి)
అగ్ని జ్వాలో మహా జ్వాల: - పరిధూమ్రావృతో రవిః ।
అనాహత చక్రమునందు ధ్వనించువాడు
(రాతి- అనాహత ధ్వనం కరోతీతి రవిః) కవి;)
ధిషణః శంకరో నిత్యో.. వర్చస్వీ ధూమ్రలోచనః ॥ నీలస్తథారింగలుప్తశ్చ - శోభనోసరవి గ్రహః ।
(నరుఁడనఁడగు అర్జునుని బలశేర్యములను పరీక్షించుటకు వైరమును నటించినవాడు - సరవిగ్రహుడు.)
స్వస్తి స్వస్తి స్వభావశ్చ భోగీ భోగకరో లఘు: ॥
(“లఘు ర్మనోజ్ఞ నిస్సారా సురుషు” అను విశ్వనిఘంటువు ననుసరించి మనోహరుడగువాడు లఘువు)
ఉత్సంగ శ్చ మహాంగ శ్చ -- మహాగర్భః ప్రతాపవాన్ । కృష్ణవర్ణ స్సుపర్ణశ్చ ఇంద్రియ స్సర్వ వర్ణికః ॥
(క ప్లేన వక్షః స్తుతః కృష్ణవః కృష్ణునిచే ను తింపబడినవాడు
కృష్ణనల్లుడు 11 పర్లో ద్విజాడౌ శుక్లాచౌస్తుభ్ : విశ్వనిఘంటువు; )
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః । మహామూరా మహామాత్రో మహామిత్రో నగాలయః ॥
(మహామాత్రః = మృత్యువు లను గజమును నియమించు మావటి
వాడు- మహామాత్రుడనబడును.)
మహాస్కందో మహాకర్లో-మహోష్ణ శ్చ మహాహనుః I మహానాసో మహాకంతో - మహా గ్రీవః శ్మశానవాన్ II
(శ్మనాం = శరీరాణాం; శాను= తనూకరణం యస్య సః శ్మశాన వంతుడు; పునర్జన్మ లేకుండ జేయు కాశీ క్షేత్రము గలవాడని భావము.)
మహాబలో మహాతేజా హ్యంతరాత్మా మృగాలయః । లంబితోష్ణ శ్చ నిష్ఠ శ్చ -- మహామాయః పయోనిధిః ॥
(విష్యాచులను మోహింపఁజేయు మాయ గలవాడు--మహామాయుడు)
మహాదంతో మహాదంష్టో - మహాజిహ్వ మహాముఖః । మహానఖో మహారోమా-మహాకేశో మహాజటః ॥ అసపత్నః ప్రసాద శ్చ - ప్రత్యయో గీత సాధకః । ప్రస్వేదనో ఽ స్వహేన శ్చ - ఆదికశ్చ మహామునిః ॥
(శోభనం అహః - స్వహః = శుభప్రదమగు దినము స్వహమగును.
స్వహమునకు ఇనః = ప్రభువు - స్వహేనుడు; స్వహేనుడగు అః = విష్ణువు శివుని వామ భాగమునుండి ఉద్భవించెను గాన అట్టి వాడు అస్వహేనుడు;)
వృషకో వృషకేతుశ్చ - అనలో వాయువాహనః । మండలీ మేరువాస శ్చ దేవవాహన ఏవ చ । అధర్వశీర్షః సామాస్యః - బుక్ సహస్రార్జిత లక్షణం । యజుః పాదభుజో గుహ్యః ప్రకాశౌజా స్తథైవ చ । ఆమోఘార్థ ప్రసాద శ్చ - అంతర్భావ్యః సుదర్శనః । ఉపహారః ప్రియః సర్వః కనకః కాంచనస్థితః ॥ నాభి ర్నందికరో హర్మ్య। పుష్కరః స్థపతిః స్థితః ।
(భువన మధ్య రూపము గలవాడు నాభియని విశ్వం బిభర్తి భువనస్య నాభి : “ అను శ్రుతి ననుసరించి చెప్పబడును)
నందికరః యజ్ఞఫల సమృద్ధిని కలుగ జేయువాడు; హర్మ్యః = కుబేరుని
గృహము స్థానముగ గలవాడు; స్థపతిః = సర్వాధ్యక్షుడు నని- రుద్రభాష్యము.
సర్వశాస్త్ర ధన శ్చాద్యో యజ్ఞోయజ్వా సమాహితః ॥
(యజ్ఞః = జీవ సాహచర్యము గలవాడు)
నగో నీల: కవిః కాలో మకరః కాలపూజితః ।
(నీల:- ‘ నీలః కపీశ్వరే నీలివృక్షలాంఛనభేదయోః “ అను విశ్వ
నిఘంటువు బట్టి శుభమునకు లాంఛన (గురు) మగువాడు; )
గణకారశ్చ భూతభావనసారథిః ॥
(భూతభావను (డనబడు బ్రహ్మదేవుడు భూరథసారథిగా గలవాడు -
భూతభావన సారథి;)
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతతను ర్గణః ।
(మంకణ ఋషి తన శరీరము నుండి ఉద్భవించిన శాకరసము (గాంచి సంతోషముతో ఆడుచుండగా- మంకణుని తపోమహిమవలన ముల్లోకములు భయపడి కదలు చుండెను. అట్టి త్రైలోక్యమును స్థిర పలుచుబుకు తన శరీరము నుండి భస్మ నుచ్ఛవింపజేసి మంకణుని శాంతిపజేసినవాడు భస్మభూత తనువని చెప్పబడెను. ఇద్ది మహాభారత ప్రోక్తము.)
ఆగమ శ్చ విలోపశ్చ మహాత్మా సర్వపూజితః ॥ శుక్ల స్త్రీరూపసంపన్నః శుచి ర్భూతనిషేవితః ।
(స్త్రీ రూపముగల అమ్మవారితో కూడి యుండు వాడు స్త్రీ రూప సంపన్నుడు;
పూర్వాచార్యులచే సేవింపబడినవాడు భూతనిషేవితుడు;)
ఆశ్రమస్థః కపోతశ్లో విశ్వకర్మా పతి ర్విరాట్ ॥ విశాలశాఖ స్తాఋషో హ్యంబుజాల: సునిశ్చితః । కపిలః కలశః స్థూల ఆయుధశైవ రోమశః ॥ శ్లో ॥ గంధర్వో హ్యదితిస్తార్యో వ్యావిజేయః సుశారదః ।
(శోబనమగు వాక్కు నొసగువాడు- సుశారదుడు)
పరశ్వథాయుధో డేవో హ్యర్థకారీ సుభాంధవః ॥
(ఆప్తుడైన బంధువువలె ఆపత్కాలమున భక్తుల నాచుకొనువాడు సుబాంధవుడు;)
తుంబవీ, మహాకోప ఊర్ధ్వరేతా జలేశయః । ఉగ్రే వంశకరో వంశో వంశవాదీ హ్యనిందితః ॥
(అనిందితః = అః = విష్ణుః, దధీచ్యాదిభిర్నిందితో యస్మాత్సః “
అను విగ్రహము వలన తన నిమిత్తముగా దధీచి మహర్షి మొదలగు వారిచే
నిందింపబడిన విష్ణువు గలవాడు- అనిందితుడు;)
సర్వాంగరూపీ మాయావీ సుహృదో హ్యనిలో బలః । బంధనో బంధకర్తా చ-సుబంధనవిమోచనః ॥ రాక్షసఘ్నో థ కామారి ర్మహాదం ` మహాయుధః । లంబితో లంబితోష్ణ శ్చ-లంబహస్తో వరప్రదః ॥ శ్లో । బాహు స్త్వనిందితః సర్వ:- శంకరోథాప్యకోపనః । అమరేశో మహాఘోరో - విశ్వదేవః సురారిహా ॥
‘నాస్తి ఇందితం= పరమైశ్వర్యం యస్మాత్సః అనిందితః “అను వ్యుత్పత్తి (బట్టి-
తన ప్రాప్తిని మించిన ఐశ్వర్యము లేనివాడు” అనిందితుడని చెప్పబడును.
అహిర్చువ్వో నిఋతి శ్చ - చేకితానో హవీ తథా ।
(బుగ్నే పృథివీమూలే పాతాళే భవతీతి బుధ్వః; అహిః - సర్పశ్చాసౌ
బుద్న్య శ్చ = అహిరుధ్న్యః “ పాతాళము నందు ఆదిశేషుడుగ నుండువాడు
అహిర్భుధ్యుఃఁడు; అతిశయముగా తెలిసికొనువాడు చేకితానుడు;)
అజైక పాచ్చ కాపాలీ శం కుమారో మహాగిరి: ॥
(“అజాయా: మాయారూపదేవ్యాః ఏకపాత్ = ఏకభాగో యస్యసః “
“మాయారూపిణియగు దేవి తన శరీరములో నొక భాగముగ గలవాడు
అజైకపాత్ - అనబడును)
(పృథివి, అంత రిక్షము అను రెండు కపాలముల చేరికయగు బ్రహ్మాండము
గలవాడు - కాపాలి;)
శ్లో॥ ధన్వంతరి రూమకేతుః సూర్యో వైశ్రవణ స్తథా । ధాతా విష్ణుశ్చ శక్ర శ్చ-మిత్ర స్వష్టా ధరో ధ్రువః ॥ ప్రబాసః పర్వతో వాయు రర్యమా సవితా రవిః । ధృతిన్చైవ విధాతా చ -మాంధాతా భూతభావనః ॥ నీర స్తీర్ణ శ్చ భీమశ్చ - సర్వకర్మా గుళోద్వహః । పద్మగర్భో మహాగర్భ శ్చంద్రవక్రో నభో జనఘః ॥
(హృదయ కమల మధ్య వర్తి= పద్మ గర్భుడు; ఆహ్లాదింపజేయు ముఖము గలవాడు
చంద్రవ క్రుడు; జన్మ నక్షత్రము లేనివాడు నభుడు;)
శ్లో॥ బలవాం శ్చోపశాంత శ్చ - పురాణః పుణ్యకృత్తమః । క్రూరకర్తా క్రూరవాసీ-తను రాత్మా మహౌషధః ॥ శ్లో॥ సర్వాశయ స్సర్వ చారీ- ప్రాణేశః ప్రాణినాం పతిః । దేవదేవః సుఖోత్సిక:- సదస త్సర్వరత్నవిత్ ॥ శ్లో॥ కైలాససే గుహావాసీ హిమవధారిసంశయః । కులహారీ కులాకర్తా - బహువిత్తో బహుప్రజః ॥
(కులములు అనబడు శరీరములను హరించవాడు కులహారి;)
శ్లో॥ ప్రాణేశో బండకీ వృక్షో-నకుల శ్చాద్రిక స్తథా । హ్రస్వగ్రీవో మహాజాను-రలోల శ్చ మహౌషధిః ॥
(“ప్రాణో బలం” అను విశ్వనిఘంటువుబట్టి శరీరవాజ్ఞనో బలము యొక్క
ప్రభువు ప్రాణేశుడు; బంధకి యనదగు పుంశ్చలిగా నుండు మాయగా నుండువాడు బంధకీ; వృశ్చతి = మాయాం ఛేదయతీతి “మాయను ఛేదించునుగాన వృక్ష్మ”
( నకులః - కులములేని వాడు నకులుడు”)
సిద్ధాంతకారీ సిద్ధార్థ-శ్చందో వ్యాకరణోద్భవః । సింహనాద స్సింహదంష్ట్ర: సింహాస్యః సింహవాహనః ॥
(సింహముఖము గల నృసింహస్వామియై హిరణ్యకశిపుని
వధించినవాడు-సింహాస్యుడు; “సింహముతో కూడిన వాహన (రథ)ము గలవాడు సింహవాహనుడు;)
ప్రభా వాత్మా జగత్కాలః కాలః కంపీ తరుస్తనుః । సారంగో భూతచక్రాంకః - కేతుమాలీ సువేధకః ।
(“ప్రాణులను జన్మలలో పరివర్తింపజేయుట చిహ్నముగా గలవాడు భూతచక్రాకుండు; కంపీ= కదులుట గల వాయువగువాడు కంపి;
కేతునా = వృషధ్వజముతో, మాలతీతి = శోభించువాడు కేతుమాలి;
మిక్కిలి అజ్ఞానగ్రంధిని వేధించువాడు - సువేధకుడు;)
భూతాలయో భూతపతి-రహోరాత్రో _మలో మల: ।
వసుభృత్సర్వభూతాత్మా-నిశ్చల స్సువిదు ర్భుధః ॥
(“భూతము అను వనము ఆలయముగా గలవాడు - భూతాలయుఁడు;
“పంచభూతముల ప్రభువు భూతపతి; అహః దినం; రాతి= దదాతీతి; అహోరాః, సూర్యుడు; తం త్రాయత ఇతి= సూర్యుని రక్షించువాడు అహోరాత్రుఁడు;
“మలం కృపణే అను విశ్వనిఘంటువు బట్టి భక్తులు కాని వారి విషయమై ఉదార
స్వభావము లేనివాడు = మలుడు;)
అసుహృ త్సర్వభూతానాం నిశ్చల శ్చలవిద్ బుధః । అమోఘ స్సంయమో హృప్లో భోజనః ప్రాణధారణః ॥
“ప్రాణులందరి యొక్క అసువు (ప్రాణము) లను హరించువాడు-సర్వభూతా
సుహృత్తనంబడును” “ ప్రాణము అను వాయువును పోషించువాడు ప్రాణధారణుడు”
ధృతిమాన్ మతిమాంస్ర్యక్షుః - సుకృతస్తు యుధాంపతిః । గోపాలో గోపతిరామో గోచర్మపసనో హరః ॥
“ ఇంద్రియములను రక్షించువాడు గోపాలుడు; 1 వాక్కుల యొక్క ప్రభువు-
గోపతి) “ “ బ్రహ్మదేవుని, దేవేంద్రుని, వరుణుని, యముని, కుబేరుని నిగ్రహించి
హరించువాడు - హరుడు.
శ్లో॥ హిరణ్యబాహుశ్చ తథా - గుహావాసః ప్రవేశనః । మహామనా మహాకామో చిత్తకామో జితేంద్రియః ॥
“మదనుని సర్వజేతగా నొనర్చినవాడు - మహాకాముడు” జీవాత్మకు చిత్తము నందు
కామవికారమును కలిగించువాడు చిత్తకాముడు.”
గాంధార శ్చ సురాపశ్చ - తాపకర్మరతో హితః । మహాభూతో భూతవృతో హృప్సరో గణసేవితః ॥
జిహ్వలో ప్రవేశించుటచే కలుగు అగ్ని యొక్క వేడితో శిరస్సునందు గల చంద్రుని నుండి స్రవించు సారము - అమరసుర కాగా, అద్దానిని త్రాగువాడు సురాపుడు “
హఠదీపిక జ్యేష్ఠం భూతం వదంత్యేసం “ అను మహాబారతగత ద్రోణ పర్వోక్త వాక్యముఁ
బట్టి మహాభూతుడు; విష్ణు ర్మహద్భూతం “ అనులోకోక్తిని పై నిర్వచనము నిరాకరించినదని తెలియవలెను. పూర్వపూర్వభక్తులచే ఆవరింపబడినవాడు- భూతవృతుడు; అప్=ఉచకపూర్ణమగు, సరః= కొలనగువాడు-అప్సరుడు,
మహాకేతు ర్ధరాధాతా నైకతానరతః స్వరః । అవేదనీయ ఆవేద్యః సర్వగ శ్చ సుఖావహః ॥
(అనేకములైన తానములనబడు మూర్ఛనలనదగిన స్వర భేదముల యందు ఆసక్తి
గలవాడు - నైకతానరతుడు) (కొద్దిగా తెలియనలవియగు వాడు - ఆవేద్యుడు;)
(అందరిచే కీర్తింపబడువాడు సర్వగుడు;)
తారణ శ్చరణో ధాతా - పరిధా పరిపూ జితః । సంయోగీ వర్ధనో వృద్రో గణికోఽథ గణాధిపః ॥
(సమస్తమును ధరించు పృథివియగువాడు పరిధ యన బడును)
నిత్యో ధాతా సహాయ శ్చ - దేవాసురపతిః పతిః । యుక్త శ్చ యుక్తబాహు శ్చ సుదేవోఽపి సుపర్వణః ॥
ఉమాదేవితో కూడిన బాహువులు గలవాడు యుక్త బాహువు;)
(ఆయేన = ఆదాయముతో; సహితః = కూడినవాడు-సహాయుడు; )
(సుష్టు దేవ్యాసహ= దేవితో బాగుగా విహరించువాడు = సుదేవుడు)
ఆషాఢ శ్చ సుషాఢ శ్చ-స్కందదో హరితో హరః । వుపు రావర్తమానోడి న్యో - వపుః శ్రేష్టో మహావపుః ॥
(స్కందుని కోపము నణచువాడు స్కందదుడు;)
(హ= అద్భుతమును; రాతి= ఏర్పరచువాడు- హరుడు)
(హేత్యద్భుతే వేదే” అమర కోశము)
విమర్శనః సర్వ-లక్ష్య లక్షణ భూషితః । అక్షయో రథగీత శ్చ సర్వభోగీ మహాబలః ॥
(యజుర్వేదము శిరస్సుగా గలవాడు = శిరస్సు; 1 తస్యయజరేవ శిరః “శ్రుతి)
(రథంతర మను సామవేదభాగముతో నుతింపబడినవాడు - రథగీతుడు)
సామ్నాయోథ మహామ్నాయ - స్తీర్ణదేవో మహాయశాః । నిర్జీవో జీవనో మంత్రః-సుభగో బహుకర్కశః ॥
తనవలన శ్రీకృష్ణాదులకు గొప్పకీర్తి నొదవ ఁజేయువాడు - మహాయశస్వి;)
(అచేతన స్వరూపుడు నిర్జీవుడు;) ( బ్రతికించువాడు-జీవనుడు;)
(మృత సంజీవనమంత్రమగువాడు మంత్రుడు) (అంతకస్వరూపుడైనిర్దయముగా
ప్రాణములను పెకిలింపజేయు అత్యంత కఠినుడు - బహుకర్కశుడు;)
రత్నభూతో _ థ రత్నాంగో-మహార్లవనిపాతనిత్ । మూలం విశాలో హ్యమృతం వ్యక్తావ్యక్త స్తపోనిధిః ॥
(పదునాలుగు రకాల రత్నముల నొసగువాడు రత్నభూతుడు;)
(శ్రేష్ఠములైన రత్నములు శరీరమున గలవాడు-రత్నాంగుడు;)
(సంసారము అను మహాసముద్రముఁదగు వినాశమును గుర్తెరుగువాడు
మహార్లవనిపాతవిదుడు)
(అవ్యక్తము అను ప్రకృతిని వ్యక్తపఱుచువాడు-వ్యక్తావ్యక్తుడు
ఆరోహణో అధిరోహశ్చ. శీలధారీ మహాతపాః । మహాకంతో మహాయోగీ-యుగో యుగకరో హరిః ॥
(పరమపదము నదిష్ఠింపజేయువాడు - ఆరోహణుడు;)
కంఠము వరకు నిండిన వేడుక గలవాడు - మహాకంఠుడు)
(ఆంజనేయుడుగ నవతరించువాడు - హరి;)
యుగరూపో మహారూపో - వహనో గహనో నగః । న్యాయో నిర్వాపణ్డి పాద:- పండితో హ్యచలోపమః ।
(శీతోష్ణాది ద్వంద్వములు రూపముగా గలవాడు యుగరూపుడు)
(కరచరణాద్య వయవములు గల ప్రాకృతరూపములు లేనివాడు - మహారూపుడు)
(బిల్వాది వృక్షరూపుడు-నగుడు) (మంచి భూములలో విత్తనముల నంకురింపఁ
జేయువాడు - నిర్వాపణుడు)
బహుమాలో మహామాలః - శిపివిష్ట స్సులోచనః । విస్తారో లవణః కూపః కుసుమాంగః ఫలోదయః ॥
(అనేక భక్తులచే సమర్పింపబడిన మందార పుష్పమాలికలు గలవాడు
బహుమాలుడు) (పాదముల వరకు వ్రేలాడు నట్టి పుష్పమాలిక గలవాడు.
మహామాలుడు) (శిపివిష్టుడన (బడు విష్ణువగువాడు- శిపివిష్టుడు)
(పుష్పములవలె సుకుమారములైన అవయవములు గలవాడు కుసుమాంగుడు)
ఋషభో వృషభో భంగో - మణిబింబజటాధరః । ఇందుర్విసర్గ స్సుముఖః - శూర స్సర్వాయుధ స్సహః ॥
ఋషభ యోగీశ్వరుడై రాజ కుమారుని జీవింపజేయువాడు ఋషభుడు)
(మణుల ప్రతిబింబముల వలె శోభించు జడల (దాల్చువాడు మణిబింబజటాధరుఁడు
( అనేకవిధబుద్ధి తరంగములను కలుగజేయువాడు భంగుఁడు)
(జరామరణములు లేనట్టి విశిష్ట రుద్రగణసృష్టిఁజేయువాడు- విసర్గుడు)
(ఆయుధ ప్రహారముల నన్నిటిని లెక్కింపనివాడు సహుడు)
నివేదన స్సుప్రజాతః - స్వర్గద్వారో మహాధనుః । గిరావాసో విసర్గ శ్చ - సర్వలక్షణ లక్షవిత్ ॥
(అమృతమును పుట్టించువాడు సుధాజాతుడు)
(మోక్ష సుఖము గల పరమ పదమగువాడు స్వర్గ ద్వారుడు)
(వాక్కులోని అర్థమగువాడు - గిరావాసుడు;)
(విసర్జనీయ రూపముతో పదములను విడదీయవాడు విసర్దుఁడు)
గంధమాలీ చ భగవా ననంతస్సర్వలక్షణః । సంతానో బహులో బాహుః సకల స్సర్వపావనః ॥
(తన బడలి పరిమళముతో రాణించువాడు-గంధమాలి)
(గొప్ప మహిమ గలవాడు- భగవా?) (కల్ప వృక్ష స్వరూపుడు- సంతానుడు)
(అపేక్షితమున కంటె నధికము నొసగువాడు - బహులుడు)
(తన భక్తులను సన్నిధి నాహ్వానించువాడు - బాహువు)
(చంద్రుని పదునాఱవ కళతో కూడినవాడు- సకలుడు)
కరస్థాలీ కపాలీ చ - ఉర్ధ్వసంహననో యువా । యంత్ర తంత్ర సువిఖ్యాతో-లోక స్సర్వాశ్రయో మృదుః ॥
“హస్తమే భోజనపాత్రముగ గలవాడు- కరస్థలి యనబడును. “
(తతః కరతలీకృత్య-వ్యాపి హాలాహలం విషం” అను పౌరాణికీ ఫణితి- ఇందుకు
ఆధారము. ( కం= బ్రహ్మదేవుని; పాలయతి = రక్షించువాడు - కపాలి;”
ముండో విరూపో వికృతో దండీ కుండీ వికుర్వణః I వార్యక్షః కకుభో వజీ - దీప్తతేజాః సహస్ర పాత్ ॥
(భక్తజనకామములను సిద్ధింపజేయు నేత్రము గలవాడు-వార్యక్షుడు;)
వాద్యము గుఱతుగా కలవాడు- కకుభుడు)
(కకుభః స్వరభేదేఽపి - వీణాంకేఆర్జునపాదపే ఇతి విశ్వ:)
(భూషణార్హములగు వజ్రాదులు గలవాడు - వజ్ర;)
సహస్రమూర్ధా దేవేంద్రః - సర్వదేవమయో గురుః । సహస్రబాహు స్సర్వాంగః శరణ్య స్సర్వలోకకృత్ ॥ శ్లో॥ పవిత్రం త్రిమధు ర్మంత్రః కనిష్ఠః కృష్ణపింగళః । బ్రహ్మదండవినిర్మాతా - శతఘ్నః శతపాశధృక్ ॥
(తన భక్తులను వజ్రాయుధము నుండి కాపాడు వాడు పవిత్రుడు)
(తేనే, నీరు, పాలు అను మూడు మధువులనొసగువాడు త్రిమధువు)
(దేవతలను ప్రసన్నులఁజేయు-మంత్రమగువాడు-మంత్రుడు;)
(నిత్యమగు యౌవనము గలవాడు కనిష్టుడు)
కలా కాష్టా లవో మా ముహూర్తో ఆహః క్షపా క్షణః । విశ్వక్షేత్ర ప్రదో బీజం లింగ మాద్యస్తు నిర్ముఖః ॥
(జీవులందరికి శరీరముల నొసగువాడు- విశ్వక్షేత్ర ప్రదుడు)
సరస ద్వ్యక్త మవ్యక్తం పితా మాతా పితామహః । స్వర్గద్వారం మోక్ష ద్వారం ప్రజాద్వారం త్రివిష్టపః ॥
(స్వర్గద్వార మగు తపస్సగువాడు -- స్వర్గ ద్వారము)
(మోక్ష ద్వారమగు వైరాగ్యాది సాధన చతుష్టయ మగువాడు-మోక్ష ద్వారము)
(సంతాన ద్వారమగు కామ మగువాడు - ప్రజాద్వారము)
శ్లో॥ నిర్వాణం హృదయ శైవ - బ్రహ్మలోకః పరాగతిః । దేవాసురవినిర్మాతా - దేవాసుర పరాయణః ॥ శ్లో॥ దేవాసురగురుర్దేవో - దేవాసురనమస్కృతః । దేవసురమహామాత్రో దేవాసురగణా శ్రయః ॥ శ్లో॥ దేవాసుర గణాధ్యక్షో - దేవాసురగణాగ్రణీ: దేవాధిదేవో దేవర్షి: - దేవాసురవర ప్రదః ॥ శ్లో॥ దేవాసురరేశ్వరో విష్ణు - ర్దేవాసురమహేశ్వరః । సర్వదేవమయో చింత్యో దేవతాత్మా స్వయంభవః ॥ ఉద్గత స్త్రీ క్రమో వేద్యో వరదోఓవరజోడింబరః ।
(అస్య- విష్ణోః, కృష్ణునకు; వరాత్ = వరప్రదానము వలన-సాంబరూపముతో
జన్మించువాడు - అవరజుడు)
ఇజ్యో హస్తీ తథా వ్యాఘో-దేవసింహో మహర్షభః ॥ విబుధాగ్ర్య స్సుర శ్రేష్ఠః స్వర్గదేవ స్తథోత్తమః ।
సంయుక్తః శోభనో వక్తా - ఆశానాం ప్రభవో కెవ్యయః
( అస్య = విష్ణువునకు; వి= విశేషించి; ఆయం= త్రైలో క్వైశ్వర్య ప్తిని కలుగజేయువాడు
అవ్యయుడు)
గురుః కాంతో నిజః సర్గః-పవిత్ర స్సర్వవాహనః । శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః ॥
(జగద్బీజమును నెలకొలుపువాడు - గురువు;)
(కస్య = బ్రహ్మయొక్క అంతము (జేయువాడు - కాంతుడు)
(శరీరములన్నియు వాహనములుగా గలవాడు సర్వవాహనుడు)
అభిరామ స్సుశరణ్ - విరామ స్సర్వసాధనః । లలాటాక్షో విశ్వదేహో - హరిణో బ్రహ్మవర్చనః ॥
(భక్తులకు ప్రశస్తములైన గృహముల నొన (గూర్చువాడు-సుశరణుడు)
స్థావరాణాం పతి శైవ - నియతేంద్రియవర్తనః । సిద్ధార్థః సర్వభూతాల్డో-చింత్య: సత్యః శుచివ్రతః ॥ ప్రతాధిపః పరం బ్రహ్మ--ముక్తానాం పరమాగతిః । విముక్తో ముక్తకేశ్చ-శ్రీమా? శ్రీవర్ధనో జగత్ ॥
(ప్రాకృత బంధము లేనట్టి బ్రహ్మదేవుని నియమించువాడు -- మక్తకేశుడు)
(శాశ్వతమైన సంపత్తు గలవాడు-శ్రీమంతుడు ;) తన భక్తులకు ఇహపర సంపదను పెంపొందించువాడు శ్రీవర్ధనుడు)
ఈ అష్టోత్తర సహస్రనామములలో ముఖ్యమగు శివనామమును మనస్సునందిడు
కొనియే-యజేశ్వరుడు విభువు నగు పరమేశ్వరుని “ బ్రహ్మదేవు ననుమతి (బడసియు” లోకత్రయ ప్రసిద్ధుడగు త్రిధన్వుడు
ఈ స్తోత్రమును పఠించి సహస్ర అశ్వమేధయాగ ఫలము నొందుటయే గాక తండిఋషి యొక్క కరుణ వలన శివానుగ్రహపాత్రుడై గణాధిపతి యయ్యెను. ఈ స్తోత్రమును చదువువాడు, వినువాడు, బ్రాహ్మణులకు వినుపించువాడును
బ్రహ్మహత్య, సురాపానము, సువర్ణచౌర్యము, గురుదారాగమనము, శరణాగతులను బాధించుటయు, మిత్రవిశ్వాసఘాతము, మాతృహత్య, పితృహత్య, వీరహత్య, భ్రూణ (గర్భ శిశు) హత్య మొదలుగు పాపములను పోగొట్టుకొనజాలును.
ప్రతిదినము శుచియై- శివాలయమున ప్రాత ర్మధ్యాహ్నసాయంకాలముల యందు శివు నారాధించుచు ఉదయము పగలు ప్రదోషకాలమున నీ స్తోత్రమును భక్తితో పఠించినచో పూర్వజన్మకృతములు ఏతజ్జన్మ క్రియామాణంబులు నగు దురితములన్నియు తొలగును.
ఇయ్యది
“ శివ విజ్ఞాన వీచిక’ “ అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (65)వ అధ్యాయము.
