లింగ మహా పురాణము

Table of Contents

37 -  మహాదానములలో తొమ్మిదవ తిలధేను దానమును నిరూపించుట

మండపమునందు పశ్చిమమున శివలింగమును పూజించి శివలింగము ముందు నేల నడుమ కమలమును ముగ్గుతో వేసియు సూతన వస్త్రములతో పద్మము నాచ్ఛాదించి - దానిపై బంగారు తామరను గంధ పుష్పాదులతో నర్చించియు - పద్మమునకు ఉత్తరభాగమున పడునొకండు గురు బ్రాహ్మణులను గంధ పుష్పాడులలో కుండల అంగుళీయకాది ప్రదానముతో సత్కరించియు బ్రాహ్మణుల ముందు ఏకాదశవస్త్రములను పఱచి వానిలో తిలలను రాసులుగా నునిచి - తిలరాసుల మధ్యన బంగారు ఆవును పూజించియు - కంచుగిన్నెలు చెరుకుగడలు అనువానితో సహ తిలరాశులను సువర్ణ ధేనువును ఏకాదశరుద్రులు అనుభావనతో ఏకాదశ బ్రాహ్మణులలోని ఆచార్యునకు సువర్ణధేనవును, మిగత బ్రాహ్మణులకు తిలరాశులను దక్షిణతో సహ సమర్పించవలెను.

ఇట్టి తిలధేను దానము వలన - ముఖ్యముగా రాజునకు స్వరాష్ట్రమున గోవృషభాది
పశుసంపద - పెంపొందుటయే గాక - సుభిక్షము నెలకొని యుండును. తదితరులు
కదితరులాచరించినను శ్రేయోభాజనులగుదురు.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాడ ప్రవచనమున (37)వ యధ్యాయము.