లింగ మహా పురాణము

Table of Contents

34 - మహాదానములలో ఆరవదైన గణేశదానమును ప్రతిపాదించుట

ఎనిమిది దిసలయందు అష్టదిక్పాలురు మధ్యన గణపతి విగ్రహము ఉండునట్లు
యథాశక్తి బంగారముతో చేయించి - అష్ట దిక్కులలో ఎనిమిది కుండములను మధ్యన ప్రధానకుండమును నిర్మించి - వానిలో దిక్పాలక మంత్రములతో - ప్రధానకుండమున గణేశమంత్రముతోడను హవనము నొనర్పవలెను.

 ఈ ప్రక్రియకు ఎనమండు గురు బ్రాహ్మణుల నొక కన్యక నెన్నుకొనవలెను. అష్టదిక్పాలక మూర్తులను గణపతి విగ్రహమును యథావిధి పూజించి - బ్రాహ్మణులకు దానముఁజేయవలెను.

 ఇట్లు అష్టదిక్పాలక పరివేష్టితుడగు గణపతిని దానము నొనర్చిన వానికి - జన్మ జన్మాంతరార్జిత పాపములన్నియు నశించును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (34)వ యధ్యాయము.