లింగ మహా పురాణము

Table of Contents

108 - ఉపమన్యు మహర్షి వలన శ్రీకృష్ణ భగవా నుఁడు శైవదీక్ష బరి గ్రహించి శివు నారాధించి పుత్రుఁబడయుట

శ్రీ కృష్ణుఁడు స్వేచ్ఛానతారుఁడైనను మానుష్యమును తూలనాడుచు దేహశుద్ధి గావించుకొని-పుత్రుఁబడయుటకై శివునద్దేశించి తపస్సు నొనర్చులకు ఉపమన్యు మహర్షి గారి ఆశ్రమముఁజేరి - మహర్షికి ప్రణమిల్లి ముమ్మారు ప్రదక్షిణముఁజేసి మునివర్యుని చూచినంతమాత్రమున తన మనోవాక్కాయ దోషములు లేనివాడై. భస్మరుద్రాక్షధారియై పాశుపత జ్ఞానము ననగా శివషడక్షరీ మహామంత్రోపదేశమును స్వీకరించి యొక సంవత్సరము నియమనిష్ఠులతో జపించినందున మహేశ్వరుఁడు సాక్షాత్కరించి సాంబుడు అను కుమారుఁడు కలుగునట్లు వరము నొసగెను.

అప్పటినుండి శివయోగు (పాశుపతు) లందరు. శ్రీకృష్ణుని చుట్టు నిలుపబడి శివధ్యానమును గావించి నందున శివానుగ్రహపాత్రులు కాగలిగిరి.

ఇంక మానవ స్త్రీలు పురుషులు తరించుటకై మరియొక విధానమును చెప్పుచున్నాను. శివలింగమును సువర్ణముతో చేయించి. వీవనకఱ్ఱను, దండమును సిరాబుడ్డిని, లేఖిని (కలము) నొకపల్లెరమున పూజించి పాశుపత శివయోగికి సమర్పింపవలెను. దాత- భస్మరుద్రాక్షలను ధరింపవలసియుండును. తన శక్తి కొలది శివయోగిని సత్కరింపవలెను.

ఇట్టి దానముఁజేయువారు సర్వపాప నిర్ముక్తులై కైలాసమును చేరుదురు. ఇందెంతమాత్రము సంశయము లేదు.

గ్రహస్థుఁడీ దానము నొనర్చినచో భవబంధముక్తుడగును. శివయోగులకే పూర్వోక్తములను సమర్పించినచో శివుఁడు శీఘ్రము ప్రసన్నుఁడగును.

శక్తి గలవారు రాజ్యమును ధనమును వాహనమును పుత్రపాత్రాది పరివారమును మహేశ్వరులకు భక్తితో నివేదించిన యెడల కృతార్థులు కాగలుగుదురు.

శ్రీ కృష్ణుని దీక్షా స్వీకారమును, పుత్రప్రాప్తిని, ఆను షంగికముగా శివలింగాది దానమును నిరూపించితిని. దీనిని పఠించినను వినినను శివలోకనివాసము లభించును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (108)వ అధ్యాయము.

* పూర్వార్ధము - సర్వంబు సమాప్తము *