లింగ మహా పురాణము
95 - విష్ణువు నృసింహావతారముఁదాల్చి - హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షించుట, నృసింహ స్మామి యొక్క ఉగ్రత్వమును
వీరభద్రేశ్వరుఁడు - శరభావతారముతో శాంతింపఁజేయుటయు
“హిరణ్యాక్షుని యగ్రజుఁడగు హిరణ్యకశిపుని సంహరించిన కథానికను వినుపించుము!” అని నైమిశారణ్యమునులు కోరగా రోమహర్షణుడు దిగువవిధము ప్రవచించెను.
హిరణ్యకశిపునకు ప్రహ్లాదుఁడు అను కుమారుఁడు జన్మించి బాల్యము నుండియే ధర్మాధర్మ విచక్షణము గలవాడై సత్యసంధుఁడై తపస్వియునై - దేవ ప్రముఖుఁడు, అవ్యయుఁడు, సర్వజ్ఞుఁడు, సర్వవ్యాపి, సర్వదేవతా మూలస్వరూపుడు, ఆదిపురుషుడు నగు శ్రీహరిని మనో వాక్కాయములతో ఆరాధించుచుండెను.
అట్టి తనయుని హిరణ్యకశిపుఁడు గాంచి యుద్రేకముతో “ప్రహ్లాదా ! నా ముందు
విష్ణు బ్రహ్మసురేంద్రాదు లెంతటివారు ? నన్నే సేవింపుము ! నా నామమునే స్మరింపుము ! నీకు జీవితేచ్ఛ గలదేని నారాయణనామము నుచ్చరింపవలదు. నేనే సర్వేశ్వరుఁడనై ఇంద్రాది అష్ట్రదిక్పాలురను శాసించువాడను. నాకంటె నితరుడెవఁడును నీకు శరణ్యుడు కాడు’’ అని గర్వముతో ప్రసంగించినను ప్రహ్లాదుడు తండ్రిమాటను పెడచెవిఁబెట్టి “నమో నారాయణాయ, నమో గోవిందాయ ‘ ఇత్యాది విష్ణువుంత్రములను తానుచ్చరించుటే గాక దైత్య బాలురందరితో నారాయణుని స్మరింపఁజేయుచుండెను.
అంత హిరణ్య కశిపుఁడు ఈ దుర్మార్గుని సంహరింపుఁడు!” అని యాజ్ఞాపింపగా
రాజభటులు ప్రహ్లాదుననేకవిధ సంహార ప్రయత్నములఁజేయునపుఁడు శ్రీహరి కాపాడుచుండెను.
“ఎక్కడున్నాడురా ! నీ శ్రీహరి?” అని హుంకరించి నంతలో రాజసభాగత స్తంభమునుండి విష్ణువు నృసింహస్వామిగా నావిర్భవించి - దిక్కులు పిక్కటిలునట్లు ధ్వనించుచు హిరణ్యకశిపుని ప్రత్యూషకాలమున నఖాగ్రములతో ఛేదించి సంహరించెను.
సృసింహస్వామి యొక్క క్రోధాగ్నిజ్వాలల తాకిడికి తాళలేక - సురాసుర సిద్ధ సాధ్యులు, దేవేంద్ర బ్రహ్మాదులును ధైర్యమును విడనాడి తమ ప్రాణములను రక్షించుకొనుటకు నలుదిసలఁ బరుగెత్తిరి. అప్పుడు సృసింహస్వామి జగత్తునంతయు క్రోధాగ్ని జ్వాలలచే నావరించెను.
లోకాలోకాచల నివాసులు, ఖేచరులు, బ్రహ్మాదులందరును గుమిగూడి. “ నీవే పరాత్పరుఁడవు; జ్యోతిస్సులకు జ్యోతివి; పరమాత్మవు; జగన్మయుఁడువు; మనోవాచామగోచరుఁడువు; మత్స్యకూర్మ వరాహస్వరూపములఁదాల్చి లోకకల్యాణము
నొనఁగూర్చితివి; ప్రస్తుతము నృసింహుడవైతివి; దేవతారక్షణార్థము దైత్యుని సంహరించితివి; నీకంటె వేరైనదేదియు లేడు.
నీవే బ్రహ్మ విష్ణురుద్రస్వరూపుఁడవు; జగత్తు యొక్క ఆద్యంతములు నీవేను; ‘ అని నుతించిరి. ఎవరీ నృసింహస్వామిని పైవిధము ప్రార్ధించెదరో, వారు ప్రారబ్దాంతమున - విష్ణులోకముఁజేరుదురు.
ఇల్లు ప్రార్థించినను నృసింహస్వామి శాంతిపనందున బ్రహ్మాదులు భయగ్రస్తులై
జగత్పరమకారణుఁడైన పరమేశ్వరు నాశ్రయించి మందర పర్వతముపై పార్వతీ దేవితో విహరించుతఱి ప్రమథగణములు, గంధర్వులు అప్సరసలు, దేవతలు, బ్రహ్మదేవుఁడును సాష్టాంగ ప్రణామంబునిడిన వారై నృసింహస్వామిని శాంతింపఁజేసి మమ్ము రక్షింపుడని ప్రార్థించిరి.
శ్లో॥ నమస్తే కాలకాలాయ నమస్తే రుద్ర మన్యవే । నమః శివాయ సాంబాయ శంకరాయ శివాయ తే ॥
“కాలకాలుఁడు, దుష్టని నిగ్రహార్థము భయంకరక్రోదము నవలంబించువాడు అంబతో కూడియుండువాడు, శంకరుఁడు సదాశివుఁడు నగు పరశివునకు నమస్కారము.
ఉగ్రుఁడవై ప్రాణులను నియమించువాడవు; మాకు మంగళము నొనఁగూర్చువాడవు. భక్తుల ఇడుములఁ బాపువాడవు; ఐహిక ఆముష్మిక సుఖముల నొదవఁజేయువాడవు, శమనాంతకుడవు, బ్రహ్మదేవుఁడవు, నారాయణుఁడవు, హిరణ్యబాహువు, హిరణ్యపతి, ఉమాపతి, శర్వుఁడు, పురుషుఁడు ఇత్యాది నామములు నీయందే సార్థకములగునవి.”
ఇత్యాది త్రయోవింశతి శ్లోకములతో ప్రార్థింపగా పరమేశ్వరుఁడు ప్రసన్నుఁడై బ్రహ్మాదులకు “నృపింహుని వధించెద”నని అభయము నొసగగా బ్రహ్మేంద్రాడులు నిశ్చింతులై తమ నెలవులకు జనిరి.
అంతమహాదేవుడు జాగరూకుడై శరభరూపముఁడాల్చి గర్వితుడైన నృసింహుఁజేరి యాతని ప్రాణములను లేవదీయగా నరరూపము సింహరూపంబు విడిబడినందున అందుండు శ్రీహరి వైకుంతమున కేగెను.
ఈ నృసింహావరారని గ్రహ కథను పఠించువాడు, వినువాడు, వినుపించునాడును కైలాసముఁజేరి శంకరుని యను గ్రహముతో సుఖపడుదురు. ఇహలోకమున శత్రువులను పరాజితులఁజేయుదురు.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” - యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (95)న అధ్యాయము.
