లింగ మహా పురాణము

Table of Contents

32 - సువర్ణ మేదినీ (భూమి) దాన నిరూపణము

శుభ్ర ప్రదేశమున మండలమునందు మూరెడు పొడవు వెడల్పు ఎత్తున గల భూమిని - నలుచదరముగా యథాశక్తి బంగారముతో సప్తద్వీపములు భూమిచుట్టు చతుస్సముద్రములు, కులాచలములు, సమస్త పుణ్యతీర్థములు, మధ్యన మేరుపర్వతంబు నుండునట్లు చేయించవలెను.

అథవా జంబూద్వీపము మాత్రము అందు నవఖండములు నుండు నట్లు భూమ్యా కృతిని బంగారముతో చేయించి  -మండలమున వేదికపై భూమి నునిచి దానిపై ఉమామహేశ్వరుల నర్చించి - శివభక్తుడైన సత్ బ్రాహ్మణునకు దక్షిణతో సహ సమర్పించవలెను.
ఈ సువర్ణమేదినీదానము లింగమహాపురాణమున - శ్రేష్ఠముగా చెప్పఁబడినది.

ఇయ్యది

“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రవచనమున (32)వ యధ్యాయము.