లింగ మహా పురాణము
89 - శివయోగుల సదాచారమును నిరూపించుట
సదాచారము గల శుద్ధాత్మ ఉత్తమగతిని పొందును. పూర్వము బ్రహ్మదేవుడు బ్రహ్మవాదులకు చెప్పిన విధముగా సూతుడు శౌనకాదులకు చెప్పదొడగెను.
శివయోగి - సన్మానమును విషముగాను, అవమానము నమృతముగాను భావింపవలెను. గురువునకు పరిచర్యఁజేయుటకై - గురుసన్నిధిని - సంవత్సరము మాత్రము నివసింపవలెను. ఆ పిమ్మట గుర్వనుజ్ఞఁబడసి స్వధర్మవిరోదము లేకుండ భారతదేశమున సంచరింపవలెను.
కనుచూపుతో త్రోవ నడువవలెను. వస్త్రమున వడబోసిన నీరు త్రాగవలెను. సత్యము
మాటలాడవలెను. శాస్త్రాదులతో సంశయము కలిగినపుడు మనస్సు ప్రేరేపించిన రీతిని ప్రవర్తింపవలెను. వస్త్ర పూతము కాని జలము (ద్రాగినచో అఘోరమంత్రమును ఐదు నూర్ల తడవలు జపించవలసి యుండును. అథవా శివలింగమును ఘృతాదులతో నభిషేకించి ముమ్మారు శివునకు ప్రదక్షిణము నొనర్పవలెను.
అతిథిగా ఆహ్వానించిన తఱి - శ్రాద్ధభోజనము జరుగు చోటునకు సోమయాగాది స్థలమునకు శివయోగి భిక్షకై వెళ్ల రాడు. ఇల్లు ప్రవర్తించిన యెడల శివయోగి (సన్న్యాసి) అహింసకుడుగా రిగణింపబడును. అగ్ని పొగ లేనిదై శాంతింపగా అందరు భుజించియుండు గృహమున భిక్షఁగ్రహింపవలెను. కాని నిత్యము మున్ను వెళ్లిన గృహమునకే భిక్షకై వెళ్లరాదు. ఇతరులవలన తనకు దుర్భాషలు రాకుండా భిక్షాటనము (జేయుయతి సద్ధర్మమును పాలించువాడగును.
వినయము సదాచారము శీలము గల శ్రోత్రియ గృహస్థుల యిండ్లలో భిక్ష నడుగవలెను.
పక్వఫలమూలాదులు తిలచూర్ణము (తెలకపిండి) గోధుమపిండి వంటలు, శివయోగి యొక్క శరీరారోగ్య సిద్ధికి మనశ్శాంతికిని దోహడములగును. శివయోగి నిత్యము భస్మశాయియై భిక్షాహారియై జితేంద్రియుడునై పాశుపత వ్రతము నాచరింపవలసియుండును.
బ్రహ్మచర్యము, త్యాగము, అహింస, అక్రోధము, గురుశుశ్రూష, శౌచము, మితాహారము, స్వాధ్యాయము అనగా వేదాంత పఠనము లేక శ్రవణంబు ననునవి యతికి విహితములగును.
ఆడవిని గజమును పట్టరానట్లు మాతాపితృ సంస్కారగుణములు కర్మబంధము మానవునకు ఆవహించినచో అట్టివాడు యతియైనను వానిని నిగ్రహింప వలను పడదు.
యజ్ఞకర్తలు స్వర్గమున దేవతలతో సమానముగా సుఖపడుటే గాక కర్మల నాచరించుచు నమరులకు అమృతాహారము నొసగుదురు గాన గృహస్థుడు జ్ఞానమార్గము నవలంబించినచో తమకు అమృతాహారము లభింపదని దేవతలు విఘ్నములను కల్పించుచుందురు.
“పాలిచ్చు ఆవు నపహరించినచో గృహస్థుడు దుఃఖపడునట్లు యజ్ఞాది సత్ర్కియలనొనర్చువాడు జ్ఞానియైనచో నమరులు బాధపడుదురని పద్మపురాణాంతర్గతమగు శివగీతయందు కలదు.
యజ్ఞయాగాది సత్కర్మాచరణమున కంటె శివషడక్షర మహామంత్రమును మహామంత్రమును జపించుట శ్రేష్ఠముగును. జపమును మించినది - పరోక్షజ్ఞానము కాగా ఆపరోక్షజ్ఞానమును కరిగించు శివధ్యానము సిద్ధించినయెడల శాశ్వత స్థాన (మహాకైలాస) నివాసము లభించును.
బహిరింద్రియ నిగ్రహ (దము)ము, అంతరింద్రియ నిగ్రహ(శమ)ము, సత్యము, కల్మషము లేకుండుట, మౌనము, ప్రాణులందరియంచు సరియైన భావస, యను నవి గల జ్ఞాన(శివధ్యాన)ము అతీంద్రియమై శివంబు నని చెప్పబడును.
శివజ్ఞాని శాంతచిత్తుడై ప్రమాద రహితుడై శివ ధ్యానపరునై, శుచియై ఏకాంతవాసయునై జితేంద్రియుడు నైనచో పాశుపతియోగమును సిద్ధింప జేసికొన జాలునని మహర్షులు ప్రవచనము.
గజము నంకుశముతో పొడునడో అభిమతస్థానమునకు మావటి వాడు వెళ్లగలుగునట్లు, ఈ చెప్పబడిన పద్ధతి నవలబించు శివయోగి కర్మబీజములను కాల్చి మోక్షము నొండజాలును,
ఇంక నొక విధానము -
గురూపదేశ యుక్తులగు వృద్ధులుకు వయఃక్రమము ననుసరించి ఎదురువెళ్లి సాష్టాంగ ప్రణామమును ముమ్మారు చేసి మూడు తడవలు ప్రదక్షిణము నొనర్పవలెను. ఇతరులైన పెద్దలకు సముస్కరింపవలెను. గురునాజ్ఞ నుల్లంఘింపరాదు. బ్రహ్మజ్ఞానోపదేశకుడైన గురువునకు జనకునకును మ్రెక్కవలెను. పినతండ్రులు జ్యేష్ఠసోదరాడులును వందనీయులేను;
ధాతువాదము, నాస్తికత, పంటలేని నేల, భూత ప్రేతపిశాచాది సాధన మంత్ర జపముతో జీవించుటయు, విషసర్పములను మంత్రాచులతో పట్టుకొనుటయు, ఇతరుల పద్దతుల సవలంబించుటయు, ఇవి మొదలగు నింద్యగుణములను శివయోగి విడనాడవలెను.
కపటము, లుబ్ధత్వము, చాడీలు చెప్పులు, పెద్దగా అతిగా నన్పుటయు, చెడుపనులను ప్రారంభించులు, (అపష్టంభము) వినోదముగా స్వేచ్ఛా చార ప్రవర్తనము, అనువాసిని - శివయోగి ఎల్లకాలము విసర్జిచుంటే గాక గురువుల సమక్షమునందును ప్రత్యేకించి పరిహరించుట ప్రశస్తమగును.
మరియు గురువాక్యము యోగ్యము కానిదైనసు బడులు చెప్పక గురువునకు కీడు కావలెనని తలప గూడదు.
శివయోగుల యొక్క. ఆసనమును, వస్త్రమును, చండాదికమును, పాదుకలను,
పుష్పమాలికలను, పరుండుచోటును, నీరుత్రాగుపాత్రను, నీడను, (అనగా ఛాయా చిత్రము (ఫోటో)ను, శివారాధనోపయుక్త వస్తువులను కాలితో తాక గూడదు.
దేవతా ద్రోహమును, గురువునకు కీడు తలంపును, ఎట్టి పరిస్థితిలోనైన చేయరాదు. ఒకవేళ చేసినచో తద్దోషశాంతికై ప్రణవపంచాక్షరిని పదివేల సార్లు జపించవలసియుండును. బుద్ధిపూర్వకముగా దేవతాగురు ద్రోహముల నాచరించిన యెడల కోటిజపముతో శుద్ధుడగును. మహాపాతక పరిహారమునకై కోటిజపము కర్తవ్యమగును. ఉపపాతక నివారణార్థము 50 లక్షలు; సామాన్యపాపనిషృత్తికై 25 లక్షలు;
సంధ్యాలోపము సంభవించిన తఱి సహస్రత్రయము; ఆహ్నికము భంగపడినచో; శతము; సకాలముల నతిక్రమించినచో అభక్ష్యభక్షణము ఘటించినచో అవాచ్యములను పలికినపుడును సహస్రము; కాకిని పెద్ద పిట్టను పావురమును పక్షులను చంపినచో అష్టోత్తర శతము జపించవలెను.
పృథివ్యాది తత్త్వములను గుర్తించి వీని నన్నిటినతిక్రమించి యుండు సదాశివుని ధ్యానించువాడు మాత్రము పూర్వోక్తదోషములలో నేదేని ఘటించినచో ప్రణవపంచాక్షరిని స్మరించినంతనే పరిశుద్ధులుగ నుందురు గాన వారికి ప్రాయశ్చిత్త జపములవసరము లేదు.
వస్త్రపూతములు వేడిలేనివి నుఱుగులేనివి యగు నుచకములతో స్నానాది సమస్తమును నిర్వహింపవలెను. గండ వర్ణ రస దూషితము, ఆశుచిస్థానస్థితము, బుఱద రాళ్లు గలదియు, సముద్రసంబంధి, ఆకులు అలముగల మడుగులోనిది, నాచుగలదియునగు ఉదకమును వాడకూడదు. గురుశుశ్రూషణాది కార్యములను శుభవస్త్రము శౌచంబు లేని యశుచి - చేయరాదు. దేవకార్యోపయుక్త వస్త్రములను ప్రతిదినము శుభ్రపరఱవలెను. మలవిసర్జన చేసినతఱి అట్టి వస్త్రమును వెంటనే ఉతుకవలెను. ఇతరులు ధరించి విడిచిన వస్త్రమును తాను ధరింపరాదు.
పట్టుబట్ట మొదలగునవి తెల్ల ఆవాలు చల్లుటతో పరిశుభ్రములగును. బంగారు గీతలు గల వస్త్రములు మారేడు దళములతో లేక మారేడుపండ్లతో శుద్ధములగును. దర్భాసనములు తక్రము (మజ్జిగ) చల్లుటచే పవిత్రములగును. మృగ వ్యాఘ్రచర్మాసనములు తెల్ల ఆవాలతో గాని, మారేడుదళములతోగాని, ఫలములతో గాని పరిశుభ్రములగును.
నారబట్టలకు ఛత్ర చామరములకు వస్త్రములకు వలె శుద్ధిచేయవలెను. కంచు పాత్రలు భస్మతోడను; ఇనుము పాత్రలు ఉప్పుకలిపిన ఉదకముతోడను; రాగిపాత్రలు చింతపండు రసముతోడను; బంగారు వెండి పాత్రలు, మణులు, శంఖములు, ముతైములు, పాషాణములు, శుద్ధజలముతోడను పరిశుభ్రములగును. గడ్డి, కఱ్ఱ మొదలగునవి స్రుక్ స్రువములు మున్నగు యజ్ఞవస్తువులు,రోకలి, రోలు, కొమ్ములు, దంత నిర్మితములు, ధాన్యరాశియందలి భాగము, శాకమూల ఫలాదులును, దర్భోదక ప్రోక్షణముతో పరిశుద్ధములగును. ఊడ్చులతో అలుకుటతోడను ఇల్లు పవిత్రమగును.
మట్టి పాత్రలు నిప్పువేడితో భూమి త్రవ్వుటతో ఆవు పేడనలుకుటతో ఊడ్చుటతో ఆవులు
నివసించుట తోడను పరిశుభ్రయగును. (త్రవ్వుటయనగా నాగలితో దున్నుటయని యర్థము) ఆవు త్రాగునది, అపవిత్రవస్తువులు లేనిది, సువాసన వర్ణము రసము గలదియు, భుమిపై ప్రవహించునదియు నగు ఉదకము కర్మాచరణమునకు, త్రాగుటకును యోగ్యమైనది.
పాలుపితుకు వేళ ముందు పాలు త్రాగిన దూడ, పండుపడవేయు పక్షి, అనురాగ సురతమున పెండ్లామునోరు, పవిత్రములని భావింపవలెను. చాకలి తన చేతుల నుతికిన వస్త్రమును దర్భోదకమును చల్లి తీసికొనవలెను. మృగముల జంపు శునకము పవిత్రమేను; నిషిద్ధ ప్రాణుల నీడ, వేదపఠనమున నోరునుండి వెలుపడు తుంపరలు తన పైన పడగూడడు.
పుప్పొడి గల నేల, గాలి, అగ్నియు, శుద్ధి లేకయే స్పృశింపదగినవి. స్నానాదులచే శుచియైనను నిద్రనుండి మేలుకొనిగాని భుజించినపిదప గాని, తుమ్మిగాని, త్రాగిగాని, ఉమ్మివేసిగాని, అధ్యయనానంతరముగాని ఉదకములో ఆచమనముఁ జేయవలెను.
ఇతరులు ఆచమనము జేయునపుడు నీటిచుక్కలు తనపై పడగూడదు.
మైథునానంతరము నేల బడిన కోడిమొదలగువాని దాకినపుడు - పంది, కాకి, కుక్క, ఒంటే, గాడిద, చండాలుడు, చైత్య (బుద్ధాలయ)ము, రజస్వల, బాలెంత అను వానిని స్పృశించినతఱి స్నానముతో శుద్ధి యగుసు.
(76 వ శ్లోకము తరువాయి)
ఇంక ఆశౌచ (సూతక)మును వివరించుచున్నానని - శౌనకారులకు సూతుఁడు చెప్పదొడగెను.
బ్రహ్మచారులకు వానప్రస్థులకు సన్న్యాసులకును ఆశాచము వర్తింపదు. ఎడతెగని పట్టుదలతో నొకానొక దీర్ఘదీక్ష గల నైష్ఠికునకును సూతకము లేదు. రాజకీయ కార్యవ్యగ్రత్వమునందు మాత్రము రాజులకు - మంత్రులు మున్నగు ఉన్నతాధికారులకు సూతక ముండదు. వేరే వేళలందైతే సూతకముండును,
ప్రతిదినము డబ్బు గడించినచో జీవనము కొనసాగునట్టి ద్విజులు స్నానమాత్రమున
పరిశుభ్రులగుదురు. ఆశౌచము లెరియని దూరదేశస్థులకు యజ్ఞదీక్షఁ బరిగ్రహించినవారికి ఋత్విజులకును నోకే దినములో సూతకము తొలగును. వైఖానసులగు బ్రాహ్మణులకు - పలితులకు నాలుగు వేడములలోని మంత్రముల జడుపువారికి పరగోత్రికులకును మూడు దినముల తరువాత బంధుమరణము తెలిసినచో ఒక దినముననే ఆశౌచము నివర్తించును.
ఇంక స్త్రీలకు త్రేతాయుగము నుండి ప్రతినెల రజోదోషము పరిగణింపఁబడుచున్నది. కృతయుగమున కురువర్షీయులవలె - భార్యలతో గూడ భర్తలు మరిణించువారగుటచే వితంతువులు లేకుండిరని తెలియవలెను. వర్ణాశ్రమవ్యవస్థ ఐతే త్రేతాయుగము నుండియే భారతదేశమునందే వ్యవహరింపబడుచున్నయది. ఇతర వర్షములలో ఖండములందును వర్ణాశ్రమములు లేవు.
స్త్రీ రజస్వలయైనచో ఆమెను నాలుగు దినములు తాకరాదు. ఇరువది దినములలో మరల బహిష్టయైన యెడల స్నానమాత్రముతో పరిశుద్ధురాలగును. రజస్వల మొదటినాడు చండాల స్త్రీగాను, రెండవనాడు బ్రహ్మ ఘాతినిగాను, మూడవనాడు రజకి (చాకలిది) గాను పరిగణింపబడినదై నాలుగవనాడు పరిశుద్ధురాలగును. నాలుగవనాడు గూడ దైవపితృకార్యములకు అర్హురాలు కాదు.
రజస్వలయగు తరుణి - నాలుగుదినములు పాటలు పాడుట, ఏడ్చుట, నవ్వుట, ప్రయాణము, అభ్యంగస్నానము, జూదము, సుగంధానులేపనము, పగటినిద్ర, పట్టుదలతో దంతధావనము, మానసికముగా రతిసుఖమును తలచుకొనుట, వాక్కుతో దేవతార్చనము, దేవతలకు మ్రొక్కుట మొదలగు వానిని చేయఁగూడదు. ఒక రజస్వల మరియొక రజస్వలను తాకినచో రెండవ వస్త్రము (చీరె)ను కట్టుకొనవలెను. నాలుగవ దినమున శుద్ధిస్నానముఁజేసిన పిమ్మట పరపురుషుని ముట్టుకొనఁగూడదు.
చతుర్దదిన స్నాతమై సూర్యుని దర్శించి పంచగవ్యమును లేక క్షీరమును పుచ్చుకొనవలెను. నాలుగవనాటి సంగమమువలన అల్పాయుష్కుడు, విద్యావిహీనుఁడు, వ్రతభ్రష్టుఁడు, పతితుఁడు, పర స్త్రీలోలుడు, దరిద్రుడు నగు కుమారుఁడు జన్మించును. కన్యార్థియగువాడు ఐనవనాడు సంగమించపలెను.
స్త్రీ రక్తము ఎక్కువైనచో కూతురు జన్మించును. పురుషుని రేతస్సు అధికమైన యెడల పుత్రుఁడుద్భవించును. శుక్రశోణితములు సమాసములగునెడ నపుంసకుఁడుదయించును. అరచనాడు పతి సంగమములో సత్పుత్రుడు జన్మించును. ఏడవనాడు గొడ్రాలగు కన్య; ఎనిమిదవ నాడు సర్వలక్షణ సంపన్నుఁడగు కుమారుఁడు; తొమ్మిదవనాడు - బాలిక, పది పదకొండు పన్నెండు దినములలో సత్పుత్రుడు; పదిమూడవ దినమున - సర్వసంకరకారిణి, తెలివి లేనిది. లే - మూగదియు నగు కూతురు; పదునాలుగచనాడు భర్తతో సంగమంచు మహిళకు ఉత్తమతసముఁడు; పదునైదవనాడు ధర్మార్కురాలగు పుత్రిక; పదహారవనాడు వేదవేదాంత విజ్ఞానపరిపూర్ణుఁడగు కుమారుఁడు జన్మించెదరు.
స్త్రీ పురుష సంగమకాలమున - ప్రాణవాయువు - ఎడమవైపు సంచరించినచో పుత్రిక జన్మించును. కుడివైపు ఊపిరి నడచినచో పుత్రుడు జన్మించును. మరియు సంగమకాలమున శుచియై - పరిశుద్ధురాలు చిరునగువు గలదియునగు ధర్మపత్నిని పొందినచో సలలితము చేకూరును,
ఇట్లు శివయోగుల సదాచారమును పురస్కరించుకొని - సకలజనుల సదాచారమును కీర్తించితిని. ఈ సదాచారాధ్యాయమును - పఠించువాడు, వినువాడు, బ్రాహ్మణాది ద్విజులకు వినుపించువాడును దేహాంతమున - బ్రహ్మలోకము జెంది - బ్రహ్మదేవునితో గూడి ఆనందించును.
అయ్యది
“ శివ విజ్ఞాన వీచిక’ యను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (89)వ అధ్యాయము.
