లింగ మహా పురాణము

Table of Contents

43 -  పదునైదవదగు లోక పాలాష్టకదానమును నిరూపించుట

శత్రురాష్ట్ర వినాశకరంబగు అష్టదిక్పాలక దానముఁదగు విధానము ఎట్లనఁగా?

దీనివలన - తన రాష్ట్రము సురక్షిత మగుటేగాక - ఏనుగలు, గుఱ్ఱములు మెదలగు వాని సమృద్ధి, పుత్రులకభివృద్ధి, గో బ్రాహ్మణహితంబు చేకూరును.

వేదికపై మండలమున అష్టదిక్పాలక విగ్రహములను, మధ్యన శివ లింగము నర్చించి ఎనిమిది దిశలయందు ఇసుకతో స్థండిలముల నేర్పరచియు - వేదవేదాంగపారగులు సదాచారసంపన్నులు జితేంద్రియులునగు ఎనమండుగురు(8) బ్రాహ్మణులచే - స్థండిలములయందు అష్టదిక్పాలకులగు దేవేంద్రాదుల మంత్రములతో హవనమును చేయించవలెను. బ్రాహ్మణుల నష్టదిక్పాలక భావనతో వస్త్రాభరణాదులతో పూజించి వారిలో నొక్కొకరికి నొక్కొక దిక్పాలక మూర్తిని సమర్పించవలెను.

తర్హి - ఈ విగ్రహములను శివలింగమునున్ను బంగారముతో లేక వెండితో చేయించులు ప్రశస్తంబగును.

ఇట్లు చేసినరాజు దిక్పాలుర లోకుములలో చిరకాలము సుఖపడి - భువిని – చక్రవర్తియై నిష్కంటక రాజ్యము నొనర్చి - దేహాంతమున ముక్తుఁడగును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక”  అను శాంకరీయ

ఆంధ్రానువాద ప్రపచనమున (43)వ యధ్యాయము.