లింగ మహా పురాణము

Table of Contents

31 - సూక్షము మహాఫలప్రదంబునగు తిలపర్వతదానమును నిర్దేశించుట.

కాలోచితమగు సమాన ప్రదేశమును, వేదిక లేకుండా - గోమయాదులతో శుభ్రపఱచి - నేలపైనూతన వస్త్రములను పఱచి - వస్త్రములపై యథాశక్తి నువ్యుల కుప్ప నేర్పరచి అష్టదళపద్మమును తిలరాశి మధ్య నునిచి పద్మమధ్యదేశమున మహేశ్వరుని యథావిధిగ నారాధించి - సద్ర్బహ్మణునకు దానముఁజేసినచో సర్వారిష్టములు - శమించును. దీనిని స్వల్ప శ్రీమంతులు గూడ ఆచరింపవచ్చును.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” - అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (31)వ యధ్యాయము.