లింగ మహా పురాణము

Table of Contents

86 - శివధ్యాన నిరూపణము

“జపమున కంటె - ధ్యానము శ్రేష్ఠమని విన్నాము. గాననో సూతమునీ ! శివధ్యానము గూర్చి వివరింపుము!” అని శౌనకాదులు ప్రశ్నింపగా సూతుడు చెప్పఁ దొడగెను.

ఒకానొకప్పుడు మేరుపర్వత గుహలో పరమేశ్వరుఁడు సనక సనందనాదులకు ఉపదేశించిన జ్ఞానమును గురించి చెప్పినవిధమును మీకు వివరించుచున్నాను.

మున్ను నేను కాలకూట విషమును నా హృదయములో నన్ను నిరామయునిగా ధ్యానించుట యను పరిపూర్ణ జ్ఞానము వలన మ్రింగఁగలిగితిని. నిజమును విచారించినచో కాలకూటము విషము కాడనియు, సంసారము విషమనియు బోధపడును.

అందువలన జీవాత్మ సర్వవిధ ప్రయత్నములతో భయంకరమైన సంసారవిషము
నుపసంహరింపవలసియుండును.

కోవక, ఇంద్రియ సుఖప్రీతి యను దోషములతో కూడిన స్వల్పజ్ఞానమే సృష్టికి మూలము, ఇచ్చానురాగముల లన కలుగు సృష్టిలో ధర్మ (పుణ్య)ము, అధర్మ (పాప)౦బు నేర్పడినవి.

స్వర్గాదిలోకములు ప్రత్యక్షములుగా లేకున్న నవ్వానియందు ఆసక్తిని కలిగించు శాస్త్రమును ఆస్తికజీవులు విసుటవలన పుణ్యము ప్రవర్తితంబగును. అందువలన ఇహలోకానుభవము, పరలోకానుభవంబు దోషభూయిష్ఠము నని భావించి - రెంటిని విసర్జించువాడు విరక్తుడని చెప్పబడును. వేదాంతము నిష్కామకర్మనిరూపకమగుటచే నద్ది నిజమైన శాస్త్రమని భావింపవలెను. సంసారమును తొలగించునదియే ధర్మమని సమర్థులు నివృత్తినే అనుసరించెదరు. సంసారము అ(ల్ప) జ్ఞానము వలననే తారసిల్లును. నిష్కామకర్మ నీశ్వరార్పిణముఁ జేయుటచే కలుగు చిత్తశుద్ధి వలన శివధ్యాన మనదగు జ్ఞానము సిద్ధించును.

జీవుడు పుణ్యాత్మయైనచో స్వర్గాదిలోకములయందు సుఖము నను భవించును. పాపాత్ముడైన యెడల నరకములయందు దుఃఖము ననుభవించును. పుణ్యపావకర్త యగునెడ - మానవలోకమున సుఖదుఃఖముల ననుభవించును.

ఉద్భిజ్జము, స్వేదజము, అండజము, జరాయుజము, నను నాలుగు తెఱగుల జన్మలు జీవాత్మకు సంభవించుచుండను.

ఉద్భిజ్జమనఁగా - నేల (బెకిలించి పుట్టనట్టె చెట్లు తీగెలు మొదలగు ప్రాణిజాతము;

స్వేదజమనఁగా - చేమలువలనఁబుట్టునది; అండజమనగా - గ్రుడ్డువలన జన్మించునది.జరాయుజఘనంగా - మావివలన జన్మించుమానవాదికము.

ఇల్లు అజ్ఞానదోషము వలన నానావిధ జన్మకృత కర్మవలనను జీవులకు ఆరు కోశములు గల శరీరమేర్పడును.

సరములు, ఎములు, కొవ్వు (ఎముకలయందు జిగురు) తండ్రి వలనను - తోలు, (త్వక్) మాంసము, నెత్తురు తల్లివలనను శరీరములో సంభవించును. గర్భమునందు, యోనిమార్గమునందు, భూమిపైనను, బాల్యమునందు, కౌమారమునందు, యౌవనమున, ముసలి తనమున, మరణమునండును దుఃఖమే కలుగు చుండును.

ద్విజులారా ! విచారించి చూడగా స్త్రీ సంగాదులతో దుఃఖమే అనుభవింప బడునని తేటపడును.

న జాతు కామః కామానా - ముపభోగేన శాస్యుతి। హవిషా కృష్ణవర్త్మేవ - భూయ ఏవాభివర్దతే ।

“కామము - కోరికల ననుభవించుబుతో శమింపక - హవిస్సుచే నగ్నివలె – అభివృద్ధి బొందుచుండును.”

అందువలన -- సంయోగమ నందు వియోగమునందును చుఃఖమే కలుగునని - విశదమైనది.

ధనకనకాదులను సంపాదించుటయందు, నానిని కాపాడులయందును, వెచ్చించుటయందును క్లేశమే కలుగుచుండును. మరియు పిశాచ కూపమున, రాక్షస జన్మయందు, యక్షత్వమున, గంధర్వదేహమున, చంద్రస్థితియందును ప్రజాపతి పదవియందు, బ్రహ్మత్వమున, ప్రకృతిలోను, పురుషావిర్భావము నందును క్షయవృద్ధులుండుటచే దుఃఖమే నెలకొనియుండును. గాన శుద్ధ (దుఃఖరహిత)ములు గానట్టి భోగములయందు కాంక్షను విడనాడి శివధ్యానపరుఁడు కావలెనని భావము.

పృథివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ననువాని సంబంధము నందు  మనోవిచారమునందు - అభిమాన ప్రదర్శనమునందు - బుద్ధి ప్రవర్తనమునందు ప్రకృతివిలాసమునందును శివయోగులైన బ్రహ్మవాదులకు - దుఃఖమే కనుపడుచుండును.

దేవేంద్రా ద్యధిపతులకు మొదట కలుగు సుఖము - దుఃఖాంతమగును. గడచిననవి గడచు చున్నవి గడువబోవునవియు, నగు అంశములను విచారించి చూచినచో దుఃఖమే గోచరించును. అజ్ఞానులు మేమే జ్ఞాసుల మనుకొని సమస్తమును సుఖమయముగా భావించుచుందురు.

ఆకలి అను రోగము శమించుటకే అన్నము ఉపయోగింపబడును కాని సుఖము కొరకు కాదు. రోగములు తొలగుటుకే ఔషధము గాని సుఖార్థము కాదు.

స్వర్గాది పుణ్య లోకముల యంచును రాగద్వేష భయాదులుండుటచే మూలచ్ఛేదముతో వృక్షము నేలఁబడునట్లు పుణ్యభోగము క్షీణింపగానే స్వర్గాదులనుండి భూలోకము పై నానావిధజన్మలను జీవులు పొంచులుకు క్రిందఁబడుచుందురు. పాపఫలము ననుభవించుటకు నరక గాములగుచుందురు.

అడవిలో “వేలుకాని బాణమునకు గురియైనచో మరణింతునను” భయముతో మృగము పరుగిడుచు ఏదే నొకచో విశ్రాంతి జెందనట్లు శివధ్యానపరుడైన యోగి పుంగవుడు సంసారము అంటుకొనునేమో యను భయముతో గ్రామ బహిః ప్రదేశములయందు పుణ్యక్షేత్రములయందును సంచరించుచు ఒకచో నిలుకడ లేకుండును.

పురుగులు పక్షులు మృగములు పశువులు గజములు అశ్వములు మొదలగు వానికిని జీవితము దుఃఖభరితముగానే యుండును గాన “సంసారగతములైన దేవ మానవాది జన్మల నపేక్షింపక సమస్తమునందు మమకారము లేని శివయోగికి శాశ్వతసుఖము చేకూరును” అని తెలియవలెను.

ఒక కల్పమువరకు జీవించు వైమానికులకు ఒక్కొకస్థానము నభిమానించు మన్వాదులకు నంతమునంచు దుఃఖమే తారసిల్లును. దేవతలు దైత్యులు నొండరులను పరాజితులఁ జేయుటలో కష్టపడుచుందురు. రాజులు రాక్షసులును ప్రారబ్ధాంతమున కటకలుపడు చుందురు. బ్రాహ్మణాది వర్ణములు గలిగిన మానవులు బ్రహ్మచర్యాది ఆశ్రమముల నవలంబించి బాధపడుచుందురు.

యజ్ఞములచేతను ప్రతముల వలనను ఉగ్రములైన తపస్సుల చేతను నానా పడదానముల వలనను పరమాత్మ సాక్షాత్కరింపడు. శివధ్యానము అను జ్ఞానము వలననే పరంజ్యోతిః ప్రాప్తియగును.

అందువలన శివజ్ఞానాభ్యాసమునకై పాశుపత వ్రతమును స్వీకరింపవలసియుండును.

ఎట్లనఁగా? భస్మ నుద్ధూళనముఁజేసికొని త్రిపుండ్రములఁచాల్చియు. రుద్రాక్ష ధారియునై శివ షడక్షర మంత్రాసంధానముతో శివునందు నిష్ఠ గలవాడై శివలింగమును ధరించి లేక పీఠమునందు పూజించుచు అహంకారమమకారములను తగ్గించుకొనియుండుట పాశుపతవ్రత మనఁబడును.

విద్య - పరయని, అపరయని రెండు తెఱగులుండను. శివతత్త్వమును పరావిద్యతో గుర్తింపవలెను. అపరవిద్యలో చేరిన నాలుగు వేదములు, ఆరు వేదాంగములును శివజ్ఞాన ప్రచములు కావు. ‘‘పంచాక్షరీ పరావిద్యా” యన్నట్లు పరావిద్యయగు శివపంచాక్షరీ మంత్రము దగు జపముతో పాపక్షయము ద్వారా. కలుగు చిత్తశుద్ధిని శివధ్యానము జేసినచో శివదర్శనము అను అపరోక్షజ్ఞానము కలుగును.

“ఏతత్తతో భవతి - స్వాత్మారామం, మన ఆనందం, శాంతిసమృద్ధ, మమృతమ్”  ఏతత్ = ప్రాకృత ప్రపంచము, తతః = దేహత్యాగానంతరము; స్వాత్మారామం = తన చిదంబర శక్తియందు విహరించునది; మన ఆనందం = దివ్యమైన మనస్సునందు ఆనందము ననుభవించునది; శాంతి సమృద్ధం = శమ దమాది సంపత్తి నిండియుండునది; అమృతం = అనాదికాలముక్తంబు న గు శివతత్త్వముగా భాసించును.” అను శ్రుత్యంతార్ధమిట నుడాహార్యమైనది.

శివతత్త్వము ప్రాకృతనేత్రములకు దృశ్యము కానిది, భౌతికహస్తములకు గ్రహింపరానిది, గోత్రము వర్ణంబు లేనిది, చక్షుఃశ్రోత్రపాణి పాదముల లేనిది, శబ్ద స్పర్శ రూప రసగంధములు లేనిది, జన్మ జరామరణములు లేనిది, అవ్యయము నిత్యము సర్వవ్యాసి స్వయం ప్రకాశమానము ఆనందమయంబునగునది.

వస్తుతః = పర అపర యను విభాగములు కల్పింపఁబడినవి గాన - నేనే జగత్తనియు, నాయందే జగత్తంతయుండుననియు, నావలననే జగత్తు ఉద్భవించి నాయందే దాగియుండునని పరమార్ధజ్ఞాని - మనోవాక్కాయశుద్ధి గలవాడై నాకంటె వేరైనది లేదని భావింపవలెను. పరిమార్థసాధకుడు సమాహితుడై - తనలో సమస్తము కలదని గుర్తించి బాహ్యము నందు మనస్సును ప్రసరింపఁ(జేయకుండవలెను.

అధోముఖముగా పండ్రెండు అంగుళముల కొలతతో బొడ్డుపైన నుండు హృదయము విశ్వమునకు నిలయమై యున్నది. హృదయము నడుమ - ధర్మము అను దుంపగలదియు, జ్ఞానము అను కాడ గలదియు, సుశోభనము, అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈ శత్వము వశిత్వము అను నెనిమిది ఐశ్వర్యములు ఆకులుగా గలదియు, శ్వేతవర్ణకము, వైరాగ్యము అను దుద్దు (కర్ణిక) గలదియు నగు కమల (పుండరీక) ముండును. ఈ పండరీకమునకు గల దిశలలో ప్రాణాదులు ప్రతిష్ఠింపబడినవి. ప్రాణాది దశవాయువులను ప్రవర్తింపజేయు నాడులు డెబ్బది రెండు వేల (72000) సంఖ్య గలవిఁగా పేర్కొనబడినవి.

జీవాత్మ - నేత్రమునందుండగా జాగ్రదవస్థ; కంతస్థితుఁ డగుతఱి నిద్రావస్థ; హృదయమున నుండినచో సుషుప్త్యవస్థ (గాఢనిద్ర) యు, శిరస్సునందు నివసించునపుడు. తురీయావస్థయు కలుగును. జాగ్రత్తున బ్రహ్మదేవుఁడు, స్వప్నమున (నిద్ర యందు) విష్ణుమూర్తి; సుషుప్తిని ఈశ్వరుఁడు;తురీయమున మహేశ్వరుఁడు సదిష్ఠాతలై యుందురు.

మరియొక (దిగువ) విధముగా కొందరు నిరూపించాం. ఎట్లనగా?

జీవాత్మ - కర్మజ్ఞానేంద్రియములతో కూడినచో జాగరూకుఁడై; మనోబుద్ధ్యహంకార చిత్త సమన్వితుడైనతఱి - నిద్రించువాడై ఇంద్రియములు అంతఃకరణంబు తనలో లీనమైనపుడు పరమాత్మతో నేకీభవించి సుషుప్తుడునై ఇంద్రియములను మనోబుద్ధ్యాదులను వేఱుపఱచి ధ్యానము (జేయువేళ తురీయుడునై యుండును. తురీయమునతిక్రమించి జీవాత్మను తనలో కాపాడు శివుడు ఈ యవస్థలకన్నిటికిని పరమ కారణముగ నుండును.

కర్మజ్ఞానేంద్రియములు పది, మనోబుద్ధ్యహంకారచిత్తములు నాలుగు, (మొత్తము
పచునాలుగు) ఆధ్యాత్మికములనఁబడును.

దర్శన శ్రవణ ఫ్రాణనములు, రుచి జూచుటయు, తాకుటయు, సంకల్పించుట,
తెలిసికొనుట, అహంకరించుట, ఆలోచించుటయు, పలుకులుయు, తీసికొనుటయుధి నడచుటయు, విసర్జించుటయు, ఆనందించుటయు అను పదునాలుగు -ఆధిభౌతికములనఁబడును.

ఆదిత్యుడు, దిశలు, పృథివి, వరుణుఁడు, వాయువు, చంద్రుఁడు, బ్రహ్మ, రుద్రుండు,
క్షేత్రజ్ఞుడు, అగ్ని, ఇంద్రుఁడు, విష్ణువు, మిత్రుఁడు, ప్రజాపతియను పడునలుగురి కూటము
ఆధిదైవిక మనఁబడును.

72000 నాడులలో - రాజ్ఞి, సుదర్శన, జిత, సౌమ్య, మోఘ, రుద్ర, అమృత, సత్య, మ్ధ్యమ, రాశి, శుకా, అసుర, కృత్తిక, భాస్వరియను పదునాలుగు నాడులు - ముఖ్యములైనవి,

ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, వైరంభము, అంతర్యామము, ప్రభంజనము, కూర్మకము, శ్యేనము, శ్వేతము, కృష్ణము, అనిలము, నాగమునను పదునాలుగు వాయువులు - నాడులలో ప్రవర్తించకుండును.

నేత్రములయందు, సూర్యునందు, నాడులయందు, ప్రాణమునందు, విజ్ఞానమునందు ఆనందమునందు, హృదయాకాశమునందు, జీవాత్మతో సహపరమాత్మ సంచరించుచుండును. అట్టి పరమాత్మ యగు నన్ను జన్మ జరావ్యాధి మరణములు లేనట్టి అమృతునిగా నుపాసిం(వ్యాసం)పవలెను.

సర్వజ్ఞుఁడు సర్వేశ్వరుఁడు సర్వాధిపుఁడు సర్వాంతర్యామి సర్వోపాన్యుఁడు సర్వసౌఖ్యప్రదాతయు నగు శివుఁడొకఁడేను; “శివ ఏకో ధ్యేయః” ఇత్యాది వేదాంత వాక్యములు, శాస్త్రములును శివునినే ఉపాసింపవలెనని నొక్కి చెప్పుచున్నవి. ఈ జగత్తంతయు ప్రళయకాలమున శివునకు ఆహారమగును. మృత్యుయమాదులు వ్యంజనములగును. ప్రాణులకు ఆహార మవసరముగాన పరమేశ్వరుడు ఆహారముతో పంచప్రాణములు ముడివేయును. “ఈ ప్రాణానాం గ్రంధిరసి రుద్రోమా విశాంతకః” ఇత్యాది శ్రుతివాక్యములు పై యంశమును ధవపఱచినవి.

అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశచతుష్టయము నధిష్ఠించి
ఆనందమయుడుగా మహేశ్వముఁడు జీవాంతర్యామి యగును. తత్త్వము ఒకటే గాన రెండు లేనందున ద్వైతము అద్వైతము అను శబ్దములను వ్యవహరించుటకు నవకాశము లేదు. మృత్యువు మోక్షము అను వ్యవహారము కూడ సరిపడదు. స్వతంత్రము పరతంత్రము అనియు చెప్పరాదు.

అంతఃప్రజ్ఞుఁడు, బహిఃప్రజ్ఞుడు , ఉభయప్రజ్ఞుఁడు, ‘ప్రజ్ఞానఘనుఁడు, విదితము వేద్యము నిర్వాణము కైవల్యమునిః శ్రేయసము అమృతము అక్షరము సమస్తంబు శివుఁడేను.

వికల్పములు లేని ప్రసన్నమగు మనస్సునందు కలుగు “సోఽహం” భాషనయే జ్ఞానమనఁబడును. తదితర మంతయు అజ్ఞానమన బలుగును. ఇబజ్ఞానము గురుకృపచే లభింపదగినదై రాగద్వేషా నృతక్రోధ కామతృష్ణాదులు లేనిది కావలెను.

జీవాత్మ - అజ్ఞాన మలచూషితుఁడగులుచే మలినుఁడునబడును. శివధ్యానము అను జ్ఞానము వలన అజ్ఞానము క్షీణించును. ముక్తియు చేకూరును. పుణ్యపాపక్షయమైనచో అజ్ఞానము సమసిపోవును. అందువలన మోక్షమునకై ‘సోహం’ జ్ఞానము నభ్యసించుచు జ్ఞానాంగములగు జపపూజాదుల నొనర్పవలసియుండును.

సంపూర్ణ జ్ఞాన్ - లోకమున యథేచ్ఛగా విహరించుచున్నను ఎట్టి పుణ్యపాపముల నంబకుండును. జ్ఞానమనగా - శివధ్యానమే యగును గాన ధ్యానము నభ్య సింపవలసియుండును.

పురాణపురుషం శంభుం - ధ్యాయన్ముచ్యేత బంధనాత్” ।

“పురాణ పురుషుఁడగు శివుని ధ్యానించువాడు సంసారబంధ నిర్ముక్తుఁడగును.” అని కూర్మమహాపురాణ నిర్వచనము.

ధ్యాయీతేశాన మిత్యాద్యాః శ్రుతయో ధ్యానకర్మణి । ప్రవృత్తాస్తా మహాదేవి । ధ్యాసం మమ విముక్తిదమ్ ॥

“మహాదేవీ ! “ధ్యాయీతేశానం” ఇత్యాది శ్రుతివాక్యములు - ధ్యానము విషయమై
ప్రవర్తించినవి గాన నన్ను ధ్యానించుట మోక్ష ప్రదమగు” నని పరమేశ్వరుఁడు పార్వతీదేవికి చెప్పినట్లు శివరహస్యమునందు కలదు.

శివధ్యాత - అహింసకుడు, సత్యవాది, దొంగతనములేనివాడు, పరిగ్రహవర్జితుఁడు,
బ్రహ్మచారి, దృఢవ్రతుఁడు’ సంతుష్టుఁడు, స్నానాదులచే పరిశుభ్రుఁడు, స్వాధ్యాయపరుఁడు,
నాయందు భక్తి గలవాడునై గురుకటాక్షలబ్దమగు శివషడక్షర మహామంత్రజపమును “సోహం” అను అజపాగాయత్రీజపమును నిత్యము అభ్యసించుతఱి. నా యందు చిత్తము నిలిచినచో దర్శన శ్రవణాదులను గుర్తింపకుండను.

ఇంక పృథివీ తత్త్వమున బ్రహ్మదేవుఁడు; ఉదకమునందు శ్రీహరియు; అగ్నియందు
కొలరుద్రుడు, వాయువులో మహేశ్వరుఁడు ఆకాశమున సదాశివుఁడు; హృదయాకాశమున - సచ్చిదానంద స్వరూపుడగు పరశివుడును ధ్యానింపదగినవారు.

పరమేశ్వరుడు అష్టమూర్తి యెట్లనగా ?

శర్వనామధేయముతో భూస్వరూపుడుగాను; భవనామముతో ఉదకరూపుఁడుగాను, రుద్రాభిధానముతో అగ్న్యాత్మకుఁడుగాను; ఉగ్రనామముతో వాయుస్వరూపుఁడుగాను భీమనామధేయముతో ఆకాశముగాను; సూర్యమండలమున ఈశానుడుగాను; చంద్రమండలమున మహాదేవుడుగాను; పురుషునిలో పశుపతిగాను విరాజిల్లుచుండును.

శరీరమందలి గట్టిదనము పృథివీసంబంధమనియు: ద్రవము - జల సంబంధమనియు; రూపము - అగ్నిసంబంధ మనియు సంచారము వాయువనియు; అవకాశము ఆకాశమనియు; వివేకము.

ఆకాశమువలన శబ్దముదయించును. వాయువు వలన స్పర్శ కలుగును. అగ్నివలన శరీరవర్ణ (వన్నె) మేర్పడును. జలమువలన రసము నెల కొనును. పృథివి వలన గంధము (వాసన) సంభవించును.

కుడికన్నుయందు సూర్యుని, ఎడమకన్నులో చంద్రుని, హృదయమున పరమేశ్వరుని చింతింపవలెను. పాచములు మొదలుకొని మోకాళ్లవరకు పృథివీ భాగము గలదై నాభివరకు ఉదకమయంబునై కంఠమువరకు వహ్ని ప్రచురమై ఫాలప్రదేశము వరకు వాయుభాగము గలదై శిఖవరకు ఆకాశ పూరితంబునై శిఖోపరిభాగము హంసాఖ్యమగు బ్రహ్మచే వ్యాప్తంబునై శరీరము ఏర్పడును.

సూర్యచంద్రులు సకాలమున నుదయించుటయు, వాయువు వీచుటయు, అగ్ని
మండుటయు, ఉదకము ప్రవహించుటయు, భూమి జగత్తును ధరించుటయు, ఆకాశము అవకాశము నొసగుటయు ఈశ్వరాజ్ఞచేతనే సంభవించును గాన సమస్తమునకు మూలమగు పరమేశ్వరునే థ్యానింప వలసియుండును. చరాచరము నంతయు శిపుడే అధిష్ఠించును గాన మహేశ్వరుడు సర్వాత్మకుడని చింతించుట ముఖ్యమగును. సంసారము అను విషముచే బాధపడువారు శివధ్యానము అను అమృతముతో సంసారవిషము నుపసంహరింపవలెను.

జ్ఞానాత్మకమగు శివధ్యాసము స్వధర్మాచరణముచే సిద్ధించును. జ్ఞానము వలన వైకాగ్యము కలుగును. వైరాగ్యమువలన పరమాత్మను ప్రత్యక్ష మొనరించుకొను పరిపూర్ణత్వ మేర్పడును. జ్ఞానవైరాగ్యసంపన్నునకు శివధ్యానయోగము చిత్తశుద్ధి ద్వారా రాగద్వేషాది ద్వంద్వ సహిష్ణుత్వమును కలుగజేయును.

ఎవఁడు సత్వగుణోపేతుడై - నాయందు భక్తి కలిగి - నన్ను పూజించుచు ఎల్లకాలము స్వధర్మమునందు నిష్ఠ గలవాడునై ఉత్సాహపరుడునై - ధీరుడై సర్వప్రాణిహితరతుఁడునై – సరళస్వభావుడు నై స్వస్థ చిత్తుడునై మృదుసంభాషణుఁడునై - గర్వరహితుఁడై - అసూయ లేనివాడునై మోక్షము నపేక్షించుచు దేవతా ఋషి పితృ ఋణములు లేనివాడై (అనఁగా జపపూజాదులతో దేవతారుణమును; వేదాధ్యయనముతో రుషిరుణమును; గృహస్థుడై సంతానమును కనుటవలన పిత్సకుణమును తీర్చవలెనని భావము). పూర్వజన్మ పుణ్యఫలముగా గురువు నాశ్రయించి గురుశుశ్రూషఁ జేయునో; అఱ్ఱవాడు ప్రారబ్ధవశమున స్వర్గమున అనేక భోగముల ననుభవించి భారతదేశమున బ్రహ్మెపాసకుఁడుగా జన్మించి - జ్ఞానియైన గురువు యొక్క - పరావిద్యోపదేశము
నొందినవాడై శివ (నా) సాయుజ్యముక్తి నొందును.

ఇల్లు పరమేశ్వరుఁడు - సనకసనంచనాదులకు మేలు గుహయందు ప్రబోధించెను. ఇయ్యది - శివధ్యాన సంపన్నమగుటచే పాశుపత మనఁబడును.

భస్మరుద్రాక్ష మంత్రధారియై శివు నర్చించు ఏకాగ్ర భక్తునకే నీ పాశుపత దీక్ష నొసగవలెను. తదితరుల కీయరాదు. దీనిని చడువువారు వినువారును శివానుగ్రహపాత్రులగుదురు.

అని సూతుడు శౌనకాచులకు వక్కాణించి విశ్రాంతికై విరమించెను.

ఇయ్యది
“ శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ
ఆంధ్రానువాత ప్రవచనమున (86)వ అధ్యాయము.