లింగ మహా పురాణము
92 - కాశీ శ్రీశైల క్షేత్రాది మహిమను వివరించుట
పూర్వాధ్యాయాంతమున చెప్పినట్లు వారాణసీ క్షేత్రము శ్రేష్ఠాతి శ్రేష్టమైనది గదా ! అట్టి అవిముక్త క్షేత్రమనఁదగు కాశీ క్షేత్రము యొక్క మహిమను పూర్తిగా వివరింపుమని శౌనకాదులు ప్రశ్నింపగా - సూతుఁడు చెప్పఁ దొడగెను.
వారాణసీ మహిమను సం గ్రహించి వక్కాణించెదను. మహాత్ముఁడైన బ్రహ్మదేవుఁడు శతకోటి వత్సరములు చెప్పిన నీ క్షేత్రముఁ దగు మహిమ పూర్తి కాదు.
పూర్వము పరమేశ్వరుడు పెండ్లి చేసికొని పార్వతీ దేవితో హిమాలయ శిఖరమునుండి బయలుడేరి గణాధిపతులు వెంట రాగా - వారాణసీ క్షేత్రముఁజేరి - ఆవిముక్తేశ్వర (విశ్వేశ్వర) లింగమును చూపెట్టి యచ్చోట నివసించెను.
కాశి, కురుక్షేత్రము, శ్రీశైలము, మహాలయము, తుంగేశ్వరము, కేదారము అను
శివక్షేత్రములలో నేదే నొకచో - పాశుపత దీక్షను స్వీకరించుట ముఖ్యము. కాశీ క్షేత్రము వారాణసి యనియు, దేవోద్యానమనియు, ఆనందకాననమనియ, పేర్కొనఁబడును.
దేనోద్యాన మనఁబడు ఆనందకాననము - వికసిత పుష్పభరిత వృక్షములతో, మనోహరములైన తీగల పొదలతోడను, ప్రియంగు (కొఱ్ఱలు గల) వృక్షముల తోడను, కేతకీ (మొగిలి) వకుళ (పొగడ) అశోక పున్నాగ వృక్షములతో నలరారుచుండగా సుగంధ పుష్పములపై తుమ్మెదలు వ్రాలి పూదేనెఁ గ్రోలుచుండును. పక్షులు సుమధురముగా కూయుచుండును.
అమ్మవారు అద్భుతమైన ఆనందకాననముఁ గాంచి - సంతృప్తిఁజెందినదై నందీశ్వరాదులు వినుచుండగా అయ్యవారికి మ్రెక్కులిడి “దేవదేవా ! గొప్ప కాంతి గల ఉద్యానముఁ జూపితివి గాన నీ క్షేత్రము యొక్క గుణములను వక్కాణింపుమని ప్రార్థించెను.”
అంత మహేశ్వరుఁడు చిరునగవుతో దేవి నభినందించి యిట్లు చెప్పనారంభించెను.
ఇమం గుహ్యతమం క్షేత్రం ప్రయా వారాణసీ మమ । సర్వేషామేవ జంతూనాం - హేతు ర్మోక్షస్య సర్వదా ॥
నాకు ప్రియమైన వారాణసీ క్షేత్రము మిక్కిలి ఆ రహస్యమైనదని భావింపుము । ఎందుకనగా ? ప్రాణులందరు ఎల్లకాలము ముక్తులగుటకు ఇయ్యది ఉపయోగపడుతున్నయది.
ఇచ్చోట నా భక్తులు – భ్స్మకు ద్రాక్షాదులను ధరించి మెక్షపేక్షతో నన్నరాధించుచునన్ను ధ్యానించుచును జితేంద్రియులై నివసించుచుందురు. నా భక్తుడీ క్షేత్రమున మరణమువరకు నివసించుట నాకు ఇష్టమగును. మరియు నాయందు మనః పూర్వకముగా భక్తి కలవాడై పుణ్యములను నాకు ‘సమర్పించుచుండినచో కలుగు మెక్షము - ఇతర క్షేత్రములలో లభింపదు. ప్రారబ్భానుసారము సహజముగా మరణమిట సంభవించినచో – జన్మరాహిత్య మెదవును. ఈ క్షేత్రముదగు, మహిమను బ్రహ్మాదిదేవతలు సిద్ధులును ముముక్షువులగు నెడ గుక్తెరుగుదురు, నేను ఎల్లకాలము విడువను గను నిద్ధి అవిముక్తమన బ్రఱగినది.
నైమిషము కురుక్షేత్రము గంగా (హరి) ద్వారము పుష్కరమునను పుణ్యతీర్థములలోని స్నానము వలనగాని అవ్వానిని సేవించలువలన గాని లభించినట్టి సంపూర్ణమోక్ష మిచ్చోట లభించును. అందువలన నీ క్షేత్రము క్షేత్రములన్నిటి కన్న మిన్నయైనది. కన్న మిన్నయైనది. ప్రయగక్షేమ్రునందైనను మెక్షము లభింమును గాన నయ్యది - అపేషికము (స్వర్గకాంక్షగలది) అగుటచే నిత్యము కాదు. కాని యిచ్చోట సకాములైనను నిష్కా ములైనను మరణించిన యెదల శాస్వతమెక్షము నొందుదురు.
ధర్మరహస్యము సత్యమునదిమిడియున్నది. మోక్ష ప్రాప్తి - శమదమాది సంపత్తితో కాశీమరణమునందు గలదు. క్షేత్ర రహస్యమును బుధసత్తములు బాగుగా గుర్తింపవలసియుందును.
ఇంక నొక రహస్యము నాలకింపుము.!
కాసుల ముం సుపు ప్రేమ కవిత్వం ఎవిభాః క్రియాః । మనకే వ్యక ప్రాధా - జము లో చాయ కల్పతే ।
ఏకమును పూనియమములను విడనాడు తన ఇష్టము ననుసనం- మహామును సుమంటనను అని నా మనసును (జనమస్తేతగా ఎంచుచున్నాడు. వ్యాసాలు పురోహితము మొదలగు నానా విధ పత్తుల సవరించింన నీ అము. క్షేత్రములు ప్రాణములను విడనాడినచో లడ్డు జూరు చేసే సాయుజ్యమును పొంది జానందము ననుభవింపఁ గలుగును.
మానవులు కాశీలో అమముగా పాపముల నొను మరణానంతరము పిశాచములగులు శ్రేష్ఠము. ఎందుకనగా ? మకాసత్వము పోగానే పునర్జన్మ లేకుండు. కైలాసము లభించును. అనేకయములం గా ఎంచి స్వరమున సూ ఇంకుమలును పరు. ఇంతకు మున భూలోకమునందు చర్లీ గరములో రావచ్చును. అందువలన కామకణము మోక్ష చేసుకుని లేపడునది.
జైగీషవ్యుడు అను మహాతపస్వి నాయందు భక్తిచే నా సాయుజ్యము నొంచినవాడు గాన నలు శివయోగులు నివసింపఁడగు జైగీషవ్యగుహ ఏర్పడినది. ఈ గుహలో యోగులు యోగాగ్నిని ప్రకాశింపజేయుచు చేవచుర్లభమగు కైవల్యమును పొందుదురు. అట్టి వారికీ గుహలో శివధ్యానయోగక్రమము నుపదేశించుచుండును. కుబేరుఁడు నీ క్షేత్రమున సుకృతముల నన్నిటిని నాకు సమర్పించి గణాధిపతి యయ్యెను. సంవర్తుఁడను ఋషియీ క్షేత్రమున నన్నారాధించి పరమసిద్ధి బొందెను. పరాశరతనయుడైన వ్యాసమహర్షి - యీ క్షేత్రముననే నిశ్చింతగా నివసించుచు - ముక్తుడు కాజోపుచున్నాడు.
బ్రహ్మదేవుఁడు, శ్రీహరి, దేవేంద్రుఁడు, దేవర్షులు, స్వర్గామతులందరు నీ క్షేత్రమున
నన్నుపాసించుచున్నవారు. ఇతరు లెందరో మహాత్ములు గుప్త రూపములతో నన్నీ క్షేత్రమున మోక్షమునకై ప్రార్థించుచున్నవారు.
శ్లో॥ విషయాసక్త ఎత్తోఽపి త్యక్త ధర్మవరి ర్నకః । ఇహక్షేత్రేమృతః సోఽపి - సంసారే న పునర్బవేత్ ॥
మానవుడు (స్త్రీ గాని పురుషుడు గాని) ఇంద్రియ సుఖలోలుడైనను, పుణ్యముల
జేయకున్నను ఈ క్షేత్రమున మరణించినచో సంసారపాశ బద్ధుఁడు - గాక శాశ్వతమోక్షము నొందును.
ఎవరు మమకారము లేనివారై ధీరులై సత్త్వగుణ సంపన్నులై జితేంద్రియులునై పాశుపవ్రస్థులునై కామ్యకర్మలఁబరిత్యజించి నన్ను ఆరాధించెడరో నవ్వారు - నా యనుగ్రహ పాత్రులై ముక్తులగుదురని చెప్పు నేల ?
యోగాభ్యాసముఁ జేయువాడు నేలకొలది జన్మలయందు పొందటేనట్టి సంపూర్ణమోక్షము నీ క్షేత్రమున నాయను హము బడసినవాడై పొండఁగలుఁగును
మున్ను బ్రహ్మదేవుఁడు కైలాస భవనము లను మందిరమును నిర్మింపజేసిన స్థలము, గోప్రేక్షకక మనఁబడును. ఇద్దానిని మానవుఁడు దర్శించి నన్ను పూజించునెడ మర్గతి దూరసుగుటయే గాక పాపములన్నియు పటాపంచలగును.
ఆవు పాలతో సరిమాగు నుదకము గని కపిలా హ్రదమనఁబఱగు కుండమును బ్రహ్మదేవుడే ఏర్పరచెను. ఇయ్యది పుణ్యతీర్థముగా పరిగణింపబడుచున్నది. ఇచ్చోట నేను “పృషధ్వజుడు” అను పేరుతో నివసించుచుందును.
బ్రహ్మన్మితమగు భధ్రతోయ మనఁబడు మరియొండు తీర్థము - కాశీక్షేత్రమున
వెలసియున్నది. ఇచ్చోట నమరులందరు నన్ను ప్రార్థించి నా యను గ్రహముఁబడసిరి.
పార్వతీ ! గచ్ఛోపశమమనబడు స్థలమునకు బ్రహ్మదేవుఁడు శివలింగమును తేగా - శ్రీహరి యద్దానిని స్థాపించినందున కోపగించిన విధాతకు “పంకజాసనా! నాచే నీశివలింగము స్థాపింపఁబడినను “హిరణ్యగర్భేశ్వరుఁడు” అను నీ పేరుతో ప్రసిద్ధంబగు “ నని నారాయణుఁడు వచింపగా చతుర్ముఖుఁడు శాంతించెను. అందువలన నీ లింగములో నేను నివసించవలసి వచ్చినది. ఇద్దానిని దర్శించి పూజించు ఉత్తముఁడు నాలోకముఁ జెంచును. మరియొక లింగము బ్రహ్మస్థాపితము కాగా ఆయ్యది స్వర్లీనేశ్వరమున బఱగినది. ఆవాహానాదులు లేకున్నను ఈ లింగము లోనికి స్వయముగా విచ్చేసితిని. ఇచ్చోట ప్రాణములను విసర్జించువాడు పునర్జన్మ లేనివాడగును.
ఈ క్షేత్రమునందు వ్యాఘ్ర రూపమున ప్రజలను బాధించు దైత్యుని నేను సంహరించినందున వ్యాఘేశ్వరుఁడనఁ బఱంగితిని. ఇట్టి లింగమును దర్శించి భక్తితో పూజించు పుణ్యపురుషుఁడు ముక్తుఁడగును.
ఉత్పలుఁడు విదలుఁడు నను రాక్షసులు- “స్త్రీ వధ్యులము కావలె” నను వరము బడసినందున నీపు వారిని కందుకము (బంతి)తో వధించితివి. గాన నా కందుకము లింగరూపముగా సరించినది. ఇడ్డి జ్యేష్ఠస్థానమునఁబడును. ఈ కందుకేశ్వరుని దర్శించువాని యొక్క పుణ్యములు ఫలించును. ఈ, జ్యేష్ఠస్థాన సమీపమున దేవతలు స్థాపించిన శివలింగములు పెకు గలవు.
ఇట్టి శివలింగములను దర్శించువాడు దేహాంతమున కైలాసముఁజేరి ప్రమథ గణములలో చేరును. గిరిజాదేవి ! నీ తండ్రియగు హిమవంతుఁడిచ్చోటనొక శివలింగమును “శైలేశ్వరు” మను పేరుతో ప్రతిష్ఠించెను. దీనిని భక్తితో చూచువాడు సద్గతి నొందును.
“వరుణ” వ అనునది - పాపముల నపహరించునదై కాశీక్షేత్రమును మట్టుకొని గంగలో కలిసినది. వరుణాగంగా సంగమ స్థలమున బ్రహ్మదేవుడు “సంగమేశ్వరుడు” అను పేరుతో శివలింగమును స్థాపించెను. ఈ సంగమ స్థానమున స్నానము నొసర్చి సంగమేశ్వరు పునర్జన్మభయము కలుగనేరదు.
యోగులు నివసించు క్షేత్రము వారాణసీ నగర మధ్యన వెలసినది. దీనిని మధ్యమేశ్వర మని వ్యవహరింతురు. దీని నాదరముతో నవలోకించు వానికి జన్మపరంపూసంబంధము విడిపోవును. మధ్యవేశ్వరుని పాశుపత వ్రతధారులగు శివయోగసిద్ధులు పెక్కుకు - మముక్షువులై ఆరాధించుచుందురు. శుక్రాచార్యుడు స్థాపించిన శివలింగము “శుక్రేశ్వర” మను పేరుతో ప్రఖ్యాత మైనది. దీనిని అమరులందు సిద్ధులును పూజించుచుందురు. నీతియమ నిష్ఠుడైనవాడు దీనిని చర్శించునెడ తల్కాలముననే పాపములన్నియు నశించును. ఈ మొదలగు స్థానములలో నెచ్చోట
మరణంచినను కాశీమరణము సంభవించినట్లేను.
పూర్వమొక రాక్షసుఁడు జంబుక (నక్క) రూపముతో కాశీవాసులను పీడించుచు
బ్రహ్మవరముతో చెలరేగియుండగా నవ్వానిని విధించితిని గాన నిచ్చోట జంబుకేశ్వర శివలింగము ఏర్పడినది. దీనిని సురాసురులు నమస్కరించుముందురు. జంబుకేశ్వరుని దర్శించువాడు కోరికల నన్నిటినను భవింపఁగలుగును. బృహస్పత్యాది గ్రహములు ప్రతిష్ఠించిన శివలింగములు కాశీ క్షేత్రమున చూడద్గిననై యున్నవి.
ఇంక నొక రహస్యము సవధరింపుము!
కాశీ క్షేత్రము నాలుగు దిశలందు నొక్కొక కోశము వరకు యోజనముగా విరాజిల్లుచున్నది. ఈ పరిధిలో మరణము మోక్ష ప్రదమగును. మహాలయపర్వతము నందు కేదారా దిక్షేత్రములయందును సను చర్చించి పూజింఘువారు - కైలాసమున గణరూపమున చిరకాలము నివసించి ఆ తరువాత నా సాయుజ్యము నొందుచురు. కాని కాశీక్షేత్రమున మరణించువారు మాత్రము తత్కాలముననే సంపూర్ణమోక్షము అనగా శివానందానుభవము గలవారగుదుకు.
ఎల్లకాలము నేను ఉడుకుకడున యుక్తి (5) నేను ముందుగానే 5కారు కాని నా మన సంపజేసి యాతని నాభికమలమునందు జన్మించిన బ్రహ్మదేవునిలో సమస్త జగత్తును పుష్టిం పజేసితిని. అందువలన నీ మహాక్షేత్రము జన్మ స్థితి అయ ఆరోధాన అనుచరులను పలు మన పంచత్యములకు నిలయమై శివక్షేత్రాగ్రగణ్యంబునై ముముక్షువులందరిచే ఆశ్రమంప పగియున్నది.
ఇట్లు మహాదేవుడు ప్రవచించినలు ఏల నవలోకింపుగా ఒక మనవిధమైన వెలుతురు సంభవించెను. ఆ వెలుతురులో భస్మస్నానవతులు, ము ద్రాక్షరాలు, ప్రమును వసములు గంగధారులు నగు మాశ్వతులు సూళ్లకొలది యేతెంచి మరునకు సాష్టాం.. ప్రణామంబులంది. మరియు సరయెప్పుడు నసలో నిలచుచు సమాత్మతో ఏకీభనుంచి రాజూర్య ( శివంహం) భావన అంచయుండిరి.
కట్టేతల సదాశిపుడు కేజోమయుడగు పురుషుడు గా వుంది నా మహామహుని పార్వతీ చేసి మీడనలుఁగొని. ఆత్మయోగశక్తితో ప్రకంగా పరిణమించి తేజసుతుడు అవలో
కంపగలిగెను.
అట్టి మహాతేజః పుంజమున మాహేశ్వకులందరు ప్రవేశించి సంసారజములను కాల్చివేసిరి. మరల నా దేవదేవుఁడు కరుణాంతరంగుఁడై నీలలోహిత కుడ్రుఁడు కాగా పార్వతీ దేవి నమస్కరించి పరమేశ్వరా ! నీలో ప్రవేశించినట్టి మహానుభావులెట్టివారని ప్రశ్నింప నిట్లు శంకరుఁడు నుడివెను.
దేవీ ! నా పాశుపత వ్రతమును స్వీకరించి నా యలను ఏకాగ్రభక్తి గలిగియుండు ద్విజోత్తములు అందువలన నీ సుహాక్షేత్రమున బ్రహ్మా ను, చ చ దాంత పాఠశాలలు, రహాసచులును సముంటరు.
ప్రతినెల తన కృష్ణ మమము లంచష్టమినాడు వదులు అముధమును సూర్యుడు ప్రగ్రహణముల యందు విశేషించి కార్తిక మాసమునందు నత్తరాయణాచి సర్వకాలముంతుండును పుణ్య తీర్ధము ఎన్నియు నేత్రమున నుత్తరమునకు ప్రతి పొందుననా కిరీటము నుండి బయలు పడిన జాన్నా నియందు నివసించును. ఆ గంగా సావంతుని కుమార్తెగా ఆవిర్భవించినది. విష్ణు చోచ్చు ని కారు లియుము !
కాని తపమున విశ్వనాథుని దర్శించి ముందుకు భవనవలోకించి దుండగులకే నమస్కరించి
చండపాని గాంచి కాలభైరవునకు ఋతుము ని గుహచ్చారును చూచి గంగా నదీజలమును
చల్లుకొనినచో జన్మజన్మాంతరార్జితములగు చరితములన్నియు చూరమగును.
(కాశీనివాసులు చేయఁగిన సత్యయార్ర-జి.)
కాశీక్షేత్రమునందు గంగాస్నానము, విశ్వేశ్వర దర్శనము ననునవి సర్వయజ్ఞఫలమును సవ్యస్కాలమునందే నొసఁగునజ్జీవి.
దేవీ ! భూమిపై పర్వతములయందును గల సముప పుణ్యక్షేత్రములకన్న వారాణసీ క్షేత్రము శ్రేష్ఠమైనదని భావింపుము !
అవియనఁగా పాపమని వేదమునందు చెప్పబడినది. పాపమును విడదీయునడై నాచే నధిష్ఠింపఁబడినందున ఆవిముక్తము అను పేరు కాశీ క్షేత్రమునకు ఏర్పడినది. (ఇది మరియొక నిర్వచనము.
ఇట్లు భగవానుఁడు నిర్వచించి ఉత్తమోత్తమమగు శ్రీశైల క్షేత్రమును పార్వతీ దేవికి చూపెట్టి మిగత పుణ్యక్షేత్రముల నన్నిటిని దర్శింపజేసెను.
కుండి ప్రభక్షేత్రమునందలి వైశ్రవణేశ్వరుని; ఆశలింగమును, బిలేశ్వరుని, విష్ణు ప్రతిష్ఠత రామేశ్వరుని, కుండలేశ్వరుని, త్రిపురాంతకేశ్వరుని, మధ్యమేశ్వరుని, చేవ ప్రతిష్ఠితుడగు అమరేశ్వరుని, గోచర్మేశ్వరుని, ఇంద్రేశ్వరుని, సృష్ట్యాదికర్మ నిర్వహణార్థము బ్రహ్మచే ప్రతిష్ఠింపబడిన కర్మేశ్వరుని, శివునిచే ఎల్లకాలము అధిష్ఠింపఁబడు సిద్ధవటమును, శుభప్రదమగు అజబిలమును చూపెట్టెను. అజబిలేశ్వర క్షేత్రమున నా పాదుకలు నెలకొనియుండును. శ్రీదేవి ప్రతిష్ఠితము శృంగాటాచల మధ్యస్థితంబునగు శృంగాటకేశ్వర లింగమును, మల్లికార్జునేశ్వరుని, రజేశ్వరుని, గజేశ్వరుని, వైశాఖలింగమును, కపోతేశ్వరుని, కోటీశ్వరుని, దక్షిణదిశ యందు బ్రహ్మస్థాపితమగు ద్విదేవకులేశ్వరలింగమును, ఉత్తరమున విష్ణుస్థాపితశైలజేశ్వరుని, పశ్చిమమున నీలలోహితరుద్రునిచే ప్రతిష్ఠింపఁబడిన బ్రహ్మేశ్వరుని ప్రదర్శింపఁజేసియు వ్యోమలింగమును స్కంధప్రతిష్ఠిత కదంబేశ్వరుని, నంద్యాది స్థాపిత గోమండలేశ్వరుని, శక్రాది దేవతలచే ప్రతిష్ఠింపఁబడిన శివలింగములను, హారపురము అను స్థలమున దేవి యొక్క కంఠహారము పడగా లోకకల్యాణమునకై ఏర్పడిన హారకుండేశ్వరుని, శివరుద్రపురమున పై ప్రదేశమునందు హిమవంతునిచే ప్రతిష్ఠింపఁబడిన అచలేశ్వరుని మరియు చండికేశ్వరుని, చండికా నిర్మితమగు అంబికాతీర్థమును, రుచికేశ్వరుని, కపిలధార (జలపాతము)ను చూపెట్టి ఈ శివలింగములయందు భక్తి శ్రద్ధలతో యథావిధిగ నన్ను పూజించు మానవుఁడు నా కైలాసమున నాతో సహ ఆనందించును.
శ్లో॥ శ్రీశైలే సంత్యజే ద్దేహం బ్రాహ్మణో దగ్ధకిల్బిషః ॥ ముచ్యతే నాత్ర సందేహో హ్యవిముక్తే యథా శుభమ్ ॥
శ్రీశైల క్షేత్రమునందును శరీరమును పరిత్యజించు బ్రాహ్మణుఁడు పాపరహితుఁడై
కాశీ క్షేత్రమున మరిణించినవానివలె ముక్తుఁడగును. ఇవ్విషయమై సంశయింప నవసరము లేదు. నెయ్యితో శివలింగము నభిషేకించుట మహాస్నాన మనఁబడుసు మహాస్నానమునకు రెండు కిలోల ఆవు నెయ్యి కావలెను. సాధారణ అభిషేకమునకై అరకిలో ఆవు నెయ్యి నుపయోగింపవలెను. సమస్త సుగంధ ద్రవ్యములతో కూడిన పరిశుద్ధ జలముతో శివలింగము నభిషేకించి శుభ్ర వస్త్రముచే తుడిచినచో శతయజ్ఞఫలము సమకూరును.
మహాస్నానము నొనర్చినయెడల లక్షయజ్ఞఫలము లభించును. శివుని ముందు సంగీతములను పాడినచో అనంతఫలము చేకూరును. కేవల జలముతోడను శ్రీ గంధోదకము తోడను భక్తితో శివలింగము నభిషేకించి శ్రీగంధమును పూయవలెను.
శమీ (జమ్మి పుష్పము, ఇతర ద్రోణ (తుమ్మి) పుష్పాదులు లభించినను మారేడుదళ
(బిల్వపత్ర) ములను ముఖ్యముగా శివునకు సమర్పించవలెను.
నాలుగు లేక ఎనిమిది లేక పది తూముల తండులములు (బియ్యం) వండిన అన్నమును నివేదింపవలెను. అశక్తుడు తూమెడు వరి అన్నమును సవేదింపవచ్చును.
భేరి, మద్దెల, తప్పెట, మొదలగు వాద్యముల ధ్వని చేతను, అనేక విధములగు శివనామ సంకీర్తనాచులతోడను జాగరణమును చేయవలెను. భృత్యులతో పుత్రులతో భార్యతోడను సన్నిహితబంధువలతోడను ప్రదక్షిణముఁజేసి శివుని దిగువవవిధము ప్రర్థించవలెను.
శ్లో॥ ద్రవ్యహీనం క్రియా హీనం శ్రద్ధాహీసం సురేశ్వర । కుతం వాన కృతం వాఽపి క్షంతు మర్హసి శంకర ॥
“మహాదేవా ! శంకరా ! పూజాద్రవ్యలోపము, పూజా విధాన క్రమభంగము, శ్రద్ధారాహిత్యమున్ను చేసినదానిలో న్యూనత్వము, చేయనిదియు ఈ సమస్త అపధారములను క్షమింపుము!”
ఇల్లు పార్థించి రుద్రాధ్యాయమును కొంత సూక్తములను పఠించి ప్రణవ పడక్షర
మహామంత్రమును యథాశక్తి జపించవలెను. ఇవ్విధము ఆచరించినదో సమస్తపుణ్య తీర్థ స్నానఫలమును సర్వయజ్ఞఫలంబు నొంది వారాణసీమృతుని వలె నా సాయుజ్యముఁబడయుసు. నా ప్రీతికొరకు పై విధముచేయువారే నా భక్తులుగా పరిగణింపఁబడుదురు.
శంకరుని ప్రబోధమును శాంకరీదేవి వినినదై కాశీక్షేత్రముఁ జేరి శ్రీ విశ్వనాథుని పాలతో నెయ్యితోడ నభిషేకించి పూజించియు సంతృప్తిఁజెందెను.
కాశీక్షేత్రమున మందర పర్వతాధిష్ఠాత తపస్సొనర్చుటచే ప్రసన్నుఁడైన శివుఁడు
మందరపర్వతము పై నొకానొక పుణ్య క్షేత్రము నేర్పరచి యుచ్చోట హిరణ్యాక్షుని కుమారుఁడైన అంధకాసురునకు ప్రమథగణత్వము నవలీలగా నొసగియను గ్రహించెను.
“ఈ సమస్త శివ కథాసారమును మియందలి అదరముతో వక్కాణించితిని. ఈ యధ్యాయమును చదువువారు, విసువారు, పరిశుభ్రులైన ద్విజులకు వినుపించు వారును, సమస్తుపుణ్యక్షేత్ర సందర్శన ఫలమును సర్వయజ్ఞఫలమును త్వరలో పొందుదురు.” అని సూత మహర్షి శౌనకాది మహామునులకు నైమిషారణ్యమున వినుపంచి విశ్రాంతికై విరమించెను.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రపచనమున (92) - అధ్యాయము.
