లింగ మహా పురాణము

Table of Contents

13 - శంకరుని మూర్తుల యొక్క సంజ్ఞలను, భార్యలను పుత్రులను నిరూపించుట

“నందికేశ్వరా! అష్టమూర్తియగు మహేశ్వరుని మహిమల నింకను చెప్పుము ! “ అని

సనత్కుమారుడు        ప్రశ్నించగా - “జగత్తు నష్టమూర్తులతో వ్యాపించిన పరమేశ్వరుని ప్రభావము నితోధికముగా వివరించెద “ నని నందికేశ్వరుడు చెప్పుదొడగెను.

మహేశ్వరుఁడు చరాచర ప్రాణులకు ఆధారమగు భూమించగుడూపముతో శర్వుడం బఱగును. శర్వుని భార్య వికేశియనియు, పుత్రుఁడు అంగారకుడనియు వ్యవహరింపఁబడుదురు.

ఉదకరూపముతో భవుఁడనబడును. భవుని పత్ని - ఉమ యనియు, కుమారుఁడ
శుక్రుఁడనియు పిలువఁబడుదురు.

అగ్నిరూపముతో మనం పయనియు, పశుపతి సహచారిణి స్వాహాదేవి యనియు, తనయుడు షణ్ముఖడనియు సముండనియు పేర్కొనబడుదురు. వాయు కాలంలో కాకుండయు, శాసన అద్దాం మనము కుమారుడు మనోజవుండము నుదహరింపబడుదురు.

ఆకాశరూపముతో భీముఁడనియు, భీముని పత్నులు దశదిశలనియు, తనయుడు

సర్గుఁడనియు కీర్తింపబడుదురు.

సూర్యరూపంలో రుద్రుఁడనియు, రుద్రపత్ని సువర్చల యునియు, రుద్రాత్మజున

శనైశ్చరుండనియి నిరూపింపబడుదురు.

చంద్రరూపముతో మహాదేవుఁడనియు, తత్పల్ని రోహిణియనియు, తత్తనయుడు
బుధుడనియు పేర్కొన బడుదురు.

యజమాన రూపముతో ఉగ్రుఁడనియు, ఉగ్రపత్నీ- దీక్షయసంయు, ఉగ్రాత్మజుడు
సంతానుండనియు గుర్తింపఁబడుదురు.

శ్లో॥ ప్రాణినో యస్యకస్యాపి - క్రియతే యద్యను గ్రహః ॥

అష్టమూర్తే ర్మహేశస్య - కృత మారాధనం భవేత్ ॥

నిగ్రహశ్చేత్ కృతో లోకే - దేహినో యస్య కస్యచిత్ ॥

అష్టమూర్తే ర్మహేశస్య - స ఏవ విహితో భవేత్ ।

సర్వోపకార కరణం- ప్రదాన మభయస్య చ ॥

ఆరాధనం తు దేవస్య - అష్టమూర్తే ర్న సంశయః ।

“ఏ ప్రాణినైనను కరుణించినచో అష్టమూర్తియగు మహేశ్వరు నారాధించినట్లేను; ఎవరినైనను బాధించి నెడ అట్టి బాధ మహేశ్వరుజెండును.

ప్రాణులందరికి నుపకారముఁజేయుటయు, అభయమును నొసంగుట  మహాదేవ నారాధించుట యగును. ఇందెంత మాత్రము సందియము లేదు.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” ఆను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రపదమున (13) మధ్యాయము.