లింగ మహా పురాణము

Table of Contents

12 - శివుని అష్టమూర్తులను విశేషించి నిరూపించుట

సందికేశ్వరుఁడు సనత్కు మారునకు చెప్పదొడగెను.

“భూమి, ఉచకము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుఁడు, చంద్రుడు, యజ్ఞదీక్షితుడు ననునవి - పరమేశ్వరుని ఎనిమిది మూర్తులగును.

ఆగ్నిహోత్రమునందు సూర్యరూపములందు వారు పరమాత్మస్సుమాసమగు శివలింగమునందును. సమర్పింపబడు ఘృతాది వస్తువులన్నియు శివ విభూతులలో చేరిన దేవతలందరిని వృక్షకావో వశాఖాన్యాయముగా మునుగాని మ్యూకు - పంచు నెంచినవాడై సమస్తారు. నొసగుదురని తెలియవలెను.

శ్లో॥ వృక్షస్య మూలసేథే - యథా శాఖోపశాఖికాః ।

తథా తస్మాత్వయా దేవా - స్తధా భూతయ ॥

“చెట్టుపుకు అదుపులో ఇరుకొమ్ములు, కొమ్ములను సందును సరయు
నారాధించుబువలన అది భూములను చేపలలు తృప్తి చెందుతుడు. “

పరమేశ్వరుని సూర్యాత్మకములగు రూపము సర్వదేవాత్మకముగా ముని పుంగవులచే ఆరాధింపబడుచు సూర్యుని అమృత అన్నయ యునవనం - ఈ లోకమున ప్రాణులచే ఆస్వాదింపబడుచున్నది. మరియు మహేశ్వరుని యొక్క చంద్రస్వరూపము: జెందిన అమృతకళలు: ఓషధులు పెంపొందుటకు ముందు కురిపించుచున్నది,

ఇఁక మహేశ్వరుని సూర్యరూపము యొక్క శుక్లములనఁబడు కిరణములు సస్య (ధాన్య) పాకాదికారణముగు వేడిని కలిగించుచున్నవి. హరికేశ మనఁబడు కిరణము నక్షత్రములను పోషించుచున్నది. విశ్వకర్మయను కిరణము బుధుని ప్రకాశింపజేయుచున్నది. విశ్వస్యచమనబడు (రవి) కిరణము శుక్రుని పోషించుచుండును. సంయద్వసువు అను కిరణము అంగారుకుని; అర్యావసుకిరణము బృహస్పతిని; స్వరాట్ అను కిరణము శనైశ్చరుని; సుషుమ్న యను కిరణము, చంద్రుని ప్రకాశింపజేయుచుండును.

ప్రశాంతములైన కిరణములకు ప్రకృతి (ఉత్పత్తి స్థానము) యగు (పరమేశ్వరుని) చంద్ర రూపము- పురుషుని రేతస్సుగా పరిణ మించినదై దేహధారులందరి యొక్క మనస్సులలో నెలకొని యుండును. పరమేశ్వరుని చంద్రరూపము - పదునారు విభాగములు గలదై అష్టమూర్తులలో ముఖ్యమైనదని తెలియవలెను.

మరియు మహేశ్వరుని చంద్రరూపము - అమృతమును కురిపించుచు దేవతలను పితరులను పోషించుచున్నది గాన నీ రూపముసు పార్వతీ దేవిగా భావింపవలెను. యజ్ఞములను తపస్సులను ఫలింపజేయు చంద్రరూపము - ప్రాణులలోని జీవాత్మలకు స్ఫూర్తి నిచ్చునదై యువ్వారిని రక్షించుచుండును. యజ్ఞదీక్షిత (యజమాన) రూపము- హవ్యములతో అమరులను కవ్యములతో పితరులను తృప్తిపఱుచుచుండును. గాన యజ్ఞజన్యముగు - పర్జన్యము ఉదకమును వర్షించుచు ధాన్యములను పండించుచు జగజ్జీవనకారణ మగుచున్నయది.

బ్రహ్మండముల లోన, వెలుపలను ప్రాణులలో నుండు (మహేశ్వరుని) ఆకాశరూపము ప్రాణులు సంచరించుటకు ప్రాణవాయువునకు నవకాశము నొసగు చుండును. ఇక. పరమేశ్వరుని యుదకరూపము నదీ నదములను సముద్రములను నింపునదై ప్రాణులను పోషించునడే గొక పావనుల జేయునదై అంబిక యనబఱుగుచున్నయది. ప్రాణుల శరీరములలో వెలుపలను నెలకొనిన (ఈశానుని) వహ్నిరూపము అత్యంతపూజనీయమై దేవతలకు హవ్యముల జేర్చుచు పితరులకు కవ్యముల నంద జేయుచు ఆహారమును జీర్ణింపఁజేయుచుండును.

ఇంక పరమేశ్వరుని వాయురూపము బ్రహ్మాండములలోను వెలుపలను సంచరించుచు చరాచర ప్రపంచము నొకచో నిలుపుచు ఆవహము, నాగకూర్మము మొదలగు భిన్న రూపములు గలిగియుండును. ‘బ్రహ్మాండములలోను వెలుపలను గల (మహాదేవుని రూపము ప్రాణులందరికి నాధార మగుచు చరాచర ప్రాణుల శరీరములుగా పరిణమించుచున్నయది.

పంచమహాభూత (పృథివీ జలసహ్నివాయు ఆకాశ)ములు, సూర్య చంద్రులు, ఆత్మయు పరమేశ్వరుని అష్టమూర్తులన బఱగునని యిట విదితమైనది. ఇక మహేశ్వరుని ఎనిమిదవ మూర్తియగు యజమాన (ఆత్మ) రూపము చరాచర ప్రాణులను కదిలించుచు జీవింపజేయుచుండును. శ్రేయస్కాములందరు నీ శివాష్టమూర్తుల నర్చింపవలేను. నమస్కరింపవలెను.

ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక”  అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (12)వ యధ్యాయము.