లింగ మహా పురాణము
26 - అఘోరార్చా విధాన నిరూపణము
శివాన్నికార్యము కలియుగ మానవులకు అసాధ్యము గాన శివ లింగమునందు పరమేశ్వరుని - శివ భక్తుఁడైన ద్విజుఁడు - శివధ్యాన పూర్వకముగ - నారాధించుట - సుసాధ్యమై ప్రశస్తంబగునని - నందికేశ్వరుఁడు సనత్కుమారునకు వక్కాణించినట్లు - సూతుఁడు శౌనకాదులకు దిగువ విధము అఘోరశివార్చనమును వివరించెను.
“అగ్నిరితి భస్మ” ఇత్యాది మంత్రముతో - అగ్నిహోత్రసంభవమగు విభూతిఁ బరి
గ్రహించి - ఆపాదతలమస్తకము నుద్ధూతనముఁ జేసికొని యజ్ఞోపవీతధారియై శివనామములతో నాచమనముఁజేసియు ఉత్తరాభిముఖుఁడై - “ఓం నమః శివాయ” అను మహామంత్రము నుచ్చరించుచు తన శరీరము పునీతమైనదని భావింపవలెను.
“ఓం అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వెభ్యః సర్వశర్వేభ్యో - నమస్తే అస్తు రుద్రరూపేభ్యః”
అను అఘోరమంత్రముతో అఘోరమూర్తిని ప్రార్థించి -
“అఘోరేభ్యః ప్రశాంతహృదయాయ నమః”
“అడఘోరేభ్యః సర్వాత్మ బ్రహ్మశిరసే స్వాహా“
“ఘోరఘోర తరేభ్యః జ్వాలామాలినీ శిఖాయై వషట్“
“సర్వేభ్యః సర్వశర్వేభ్యః పింగళకవచాయ హుమ్”
“నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నేత్రత్రయాయ వౌషట్”
“సహస్రాక్షాయ దుర్భేదాయ పాశుపతాస్త్రాయ హుం ఫట్”
అనువానీని అంగముల స్వసింపవలెను.
తరువాత - పూజా మందిర ద్వారమును వాస్త్వధిపతిని పూజించి - కరశుద్ధిఁ గావించుకొనియు - హృదయన నాభియందు భూమధ్యస్థానమునందునున్నట్లు అఘోర శివుని అష్టాదశభుజుఁడుగాను, గజచర్మోత్తరీయుఁడు గాను సింహాజినాంబరధారి గాను సర్వాభరణ సంయుక్తుఁడుగాను, సర్వదేవ నమస్కృతుడుగాను, కపాల మాలాభరణుఁడుగాను, సర్పభూషణుఁడుగాను, పూర్ణేందువదనుఁడుగాను, సౌమ్యుఁడు గాను, చంద్రకోటి సమప్రభుఁడుగాను; చంద్రరేఖాధరుఁడుగాను; శక్తి విశిష్టుఁడుగాను;
నీలవర్లకుఁడుగాను; ఖడ్గము, చర్మ, పాశము, అంకుశము, ధనుస్సు, బాణములు, పాశుపతాస్త్రము, దండము, ననువాసిని వామ హస్తముల యంచు ధరించినవాడుగాను; వీణ, గంట, త్రిశూలము, డమరుకము, వజ్రము, గద, టంకము, వరదము, అభయము ననువానిని దక్షిణ హస్తములఁ దాల్చినవాడుగాను; ధ్యానించి అఘోరమంత్రముతో అగ్నియందు ఘృతచరు సమిధాదులను 1000, 500, 108 అను వానిలో నే దేనొక సంఖ్యగా హుతముల నొసర్చి స్తుతి గావించియు, నేవేద్యమును సమర్పించి అంతర్బలి నొసగవలెను.
“రుద్రేభ్యః, మాతృగణేభ్యః, యక్షేభ్యః, ఆసురేభ్యః, గ్రహేభ్యః, రాక్షసేభ్యః, నాగేభ్యః,
నక్షత్రేభ్యః, విశ్వగుణేభ్యః ఇమం బలిం సమర్పయామి” అనుచు బాహ్యబలి నీయవలెను.
పశ్చిమదిశనుండి వాయవ్యదిశవరకు గల మధ్య ప్రదేశమున - క్షేత్రపాలబలిని సమర్పించవలెను.
తరువాత అఘోరశివలింగమును పాద్య అర్ఘ్య ఆచమనీయ సమర్పణముతో, పంచామృత ఫలోదక శుద్ధోదకాభిషేకములతో, గంధాక్షత పుష్ప బిల్వ ధూప దీప నైవేద్య తాంబూల మంగళ నీరాజన మంత్రపుష్పములతోడ నర్చించి - ప్రార్థించియు- అష్టవిధ పుష్పములను సమర్పించవలెను.
ఇట్లు అఘోరార్చసమును సంక్షేపించి చెప్పితిని. అఘోరార్చనమును శివ లింగమునందుగాని స్థండిలాగ్నియందు హవనరూసముగ గాని చేయవచ్చును. కాని స్థండిలాగ్ని హవనముకంటె లింగార్చనము శ్రేష్ఠమగును.
లింగార్చనరతో విప్రో - మహాపాతకసంభవైః।
పాపై రపి నలిప్యేత - పద్మపత్ర మివాంభసా॥
లింగస్య దర్శనం పుణ్యం దర్శనా త్స్పర్శనం వరమ్।
అర్చనా దధికం నాస్తి - బ్రహ్మపుత్ర! న సంశయః॥
ఏవం సంక్షేపతః ప్రోక్త - మఘోరార్చన ముత్తమమ్।
వర్షకోటిశతేనాపి - విస్తరేణ నశక్యతే॥
“శివలింగార్చనపరుఁడగు ద్విజుఁడు (బ్రాహ్మణుఁడు) బ్రహ్మహత్యాది మహాపాపముల వలనకలుగు దోషముల “తామ రాకును నీరువలె” నంటకుండును.
“శివలింగమును దర్శించుట - పుణ్యఫలప్రదము కాగా - శివలింగ దర్శనమున
కన్న - శివలింగమును స్పృశించుట శ్రేష్ఠముగునది. అంతకన్న మిన్న శివలింగార్చనమున
శివలింగారాధనమును మించినది - మరియొకటి లేదనియు, స్థండి లాగ్ని హవనాదులు
శివలింగార్చనాంగములనియు, బ్రహ్మమానసపుత్రా! సనత్కుమారా! తెలిసికొనుము! దీనిని పూర్తిగా వివరించుటకు శతకోటివత్సరములైనా చాలవు. ఇండెంతమాత్రము సంశయము లేదు.
ఇయ్యది
“శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (26)వ యధ్యాయము.
