లింగ మహా పురాణము

Table of Contents

72 - త్రిపురాసురవినాశార్థము రథచక్రాది నిర్మాణము, కార్యసిద్ధి సూచనలున్ను

సూత ఉవాచ –

విశ్వకర్మ నిర్మిత రథము నందు దేవతాశక్తులు పంచమహాభూత సారంబు నిమిడియుండుటచే దేవమానవాదులు అద్దాని నామోదించునట్లు - రథము - అపూర్వమై యుండెను. రథమునకు దక్షిణ చక్రము (కుడి గీరె) సూర్యుఁడు కాగా వామచక్రము (ఎడమ గీరె) చంద్రుఁడయ్యెను.

దక్షిణ చక్రము పన్నెండు ఆకులు గలదిగా వామచక్రము పదునారు ఆకులు గలదిగా నుండెను. దక్షిణచక్రముపై ద్వాదశాదిత్యులు, వామచక్రముపై షోడశ చంద్రకళలు నమరియుండినవి. వామచక్రమునకు నక్షత్రములు భూషణములు కాగా ఆ రెండు గీరెల కమ్ములు షడృతువులయ్యెను.

అంతరిక్షము రథములోని అవకాశముగాను; మందర పర్వతము రథములో సారథిస్థానము గాను; ఉదయాస్తపర్వతములు రెండు నొగలుగాను;

మహామేరుపర్వతో పరిభాగము రథమధ్యవేదికగాను; కేసరాచలములు వేదికాధారములుగాను; సంవత్సరము - రతో వేగము (శీరెలు తిరుగుట) గాను; దక్షిణోత్తరాయణములు గీరెల యొక్క నడిమి కూడికలు గాను; ముహూర్తములు రథముదిగువ - వంగిన కట్టలుగాను; కళలు చక్రముల యొక్క చీలలుగాను; నిమిషములు - నొగలు క్రింద ఆనకుండ నమర్పబడు మ్రానుతునకలుగాను; స్వర్గమోక్షములు ముఖ్యములైన రథధ్వజములు గాను; బుద్ధి-రథములో వెలుతురుగాను;
జ్ఞానకర్మేంద్రియములు రథాలంకారములు గాను; శ్రద్ధయనునది రథగమనము గాను; వేదములు అశ్వములుగాను; వేదపదవిభాగములు భూషణములుగాను, శిక్షావ్యాకరణాది షడంగములు ఉపభూషణములుగాను; పురాణములు న్యాయశాస్త్రము పూర్వోత్తరమీనూంసలు, ధర్మశాస్త్రంబు- వాలాశ్రయములగు వస్త్రములుగాను మంత్రములు కకారాదివర్ణములును గంటలుగాను; సహస్రఫణి భూషితమగు ఆదిశేష మహాసర్పము రథమును బిగించు త్రాడుగాను; పుష్కరాదిమేఘములు పతాకలు గాను రథము రమణీయము దృఢంబునై యుండెను. రథ పార్శ్వములయందు గంగాదిమహానదులు స్త్రీరూపధారిణులై చామరములను కరములతో పట్టుకొని యున్నవారై రథశోభ నినుమడింపఁజేయుచుండిరి.

ఆవహాదిసప్తవాయువులు రథములోనికి పోవుటకు సువర్ణసోపానము (మెట్లు) లయ్యెను. భగవానుఁడగు బ్రహ్మదేవుఁడు రథసారథికాగా అమరులు పగ్గములను పట్టుకొనువారైరి. ప్రణవము ప్రతోద (మునికోల) మయ్యెను. (దీనిని కొరడా యని వ్యవహరింతురు.) మేరు పర్వతము ధనుస్సుగా సర్పరాజు అల్లెత్రాడుగా, సరస్వతీదేవి - ధనుర్హంటగా, మహాతేజస్వి యగు శ్రీహరి బాణముగా, ,చంద్రుఁడు లంతః బాణాగ్రముగా, కాలాగ్నిబాణాగ్రము యొక్క కొనగా, నమరియుండిరి.

ఇల్లు దివ్యరథమును ధనుస్సును బాణమును సారథిని మరియు కథాంగముల నన్నిటిని దేవతలు సేపపరుపగా మహేశ్వరుఁడు కవచముకు బాది రణమండనములను ధరించి – భూమ్యాకాశములను కదిరించునట్లు ఆథము నధిష్ఠించెను. అట్టితటి నారదాది మహర్షులు-వైదికపౌరాణిక స్తోత్రములతో రత్వమున (బొగడుచుండిరి. భక్తులందరు నమస్కరించుచుండిరి. అప్సరసలు నాట్యమాడుచుండిరి.

మహేశ్వముఁడు - బాగుగా శోభించుచు సారథియగు బ్రహ్మదేవు నవలోకించి రథము నెక్కు చుండగా వేదాశ్వములు తలలు వంచి శంభుని భారమును మోయలేక నేల (బడుచుండెను. వథము కుంగుమండగా భగవానుడైన నారాయణుడు పుషభరూపమున రథమును లేపి క్షణకాలము మాత్రము మోయ (గలిఁగెను. వృషేంద్రుఁడు గూడ శంకరుని బరువును మోయఁజాలనివాడై మోకాళ్లపై నిలిచి క్రిందికి వంగుచుండెను.

రవృత్తాంతమునకు ప్రోచ్చలకముగా శివరహస్యమునంచు దశమాంశములో దిగువ విధము వర్ణింపఁబడినది.

శ్లో ॥హంసోత్థామల పక్ష దామర మరుత్సం వీజితః శంకలో । వత్న భ్రాజిత పాదుకాయుత జో-చేవాంకం ప్రాపహి । శ్లో ॥ఛత్రా శ్వాసి పతాకకై: శతకం-- ర్నానానచత్తూర్యః । మద్రాణికరముక్త మౌక్తికఫలై-స్మూధ్యర్చితః శంకరః । శ్లో ॥రత్న భ్రాజిత పాత్రమధ్యగలసత్సౌవర్ణదీపావలీ । దేవ్యాలీకరకంకణధ్వని యుతైః - సప్తార్చి నీరాజితః 11 శ్లో ॥పశ్యం స్తా మగకన్యకాజ్ఞవచనం సం వీక్ష్య సంవీజలీం । దేవ్యాసారమరంచసౌరభసమోత్క కోరువ రపి ॥ శ్లో ॥ సందీశాన పునః ప్రసాకిన మహావే త్రాగ్రతోత్సాం : । విష్ణు బ్రహ్మసుకాసులా చికగణైః - సంప్రోక్తవాచాంభరైః ॥ శ్లో ॥శంభో పాహి సుభాసురాణ - ప్రమథపాధీశోక్త సూక్తి ప్రభా । మంచారానతమౌజాలణయు పావ ప్రభావః శివః ॥

“రాజహంసలచే లేపఁబడిన, స్వచ్ఛములైన రెక్కలు అను చామరముల గాలిచే వీచబడినవాడు; రత్నములతో ప్రకాశించు పాదుకలతో కూడిన పాదములు గలవాడు, పార్వతీ దేవి యొక్క హస్తములచే విడువబడిన ముక్తాఫల (ముతై) ములచే శిరస్సున పూజింపఁబడువాడు, మణులతో రాణించు పల్లెరము నడుముఁజెండి వెలుగొందు బంగారు వన్నె గల చీపముల వరుసతోడను అమ్మవారి యొక్క చెలికత్తెల చేతులకు గల కంకణముల ధ్వనితోడను గంగాదేవి యొక్క జలముఁడగు శీకరము (తుంపర) లతో
నైన మకరందముతో సమానములగు గొప్ప వాన చినుకుల తోడను కూడిన మంగళహారతిని సత్కరింపఁబడు వాడును; వింజామరతో వీచుచున్న గంగాదేవిని కడకంటితో చూచి హైమవతీ - దేవి యొక్క కమలమువంటి ముఖమును కనులార గాంచియు శ్వేతచ్ఛ ‘త్రములతో, జండాలతోడను ధనురాణములను ధరించిన హస్తములతోడను నానావిధములుగ బసచున్న వాద్యములతో కను మాడిన రథమునందు శోధించు శంకరుని రథము నడచుచుండగా దారి నడుపుచున్న సురాసురగణములను నందికేశ్వరుఁడు తనముందు గొప్ప బెత్తము. ఆు ఆ భాగమును దాల ప్రదుకు నెట్టుచుండెను.

అట్టితటి  శంభో ! మహాదేవా ! మమ్ము రక్షించుము లను అందుకు సదరులు
పలుకుచుండగా ప్రమథ గణాదిపాధీశుడగు నందీశ్వరుని నివారణ వాక్కులును సూటంలో గల ప్రభావనమునకు లొంగినవారైతమ మందార పుష్ప ఘటితములగు కరీముల యొక్క గుంపులు చేరికతో ప్రణామములను చేయుచుండిరి. అట్టి పాదముల మహిమగలవాడు శంకరుఁడు” అని రహస్య గత దశమాంశమువలన విదితమైనది.

ఆ సమయమునమహేశ్వరుఁడు సూచింపగా బ్రహ్మదేవుఁడు పగ్గములతో నశ్వములను లేపి రథమును పూర్వస్థానమునందు నిలిపియు మనోవాయు వేగము గల గుట్టములను బలవంతులైన త్రిపురాసురుల పట్టణములవైపు నడిపించుచుండెను.

ఆ ‘సమరసన్నాహమున శంకరుఁడు -  దేవతలారా ! హరుపతిత్వమును నాకు మీరు సమ్మతించినదో లసుములందునుమాడెదను. చేప మానవాడు అంచను పశువులను, నేను పశుపతిననియు మీరంగీకఏంపనివో చైత్యులను వధింహా • సనగా వివేషములు ముత్యము వాల్చి శంకించుమండి. అప్పుడు ఈ పురుభావముఁ గూ మీకు భయము వలపు పడు సాకుపర దీక్ష ఒక గ్రహించునో వాడు పశుభావమును తొలగించుకొనును.

పాశుపత ప్రతము జన్మాంత యువతులు, దాడు. నంది, వనం మనం ,
వత్సరత్రయకంబునని నాలుగు విధములుండును. ఆజన్మాండము వేంగుబడుంది. ఇప్పుడు ప్రాంతంలో శివలింగధారణాత్మకమగును. పన్నెండు ఏండ్లడి - ఆచండ్లది, మూడేండ్ల చియు భార్యను రానుం ఆ ధారణాత్మకములగును. వీనిలో ప్రథమము ఉత్తమోత్తమము, రెండవది - ఉండుము, మును మధ్యమము, నాలుగవది కనిష్ఠంబు నగును. ప్రథమము, నాచరించు మా బారున న జన్మాంతమునంచే శివసాయుజ్యము లభించును.

ద్వితీయ తృతీయ చతుర్థములగు పాసు ప్రతములు సవరించించు వారు ప్రమముగా రెండు, మూడవ, నాలుగవ, జననముల చివర ముక్తులగుదురు.

ఇవ్విధము వచింపగా కవి బ్రహ్మాది దేవతలు పాసుపత ప్రతమును సంపమని

ంగీకరించిరి.

అటు పిమ్ములు విఘ్నేశ్వరుఁడు “ అదుతులారా ! నన్ను పూజింపకయే మీకు
త్రిపురాసుర సంహారమును తల పెట్టితివి. దివిషముడు గాని జైత్యుడు గాని మానవాదులు గాని నన్ను నిరాకరించినచో వారి కార్యమునకు విఘమును కల్పింతు  ననగా దేవతలు భయపడి వినాయకుని పాచ్య అర్ఘ్య ఆచమన అభిషేక భస్మ గంధాక్షత పుష్ప బిల్వ చూర్సలతో సరించి ఘాపదీపములను ప్రదర్శించి భక్ష్యభోజ్యాదులను మోచూచులను నివేదించియు: సీరాజన మంత్రపుష్పములను సమర్పించియు  “దేవా ! మా కార్యమును నిర్విఘ్నముఁజేయు” మని ప్రార్ధించిరి.

అంత పరమేశ్వరుఁడును (ఆత్మావై పుత్రనామారిసి” అను న్యాయమున వినాయకు
నాప్యాయతతో కౌగలించుకొని. భక్ష్యభోజ్యాదుల నిప్పించి నభినందించెను.

ఆ తరువాత మహేశ్వరుని రథము నడచుచుండగా నందికేశ్వరుఁడు రథము ముందు విమానమునందు పయనించుచుండెను. ప్రమథ గణాధిపతులందరు దేవతలును నందికేశ్వరు ననుసరించిరి. కమలదళకాంతి గల నారాయణుఁడు గరుత్మంతు నధిష్ఠించి మహేశ్వరుని వామ పార్శ్వమున బయలుదేరగా దేవేంద్రుఁడు ఐరావత గజేంద్రము నెక్కి శివుని దక్షిణ భాగమున పయనించెను.

యముఁడు, అగ్నిదేవుఁడు, కుబేరుఁడు, వాయువు, నిబ్రుతి, వరుణుఁడు, ఈశానుఁడు, వీరభద్రస్వామి, మహాకాలుఁడు, కుమారస్వామి, వినాయకుఁడు, కాళికాదేవి, మాతృకలు, డుర్గాదేవి, బాలాదేవి తదితరులును తమ తమ వాహనముల నధిష్ఠించి ఆయుధములఁబట్టుకొనియు శివరథమునకు నలుదిసలయందు మహేశ్వరు ననుసరింపగా ఖేచరులు జయశబ్దము నుచ్చరించుచు పుష్పములఁగురిపించిరి. మునులందరు సంతోషాతిశయమున గంతులు వేయుచుండిరి. భృంగీశ్వరుఁడును
సమరసన్నాహి యయ్యెను. పార్వతీదేవి - పరమేశ్వరుని చేరువ నున్నదై మహేశ్వరుని కుతూహలము నినుమడింపఁజేయుచుండెను.

శుభావతి యనునామె దేవి ప్రక్కన చామరమును కేలఁబూని రాణించుచుండెను. భస్మతో శ్వేతవర్ణము గల పరమేశ్వరుని శరీరము హిరణ్మ యమగు మేరుపర్వతము అను ధనుస్సును ధరించుటచే ఆకసమున మెరుపుతో తెల్లని మేఘమువలె ప్రకాశించుచుండెను. శంకరుని మెడపై గల పుష్పమాలిక ఆకాశము నుండి పడుచున్న గంగానదివలె శోభించుచుండెను.

ఆ సమయమున బ్రహ్మేంద్రాద్యమరులు శివునకు ప్రణమిల్లుచు “ క్షణములో చరాచర ప్రపంచమును దహించుటకు సమర్థుఁడైన మహేశ్వరుఁడు పురత్రయమును మనస్సుతోడనే కాల్పులుకు ప్రమథగణములతో కూడి స్వయముగా పయనించుట ఎందుకో’; రథముతో బాణముతో గణములతో దేవతలతో నేమి ప్రయోజనము ? ఈ ఫటాటోపము బోధపడుట లేదు. లీలార్ధమే సమస్త సాధనములను స్వీకరించెనని తోచుచున్నది. “అని లోలోన చింతించుచుండిరి.

శ్లో॥ అథ సజ్యం ధనుః కృత్వా - శర్వః సంధాయ తం శరం । యుక్త్వా పాశుపతాస్త్రీణ - త్రిపురం సమచింతయత్ ॥

“అట్లు సన్నాహము జరిగిన తరువాత శివుఁడు ధనుస్సు యొక్క అల్లెత్రాడు బిగించి ధనుస్సునకు బాణముతో పాశుపతాస్త్రమును సంయోజించియు పురత్రయము ఒక చోటునకు రావలెనని చింతించుచు నిరీక్షించుచుండగా దివ్యవర్ష సహస్రకాలమునకు మూడు పట్టణములు ఒకటి యైనందునఅమరులు సంతోషించుచు జయధ్వానములతో మహేశ్వరుని నుతించుచుండిరి.

అంత బ్రహ్మదేవుఁడు “మహాదేవా ! పుష్యనక్షత్రము తటస్థించినను నీ లీలావిలాసమును పురత్రయైక్య నిరీక్షణముగా చూపెట్టుచున్నావు! అమరులు నసురులును నీకు సమానులైనను దేవతలు ధర్మాత్ములై లోకకల్యాణము నాశించువారు. అసురులు ఆధర్మాత్ములై లోకమును పీడించు వారు శ్రీ లింగ మహా పురాణము గాన నీ లీలా విలాసమును విరమించి పురత్రయమును దహించుము! ఇందుకు బాణముతో భూతసంఘములతో విష్ణుమూర్తితో రథముతో ధ్వజముతో నాతోడ నేమి ప్రయోజనము నీకు ? ఈ నగరములు మూడు విడిపోవు నంతలోనే దహించుము!” అని ప్రార్థించెను.

అంత సర్వజ్ఞుఁడైన మహాదేవుఁడు - వికారదృష్టితో గాంచుచుక్షణ కాలముననే పురత్రయమును వహింపనుండగా బాణము నధిష్ఠించినట్టి సోమ విష్ణు కాలాగ్ని వాయువులు ప్రణమిల్లి “మాపాతము కొరకు బాణమును ప్రయోగించు’ మని ప్రాధేయపడగా మహేశ్వరుడు చిరునగవుతో బాణము 3క్కు పెట్టి చెవివరకు లాగియు విడువగా నా బాణము పురత్రయమును నిశ్శేషముగా కాల్చినదైమరల నేవదేవుఁ జేరి నమస్కరించియు సమీపమున నుండెను.

అట్టితటి - రుద్రుఁడు ప్రళయకాలమున భస్మమొనర్చిన జగత్తువలె పురత్రయము భస్మమయమై శోభించుచుండెను. అట్టిపురత్రయమున బౌద్ధ ప్రచారమునకు లోను గాక - శివునారాధించిన వారందరు మరణించి కైలాసమున గణాధిపత్యపదవి నధిష్ఠించిరి.

ఆ సమయమున తీక్లనయనుఁడగు మహేశ్వరు నవలోకించి ఇంద్రోపేంద్రులు గణేశ్వరులును భయపడుచుండగా పరమేశ్వరుఁడు అవ్వారి భయమును గమనించి “ మీ వైఖరి ఇబ్లెందుకు?” అని యనగా అమరులు నందికేశ్వరునకు పార్వతీ దేవికి గణపతికి మహేశ్వరునకు పునః పునః ప్రణామముల నొనర్చిరి. అంత హరి బ్రహ్మాదులు దిగువ విధము స్తుతించిరి.

శ్లో॥ ప్రసీద దేవదేవేశ - ప్రసీద పరమేశ్వర । ప్రసీద జగతాంనాథ । ప్రసీదానందదావ్యయ ॥

“దేవదేవేశ్వరా! పరమేశ్వరా ! జగన్నాథా ! ఆనంద దాయకా ! అవ్యయా ! ప్రసన్నుఁడవు కమ్ము ! అనుగ్రహింపుము ! శాంతించుము ! కరుణించుము !”

శ్లో॥ అగ్నివర్ణాయ రౌద్రాయ అంబికార్ధశరీరిణీ । ధవళశ్యామరక్తానాం - ముక్తిదాయామరాయ చ ॥

అగ్ని వంటి కాంతి గలవాడు, భయంకరుఁడు, వామార్ధశరీరము అంబికగా గలవాడు, ధవళ క్యామరక్త వర్ణములు గల రుద్ర విష్ణు బ్రహ్మలకు మోక్షము నొసఁగువాడు, ఏ కాగ్ర భక్తులకు సారబ్దాంతమున తన యానందమును ప్రసాదించువాడు, జన్మజరావ్యాధి మరణములు లేని నిత్య సత్య స్వరూపము గలవాడునగుమహేశ్వరునకు సాష్టాంగ ప్రణామము.

ఇత్యాది స్తోత్రమును 46 శ్లోకములతో చేయగా - మహేశ్వరుఁడు సంతోషించి దరహాసముతో పార్వతీ వదనారవిందము నవలోకించి – “ఈ మీస్తోత్రము నాకర్ణించితిని వరముల నడుగుఁడు ! “అని యనుగ్రహింపగా బ్రహ్మదేవుఁడు శ్రీహరియు నీయందు భక్తి-మాకు ఎల్లకాలము స్థిరపడుగాక! కథైవ అవసరము పడినతటి వాహనమై నిన్ను మోయు శక్తి గలవాడ నగుదును గాక ! అని విష్ణువు - ‘సారథి నీ సన్నిధి నుందును గాక” అని బ్రహ్మయు, “నీయనుగ్రహమున మేమందరము స్వర్గమున నిర్భయులమై సుఖముగ నుందుము గాక !” అని సురలును కోరగా “తథాస్తు” అని శర్వుడు సమథగణములతో పార్వతీ దేవితో గణేశకుమార వీరభద్రాదులతోడ నంతర్ధానముఁజెందెను.

త్రిపురాసుర సంహారము గల నీ యధ్యాయమును దైవకార్యములయందు పితృ
శ్రాద్ధకాలమునందును చదువువారు వినువారు వినుపించువారును మనోవాక్కాయకృతములగు జన్మజన్మాంతర పాపములను పోగొట్టుకొందురు. మరియు శత్రువులు నశింతురు. యుద్ధమున విజయము సంప్రాప్తమగును. వ్యాధులు తొలగును. ఆపదలు దరికిరావు. ధనము, దీర్ఘాయుష్యము, కీర్తి, విద్య, మహిమయు సమకూరును.

ఇయ్యది
”శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ
ఆంధ్రానువాద ప్రవచనమున (72)వ అధ్యాయము.


 

త్రిసప్తతిత మాధ్యాయము - లింగార్చన ప్రాముఖ్యము

సూత ఉవాచ -

త్రిపురాసురులను సంహరించి పరమేశ్వరుఁడు నిజధామము (జేరిన తరువాత బ్రహ్మదేవుడు దేవతల నుద్దేశించి దిగువవిధము వక్కాణించెను.

తారకాక్ష- కమలాక్షు విద్యున్మాలులు- ఇతర దైత్యులును విష్ణుమాయా ప్రభావము వలన మహాదేవారాధనమును విస్తరించి తను నరగ త్రయములో సహ నశించిరి గచా ! ప్రస్తుతము నే చెప్పునదేమనగా ?

శ్లో॥ తస్మాత్సడా పూజనీయో లింగమూర్తి: సదాశివః ॥

 “అందువలన లింగస్వరూపము గల సదాశివు నెల్లకాలము (ఆజన్మాంతము) ప్రతి దినము పూజింపవలెను.” ఎంతవరకు దైత్యులు శివపూజ నొసర్చిరో అంతవరకు క్షేమములో నుండిరి. దేవతలారా ! మీరును నిత్యము శివలింగము నర్చించుచుండుడు!.

లోకమంతయు శివలింగమయము గాన సమస్తంబు శివ లింగమునందే ఆధారపడియున్నది. అభీష్టసిద్ధి నపేక్షించు ప్రతివాడు నవశ్యము శివలింగము నారాధింపవలెను.

దేవతలు, దైత్యులు, డానవులు, యక్షులు, విద్యాధరులు, సిద్ధులు, రాక్షసులు, పితృదేవతలు, మునులు, దివ్య పిశాచములు, కిన్నరాదులును శివలింగము నర్చించియే తమతమ వాంఛలను సిద్ధింపఁజేసి కొనిరి. ఇంకెంత మాత్రము సందియము లేదు.

దేవదేవుడగు మహేశ్వరుని ముంచు మన మందరము పశువులమై యున్నాము. పాశుపత వ్రతము నాచరించినచో పశుత్వము - తొలగును. అది యెట్లనగా,?

ప్రణవముతో ఐదు పర్యాయములు ప్రాణాయామమును చేసి పృథివ్యాది పంచ
మహా భూతములను శోధించి. ఓంకారము నుచ్చరించుచు ప్రాణాపానవాయువులను
నియమించియు- జ్ఞానామృత మనడగు ప్రణవమును సర్వాంగములయందు వ్యాపింపజేసియు కర్మేంద్రియములను ప్రణవములో శోధించియు తన శరీరమును చైతన్యభరితముగా భావించి  అగ్ని రితి భస్మ , వాయు రితి భస్మ , 16 జల మితి భస్మ , (స్థల మితి భస్మ “ (వ్యోమేతి భస్మ, సర్వం హవా ఇదగ్ం భస్మ” అను మంత్రముల (జడువుచు భస్మను తాకవలెను. త్రియాయుషం జమదగ్నే? ‘ఇత్యాది మంత్రములతో ప్రాత ర్మధ్యాహ్న సాయంకాలములయందు పొడిభస్మను ఒడలంతటిని తాచుకొనవలెను. (దీనిని ఉద్భూళనమందురు)

దేవసత్తములారా! ఇయ్యది పాశుపత వ్రత మనబడును. దీని నాచరించువాడు సర్వతత్త్వజ్ఞుడైన శివయోగి యగును. సంసారపాశవిచ్ఛిత్తి కే- భవుడిద్దానిని ప్రబోధించెను. ఇట్లు నేను విష్ణు మూర్తియు పాశుపత వ్రతము నాచరించి సృష్ట్యాదిని జ్యోతిర్లింగమునంచు పరమేశ్వరుఁ గాంచితిమి. గాన శివ లింగమును ఒక సంవత్సరమైనను పూజించినచో జీవాత్మలకు పశుభావము తొలగును.

మేము - బ్రహ్మ విష్ణురుద్రులము బాహ్యమున ఆంతరమునను భక్తి శ్రద్ధలతో శివునారాధించి సృష్టి స్థితిలయములు అను కర్తవ్యము లను కొనసాగించు కొనుచున్నాము.

నేను, శ్రీహరి, మునులుసు గావించు ప్రతిజ్ఞ - యిది యగులులో సందేహమేమియులేదు. అందువలన శివారాధనము అవశ్యకర్తవ్యమైనదని - భావింపుడు!

శ్లో ॥ సాహానిస్తన్మహచ్ఛిద్రం సమోహస్సా చమూకతా ॥ యత్ క్షణం వాముహూర్తం వా శివ మేకం న చింతయేల్ ॥

“ప్రతిదినము క్షణకాలమైనను ముహూర్తకాలమైనను శివుని పూజాజుప ధ్యానములతో నారాధింపకుండుటయే కీడు, తప్పు, ఆవివేకము, మూగతనంబునగు నని తెలియవలెను.”

శివభక్తి పరులు, శివార్షితమనస్కులు, శివస్మరణరతులు నగువారు దుఃఖభాజనులు కారు.

భవనాని మనోజ్ఞాని- దివ్య మాభరణం స్త్రీయః ॥ ధనం వా తృప్తి పర్యంతం - శివపూజావిధేః ఫలమ్ ॥

“మనోహరములైన భవనములు, దివ్యభూషణములు, సుందరులైన తరుణులు, తృప్తి కలుగువరకు ధన ప్రా యు శివ పూజావిధికి ఐహిక ఫలములుగా నొప్పారుచున్నవి. “

శ్లో॥ యే వాంఛంతి మహాభోగాణ - రాజ్యం చ త్రిదశాలయే । తేరిర్చయంతు సదాకాలం లింగమూర్తిం మహేశ్వరమ్ ॥

“ఈ లోకమున మహారాజభోగములను, పరలోకమున స్వర్గరాజ్యము నపేక్షించువారు జీవితకాలమున లింగమూర్తియగు మహేశ్వరుని నిత్యము ఆరాధింతురు గాక!”

శ్లో॥ హత్సా ఖిత్వా చ భూతాని చర్వా సర్వమిదం జగత్ । యజేదేకం విరూపాక్షం నసపాపైః ప్రలీష్యతే ॥

‘‘ప్రాణులను హింసించియైనను బాధించియైనను ఈ సమస్త శరీరమును శుష్కింపజేసియైనను (ఇట జగత్ అనగా శరీరము, దగ్గా = అనగా మాంసశోణితములు తగ్గునట్లు