లింగ మహా పురాణము

Table of Contents

36 -  మహాదానాష్టమ మగు లక్ష్మీదానమును వివరించుట

మహదైశ్వర్యదాయకముగు లక్ష్మిదానమును వివరించుచున్నానని సనత్కుమారుడు
చెప్పదొడగెను.

 యథాశక్తి సువర్ణముతో ‌- సర్వవిధ ఆభరణసంపన్నురాలుగా లక్ష్మీదేవి మూర్తిని, లక్ష్మీదేవికి కుడి భాగమున విష్ణు విగ్రహమును చేయించి - పీఠముపై వెండిపళ్లెరములో నునిచి శ్రీ సూక్తముతో లక్ష్మీదేవిని; విష్ణుగాయత్రితో శ్రీహరిని యథావిధి పూజించియు సమిధలతో నెయ్యితోడను వేరువేరుగా హసనము నొనర్చి యజమానునకు లక్ష్మీదేవిని విష్ణువి గ్రహమును చూపెట్టి యాతనితో ఆచార్యుడు సాష్టాంగ నమస్కారమును చేయించి - పూర్వము వలె శివలింగము నభిషేకించి పూజింపవలెను. ఆ పిదప ఆచార్యునకు లేక - గురువునకు సువర్ణ లక్ష్మీ విష్ణు విగ్రహములను సమర్పించవలెను. మరియు అందరిని భోజనతాంబూలాదులతో సత్కరింపవలెను.

ఇట్లు చేసినచో ఆర్జిత ధనమంతయు స్థిరపడును. తరతరాలనుండి ఉన్న స్థిరచరాస్తి యనుభుక్తంబు నగును.

ఇయ్యది
“శిన విజ్ఞాన వీచిక”  అను శాంకరీయ

ఆంధ్రానువాను ప్రవచనమున (36)వ యధ్యాయము.