21 - ప్రహ్లాద వంశ విస్తారము

శ్రీపరాశరుడు:

సంహ్లాదపుత్ర ఆయుష్మాన్ శిభిర్భాష్కల ఏవచ।

విరోచానస్తూప్రహ్లాదిర్బలిర్జజ్ఞేవిరోచనాత్॥

బలేఃపుత్రశతంత్వాసీద్బాణజ్యేష్ఠం మహామునే।

హిరణ్యాక్షసుతాబ్రహ్మన్ సర్వ ఏవమహాబలాః॥

ఝుర్ ఝురశ్శకునిశ్చైవభూతసంతాపనస్తథా।

మహానాభోమహాబాహుఃకాలనాభస్తథాపరః॥

అభవన్దనుపుత్రాశ్చద్విమూర్దాశంబరస్తథా।

అయోముఖశ్శాంకుశిరాః కపిలశ్శంకరస్తథా॥

ఏకవక్త్రోమహాబాహుస్తారకశ్చ మహాబలః।

స్వర్భానుఃవృషపర్వాచపులోమాచమహాస్వనః॥

ఏతే దనుసుతాఃఖ్యాతా విప్రచిత్తిశ్చవీర్యవాన్॥

స్వర్భానోస్తుప్రభాకన్యాశార్మిష్ఠావార్షపర్వాణీ।

ఉపదానవీహయశిరాఃప్రఖ్యాతావరకన్యకాః॥

వైశ్వానరసుతెచోభే పులోమాకాలకాతథా।

ఉభే తత్రమహాభాగే మరీచేస్తుపరిగ్రహః॥

తాభ్యాంపుత్రసహస్రాణి షష్ఠిర్దానవసత్తమాః।

పౌలోమాఃకాలకేయాశ్చ మరీచితనయాస్మ్పృతాః॥

తతోఽపరేమహావీర్యా దారుణాస్త్వతినిర్ ఘృణాః।

సింహికాయామథోత్పన్నా విప్రచిత్తేస్సుతాస్తథా॥

త్ర్యంశశ్శల్యశ్చబలవాన్ నభ శ్చైవమహాబలః।

వాతాపిర్నముచి శ్చైవ ఇల్వలః ఖసృమస్తథా॥

అన్ధకోనరకశ్చైవకాలనాభస్తథైవచ।

స్వర్భానుశ్చమహావీర్యో వక్త్రయోధీమహాసురః॥

ఏతేవైదానవశ్రేష్టాదనువంశవివర్ధనాః।

ఏతేషాంపుత్రపౌత్రాశ్చ శతశోఽథసహస్రశః॥

శ్రీపరాశరుడు:

ప్రహ్లాదుని పుత్రులు శిబి, బాల్కులుడు, విరోచనుడు అను మువ్వురు. విరోచనుని కుమారుడు బలి. బలికి నూర్గురు పుత్రులు. బాణుడు పెద్దవాడు. హిరణ్యాక్షుని కుమారు లందఱు మహా బలశాలులు. ఝర్ఝరుడు, శకుని, భూత సంతాపకుడు, మహానాభుడు, కాలనాభుడు అనువారు. దను పుత్రులు ద్విమూర్ధుడు, శంబరుఁడు, అయోముఖుడు, శంకుశిరుడు, కపిలుడు, శంకరుడు, ఏకచక్రుఁడు, మహాబలుడగు తారకుడు, రాహువు, వృషపర్వుడు, పులోముడు, వీరుడగు విప్రచిత్తి. స్వర్భాను (రాహువు) పుత్రిక ప్రభ, వృషపర్వుని కన్య శర్మిష్ఠ. ఉపదాని, హయ, శీర్ష కూడా వాని కన్యలే. వైశ్వనరుని కన్యలు పులోమ, కాలక అను నిద్దరు. ఈ యిద్దరు మారీచుని భార్యలు. వారి వలన పుత్ర సహస్రము కలిగెను. దనుపుత్రులు అరువది మంది. పౌలోములు, కాలకేయులు మరీచ తనయులు ఇంకను సింహిక (హిరణ్యకశిపుని సోదరి) విప్రచిత్తికి కలిగిన వారు మహావీరులు నిర్దాయులు కఠినులు త్యంషుడు శల్యుడు నాభుడు మహా బలశాలులు. వాతాపి నముచి ఇల్వలుడు ఖసృముడు అన్ధకుడు అరకుడు కానభుడు స్వర్భానువు మహావీర్యుడు వక్త్రయోది మహాసురుడు వీరు దను వంశోద్దారకులగు దానవులు. వీరి పుత్ర పౌత్రులు వందలు వేలు గలరు.

ప్రహ్లాదస్యతుదైత్యస్యనివాతకవచాః కులే।

సముత్పన్నాస్సుమహతా తపసాభావితాత్మనః॥

షట్సుతాస్సుమహాసత్త్వాస్త్రామ్రాయాఃపరికీర్తితాః।

శుకీశ్వేనీచభాసీచసుగ్రీచసుగ్రీవీశుచిగృద్ద్రకా॥

శుకీతుజనయామాస ఉలూకప్రత్యులూకకాన్।

శ్వేనీశ్వేనాం స్థథాభాసాన్ భాసీగృద్రాంశ్చగృధ్రకీ॥

శుచ్యౌదకాన్ పక్షిగణాన్ సుగ్రీవీతువ్యజాయత।

ఆశ్వానుష్ట్రాన్ గర్దభాంశ్చ తామ్రావంశఃప్రకీర్తితః॥

వినతాయాశ్చపుత్రౌద్వౌవిఖ్యాతౌగరుడారుణౌ।

సువర్ణఃపతతాంశ్రేష్టోదారుణఃపన్నగాశనః॥

సురసాయాంసహస్రంతు సర్పాణామమితౌజసామ్।

అనేకశిరసాంబ్రహ్మన్ ఖేచరాణాంమహాత్మనామ్॥

కాద్రవేయాస్తుబలినఃసహస్రమమితౌజసః।

సువర్ణవశగాబ్రహ్మన్ జజ్ఞిరే నైకమస్తకాః॥

తేషాంప్రధానాభద్రంతే శేషవాసుకితక్షకాః।

శాఖశ్వేతౌమహాపద్మఃకంబళాశ్వతరావుభౌ॥

గొప్ప తపస్సుచే భావితాంతః కరుణుడగు ప్రహ్లాదునకు నివాత కవచులు పుట్టిరి. తామ్రాకు మహా బలశాలురగు నారుగురు సుతులు గలిగిరి. శుకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుచి ,గృద్ద్రక అని వారి నామ ధేయములు. శుకి శుకము (చిలుక) లను, గ్రుడ్ల గూబలను, కాకులను గనెను. శ్యేని డేగలను, భాసి భాసములను, గృద్ధ్రి గ్రద్దలను, శుచి నీటి పక్షులను, సుగ్రీవి ఆశ్వములను, ఒంటెలను, గాడిదలను కనెను. తామ్రా వంశము కీర్తింప బడినది. వినత యొక్క పుత్రులిద్దరు. గరుడుడు, అరుణుడు. సువర్ణుడు (గరుడుడు) పక్షులలో శ్రేష్ఠుడు. కఠినుడు, సర్పముల భక్షించును. సురస యందు మిక్కిలి ఓజస్సు గలవియు అనేక శిరములు గలవియు ఆకసమున సంచరించుచు మహా ప్రభావ సంపన్నులునగు సర్పములు గరుడ వశమైరి. వానిలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖశ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, ఆశ్వతరుడు ప్రధానులు.

ఏలాపుత్రాస్తథాకర్ణః కర్కోటకధనంజయౌ।

ఏతేచాన్యేచబహవోదన్దశూకావిశోల్బణాః॥

గణంక్రోధవశంవిద్ధి తేచసర్వేచడంష్ట్రిణః।

స్థలజాఃపక్షిణోఽబ్జాశ్చదారుణాః పిశితాశానః॥

గాస్తువైజనయామాససురభిర్మ హిషీస్తథా।

ఇరావృక్షలతావల్లీతృణజాతిశ్చసర్వశః॥

ఖసాతుయక్షరక్షాంసిమునిరాప్సరసస్తథా।

అరిష్టాతుమహాసత్త్వాన్ గన్ధర్వాన్వై వ్యజీజనాత్॥

ఏతేకాశ్యపదాయాదాఃకీర్తితాస్థ్సాణుజంగమాః।

తేషాంపుత్రాశ్చపోత్రాశ్చ శతశోఽథసహస్రశః॥

ఏషమన్వన్తరేసర్గో బ్రహ్మన్ స్వారోచిషేస్మృతః॥

ఏలా పుత్రుడు కర్కోటకుడు, ధనంజయుడు ఇంక మరి కొన్నియు విష ప్రాబల్యము కలవి. ఈ సముదాయము క్రోధ వశురాలు వలన కలిగినది. వీనికి కోరలు గలవు. ఇవి స్థలజములు, జలజములు, పక్షములు గలవి. క్రూరములు మాంసాశనములు. కోపము వలన పిశాచములను పుట్టించెను. ఖస (స్వస) యక్షలను రాక్షసులను పుట్టించెను. ముని అప్సరసలను అరిష్ట మహా బలోపెతులగు గంధర్వులను సృజించెను. ఇవి అన్నియు కశ్యప ప్రజాపతి దాయాదులగు స్థావర జంగములని చెప్ప బడినవి. వారి పుత్రులు పౌత్రులు వందల కొలది వేలకొలది గలరు. ఇది స్వారోచిష మన్వంతర సృష్టి.

వైవస్వతేచమహతివారుణేవితతేక్రతౌ।

జుహ్వానస్యబ్రహ్మణోవై ప్రజాసర్గ ఇహోచ్యతే॥

పూర్వంయాత్రతుసప్తర్షీనుత్పన్నా నేవమానవాన్।

పుత్ర(పితృ) త్వేకల్పయామాస స్వయమేవపితామహః॥

గంధర్వభోగిదేవానాం దానవానాంచసత్తమ॥

దితిర్వినష్టపుత్రావై తోషయామాసకాశ్యపమ్।

తయాచారాధితస్సౌమ్య కాష్యపస్తపతాంపరః॥

వరేణఛన్దయామాససాచవవ్రేతతోవరం।

పుత్రమిన్ద్రవధార్ధ యసమర్థ మమితౌజసమ్॥

సచతస్యై వరం ప్రాదాద్భార్యాయైమునిస్సత్తమః।

దత్తచవరమవ్యగ్రఃకాష్యపస్తామువాచహ॥

శక్రంపుత్రోనిహనతాతేయదిగర్భంశ్శరచ్చతమ్।

సమాహితాతిప్రయాతా శౌచినీధారయిష్యషి॥

వైవస్వత మన్వంతర సృష్టి:

వైవస్వత మన్వంతరము నందు వరుణుడు చేయుచున్న గొప్ప క్రతువు నందు హోతగా నున్న బ్రహ్మ యొక్క సృష్టి యిచట చెప్ప బడుచున్నది. గంధర్వాదులకు పూర్వము పుట్టిన మన్వంతరీయు లగు మనో జాతులగు సప్తర్షులను బ్రహ్మ స్వయముగ గాంధర్వ సర్వ దేవతలను దానవులకును పుత్ర ప్రభావమున కల్పించెను. దితి నష్ట పుత్రులు గలదై కాశ్యప ప్రజాపతిని సేవించెను. కశ్యపుడు సంతోషించి వరమిచ్చెద ననెను. ఆమె ఇంద్రుని వదనిమిత్తమై సమర్ధుడు ప్రతాప శాలియగు పుత్రుని గోరెను. భార్యకు కశ్యపుడు వరమిచ్చి యిట్లనెను. నీ గర్భమును నూరు సంవత్సరములు శౌచవతివై జాగ్రత్తో ధరించెదవేని నీ పుత్రుడు ఇంద్రుని చంప గలదు అని కశ్యపుడు చెప్పును.

ఇత్యేవముక్త్వాతాందేవీం సంగతఃకాశ్యపో మునిః।

ధదారసాపితంగర్భస్సంయక్చౌచసమన్వితా॥

గర్భనాత్మవధార్ధ యజ్ఞాత్వాతంమఘవానపి।

శుశ్రూషు స్తామథాగాచ్చాద్వినయాడమరాధిపః॥

తస్యాశ్చైవంతర ప్రేప్సురతిష్ఠత్పాకశాసనః।

ఊనేవర్షశతేచాస్యాదదర్శా న్తరమాత్మవాన్॥

అకృత్వాపాదషౌచంతు దితిశ్శయనమావిశత్।

నిద్రామాహారాయామాసతస్యాఃకుక్షింప్రవిశ్యసః॥

వజ్రపాణిర్మహాగర్భం తంచిచ్చేదాథసప్తధా॥

సపాట్యమానోవజ్రేణప్రరురోదాతిదారుణమ్।

మారోదీరితితంశక్రః పునః పునరభాషత॥

సోఽభావ్స్తప్తదాగర్భస్త మిన్ద్రఃకుపితఃపునః।

ఏకైకంస్ప్తదాచక్రే వజ్రేణాద్రివిదారిణా॥

మరుతోనామదేవాస్తేబభూవురతివేగినః।

యదుక్తంవైమఘవతా తేనైవమరుతోభవన్॥

దేవాఏకోనపంచాశత్సహాయావజ్రపాణినః॥

ఆమె గర్భవతి యాయెను. నియమవతియై యామె గర్భ సంరక్షణము చేయు చుండెను. ఆ గర్భము తన వదార్ధమై ఏర్పడెనని తెలిసికొని ఇంద్రుడు వినయాన్వితుడై యామె సన్నిధి కేతెంచి సమయము కొఱకు నిరీక్షించు చుండెను. వర్షశతము పూర్తి కాక పూర్వమొక అవకాశము చిక్కెను. దితి పాద ప్రక్షాళన శౌచమును జేసి కొనక పరుండెను. ఆమె గర్భమును నేడు ఖండములు చేసెను. వజ్రముచే పీడించు చుండగా ఘోరముగా నేడ్చెను. ఏడ్వ వలదని ఇంద్రుడు మాతమాకు అనుచుండెను. ఆ గర్భము ఏడు ఖండము లాయెను. ఇంద్రుడు కోపించి నాగర్భ ఖండముల నొక్కొక్క దానిని ఏడు బాగములుగా చేదించెను. ఆ ముక్కలు మహావేగ వంతులైన మరున్నామక దేవతలైరి. భగవంతుడు చెప్పిన విధముగ ఆ నలుబది తొమ్మండుగురు. మరుద్దేవులు వజ్రపానికి సహాయ భూతులైరి.