మత్స్య మహా పురాణము
287 - రత్న ధేను దాన విధానము
శ్రీ మత్యుడు మనువున కిట్లు చేప్పెను : ఇపుడిక నరులకు గోలోక ప్రదమును అనుత్తమమును నగు రత్న ధేను మహా దానమును వివరింతును; పుణ్యమగు పర్వదినమున తులా పురుష దానమందువలేనే లోక పొలా వాహనమును జరిపి ఈ రత్న ధేను రచన జరిపించవలయును: భూమి పై కృష్ణాజినమునమర్చి ద్రోణపరిమాణలవణమును దాని పై పోసి దాని పై ఈ రత్న మయధేనువును సంకల్ప పూర్వకముగా కల్పోక్త విధానముతో నిర్మించవలయును; ఎట్లన ముఖస్థానమునందు ఎనుబదియొక పద్మరాగములను ముట్టే యందునూరుపుష్యరాగములను లలాటమునందు బంగరు తిలకమును కన్నులయందు నూరు ముత్తెములను రెండు కనుబొమలయందును నూరు పగడములను రెండు చేవులందును రెండు ము తైపు చిప్పలను బంగరుతోనే కొమ్ములను నూరువజములలో శిరస్సును మేడయందు నూరు. గోమేదకములతో గంగడోలును నూరింద్ర నీలములతో వీపును నూరు వైదూర్యములతో పార్శ్వములను స్పటికములతో ఉదరమును నూరు సౌగంధికములతో కటిప్రదేశమును బంగరుతో గిట్టలను ముక్తావళులతో సూర్యకాంత చంద్ర కాంత ములతోను తోకను కర్పూర చందనములతోను ముకుపుటములను కుంకుమపూవుతో రోమములను వెండితో నాభిని నూరు గరుడ పచ్చలతో అపానమును అమర్చి సర్వ సంధులందును ఇతర రత్న ములను అమర్చవలెను.
శర్కరతో నాలుకను గుడముతో గోమయమును ఆజ్యముతో గోమూత్రమును వస్తువులుగానే గోదధి గోక్షీరములను తోక చివరకుచ్చుగా చామరమును తత్సమీపమందు పాలు పెరుగు రాగి పాత్రను బంగరు కుండలములను ఇతర భూషణములను యథాశక్తిగ చేయించవలయును; ఈ విధముగానే ఇందు నాలుగవవంతుగ ఆయా సామగ్రితో దూడను చేయించవలయును. ఆపునకును దూడకును గూడ చెరకుతో పాదములనమర్చవలయును; సర్వధాన్యములను సర్వనానాఫలములను ఐదువన్నెల వితానక మును (మేలుకట్టు)ను అమర్చుకొనవలయును; హోమమును దేవతాధి వాసనమును జరిపి ఋత్విజులకు దక్షిణలను ఇచ్చి తరువాత ఈ రత్న ధేనువునకు గుడధేనువు నందువలెనే ఆవాహనము జరిపి ఈ మంత్రమును పలుకుచు ఆమంత్రించవలయును:
“రుద్రేంద్ర రవి బ్రహ్మ విష్ణువులును 'నీవు సర్వదేవగణములకును అవాసస్థాన 'మని పేర్కొనుచున్నారు; కావున ఆ ప్రమాణము ననుసరించి నమ స్త భువనత్రయమందలి దేవతలును నీయందే యున్నారు; ఇట్టి దేవీ! నీవు సంసార సాగ రముచే పీడింపబడుచున్న వాడనగు నన్ను కాపాడుము.”
ఇట్లామంత్రించి భక్తితో చుట్టును ప్రదక్షిణించి జలపూర్వకముగ ఆ గోవును తన గురుడగు బ్రాహ్మణునకు దానము చేయవలయును.
పుణ్య పర్వదినమున ఉపవాస పూర్వకముగ ఇది యాచరించినవాడు పాపవిముక్త దేహుడై విష్ణు స్థానప్రాప్తు డగును; సకల విధానమును ఎరిగి ఇట్లు రత్న ధేను దాన మాచరించిన దాత సకల కలుష విముక్తి నంది దేదీప్యమాన విమాన మారోహించి మన్మథ సమానరూపుడై బంధు పుత్త్రపౌత్త్ర సహితుడై విష్ణులోక ప్రాప్తు డగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున రత్న ధేను ప్రదానికమను రెండు వందల ఎనుబది ఏడవ అధ్యాయము.
Summary of chapter 287 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents the systematic ritual for Mahābhūtaghaṭa-dāna, the thirteenth Mahādāna involving a large golden pot representing the five great physical elements known as Pañchamahābhūtas: earth, water, fire, air, and space. Bhagavān Matsya describes filling the golden pot with holy earth, sanctified water, lighted lamps, aromatic incense, and empty space, placing golden icons of Bhagavān Brahmā, Vishṇu, and Śiva inside. Gifting this elemental pot to a learned Brāhmaṇa harmonizes the donor's physical and subtle bodies, bestows vibrant health, and grants ultimate spiritual liberation.