మత్స్య మహా పురాణము
215 - రాజాను జీవుల అనువర్తన ప్రకార వివరణము
మత్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: రాజానుజీవులు సర్వదా సదాచారులయి రాజునేట్లనువర్తించవలయునో చెప్పెదను; వినుము; విషయమునేరిగి రాజాను జీవులు రవిపుత్తా! మనూ నిండు మనస్సుతో అన్ని విధముల రాజు ననువర్తించవలెను; ఎట్లన.రాజు చెప్పు వాక్యమును యత్నముతో వినవలెను; అతని మాటను నడుమనే నిలిపి తనమాట చెప్పకూడదు; జనసభలో నున్న రాజుతో అతనికి అనుకూలమును ప్రియములునగు మాట పలుకవలెను; ఏకాంతమందు మాత్రము రాజునకు అ ప్రియమైనను హితమగు వచనము పలుకవలే(చ్చు)ను; ఇతరులకు మేలుకావలసిన పని ఏదయిన నున్న ను రాజ మనస్సు సమముగా నున్నపుడు చెప్పవలెను; తన సొంతమునకు రాజు వలన కావలసినదేదైన నున్న చో ఆది అతనికి ఇతరులచే చెప్పించవలెనేకాని తాను చెప్పరాదు; ఏ పనిని గాని సమయము మించకుండ నేరవేర్చుటకు యత్నించవలెను; రాజాధికృతు డెప్పుడును రాజ ధనమును దుర్వినియుక్తము చేయరాదు; రాజు తన పై చూపు ఆదరమును అలక్ష్యము చేయక దానిచే తానతనికి ప్రియుడు కావలెను. రాజువలే తన వేష భాషా చేష్టితములాచరించరాదు; (ఎగతాళిగా) రాజుననుక రించరాదు; అతనికిష్టము కానివి విడువవలెను; రాజవేషమునకు సమము అధికమునగు వేషమును ధరించరాదు; ద్యూతము మొదలగువానియందు తనకుగల నేర్పునతనికి ప్రదర్శించవలేను; ఆట్లు ప్రదర్శించినను వాటి యందు రాజే తనకంటే గొప్పవాడని చూపవలేను; ఆంతఃపుర జనోధ్యములతో శత్రు రాజదూతలతో తన రాజుచే వేడల గొట్టబడినవారితో రాజాజ్ఞ లేనిదే సంబంధము పెట్టుకొనరాదు? తనకు ఎవరియందుగాని స్నేహ రాహిత్యము కాని అవమాన దృష్టికానియు న్నను దానిని బయల్పరచక దాచి ఉంచవలెను; రాజరహస్యములను లోకమున బయలుపరచరాదు. రాజు తనతో చెప్పిన పరమ గుహ్యములను బయలుపరచరాదు; దాని అతడు రాజునకు ఆప్రియుడగును; రాజు ఇతరుల నేదయిన ఆజ్ఞాపించుచున్నను తాను లేచి 'నేనేమి చేయుదును?' అనవలెను: కార్యస్థితి నెరిగి దానిని నెర వేర్పచూడవలేను.
కానీ ఈ విధముగ కూడ ఎల్లప్పుడును చేయు చున్న చో తాను ప్రభువునకు తేలిక వాడగును; రాజునకు ప్రీతి కరములగు వచనములను పలుకవలసినదే కాని అవి మిక్కిలిగాగాని మాటిమాటికి (ఎప్పుడును అదేపనిగా) కాని ఆడరాదు; మహాసుశీలుడుగా నుండవలెను; కనుబొమలు ముడిపడనీయకూడదు; ఎక్కువ మాటాడ రాదు; బొత్తుగా మాటాడకుండ రాదు; మత్సరముండ రాదు; తను తానేట్టి స్థితియందును పొగడుకొనరాదు; రాజునందుగల దుష్కృత్యములను ఎప్పుడు గానీ ఎక్కడ గానీ పేర్కొనరాదు; రాజిచ్చిన వస్త్రములను అస్త్రములను అలంకారములను తానే ధరించవలేను కొని షేమము గోరువాడెవడును వానిని ఔదార్యముతో ఇతరులకీయరాదు; తెగ తినరాదు; అతినిద్ర పోగూడదు; ప్రవేశించ వచ్చునని నిర్దేశించని (నిషిద్దమయిన) వాకిటియందు ఎన్నడును ప్రవేశించరాదు; రాజు దర్శించరాని చోటు లందుండగా దర్శించరాదు; రాజునకు కుడి ఎడమలందే కాని ముందు వెనుక లందు కూర్చుండరాదు; రాజ సమీపమున ఆవులించుట ఉమియుట దగ్గుట (ఇతరుల పైనైనను) కోపించుట వీరాసనమున కూర్చుండుట కనుబొమలు ముడి వేయుట కక్కుట కేక రించుట చేయరాదు; తన గుణములను తానే చెప్పుకొనుట తగదు; ఒక వేళ రాజునకుఆవి తెలుపవలసియున్నచో ఇతరులచే తెలిపించవలయును; రాజాను జీవులు నిర్మల హృదయులు రాజునందు పరమభక్తులు సోమరితనము లేని వారు నయి కొంటె తనము ఆయా విషయములందాస కి చాడీలు చెప్పుట నొ సికత్వము క్షుద్రత్వము చాపల్యము విడువవలెను; వేద విద్యలయందు నుశీలమునందు మనస్సు దృఢముగా నిలుపవలయును; ఇట్లుండి రాజ సేవ చేయుట చే శ్రేయస్సు కలుగును; రాజునకు పుత్రులు మంత్రులు ప్రియులునగు వారిని నమస్కరించుచుండవలెను; రాజ సచివులయందు నమ్మిక తో నుండ రాదు; రాజడుగనిదే మాటలాడరాదు; ఒక వేళ మాటలాడినను రాజహితులగు వారితో మాట కలిపి రాజునకు హితమును క్షేమకర మును సత్యమునునగు మాటనే చెప్పవలయును; సదా రాజ చిత్తమునెరిగి వర్తించవలెను; ఇట్లుండి రాజునారా ధించ ( మెప్పించ) వలెను.
విరక్త-రక్త-లక్షణమ్ - విరక్త-రక్త-లక్షణము
రాజుకూడ తన క్షేమమును కోరుకొనినచో తన భృత్యులలో తన యందు రక్తుడెవడో విరక్తుడెవడో గురుతించి విరక్తుని వీడువవలెను; రక్తుని చేతనే సేవావర్తనము చేయించవలెను; విరక్తుడగు భృత్యుడు తన ప్రభువునకు నాశ మును శత్రుపక్షమునకు అభ్యుదయమును కలిగించును; ఆశను పెంచును; ఫలసాశము కలిగించును.
విరక్తుడగు భృత్యుని గురుతించుట ఎట్లన-
విరక్తుడగు భృత్యుడు మదముతో నిండిన మాటలు పలుకును; తుదకు తన జీవనమున కే ముప్పుతెచ్చుకొనును; వాక్యములు ఆరంభించునప్పుడు సంతోషముతోనే ఉండి ఆరంభించును; కాని అదే విధముగా తుదవరకు మాటలాడడు; రాజునారాధించ (మెప్పించ వలసిన సర్వవిషయములందును నిదుర పోవుచున్నట్లు వర్తించును; మాటలందు తప్పులు వేదకి ఎత్తి చూపుచుండును; మాటకు నడుమనే త్రుంచివేయును; తన ప్రభుని గుణములను కీర్తించునప్పుడు కూడ విము. ఖుడుగా కనబడుచుండును; తాను పనులు చేయుచుండియు తన చూపును మరియొకచోట నుంచును; విరక్తుని లక్షణములు ఇట్లుండును; ఇక-రక్తుడగు భృత్యుని లక్షణములు: తన ప్రభుని చూచినంతనే ప్రసన్ను డగును; చెప్పిన వాక్యమును ఆదరముతో స్వీకరించును; కుశలప్రశ్నా దీకము చేయునపుడు హర ములో విన ఇంపుగా మాటలాడును; ఏకాంతమునందు రహస్య వివక్ష స్థలములందు తన ప్రభువు తనకు కనబడినను జంకు గోనడు; తనప్రభుని గూర్చిన మాటలితరుల నోట వినునపుడతని మొగమున హర్షము కనబడును; తనప్రభువు తన్నే వైన ఆప్రియ వచనము లాడినను అవి మెచ్చునే కాని కోపింపడు; తన ప్రభువిచ్చిన ఆదరముగాని పారితోషికముగాని అల్పమైనను గొప్పదియను గౌరవముతో గ్రహించును; మాటల నడుమ తన ప్రభుని గూర్చిన మాట తటస్థించినచో హరము మొగమున పొడచూపును; ఇట్టివానిని రక్తుడగు సేవకునిగా గురుతించి వానిచేత సేవ చేయించుకొనవలెను; ఆపదలయందున్న భృత్యుని కాని మిత్రునికాని ఎవరు. విడువక ఆదుకొందురో అట్టి ప్రభువును తన ప్రభువును రాజును త్రిగుణా కేతుడు అప్రమేయుడు ఆగు భగవంతునిగా ఎవరు భావించి వానినాశ్రయింతురో అట్టి భృత్యులును ప్రజలును అమర బృందాశ్రితమగు దేవేంద్రస్థానమగు స్వర్గమును చేరి సుఖింతురు.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజధర్మమునందు రాజానుజీవి వర్తనమను రెండు వందల పదునైదవ అధ్యాయము.
Summary of chapter 216 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the critical functions, training, and operational protocols for diplomatic ambassadors known as Dūtas and secret intelligence agents known as Chāras. Bhagavān Matsya explains that a successful ambassador must possess sharp intellect, eloquence, knowledge of psychology, and absolute loyalty to represent the state effectively in foreign courts. The text outlines the deployment of a multi-layered espionage network disguised as ascetics, merchants, scholars, and travelers to monitor internal stability, prevent foreign subversion, and gather accurate intelligence across all borders.