మత్స్య మహా పురాణము
181 - స్కంద సనకాది సంవాదము-అవి ముక్త మాహాత్మ్యము॥
సూతుడు ఋషులకిట్లు చెప్పెను: తపోధనులగు సనకాది సర్వఋషులును మ హేశ్వర భక్తులగు సర్వ మహర్పు లును కైలాస పర్వతపు నెత్తమున కూర్చున్న వాడును బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడునగు స్కందుని ఇట్లడిగిరి॥ స్కందా? మహాత్ముడు సర్వభూత ములకు ఆత్మభూతుడు దేవదేవుడు సనాతనుడు ప్రభుడునగు భవుడు (శివుడు) దేవదానవులకును దుష్కరమగు ఘోర రూపమును ధరించి స్థాణు భూతుడై భూత ప్రళయమువరకును భూలోక మందెచ్చట నిరంతరము ఉండునో అట్టి గుహ్యము రహస్యము)లలో పరమ గుహ్యమగు క్షేత్రము ఆవిముక్తమని పెద్దలందురు॥ ఇచట నిత్యమును భవుడుండుటచే ఇది సదా సిద్దిప్రదము; ఈశ్వరుడు చెప్పినట్లు ఈ క్షేత్ర మాహాత్మ్యము ఇది; ఇది పరమ పవిత్ర స్థానము; ఇది తీర్థమును క్షేత్రమును; ఇచట శ్మశానమందే శివుని గృహము (శివాలయము) దివ్యమైనది॥ అంతరితమయి భూలోకముతో అంటక అంతరిక్షమునందున్నది; దీనిని యోగ సం స్కృతమగు చిత్తము కలవారు బ్రహ్మ చర్య వ్రత ములతో శాంతులయిన వేదాంత కోవిదులగు సిద్దులు చూడగలరు; ఇతరులు చూడజాలరు; దేహపాతము అగు వరకును ఈ క్షేత్రమును విడువక నివసించుట॥ లేస్సగా జహ్మచర్య వ్రతముల ననుష్ఠించుటతోను చక్కగ యజ్ఞము లాచరించుటతోను సమానము; పాప రహితులయి ఉత్తమ కర్మానుష్టానము చేసిన వారును పుణ్యమయిన యోగ సాధన చేసినవారును పొందు ఉత్తమగతి ఆ మరణాంతము ఈ క్షేత్రమున నివసించుటచే లభించును॥ ఏలయన దివ్యయోగ సాధనచే ఉత్తమ గతియును జన్మశతములచే కూడ లభించకపోవచ్చును॥ అది ఈ క్షేత్ర మాహాత్మ్యమున శంకర ప్రసాదమున సులభమగును॥ ఇచట మనోనిగ్రహము కలిగి శివునియందు చిత్తము నిలిపి నిరతము వసించువాడు మూడు వేళల భుజించినను వాయు భక్షణమున జీవించునట్లే॥ అవిముక్త క్షేత్రమున దినమునకోక నిమేష మాత్ర మయినను భక్తియుక్తుడై బ్రహ్మచర్యము కలిగి తపమాచరించుచు ఇంద్రియములను మనస్సును జయించి మానమాత్రము నీయమ పరుడై వసించువాడు మహాదివ్య పాశుపత వ్రతము ననుష్ఠించునట్లే; అట్టివాడు జన్మ మృత్యుభయము నతిక్రమించి పరమ గతినందును॥ పుణ్య లభ్యమగు నిః శ్రేయస (పార లౌకిక) గతిని యోగసిద్ది లభ్యమగు పరమగతిని అందును॥
దివ్యయోగగతి నూరు జన్మాంతరములకును॥ లభించకపోవచ్చును; కాని అవిము క్షమున మాత్రము ఈ క్షేత్ర మాహాత్మ్యమున శంకర ప్రసాదమున అది లభించును; బ్రహ్మ హత్య చేసినవాడును ఒక మారైన ఈ క్షేత్రమున కేగినచో తన్మాహాత్మ్యమున అది నివర్తిల్లును; దేహపాతమగువరకు అతడిచట వసించుటచే ఆ బ్రహ్మహత్యా దోష మేకాక పూర్వ కృత దోషములును నశించును; వాడు విశ్వేశ్వరుని సన్నిధీనందును; మరల జన్మించడు; ఆనన్య మనస్కుడై ఇట విడు వక వసించువాని విషయమున దేవుడు సంతుష్టుడయి సర్వకామముల నొసగును; సాంఖ్యయోగ తత్వములకు ద్వార భూతుడగు ప్రభువు ఆగు భవుడు మహాదేవుడు సగుణరూపుడై భక్తులయందలి దయతో ఆట వసించుచున్నాడు; అవి ముక్తము పరమ క్షేత్రము; అచట ఉండుటచే పరమసిద్ధి పరమపదము పరమగతి దొరకును; పునర్జన్మము కలుగరాదను కొను ధీమంతుడగు వాడు దేవర్షిగణసేవితమగు అవిముక్తమును సేవించవలయును; మేరు పర్వతమునకు ద్వీపములకు సముద్రములకు గల గుణములనే న చెప్పగలము కానీ ఈ అవిముక్త క్షేత్ర గుణముల చెప్పజాలము; ఆంత కాలమున మాన వుల (ప్రాణుల) మర్మస్థానములు భిన్న మగుచుండగా ప్రాణ వాయువులు శిథిలమగుచుండగా స్మృతియే లేకుండ పోవును; ఆప్పుడును ఈశ్వరుడు ఆయా కర్మలచే పేరితులై బాధలనందు తన భక్తులకు తాను స్వయముగా కర్ణములందు మంత్రోవ దేశమునిచ్చును॥ అవిముక్తమున దేహత్యాగ మొనర్చువాడు ఉత్తమ సంస్కారమందిన ఆత్మలు లేనివారికి పొందరాని ఇష్టపరమ గతిని ఈశ్వర పేరణచే పొందును॥ ఈ మానుష్యలోకము ఆశ్వతమును బహుపాపయుక్తమును; ఇది ఎరిగి సంసారభయ మోచనమగు ఆవిము క్తమును సేవించవలయును; ఇది భోగ మోక్షప్రదము॥పుణ్యము॥ బహు విఘ్న వినాశనము; వీఘ్న సహితుడయినను అవిముక్తమును విడువక ఆట వసించువాడు అశాశ్వతమగు ఈ జన్మమును జరా మృత్యువులను వీడి శివప్రసాదమున శివ సాయుజ్యమందును॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున స్కంద సనకాది మహర్షి సంవాదరూపమగు అవిముక్త క్షేత్ర మాహాత్మ్యమను నూట ఎనుబది ఒకటవ అధ్యాయము॥
Summary of chapter 182 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the precise geographical extent, sacred boundaries, and spiritual geometry of Vārāṇasī-kshetra. Anchored between the holy rivers Varaṇā and Asī, the sanctified area extends two Yojanas in radius, centered upon the sacred Vishveshvara Linga. Bhagavān Matsya describes how every step taken within this holy perimeter yields spiritual merit equivalent to performing major Ashvamedha sacrifices.