మత్స్య మహా పురాణము
109 - ప్రయాగ మాహాత్మ్యము
యుధిష్ఠిరుడు మార్కండేయుని ఇట్లడిగెను: మహామునీ: ప్రయాగ తీర్థప్రభావము స్వర్గప్రద మెట్లగును? అది నా పూర్వులను ఎట్లు తరింపజేయగలదు? తెలుపుమన మార్కండేయుడిట్లు చెప్పెను: ఈ లోకములన్నియును దాని యందలి స్టీరచర ప్రాణులును పదార్థములును బ్రహ్మ విష్ణు శివులును దేవతలును అన్ని యు అవ్యయుడగు ప్రభువగు ఆ పరమాత్మయే. అందునను బ్రహ్మ సృజింపగా విష్ణువా లోకములను వర్ధిల్లజేయును. కల్పాంతమందడియంతయు రుద్రుడు సంహరించును (మూల తత్వమునందు లయమంద జేయును.). ఐనను ఇది (ఈ ప్రయాగ) ఎన్నడును నశించునది కాదు. కాపున ఇచట నివసించువారు పరమపదము నందుదురు. అన యుధిష్ఠిరుడిట్లడిగేను: ప్రయాగ ఏల ఎన్నడును నశించదు? ఈ లోక సతములగు త్రిమూర్తులచట సదా ఏల నివసింతురు? తెలుప వేడెదను. ఆన మార్కండేయు డిట్లనెను: పంచయోజన విస్తీర్ణమగు ప్రయాగ మండలమునందు తీర్థ సేవకుల పాపమోచనము చేయుట కే వారు మువ్వురును మారు రూపములో ఉందురు. వారచట వట రూపముగ నున్నారు. ప్రళయుము వరకును ఉందురు కూడను. వారి మారు రూపములగునవి ఇంకను అచట అనేకములు గలవు. కావున అనఘా! (నామాట విశ్వసించి ప్రయాగ తీర్థ సేవచేసి) నీ సహోదరులతో కూడి రాజ్యపాలనము చేయుచుండుము.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 110 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya concludes the exposition of Prayāga-māhātmya by summarizing its supreme spiritual benefits. Bhagavān Matsya asserts that among all places of penance, holy forests, and river banks across the earth, Prayāga stands supreme as the ultimate refuge for seekers of liberation. Whosoever hears, recites, or studies this sacred description of Prayāga with unyielding devotion is freed from all sins of mind, speech, and action, achieves complete earthly prosperity, and attains eternal absorption into the supreme spiritual abode of Bhagavān Vishṇu.