మత్స్య మహా పురాణము
35 - యయాతే ర్వనగమనమ్ - యయాతి వానప్ర్వ్రస్థవతానుష్ఠానము- అతనిస్వర్గప్రాప్తియు
శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు యయాతి తనకు ప్రీతిపాత్రుడగు పుత్తుని పూరుని రాజపదమునం దభి షేకించి ముదితుడై వానప్రస్థుడె మునిగా నయ్యెను. అతడు వనవాసమును జరిపి అచటి బ్రాహ్మణులతో పాటుగా ఫలమూలము లాహారముగా ఇంద్రియముల నిగ్రహించి తుదకు స్వర్గమున కేగెను. అతడచట సుఖవాసమును పొంది ముదితుడై సుఖముగా నుండెను. కొంతకాలము నకు ఇంద్రు డతనిని క్రిందికి పడద్రో నేను. అతడు స్వర్గమునుండి జారిపడెను. కాని భూమికీ చేరలేదు. అప్పటిలో కొంతకాలమంత రీక్షమందే యుండి యజ్ఞ సంపత్ నందు ఉండిన వసు మాన్ అష్టకుడు ప్రతర్దనుడు శిబి అను రాజులతో కూడి అటనుండియే మరల స్వర్గమున కేగెను. అని నేను పరంపర లో వినియున్నాను.
శతానీకుడు శౌనకు నిట్లడిగేను: భగవన్! “యయాతి పృథివీ పాలకుడుగా శ్రేష్టుడు. వంశమునకు వృద్ధిని (శుభమును సంతోషమును అభివృద్ధిని కలిగించినవాడు. సూర్యుని ప్రకాశముతో అగ్ని ప్రకాశముతో సమమగు ప్రకాశము కలవాడు, వంశమును విస్తరింపజేసినవాడు. పో స్తవమును నిర్మలమున నగు కీ ర్తీగలపోడు. మహామనస్కుడు, స్వర్గమునందును దేవర్షి గణముల ప్రశంసలందుకొనుచు వారి సన్నిధియందు దేవరాజసముడై వెలుగొందెను." అందురు. గదా! అట్టి వాని నింద్రు డెట్లు ఏల స్వర్గమునుండి పడద్రో సెను? యయాతిచరితమునందలి ఈ యంశ ములన్నియు అతని ఐహిక పార లౌకిక వృత్తాంతమునందలి తత్వము నంతయు వినగోరుచున్నాను.
శౌనకుడు శతానీకున కిట్లు చెప్పెను: నాయనా! యయాతి కథ ఉత్తమ మయినది. సర్వపాపములను పోగొట్టి పుణ్యమును కలిగించునది. అతని ఐహ లౌకిక పారలౌకిక వృత్తాంతమును తాత్వికముగా వివరింతును. వినుము.
నహుష పుత్రుడగు యయాతి తన కడపటి కుమారుడగు పూరుని రాజ్యమునం దభి షేకించి ముదితుడై వనమునకు ప్రత్రాజితుడయ్యె నంటిని గదా! అంతకుముందే అతడు యదువు మొదలగు కుమారులను రాజ్యపు మేరల యందును అంతకు వెలుపలను నీలి పెను. వనమునందు ఈరాజు వానప్రస్థుడుగా ఫలమూలములు అహారముగా ఇంద్రియ నిగ్రహము క లిగి అరణ్యమునందు చాల కాలముండెను. చిత్తమును తీక్ష మొనర్చుకొని క్రోధమును జయించి పితృదేవతల తృప్తి నొందించుచు అగ్నియందు వానప్రస్థ విధానమున హోమాదికము జరుపుచుండెను. ఆ ప్రభువు వనములందు లభించు ఆహారాదిక మును దేవతలకు నివేదించిన తరువాత ఆ హవిష్యమునే అతిధులకు ఆహారముగా నిచ్చి వారి నాదరించుచుండెను. శిలవృత్తి పొలములు మొదలగుచోట్ల రాలిన ధాన్యకణముల నేరితెచ్చుట) ఉంఛవృత్తి (సేద్యపు పొలములలో రాలిన ధాన్యపు కంకులను ఏరి తెచ్చుట) అవలంబించి దేవతలకు అతిథులకు పితరులకు వినియోగించగా శేషించిన ఆహారమునే తినుచుండెను. ఇట్లారోజు వేయి నిండు సంవత్సరములు జీవితము గడ పెను. తరువాత మూడు మాసములు జలాహారుడై మనస్సును వాక్కును నియమించుకొనియుండెను. తరువాత సోమరితనము లేక సంవత్సరము పాటు వాయుభకు డయ్యెను. తరువాత సంవత్సరకాలము పంచాగ్ని మధ్యమున తప స్సాచరించేను. వాయు వాహారముగా ఆరుమాసములు ఏక పాదస్థితుడై తపస్సు చేసెను, పుణ్య కీ ర్తియగు ఆ యయాతి తన ప్రకాశ ముతో రోదసులను (ద్యుభూలోకముల నడుమ ప్రదేశమును) నింపివేయుచు స్వర్గము చేరెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున యయాతి వానప్రస్థ జీవితము -అతని స్వర్గప్రాప్తియను ముప్పదియైదవ యధ్యాయము.
Summary of chapter 35 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes King Yayāti's departure from his capital after renouncing all royal opulence, kingdoms, and sensory attachments. Accompanied by his wives Devayānī and Śarmishṭhā, the elderly monarch retired to the holy hermitage of Bhṛgu-tīrtha to observe the austere vows of Vānaprastha. He engaged in severe asceticism, eating only wild roots and fallen leaves, controlling his senses through intense breath control, and meditating continuously upon Bhagavān Vishṇu. Through decades of unshakeable tapasya and unwavering devotion, King Yayāti purified his subtle body, conquered all material desires, and ultimately cast off his mortal frame, ascending directly to the elevated celestial realms of Svarga.