236 - మృగపక్షి వైకృత శాంతి.

గరుడత్రితో ఇట్లు చెప్పెను: ఆరణ్య మృగ పక్షులు గ్రామములందును గ్రామ్యమృగపక్షులరణ్యములందును ప్రవేశించుటయు స్థలచర ప్రాణులు జలములందును జలచర ప్రాణులు స్థలమునందును ప్రవేశించుటయు అవి నిర్భయము లయి ఘోరధ్వనులు చేయుటయు అశుభకరములగు గుంటనక్క రాజద్వారమందును పురద్వారమందును చేరి కూయుటయు రాత్రించర ప్రాణులు పగళ్ళయందును దివాచర ప్రాణులు రాత్రులందును సంచరించుటయు గ్రామ్య ప్రాణులు గ్రామములను విడుచుటయు జరిగినచో ఆ గ్రామము (నగరము) శూన్యమగునని తెలియవలయును; సంధ్యాకాలములందు గుంట నక్కలు చెల రేగి క్రూరముగా కూయుటయు మండ లాకొర మున తిరుగుచుండుటయు వికృత స్వరముతో కూయుటయు జరిగినను ఇదే ఫలమగును; ప్రదోషమందు కోడియు హేమ నమందు కోకిలయు కూసినను సూర్యోదయాభిముఖముగా గుంట నక్క కూసినను భయము కలిగించును; ఇంటియందు పావురము దూరినను మాంసాహారి పడి ఇంటిపై వాలినను (మండ లాకృతిగా తిరిగినను) ఇంటియందు తేనెటీగలు తేనెపట్టు పెట్టినను గృహస్వామి మరణించును; ప్రాకారములందును ద్వారములందును గృహములందును పుర ప్రధాన ద్వారములందును అంగడి వీథులందును ధ్వజములు (జెండాలు) ఛత్త ములు ఆయుధములు మొదలగు వానియందును (మీదను) మాంసాహారి పక్షి వాలినను పుట్టి పెరిగినను తేనె స్రవించినను ఆదేశము నశించును; రాజు మృతుడగును; మూషికములు మిడుతలు అధికమయి కనబడినచో మద్బయమగును; కుక్కలు క టెలనో కోరవుల ఎముకలనో కొమ్ములనో నోట కరచుకొని తిరుగుచో మృత్యువును సూచించును; కాకులు ధాన్య మును ముక్కున కరచుకొని కనబడినచో దుర్భిక్షము కలుగును; అవి భయములేక జనులను క్రమ్మి భయ పెట్టు చున్న చో యుద్దము కలుగును; కాక మైథునముకాని తెల్లని కాకి కాని కనబడినచో రాజ మరణమును దేశ నాశమును జరుగును; రాజ ద్వారమందును గృహమందును గుడ గూట నివాసమారంభించినచో గృహస్వామికి మృత్యువు కాని ధననాశము కానీ కలుగును. ఇట్టి మృగపక్షి వైకృతములు సంభవించుచో దక్షిణా యు కముగా హోమము జరిపించవలెను; ఐదుమంది బ్రాహ్మణులచే 'దేవాః కపోతా.' ఇత్యాది మంత్రములు జపింపజేయవలయును; విప్రులకు యథావిధిగ బంగారు వస్త్ర ద్వయము గోవును దానము చేయవలెను; ఇట్లు ఈ దోషము శాంతించును.  

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున మృగపక్షి వైకృత శాంతి ప్రతిపాదనమను రెండు వందల ముప్పది ఆరవ అధ్యాయము.