28 - శుక్ర దేవయానీ సంవాదము

శుక్రుడు ఇట్లనెను : “దేవయానీ ! ఎవడు ఇతరులు పలికిన అతివాదములను (అనరాని మాటలను) ఓ కొనునో అత డే' ఈ సమస్త విశ్వమును జయించిన వాడనీ ఎరుగుము. ఎవడు పైకి ఎగిరి పడుచున్న క్రోధమును గుర మును వలె నీ గ్రహించి పట్టుకోనునో అతనిని సత్పురుషులు -యంత నియమించుకోనుపొడుసారథి' అని వ్యవహరింతురు. గుర్రము- పగ్గములయందు చిక్కుకొనియుండును. (పగ్గములు లాగినచో గుర్ర ము నిలిచిపోవును. చిత్త్రమును నిగ్రహించినచో క్రోధము నిలిచిపోవును.) పైకి ఎగిరి పడుతున్న క్రోధమును ధర్మము నిగ్రహించి వాడే ఈ విశ్వమంతయు జయించినవాడు. పైకి లేచుచున్న కోపమును కుబుసమును పాము దూరముగా తోసివేసినట్లు ఏడు ! వేయునో వాడే పురుషుడు. ఎవడు ధర్మమును అనుషించునో ఎవడు మిగుల ఓర్పుతో ఉండునో ఎవడు ఇతరులు తపింపజేసినను తపి చడో అతడే ప్రయోజనము (శుభము ను పొందును. నెలకు ఒకటి చొప్పున నూరేండ్లు అశ్వమేధములు చేసిన వాని కం టెను నూరేండ్లు నిరంతరము. అన్న దానము చేసిన వానికంటెను క్రోధమును అణచుకొన్న వాడే మేలు. విరోధము. ఓర్పు- అనువాని బలాబలములు తెలియనందున అవివేకముచే కుమారులును కుమారికలును పసివారు) పరస్పరము కలహింతురు. కాని ప్రొజులు అట్టిది చేయరు."

"దేవయాని ఇట్లు పలికెను : “తండ్రీ ! నా వయస్సు చిన్న దే నను నాకు కార్యగతి (ఏ పని చేయవలెనో) తెలియును. క్రోధము అతివాదము అను వాని బలా బలములును నాకు తెలియును. తన శుభము కోరినవాడు ఎవ్వడును తన శిష్యుడు శిష్యుడుగా నడుచుకొనక పోవుటను సహించరాదు. సద్వర్తనము లేక ధర్మాధర్మముల సంకీర్ణపరచి నడుచు కొనువారి యొద్ద జీవించుట నాకిష్టముగాదు. సద్వర్తనము కలిగిన వారిని మంచి వంశమున పుట్టిన వారిని ఎవరు తగినట్లు గౌరవించరో . అటువంటి పాపబుద్దులయొద్ద తస మేలు కోరిన ప్రాజ్ఞుడు నివసించరాదు. . ఎవరు తాము సద్వర్తనమును సద్వంశమును కలిగి అవి కలిగినవారిని గుర్తించి ఆదరింతురో అట్టి సాధుజనుల యొద్ద నివసించుట తగినపని. ఆదియే శేషమగు నివాసము. ఇది ఇట్లుండగా వృషపర్వుని కూతురు పలికిన మహా ఘోరములగు దుర్వచనములు అగ్ని ని సంపా దీంనగోరిన వారు అరణిని మథించినట్లు నా హృదయమును మథించుచున్నవి. తన గొప్పతనము తరిగిపోవుచుండ ప్రజ్వ లించుచున్న శత్రుల గొప్పతనమును ఆశ్రయించి ఇతడు జీవించుచున్నాడు అనిపించుకొనుట కంటే దుష్టవచనము ( అపకే రి కరమగు విషయము) లోకములో మరేదియు లేదని నా అభిప్రాయము.”

ఇది శ్రీమత్స్య మహాపురాణమున చంద్ర వంశానువర్ణనమున యయాతి చరిత్రమున శుక్ర దేవయానీ సంవాదము అను ఇరువది ఎనిమిదవ అధ్యాయము.