మత్స్య మహా పురాణము
31 - శర్మిష్ఠా యయాతి సంవాదము
శౌనకుడు శతానీకునితో ఇంక ను ఇట్లు చెప్పెను: యయాతి తన రాజధాని చేరెను. అది మ హేంద్రుని అమరా వతితో సమానమయినది. అతడు అంతఃపురమున ప్రవేశించి అందు దేవయానికి నివాసము ఏర్పరచెను. ఆమే అను మతితో అతడు వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ణకు అశోకోద్యానపు సమీపమున గృహమును నిర్మింపజేసి దానియం దామెను ఏ సింపజేసెను. ఆమెకు పరివార ముగా ఆమె నాశ్రయించియుండు దాసీ సహస్రము కూడ అచ్చటనే ఆ అశోకో ద్యానమునందే ఆమెతో పాటు వసించుచుం1 రాజు వారికి వస్త్రములు అన్న పానములు వేరువేరుగ ఏర్పాటు చేయించి కని పెట్టి యుండెను. నహుషాత్మజుడగు' ఆ యయాతి రాజు దేవయానితో కూడి చాల ఏండ్లు దేవునివలె విహరించుచు మిగుల సంతోషించుచుండెను.
ఋతుకాలము రాగా ఉత్తమాంగనయగు దేవయాని మొదటిసారిగా గర్భవతి యయ్యెను. కుమారుని కనెను. కమలనయనయగు వృషపర్వుని కూతురు శర్మిష్ఠయు వేయి సంవత్సరముల తరువాత మౌవనవతియే ఋతుదర్శనమును పొందెను. లోకధర్మమును ఎరిగిన ఆశర్మిష “నాకు ఋతుకాలము సంప్రాప్తమయినది. కాని నేను ఎవరిని పతిగా వరించి పొందియుండ లేదుకదా! ఇపుడు ఏది తగినది? ఏమి చేయవచ్చును? ఎట్లు చేసిన ఈ ఋతువు సఫలమగును?” ఆ.. ఆలో చించి ఆమె తన మనసున యయాతినే తనకు ప్రాప్తించిన యావనమునకు తగిన ప్రతినిగా వరించుకొనెను. “ఆమె దేవయాన్ని తానై యయాతిని తన భర్తనుగా వరించిన ప్లే నేనును ఆతనినే నాభర్తనుగా వరింతును. రాజే నాకును పు తం ఫలమును ఈయదగినవాడు. అని నామదికి నిశ్చయముగా దోచుచున్నది. ఆరాజు ధర్మము నెరిగినవాడు. అతడు ఈ సమయమున ఏకాంతమున నాకు కనబడిన ఎంత బాగుగానుండును!' అని ఆమె తలచేను.
ఇంతలో ఆదే సమయమున రాజు కూడ డై వికముగా బయటికి వచ్చి అశోకోద్యాన సమీపమున శర్మిష్ట యున్న చోటికి దగ్గరలో వచ్చియుండెను. సహజముగనే చూచువారికి ఇంపుగోలి పెడి చిరునవ్వు మోము గల శర్మిష రాజట్లు ఏకాంతమందుండుట గమనించెను. అతడు ఉన్న వైపునకు పోయెను.
ఆతనిని సమీపించెను. దోసిలి చేసి ఇట్లు పలికెను. “నహుష పుత్తా: సోముడు -ఇంద్రుడు విష్ణువు-యముడు వరుణుడు-నీవు. ఈ వీరి ఇండ్లయందలి స్త్రీని పరపురుషుడు ఎవ్వడు చూడనైన చూడగలడు? నేను గొప్ప వంశ మున పుట్టినదాననని సౌందర్యవతినని నీకు మొదటి నుండియు తెలియును. ఇట్టి నేను కామా రనై నిన్ను అభియాచించుచున్నాను. రాజా! నాకు ఋతుఫలము ఇమ్ము.” యయాతి: “నీవు శీలసంపన్నవు. ఉ తమ దైత్య వంశమున పుట్టితివి. నీలో దోష మేమియు లేదు నీ రూపమునందును సూది మొనయంత కూడ దోషము లేదు. ఇది యంతయు నాకు తెలియును. కాని నేనానాడు దేవయానిని వివాహమాడినప్పుడు శుక్రుడు 'నీవు ఈ శర్మిషను శయనముమీదకు పిలువరాదు.' అని నాతో చెప్పెను.” శర్మిష్ఠ: “పరిహాసమున-శ్రీ విషయమున పెండిండ్లు ప్రాణహాని సర్వధన నాశము - ఈ సందర్భములందు ఆడేడి అసత్యము పాతకము కాదందురు. సాక్ష్యము చెప్పుమనినప్పుడు అన్యధాగా చెప్పినవారు అసత్యము చెప్పిన పాపము పొందుదురు. ఏకార్ణత (ఆ కార్యము వలన కలుగవలసిన ప్రధాన ప్రయోజనము) దెబ్బ తినినపుడు మాత్రమే అసత్యము అసత్యమే అది చెప్పిన వానిని హింసించును.” యయాతి: “అన్ని ప్రాణులకును రాజు ప్రమాణము. (అతడు నడచినట్లు అందరును నడతురు.) అట్టివాడు అసత్యము పలికినచో తానే నశించును. కావున ఎట్టి ప్రయోజనము కాని ధనముకాని నశించు పరిస్థితి వచ్చి నను నేను అసత్యమాడ జాలను.” శర్మిష్ణ: “రాజా! తన పతియు తన సఖిపతియు స్త్రీకి సములే. ఈ ఇద్దరిలో ఏఒకరు ఒకనిని పతిగా చేసికొనినను రెండవ వారును అతనినే పతిగా చేసికొనినట్లే. అని పెద్దలు చెప్పు చున్నారు. నీవు నా సఖికి పతివి కదా!" యయాతి: “అడిగినవారికి అడిగినది ఈయవలయును. అని నావ్రతము. నీవు కామ ఫలమును కోరుచున్నొవు. నేను నీ కేమి ఉపకారము చేయవలెను?” శర్మిష: “రాజా! నన్ను ఆధర్మము అంటకుండ కాపాడుము. ధర్మ ఫలము నాకు ఇమ్ము. నీవలన సంతానవతినై నేను లోకమున ఉత్తమ ధర్మము నాచరించగలుగ వలయును. రాజా! భార్య-దాసుడు. సుతుడు. ఈ ముగ్గురును తమకు తమ ధనము మీదగాని తమమీదగాని స్వత్వమును స్వాతంత్ర్యమును లేనివారు. వీరు ఎవరిని ఆశ్రయించినచో అనగా వీరు ఎవరి ధనమైనచో-వీరును వీరి ధనమును-ఆ భార్య దాసుడు-సుతుడు - అను ముగ్గుర స్వామికి చెందియుండును. ఇక్కడనో.దేవయాని నీ భార్యకదా! ఆమెకు తన పై స్వత్వము లేదు. ఆమె నీ యధీనమునందలిది. నేనామెకు దాసిని. కనుక నేనును నీ స్వాధీనమునందుండి నీవనుభవింప దగినదాననే. ఈ హేతువులచే నన్ను నీవన్ని విధముల భరించవలసిన వాడవే. నేను భరింపబడవలసిన దానను. భరింపబడునది భార్య. కావున నేనును నీకు భార్యనే.) కనుక నన్ను పొందుము."
యయాతి రాజు శర్మిష్ణ చెప్పినది నిజమే యనెను. ఆ మేధర్మజ్ఞతను అతడు మెచ్చుకొనెను. ఆమెకు ధర్మమును దానముగా ఇచ్చుటకు అంగీకరించెను. అతడామెతో సంగమించెను. తమతమ కోరికలను ఇరువురును తీర్చుకొనిరి. ఒకరినొకరు మెచ్చుకొనిరి. ఎవరి తోవను వారు పోయిరి. ఈ సమాగమముతో వృషపర్వ పుత్రీ శర్మిష్ణ ఆ రాజ శేష్ఠుని వలన ప్రథమముగా గర్భవతియయ్యెను. యథాకాలమున ఆ పద్మలోచనకు కుమారుడు కలిగెను. వాడు దేవకుమారుడు వలెనుండెను. అతని వర్చస్సు ఆదిత్యుని వర్చస్సువలె నుండెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్లనమున శర్మిష్ణా యయాతి
సంవాద (సమాగమ) మను ముప్పదియొకటవ యధ్యాయము.
Summary of chapter 31 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes how Princess Śarmishṭhā, residing in an isolated palace cottage assigned to her by Devayānī, approached King Yayāti in secret when her fertile period arrived. She pleaded with him that a woman's desire for motherhood must not be thwarted by unrighteous conditions, arguing that since she was Devayānī's servant, her person also belonged to Devayānī's husband. Yielding to her earnest entreaties and spiritual reasoning, King Yayāti united with Śarmishṭhā in secret, and from their union were born three courageous sons named Druhyu, Anu, and Puru. For years the secret remained hidden, until Devayānī noticed three radiant boys playing in the gardens whose striking physical resemblance to King Yayāti revealed the truth.