మత్స్య మహా పురాణము
143 - ద్వాపర_కలి_యుగధర్మములు - అందు ద్వాపర యుగధర్మము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. ఇక మీదట ద్వాపర యుగధర్మ స్వరూపమును తెలి పెదను. త్రేతా యుగము ముగిసిన మీదట ద్వాపరయుగ మారంభమగును. త్రేతాయుగమున ప్రజలకు ఏఏ విధములగు లౌకిక ప్రవృత్తు లును వాటి ఫలములును ఉండెనో అవియే ద్వాపర యుగాదియం దుండును. ఆ యుగము మారిపోగానే క్రమముగా తత్పూర్వయుగ కార్యఫలసిద్దులు నశించును. తరువాత ద్వాపర యుగమున ప్రజలలో లోభము భృతి వేతనముతో పని చేయుట) వాణిజ్యము యుద్ధము తత్వ నిశ్చయము చేయలేక పోవుట వర్ణవ్యవస్థ ధ్వంసమగుట కర్మ విపర్యయము (విహిత కర్మములు చేయకపోవుట నిషిద్ధ కర్మములను ఆచరించుట) బాటసారులను చంపుట తీవ్రమగు దండనము
దురభిమానము దర్పము ఓర్పు లేకుండుట బలమునకు ప్రాముఖ్యము. అధిక మగును. ద్వాపరయుగ మారంభము కాగానే రజస్తమోగుణ ప్రవృత్తు లధిక మగును. మొట్ట మొదటిదగు కృతయుగమున ఆధర్మము ఏ మాత్రమును లేకుం డెను. త్రేతాయుగమునందు అది ప్రవర్తింపజేయబడెను. ద్వాపర మున వ్యాకులత నొందును. కలియుగమున ధర్మము పూర్తిగా నశించును. ఈ ద్వాపరయుగమున వర్ణ ధర్మములును బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములుసు సంకీర్ణములు (ఒక దాని ధర్మమునందు మరియొకటి కలిసినవి.విహితమును చేయుటతోపాటు అవిహితమును కూడ చేయుట ఆవిహితమును విహితమని వాదించుట ఆచరించుట మొదలగు పాండిత్య దుర్విలసితములును ) అగును. శ్రుతి స్మృతుల అర్థ నిర్ణ యము విషయమున ద్వైధము (భిన్నాభిప్రాయ చిత్తవృత్తి ఏర్పడును. శ్రుతి స్మృతులును తామై రెండు అభిప్రాయముల నిచ్చుచుండును. దాని మూలమున ధర్మతత్వము ఇది యని తెలియక పోవును. దానివలన ప్రజలలో అభిప్రాయ భేదములు పెరుగును. దృష్టి భేదముచే ఐకమత్యము లోపించును. దానిచే లోకము ఆకులత సందును. త్రేతాయుగమున నాలుగు పాదములతో ఒకటిగానే యున్న వేదము మరల మరల సమకూర్చబడుటచేతను ఆయువు తక్కువ యగుట చేతను ద్వాపరయుగమున ఆది ఋషి పుత్రులచే నాలుగుగా విభజింపబడును. ఐనను ఆపుడు కూడ దృష్టి విభ్రాంతి చేత వేద ములు ఏవి ఏవి అను విషయమునను అర్థముల విషయమునను భేదము ఏర్పడును. ఆనాటి మహర్షులు వేదములను బ్రాహ్మణ (వేద ములకు ఆర్ష వ్యాఖ్యానములు బ్రాహ్మణములు) విన్యాసము (అమరిక) స్వరక్రమ విపర్యయములతోను ఋగ్యజుః సామ సంహితలుగా వ్య స్తములు(విభ క్షములు)గా చేయబడును. వాటిలో ఆయా శాఖలయందు కొంత సమానత యున్న ను వాటిలో కొంత వైకృతము(ఆకృతి భేదము కలిగి అచ్చటచ్చట దృష్టి భేదమును కలుగును. బ్రాహ్మణములు కల్ప సూత్రములు వాటి పై భాష్యములనేడు విద్యాస్థాన భేదములు వానిలో ప్రస్థానభేదములు (మార్గ-సంప్రదాయ విచారణా పద్దతి భేదములు) ఏర్పడును. కొంద రోక విషయమున ఒక ప్రస్థానము ననుసరించుచుండ మరికొందరు వారితో ప్రత్యవ స్థితులు ఎదురు వాదము చేయువారు) అగుదురు. ఇట్లు ద్వాపరయుగమున ఋషులు స్వస్వదర్శన(దృష్టి భేదముల నను సరించి వేద తత్సంప్రదాయముల విషయమున భిన్నార్ధ ప్రకాశనము చేయుదురు.. ఆధ్వర్యవ(యజుర్వేద శాఖయు అతః పూర్వము ఒకే రూపమున నుండినది ద్వాపరమున ద్విధాభావమును (రెండుగా అగుటను) పొంది కొన్ని అర్థములు సమాసాకారముతో ఉండియు కొన్నిటికి విపరీతశాస్త్ర సంప్రదాయ విరుద్ధములగు అర్థ ములు ప్రతిపాదింపబడుటచే శాస్త్ర ములు ఆకులములగును.
ఆధ్వర్యవ (యజుర్)వేదము కూడ వేరు వేరు ప్రస్థానమార్ధ సంప్రదాయములతో బహు భేదముల నొంది వ్యాకుల మగును. వాటి అర్థములకు ఆయా ఋషులును మునులును భిన్న దర్శనులయి సాంకర్యము కలిగింతురు. ఉచితానుచితార్థ సంమిశ్ర ణము కలిగింతురు.) ద్వాపరయుగమున ఇట్లు నడచి నడచి వ్యాకులత నొందిన ఆ వేద వేదార్థ ములును కలియుగమున నాశమునందును; దీనిచే ద్వాపరమున అజ్ఞానము అకాల మరణము వ్యాధుపద్రవములు కలుగును. వాజ్మనః కాయిక ములగు దుఃఖము లనుభవించుట కలుగును. దానిచే నిర్వేదము ప్రాపంచిక జీవనము పై విసుగు) కలు గును. తత్పలముగా ప్రజలలో ఈ దుఃఖములనుండి ము కి ఎట్లను విచారణ కలుగును. విచారణచే వైరాగ్యమును దాచే సంసార దోష దర్శనమును దానిచే జ్ఞానోత్పత్తియు కలుగును.
ఈ ద్వాపరమున స్వాయంభువ మన్వంతరము నాటి మేధావులకు శత్రువులు (అలనాటి మేధావుల ఉదారాభి ప్రాయములను కాదను వారు) జన్మి తురు. ఈ ద్వాపరమున ఆయుర్వేదము జ్యోతిషము ఇతర వేదాంగములు-వీని విషయము నను శాస్త్ర విరోధులు జన్మింతురు. ఈ శాస్త్రములలో వికల్పములును సంప్రదాయ తదభిప్రాయ - భేదములును) ఏర్ప డును. అర్థ శాస్త్రమున హేతు (న్యాయ వైశేషిక) శాస్త్రమునందు కల్పసూత్రములందు భాష్యరూపమగు విద్యాస్థానములందు స్మృతి శాస్త్రములందు ప్రస్థానములందు వికల్పము లేర్పడి దాని చే ప్రజలందును మతి భేదములు ఏర్పడును. మనో వాక్కాయిక కర్మములతో ఎంతో శ్రమ పడిన మీదటగాని లోక యాత్ర జరుగక పోవును. ఇట్లు ద్వాపర యుగము సర్వభూతములకును కాయ క్లేశము కలిగించునదియని పెద్దలు తలచుచున్నారు. లాభము - భృతి-వాణిజ్యము యుద్ధము శాస్త్రత త్వ నిశ్చయము లేక పోవుట -వేద శాస్త్రములను (విభిన్న రీతుల) నిర్మించుట ధర్మ సంకరము వర్ణాశ్రమ ధర్మ పరిధ్వంసము కామము ద్వేషము రెండువేల సంవత్సరముల పర మాయువు ఇవి ద్వాపరయు లక్షణములు. ద్వాపర సంధ్యా కాలమున యుగ కాలధర్మములో చతుర్థాంశమును సంధ్యాంశ కాలమున దానిలో చతుర్థాంశ మును ధర్మము ప్రవర్తిల్లును. ఇట్లు ద్వాపరము గడచిన తరువాత వచ్చు కలియుగ స్వరూపమును తెలి పెదను; వీనుడు: కలియుగ ధర్మములు- ఈయుగమున విప్రుల ప్రవృత్తియందలి దోషములు ప్రజల క్షేమహానికి హేతువులనుట.
ద్వాపర యుగ సంధ్యా సంధ్యాంశముల ప్రవృత్తి ముగియగానే తిష్య (కలియుగము ఆరంభమగును. హింస-చౌర్యము. అనృతము. మాయ. తపస్వుల వధ _ఇవి కలియుగ ధర్మములు; ఆనాటి ప్రజలు ఈ ప్రవృత్తులను సాధింతురు. ఇది యే వారికి ధర్మము; వాస్తవమగు ధర్మమంతయు పరిహిణమగును. పూర్తిగా నశించును.)
కలియుగమున మనోవాక్కాయ కర్మములతో వా ర లోకయాత) నెర వేరునో జరుగునో లేదో కూడ చెప్పజాలము. కలియుగము ప్రాణులకు అధికముగా సురణ పదము; ఎల్లప్పుడును రోగము ఆక లివలని భయము అనావృష్టి భయము దేశోపద్రవము ఉండును. ప్రజలు దేనినిగానీ ప్రమాణముగా గ్రహించరు. ఇట్లే ఘోర కలి యుగమున గర్పస్తులుగా యౌవనస్థులుగా కౌమారమున వార్త క మున ఇట్లనేక వయో దశలలో జనులు మరణింతురు. ప్రజలకు తేజోబలములలములు; వారు పాపులు. మహాకోపులు- అధార్మికులుగా నుందురు. అనృతమాడుటయే వారి వ్రతము. వారు లోభపరులు; వారు అనుష్టించు యజనములు అధ్యయనములు ఆచారములు (ప్రమాణముగా గ్రహించు) ఆగమములు సరియైనవికావు. ముఖ్యముగా సమాజమునకు క్షేమము కలిగింప యత్నించవలసిన బ్రాహ్మణులు ఆచరించు కర్మములండలి దోషముల ప్రభావమున ప్రజలు భయముల పాలగుదురు. ఈ యుగమున ప్రజలలో హింసా (దురభిమానము ఈర్య క్రోధము మాయ అక్షమ (ఓర్పు లేకుండుట) ఆధృతి నిబ్బరము లేక పోవుట) లోభము మోహము అన్ని విధముల వ్యా ప్రమగును. సర్వవిధములగు సంక్షోభములును మిక్కిలిగా కలు గును. బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయరు; సరియగు) యాగము లనుష్ఠించరు. ఇట్లు విప్రులే కాదు. శ్రీయులును వైశ్యులను ఉత్సాదము మానసికమగు నాశ స్థితి) నందుడురు-శూద్రులకు బ్రాహ్మణులతో (వా స్తవమున బ్రాహ్మణులకు శూద్రుల తో) మంత్రము-వేదము) యోని కామ ప్రవృత్తి) పడక .భోజనము కలిసి-కూర్చుండుట మొదలగు విషయము లలో సంబంధము ఏర్పడును. చాలవరకు శూద్రులు రాజు (పొలకు లగుదురు. పాషండ వేద శాస్త్రములందు ప్రామాణ్య బుద్ధిలేని) ప్రవృత్తులధికమగును.ప్రజలు కాషాయ వస్త్రధారులు నిర్గంథులు కర్మానుష్ఠానములను వదలిన వారు నిష్కచ్చులు లోపల గోచీవంటి దానిని ధరించకయే వస్త్రధారణ చేయువారు) కపాలాది ధారణము తమ ధర్మ లక్షణముగా ధరించు కాపాలికులు- దేశ భక్తుల వేషములు ధరించిన లోకవ చకులు లోక నాశకులు ధర్మమును పాడు చేయువారు కొందరు దివావతులు (పగలు మాత్రము జనులకు తాము సదా చాంద్ లక్షణ , సంపన్నులని చూపుటకు వేషముతో సటన చేయుచు పరోక్షమునను మనస్సులోను దుష్పవృత్తులతో ఉండువారు) వృ తినిమి త్తము (పొట్టకూటి కై) వేదాధ్యయనాదికము చేసినట్లు నటించువారు అగుదురు. శూద్రులు వేదాధ్యతలుగా ధర్మార్థ కోవిదులుగా అగుదురు. శ్రీ బాల గోవధ పరస్పర వధలు స్వార్థమున కై పరస్పరోపకారము చేయువారు అగుదురు. దుఃఖప్రాచుర్యము అల్పాయువు-ప్రజలు దేశ ములు వదలిపోవుట రోగములు చెందుట ఆధర్మమునంద భినివేశము (గాథాస కి తమోగుణ ప్రవృత్తి భ్రూణ (సొంగ వేదాధ్యయనము వేద ధర్మానుష్టానము కల బ్రాహ్మణుల గర్భస్థ శిశువుల - హత్య) ఆయుర్బల రూపహాని అధికమగును. (ప్రజలేలరు దుఃఖములతో అభిప్లుతులు (మునుక లె త్తినవారు) అగుదురు. వీరి పరమాయువు ఎక్కువకు ఎక్కువయును) నూరు సంవత్సరములు. అదివరకు ఉన్నంత మంచిస్థితిలో కాదు నరేగదా ఏమాత్రమును మంచిస్థితిలో ఈయుగమున వేదములుండవు. కేవలము ధర్మ వ్యవస్థాపరిరక్షణలో అడ్డుకట్టలవలేనుండు యజ్ఞములు నడువక నశించును. ఇది కలియుగధర్మ ప్రవృత్తి స్వరూపము . ఇక కలి సంధ్యా సంధ్యాంశముల ధర్మస్వరూపమును తెలిపెదను.
ప్రతి యుగమునందును ఆయా యుగపు సద్ ధర్మములు దాని సంధ్యాకాలమునందు మూడు వంతులు నశించి ఒక నాలవ వంతు మాత్రము శేషించును. సంధ్యా కాల ధర్మములలో నాలవవంతు మాత్రమే ఆయుగపు సంధ్యాంశ కాలమున మిగులును. ఇట్టి కలియుగ సంధ్య కాలము కూడ గడచి సంధ్యాంశ కాలము . వచ్చిన యుగావసాన సమయమున ఆనాటి అసాధు వర్తనులను రాజులను దండించుట కై ధృగు వంశమున జన్మించిన చంద్రుడను దాని గోత్రమున మీదటి తరములలో) ప్రమతియను నాతడు జన్మించును. ఆతడా స్వాయంభువ మన్వంతరపు కలియుగ సంధ్యాంశ కాలమున నిండుగ ముప్పది ఏండ్లు పృథివియంతయు సంచరించుచు అస్త్ర ప్రయోగముతో యుద్ధములు చేయుచు చతురంగ బలము వెంటరాగా ఆయుధములుపట్టి నూర్ల కొలది వేల కొలది విపులు తను పరివారించి వచ్చుచుండగా సర్వ మేచ్చులను సంహరించును. శూద్రులగు రాజులను పొషులను నీ। శేషులనుగా చేసెను. అధార్మికులనందరను. ఉదీచ్య మధ్య దేశ్య పార్వతీయ ప్రాచ్య ప్రతీచ్య వింధ్య పృష్ట వాసులను అపరాంతికులను భారత దేశపు పడమటి అంచులందలి వారిని దాక్షిణాత్య ద్రవిడ సింహళ జనులను గాంధార దరద పప్లవ యవన శ క తుషార బర్బర పుళింద పులస లింబకార్ధకరక చొర జాతులను సంహరించును. తన చక్రము ( సేన)ను ప్రవర్తిల్ల (సంచరింప జేసి శూద్ర రాజులను అంతమొందించును. ధర్మవిరోధి) సర్వ ప్రాణులను తరుముచు ఈ భూమియందంతటను ఆతడు సంచ రించును. ఇతడు మను వంశమున జన్మించిన నృ దేవునికి రాజునకు) కుమారుడు; ఈ జన్మమునకు ముందు అతడు సాక్షాద్విష్ణువే. అతడు ప్రమతియను పేర చంద్రముడను రాజునకు వీర్యశాలియగు కుమారుడుగా పుట్టును. అతడు తన ముప్పది రెండవ ఏట బయలుదేరి ఇరువది సంవత్సరములపాటు ఇట్లు మానవులలో సర్వ ప్రాణులను చంపిచంపి క్రూరకర్మమునాచరించి ఈ పృథివిని మానవ బీజావ శేషమునుగా (ఏకొలదిమందియో మాత్రము మిగులునట్లు చేసెను.
ఇట్టి స్థితిలో పరస్పర హేతువుల చేతను కాలవశమునను ఆకస్మిక ముగను (ఏ కారణమును లేక యును) ఒక టీగా ప్రమతి వెంట కూడియున్న సేన ఈ చెప్పిన పని పూర్తికాగానే శీఘకాలముననే గంగా యమునల నడుమ (ప్రయాగ క్షేత్రములో) సమాధి నవలంబించి ప్రమతితోకూడ దేహత్యాగ మొనరించెను. ఇట్లు స్వాయంభువ మన్వంతర మందలి సంధ్యాంశ మున కూరకర్ములగు జనులు పూర్తిగా నశించగా నాటి రాజులనందరను నశింపజేసి ప్రమతి మొదలగువారును గతించిపోగా సంధ్యాంశమందలి కడపటి కాలమాసన్న ముకాగా స్వల్పావశిష్టులుగా మిగిలిన కొలదిమంది ప్రజలును అచ్చటచ్చట మిగిలియుందురు. వారును తమ క్షేమమే తాము చూచుకొనుచు స్వ ప్రధాన దృష్టి కలవారై సర్వ విధముల లోభావిష్ణులయి వర స్పరము హింసించుకొనుచు దోచుకొనుచు నుండిరి. లోకమరాజక మే ప్రజల జీవితము సంశయగ్ర సనుయ్యెను. ప్రజలు పరస్పర భయపీడితులై వ్యాకులత నొంది ఒకరికింకొకరికి పొతు పొంతనలు లేక కొందరు గృహములు విడిచిపోయిరి. మరికొందరు దేహములనే విడిచిరి. తమ్ము దయ చూచువారు లేక పోగా తమతమ ప్రాణముల కాపాడు కొనుచు మిగుల దుఃఖపీడితులై . శ్రాతస్మార్త ధర్మములు నశించెను. ప్రజలు - కామ క్రోధ వశులు మర్యాద తప్పినవారు ఆనందరహితులు స్నేహబుద్ధి సిగ్గు బిడియములు లేని వారునయిరి. ధర్మనాశ మయ్యెను. వారాపదలపాలై రి. పొట్టివారును ఇరువదియై దేండ్లకంటే జీవించని వారునయి. ప్రజలు విషాదముతో వ్యాకులు రై దారపుత్తూల విడిచి వానలు లేక ఇబ్బందులపాలయి జీవనోపాధులు విడిచి (లేక) దుఃఖితులై జింక చర్మములే ధరించుచు ఏ పనులును చేనుక ఇచ్చువారును పుచ్చుకొనువారును లేక వర్ణాశ్రమ పరిభ్రష్టులయి ఘోర మగు ధర్మ సంకరము నొందిరి. మిగిలిన కొలదిమంది ప్రజలును ఈ స్థితినొందిరి. ఇతర ప్రాణులును ఆక లి పీడనందుచు జీవితము పై విసుగు చెందెను. చక్రములవలే నిలుకడలేక సంచరించుచు తమ దేశ ముల విడిచి విదేశముల నొశ్రయించిరి. వారు మాంసాహారులయి లేళ్ళు మొదలగు వానిని పందులను ఎదులను మరి ఇతర వన చారి ప్రాణులను తినసాగిరి. సముద్ర నదీ తీర ముల నాశ్రయించిన ప్రజలును మత్స్యములు మొదలగువానిని (వారు బ్రాహ్మణులై నను) తినిరి. భక్ష్యాభక్ష్య విచారణను వారు విడిచిరి. అభజ్యాహార దోషముచే జగత్తున ఒకే వర్ణమయ్యెను. ఇది కృతయుగపు స్థితివలె నుండెను. కృతమున అందర ను ధర్మపరులై ఒకే వర్ణము వారుగానయి. ఈ కలియుగమున అధర్మవశులై ఏక వర్ల మువారైరి.) ఇట్లు కలియుగాంతమున ఎల్ల ప్రజలును శూద్రీభూతులయిరి. ఇట్లు నూరు దివ్య వరముల కాలము గడ చేను. ఇది మానవ మానమున ముప్పది ఆరువేల సంవత్సరములు.
ఇట్లు చాలకాలము గడచిన మీదట ఆకటి బాధతో ప్రజలు పశు పక్షులను మత్స్యములను దొరకినచోట దొర కిన వెల్ల తిని వేయగా అవి ఏమాత్రమును మీగులక పోయేను. నాటి కలి సంధ్యాంశ స్థితి ఇది. అంతట ప్రజలు నేల త్రవ్వి కొని కందమూలములను చెట్లనుండి ఫలములను-తినసాగిరి. వారుండుట కిండ్లు లేకుండెను. వారికి చెట్ల బెరడులే వస్త్రములు. నేలయే పడకలు. దాన పరిగ్రహములు వారిలో లేకుండెను. శుద్ది లేకుండెను. ఇంకను మిగిలిన కొలది మంది కూడ ఇట్లు క్రమముగ నశించిరి. ఇంకను అల్పావశిష్టులుగా మిగిలినవారు ఆహార మునుఉన్న దానిని తిని వృద్ధి నొందిరి. ఇట్లు కలిసంధ్యాంశము నూరేండ్లును గడచెను. ఇట్లు వేల మానవ సంవత్సరముల తరువాత మిగిలిన కొలది మంది ప్రజలును వారి కుమారులును మిగిలియున్న స్త్రీలతో దాంపత్య సంబంధమును వ్యవస్థ చేసికొనిరి. సంతానమును నిరి. వారికి సంతానము కలిగిన కొలది కాలములోనే వారికి ముందటి తరముల జనులు ఈ పుట్టిన సంతానపు తల్లిదండ్రుల తరపు జనులు) మరణించిరి. (కలియుగపు జను లేవ్వరును మిగులలేదు. ఇట్లంతట కృతయుగ మారంభమయ్యెను. జీవులు ఈ భూలోకపు దేహమును విడిచిన తరువాత వారి పుణ్య పాపముల ననుసరించి స్వర్గనరక సుఖదుఃఖానుభవార్థము మరి యొక దేహము ఆ జీవులకు లభించునట్లే కలియుగపు జనులనుండి కృతయుగమునకు సంబంధించిన జనులకు దేహ ప్రాప్తి యయ్యెను. ఇది కలియుగము ముగిసి కృతయుగ మారంభమయిన విధము. కలియుగమునుండి మిగిలినవారెవ్వరైన నున్న చో వారియందును ఈ కృతయుగ జలయందును విచారణా ప్రవృత్తి కలిగేను. దాని ప్రాపంచిక జీవితము పై విసుగు సత్వరజస్తమోగుణముల సమతాస్థితి దానిచే ఆత్మజ్ఞానము దానిచే ధర్మశీలము కలిగి. మొదటి కృతయుగమందు వలే సజ్జనులగు ప్రజలు పుట్టిరి. దీని కంతటికిని భవితవ్యమగు అర్థము (జరుగవలసిన విషయము -జీవుల పూర్వ కర్మాను గుణమగు అదృష్టమను ధర్మాధర్మఫలములును) హేతువు. దీని కంతటికిని మూలతత్వమగు స్వయంభూ బ్రహ్మకు నమస్క రించి మీకు ఈ యుగధర్మ ప్రవృత్తులన్ని యు తెలిపితిని. యుగప్రవృత్తులు ప్రతి ఆ వృత్తియందును ఇట్లే యుండును. ఇది యుగ ప్రవృత్తుల సమాస-వ్యాస-కథనము. (మొదట ఒక విషయమును సంగ్రహముగ చెప్పి పిదప దానియందలి ప్రత్యేకాంశముల గ్రహించి విస్తరించి చెప్పుట సమాస-వ్యాస కథనము.)
ఇట్లు ప్రవర్తిల్లిన కృతయుగమునందు ఆది కలియుగమునుండి మిగిలిన వారికి జనించినవారే ఆది ప్రజ లగు దురు. ఈ లోకమున ఎవరికిని కనబడక అదృష్టులే తిరుగుచుండు సిద్ధులును సప్త ఋషులతోను కూడ ద్యులోకమందుండు మహాపురుషులును లోకమున ఈ కృతయుగ ప్రజల ఉత్పత్తి కి బీజరూపమున నిలిచియున్న బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర శేష ప్రజలును ఈ కృతయుగారంభపు ఆది ప్రజలతో కలిసి మెలసి తత్సములయి యుండి వీరికి ధర్మము నుప దేశింతురు. వర్ణాశ్రమాచార ధర్మములను క్రౌత స్మార్త కర్మ మూల ధర్మ ప్రవృత్తులును సప్తర్షులు వీరి కుపదేశింతురు. ఏలయన ధర్మవ్యవస్థా ప్రతిష్టార్థమై సపరులు ఈ లోకపు ప్రజల నడుమ ప్రతియుగమునను నిలుతురు. వారి యుపదేశ ముచే ప్రజలును ధర్మకర్మాచరణములందు ప్రతిష్టితులు దృఢాభి నివేశము తో నిలిచినవారు) అగుదురు. ఈ ఋషు లిట్లు మన్వంతర ప్రవర్తనాధికారమునందు నిలిచియుండి లోక ముస ధర్మప్రతిష్ణా ప్రవృత్తులకు హేతుభూతు లగుదురు. వనము లలో దావాగ్ని దవమనగా అడవి) వలన తృణములు కాలిపోయినను దానిని చల్లార్చుటకై కురిసిన వాననీటిబొట్టు పడి నందున ఆ దావాగ్ని పాలయిన తృణపు మొదటినుండి యే ఈ దావాగ్నితో దగ్గము కాక మిగిలిన ఈ తృణ బీజ శేషము నుండి । కోత తృణము మొలచును గదా। అట్లే యుగము తరువాత మరియొక యుగపు ఆరంభమున ప్రజా సంతానము సంతానము – నేరంతరమున కొనసాగుట) జరుగును. ఇట్లు రెండేసి యుగముల పరస్పర సహకారముతో యుగానంతర యుగప్రవృతి మన్వంతరము ముగియు వరకు అనవచ్చిన్న మయి సాగుచునే యుండును. కృతము మొదలు క లివరకు యుగములలో ఆయుర్బల ధర్మార్థ కామములు క్రమమున నాల్గవవంతు చొప్పున తగ్గుచు వచ్చును. ఇది ప్రతిసంధి సంధ్యా సంధ్యాంశ) శాప్రవృత్తి ప్రకారము (ప్రకారము _ రీతి); ప్రతి చతుర్యుగము చతుర్యుగము = మహాయుగము కృత త్రేతా ద్వాపర కలియుగముల సముదాయము నందును యుగ పరివర్తన క్రమ మిట్లే యుండును.
ఇటువంటి మహాయుగములు డెబ్బది యొకటి ఐనచో ఒక మన్వంతర మగును.
ప్రతి యుగమునందును కృతాదియుగ చతుష్టయమునందును ఏ యుగమునందు ఒక సారి ఏది ఎపుడు ఎట్లు జరుగునో అదియే అట్టి ప్రతియొక ఆవృ యందును జరుగును. ప్రతియొక యుగ సృష్టియందును కొన్ని విశేషాంశము లందు వీటికి పరస్పర భేదమును ఉండవచ్చును. ఇవియు అట్లే ప్రతియుగ మహాయుగా వృత్తియందును జరుగుచుండును. ఈ విషయము పదునాలుగు మన్వంతరములందును ఇట్టే ఆవృత మగును. మానవులు మాత్రమేకాక అసురులు యాలు ధానులు పిశాచులు యక్షులు రాక్షసులు మొదలగు జ్ఞాతులవారు కూడ ఆయా యుగ మహాయుగ మన్వంతరములయందు సమాన లక్షణములతో సుందురు.
ఇట్లు మీకు యుగముల లక్షణము యథాక్రమముగ తెలిపితినీ. ఇట్టే కల్పావసానము వరకు మన్వంతరము లును పరివర్తనమునందుచు పోవును. ఇవి ఇప్పటికి ఎంతయో చిరకాలమునుండి ప్రవర్తిల్లుచు వచ్చుచున్నవి. ఇక ముందును కొనసాగుచుండును. యుగ స్వభావమే ఇందులకు హేతువు. ఈ జీవలోకము క్షణకాలము కూడ ముందునకు సాగక మార్పు నొందక యుండదు. ఈ జీవలోకమునకు నాశము ఉత్పత్తి ఈ రెండును స్వాభావికములు.
ఇట్లు యథాక్రమమున మీకు యుగ స్వభావములను తెలిపితిని. ఈ కల్పమునందు గడచిన గడుచుచున్న - గడువనున్న - మన్వంతరముల విషయమును కూడ తెలి పెదను.
ఇది శ్రీమత్యమహాపురాణమున మన్వంతరాను కీర్తనమున యుగ లక్షణాను కీర్తనమను నూట నలువది మూడవ అధ్యాయము.
Summary of chapter 144 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the majestic march of the celestial Deva army led by Bhagavān Kārttikeya riding His divine peacock vehicle. The celestial forces, equipped with glowing chariots, war elephants, and divine banners, advanced toward the stronghold of Tārakāsura, filling the cosmos with the resounding roars of war drums and trumpets.