మత్స్య మహా పురాణము
39 - యయాత్యష్టక సంవాదము
అష్ట కుడు: “కృతయుగపు వారిలో ప్రధానుడవగు యయాతీ: నీవు నందనవనమున కామరూపుడవయి నూరు పదివేల సంవత్సరములున్న తరువాత దానిని విడిచి భూలోకమునకు చేరుకొంటివిగదా! కారణమేమి?” యయాతి: “ఈ లోకములో మానవునకు ధనము క్షీణించిన తరువాత అతనిని అతని జ్ఞాతులును మీతులును స్వజనులును విడిచి పెట్టుదురు గదా! అట్లే ఆలోక ములందు లోక పాలురును దేవ సంఘములును మనుష్యుని పుణ్యము నశించగానే అతనిని వదలి వేయుదురు.” అష్టకుడు: “మానవులచట క్షీణపుణ్యు లేట్లగుదురు? ఈ విషయమున నా కేమియు తెలియుటలేదు. ఏ విష యమున ఎంత విశిష్టులు (ఇచట పడిన తరువాత మరల ఏలోకమును చేరుదురు? ఇది యంతయు నాకు చెప్పుము. నీవు క్షేత్ర తత్వమును (దేహము-దేహధారికి కలుగు ధర్మాధర్మఫలములు మొదలగునవి) ఎరిగినవాడవను విశ్వా సముతో అడుగుచున్నాను." యయాతి: “స్వర్గమునుండి ఈ భూలోకమును చేరుకొనిన జీవులు ఈ భౌమ భూలోక సంబంధి) నరకమున పడుదురు. వారందరును రాజా! (తమకు కలిగిన ఈ స్థితికై) విలపింతురు. భూలోకమున పడి వారు అనేక విధముల ప్రాణులుగా వృద్ధి పొంది రాబందులు నక్కలు పిల్లులు మొదలగు ప్రాణులకు ఆహారమగుదురు. కావున మానవుడు ఈ లోకములో దుష్టమును నింద నీయమును నగు కర్మమును చేయక విడువవలయును. నీవడిగిన దంతయును చెప్పితిని. ఇపుడిం కేమి చెప్పవలయును?" ఆప్షకుడు: “పాపకర్ములగు వారిని గ్రద్దలు నెమళ్ళు మొదలగు పక్షులు ఎట్లు బాధించును? ఈ నరక బాధలలో ఈ జీవులు ఎట్లు ఉందురు? ఎట్లు ఉండరు? భౌమమగు నరక మును గురించి ఇంకను వినగోరుచున్నాను.” యయాతి: “ఈ దేహము కర్మను అనుసరించి రూపొందుచుండును. ఎవరు చేసిన కర్మమునకు తగిన శరీరమును వారు పొందుదురు.) దేహమును విడిచిన తరువాత వారు దానిని బట్టియే పృథివి యందును ఆయా దేహములను ధరించి సంచరింతురు. స్వర్ణమునుండి పడినవారును అట్లే ఈ భౌమ నరకమున వారు పడుదురు. అనేక సంవత్సరములపాటు మరల వెనుకకు తిరిగి చూడనే న లేకుందురు. పుణ్యలోకములనుండి భ్రష్టులైన వారు క్రిందికి పడుచు ఆరువదివేలఎనుబదిసంవత్సరములపాటు అంతరిక్షమునందే యుందురు. వారిని ఆ కాలములో వాడి కోరలుగల భయంకర రాక్షసులు పీడించుచుందురు.” అష్ట కుడు: “ఇట్లు ఆ భయంకర రాక్షసుల పీడలు అనుభవించిన తరువాత ఈ జీవులు ఏఏ విధముల ఉందురు: ఎట్లుండరు? ఏయే స్థితుల పొంది ఈ జీవులు గర్బముగా రూపొందుదురు?” యయాతి: “(కొందరు జీవులు మానవులగుదురు. వారి విషయము.) పురుషుడు వదలిన రేతస్సు స్త్రీకి చెందిన పుష్ప ఫలముతో (రజోర క్తముతో కలిసి స్త్రీ రక్తమున ప్రవేశించును. ఇట్లు జీవుడు మానవ రజస్సును చేరును. పిమ్మట అచ్చట గర్భముగా అగును. మరికొన్ని జీవులు వనస్పతులను ఓషధులను వాయువును నీటిని పృథివిని అంతరిక్షమును చతుష్పాత్రాణులను ద్విపాత్రాణులను-దీనిలో వేటినై నను ప్రవేశించును.”
అష్టకుడు: “మానవ లోకమునందలి ఆ యా శరీరములను జీవులు పొందుటలో వారు తమ సంకల్పము ననుసరించి తాము కోరిన శరీరమును పొందుదురా? లేక మరిఏదై న హేతువు వారిని గర్భముగా గర్భస్థ శిశువుగా) రూపొందించునా? సాకుగల ఈ సంశయమును తెలియగోరుచున్నాను. చెప్పుము. ఏ హేతువుచే హెచ్చు తగ్గులుగల వివిధ శరీర ములను వానియందలి చక్షుః స్రోత్రాందీంద్రియ భేదములను సంజ్ఞా అనుభూతి) భేదమును పొందగలుగుదురు? నేను ప్రశ్నించిన ఈ విషయములన్నియు చెప్పుము. ఏలయన నీవు క్షేత్ర శరీర సృష్టి) తత్వమును ఎరిగినవాడవని మేమందరము (అష్టక సోదరులు) అనుకొనుచున్నాము.” యయాతి: “ఋతుకాలమునందు రేతస్సుతో రజస్సుతో సంపర్కము చెందిన గర్బయోనిని గర్భము నిలిచియుండెడి ఉదర కోశమును) వాయువు లాగిపట్టి యుంచును. ఆ వాయువు ఆ గర్భకోశమునందు పంచ తన్మాత్రలకు తాను ఆశ్రయమైయుండి గర్భమును వృద్ధి పొందించును. అనంతరము జీవుడు వ్య క్తత పొందుచు అవయవములు స్పష్టములగుచురాగా అనుభవ జ్ఞానమును పొందుచు వచ్చును. క్రమముగ శోత్రముతో శబ్దమును చుస్సుతో రూపమును ఘాణముతో గంధమును జీహతో రసమును త్వక్కుతో స్పర్శమును మనస్సుతో భావమును తెలిసికొనును. అష్ట కా! ఈ జీవ లోకములో దేహియొక్క (మానవుల దేహవృద్ధి క్రమము ఈ విధముగ నుండును. అనీ ఎరుగుము.” అష్టకుడు: “మరణించిన మానవుడు దహింపబడీ కానీ హితీ వేయ బడి కాని ప్రాణులచే తినబడి కాని అభావమును పొంది నశించునుక దా! అతడు మరల తనుతాను చేతన పదార్థముగా ఎట్లు రూపొందించుకొనును?” యయాతి: “గాఢనిద్ర పోవువాడు గుర్రు పెట్టినట్లు మానవుడు మూలిగి ప్రాణములను విడుచును. అనగా ఈ దేహమును విడుచును. అతని సుకృత దుష్కృతములు మాత్రమతనికీ ముందు ఉండి అతనిని తమవేంటగోని పోవును. తరువాత మరల నతడు తన పుణ్యపాపముల ననుసరించి లభించిన మరియొక (మాతృ పితృ గర్భమును ప్రవేశించును. మహానుభావా! పుణ్యమును చేసినవారు పుణ్యమానిని జన్మమును) పాపము చేసినవారు పాప జన్మమును పొందురురు. అతి పాపులు కీటక ములుగా పక్షులుగా అగుదురు. వాటిని వివరించి చెప్పుశ క్తి నాకు లేదు. ఆయా భూతములు గర్భభూతులై గర్భమునందలి శిశువులుగానై) మరికొందరు నాలుగు పాదములు - రెండు పాదములు-ఆరుపాదములు-కల పాణి విశేషములుగా నగుదురు. నీవడిగిన ఈ విషయమంతయు ఏమియు వదలక చేప్పితిని. మరింకేమి యడుగుదువు?” అష్టకుడు: 'తండ్రీ! మర్త్యుడు ఏమి చేసినచో తపస్సును చేసియో-విద్యను ఆర్జించియో- శ్రేష్టములగు లోకమును పొందును? క్రమక్రమముగా ఉత్తరోత్తరము మేలగు లోకములను ఏ యుపాయముచే పొందవచ్చును? నేనడిగిన ఈ ప్రశ్నకు సమాధానము ఉన్నదున్నట్లు చెప్పుము.” యయాతి: “తపస్సు దానము శమము ( అంతఃకరణ నిగ్రహము) దమము (బహిరింద్రియ నిగ్రహము) సిగ్గు బిడియము ఋజు వంకరలేని) స్వభావము సర్వభూతములయందును దయ ఈ ఏడును మానవులకు స్వర్గలోకమునకు పోవు ద్వారములని వివేకులు చెప్పుదురు. మానవులు ఎల్లప్పుడును దురభిమానముచే అజ్ఞానము క్రమ్మగా నశింతురని పెద్దలు చెప్పుదురు. ఎవరు తాను విద్యలను అధ్యయనము చేసి తాను పండితుడయ్యేనని అహంకారపడుచు తన విద్యచే ఇతరుల కీర్తిని నశింపజేయునో అట్టివాని లోకములు (వాడు సుకృతము చేసి పుణ్య లోకములను సాధించుకొన్నను) అంతవంతములు ముగిసినవి నశించినవి) అగును. అంతేకాదు. అతడు అధ్యయనము చేసిన వేదము కూడ అతనికి ఫలము నీయదు. మానవునకు భయమును పోగొట్టి ఊ తమ లోకములకు కొనిపోవు కర్మ ములు నాలుగును .అగ్నిహోత్రము.మౌనము తపస్సు) అధ్యయనము-యజ్ఞము. చేయవలసినట్లు చేయనిచో అధమలోక ప్రాప్తి భయమును కలిగించును. అవి 1. మనాగ్ని హోత్రము 2. మానతపస్సు 3. మానాధ్యయనము 4. మానయజ్ఞము అను నవి ఇతరులు ఆదరించగా హరమునందక అవమానించిరని సంతాపపడకయుండు వానిని సత్ జనులు ఈ లోకమందును పైలోకమందును పూజింతురు. కాని అసాధుజనులు సాధు బుద్ధిని పొందుట దుర్ఘటము. (అది స్వాభావికముగ కలుగ వలెను.) ఈ ప్రయోజనమున కై దానము చేయు చున్నాను. ఇందుల కే యజ్ఞము దేవతారాధనము) చేయుచున్నాను. ఇందుల కై అధ్యయనము చేయుచున్నాను. ఇందులకై వ్రతములను (వైదిక సార్మ కర్మలను) అనుష్ఠించుచున్నాను. అని చేయు ఈ పనులన్నియు భయమును కలిగించునవి. కావున వాటిని ఎల్లప్పుడును అన్ని విధముల తప్పక విడువ వలయును. ఎవరు తత్వము నెరిగినవారై పురాణము (అతి ప్రాచీనము శాశ్వతము) అగు ఆశ్రయమును పరమాత్ముని తమ చిత్తవృత్తియందు స్థిరముగ నిలిపి ఆదరింతురో వారు తే జసమగు స్వయంప్రకాశమగు) రూపమును పొంది నిః శేయసమును ఇహమునను పరమునను పరమశాలతిని పొందుదురు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున యయాత్యష్టక సంవాదమను ముప్పది తొమ్మిదవ యధ్యాయము.
Summary of chapter 39 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the profound dialogue between King Ashṭaka and King Yayāti concerning the nature of heavenly realms, karmic merit, and spiritual liberation. King Ashṭaka asked whether the worlds attained through pious deeds were permanent or temporary. King Yayāti explained that all celestial worlds attained through ritual sacrifices and good deeds are finite, lasting only as long as the underlying karmic merit remains unexhausted. Once the accumulated merit is spent, the soul must inevitably re-enter the cycle of mortal birth and death. King Yayāti emphasized that true liberation is attained solely through unreserved devotion to Bhagavān Vishṇu, freedom from false ego, and realization of the eternal self beyond material cause and effect.