మత్స్య మహా పురాణము
98 - విభూతి ద్వాదశీ వ్రతము
నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పసాగెను: సర్వోత్తమమగు విష్ణుదేవతాక వ్రతమును మరియొక దానిని చేప్పెదను. విభూతి ద్వాదశీ వ్రతమనునది సర్వామరుల ప్రశంసలనందుకొనునది. చైత్ర వైశాఖాషాఢ కార్తీక మార్గశీర్చ ఫాల్గున మాసములలో దేనియందై న శుక్ల దశమినాడు లఘు భోజనము చేసి ఆనాటి సాయం సంధ్యావందనమయిన తరువాత "నేను రేపు ఏకాదశినాడు నిరాహారుడనై జనార్ధ సుని అభ్యర్చించి ద్వాదశినాడు ద్విజులతో కూడి భుజింతును. సో ఈ వ్రతము నిర్విఘ్న మును సఫలమును అగుగాక! మధుసూదనా!” అని సంకల్పించి నియమము పూనవలెను. రాత్రి నిద్రించునపుడును 'నమో నారాయణాయ' అని ధ్యానించుచుండవలెను.
ఏకాదశినాటి ఉదయమున మేల్కాంచి స్నాన జపములు చేసి శుచియై గంధమాల్యాను లేపనములలో పుండరీ కాక్షునీ పూ జీంచవలేను.
పూజా మంత్రములు: 1. వీభూత యేనమః-పాదౌ పూజయామి; 2. విశోకాయనమః జానునీ పూజయామి; 3. శివాయనమః ఊరూ పూజయామి; 4. విశ్వమూర్తయేనమః కటిం పూజయామి; 6. కందరాయనమః-మేడం పూజ యామి; 6. ఆదిత్యాయనమః -కరౌ పూజయామి; 7. దామోదరాయనమః ఉదరం పూజయామి; 8. ఆదిదేవాయనమః స్తనౌ పూజయామీ: 9. మాధవాయ నమః – ఉరః పూజయామి; 10. వైకుంఠినే నమః కంఠం పూజయామి; 11. శ్రీధరాయ నమముఖం పూజయామి; 12. ధనదాయ నమః- శ్రవణే పూజయామి; 18. సర్వాత్మనే నమః శిరః పూజయామి; 14. కేశ వాయ నమః - కేశాన్ పూజయామి; 15. శార్జధరాయ నమః - పృష్ఠం పూజయామి; 16. శంఖచక్రగదా జలజపాణయే బ్రహ్మణే నమః అని పూజించవలయును.
బంగారుతో కలువపూవును మత్స్యమును చేయించి అవియును.పానితోపాటు ఊదకుంభమును-పాత్రయందు. నూవులును బెల్లమును నింపి పచ్చని వస్త్రముతో దానిని కప్పి అదియు స్వామి ముందు చవలేను. ఇతిహాస కథాది శ్రవ ణముతో జాగరణము చేసి ఆ రాత్రి గడుపవలేను. ద్వాదశినాటి ఉదయమున కుటుంబియగు బ్రాహ్మణునకు కలువపూవును మత్స్యమును ఉద కుంభమును గుడతలపాత్రమును దానము చేయవలెను. దాన ప్రార్థనామంత్రము : “విష్ణో! సర్వ విభూతి యుక్తుడవగు నీవు అశేష దుఃఖ సంసార పంకమునుండి నన్ను దరించుము.” ఇబై సంవత్సరముపాటు మత్స్యాది దశావ తార ప్రతిమలను దత్తాత్రేయ వ్యాసాదుల ప్రతిమలను కలువపూవును బంగారుతో చేయించి ఇచ్చుచుండవలెను. ఈ కాలమునందు పాషండుల(వేద నిందకులతో సంబంధమును ఏ మాత్రము పెట్టుకొనరాదు.
ఇట్లు యథాశ క్తిగా పండ్రెండు ద్వాదశులను గడపి సంవత్సరాంతమున గురుని వస్త్రాలం కొర భూషణములతో పూజించి లవణ పర్వతమును శయ్యను పొడియావును గ్రామమును పొలమును భవనమును శ క్తిని బట్టి) ఈయవలెను. ఇతర బ్రాహ్మణులను కూడ యథాశక్తి భుజింపజేసి వస్త్ర గోరత్నధనాదిక దానములచే సంతోషపరచవలేను. శ క్తిలేని వాడు అల్పముగను ఈయవచ్చును. మరియు ఆల్పధనుడు పుష్పార్చన ఏధానముతో మూడు సంవత్సరములు మాధవుని ఇట్లర్చించవచ్చును.
దీని నాచరించుటచే తాను తరించి పొసిర్ముకుడై నూర్గురను పితరులను కూడ తరింపజేయును. ఈ ఫలము అతనికి నూర్ల-వేల జన్మములవరకు వెంట నుండును. అతనికి వ్యాధులు దారిద్ర్యము బంధనము కలుగవు. ఆతడు శైవు డై నను వైష్ణవుడై నను దీని ఫలముగ నూట ఎనిమిది వేల యుగములపాటు స్వర్గమున వసించి కల్పాంతానంతర సృష్టిలో భూపతిగా జన్మించును.
పుష్పవాహనోపాఖ్యానమ్ - పుష్పవాహనోపాఖ్యానము
పూర్వము రాథంతర కల్పమున రవితేజస్కుడగు పుష్పవాహనుడను రాజుండెను. అతడు తపముచే బ్రహ్మను మెప్పించి కామగమనముగల కాంచన కమలమును సంపాదించి తన నగర వాసి జనముతోకూడ సమస్త ద్వీపములందును సురలోకమునందును సంచరించుచుండెను. అతడు కల్పాదియందు ద్వీపములలో ఏడవదియగు పుష్కర ద్వీపమున వసించుచుండెడివాడు. బ్రహ్మ అతని కిచ్చిన పుష్కరము(పద్మము) ఆదీయే. దీనిచే అతని దేవదానవాదులు పుష్పవాహను కనిరి. నా డా రాజునకు సాటి ఎవరును లేరు. అతని తపోనుభావ మట్టిది. ఆతని పత్ని నారీసహస్రముచే వంద్యమానయు. లావణ్యవతియునై భవునకు పార్వతివలె ఆ రాజునకు ప్రియయై యుండెను. ఆమెకు ధర్మాత్ములు ధనుష్క శేష్టులు నగు పదివేల మందీ తనయులు కలిగిరి. ఇదియంతయు చూచికొని రాజు తరచు వేర గొందుచుండి యొక నాడు తన కడ క భ్యా గతుడై వచ్చిన ప్రచేతసు నిట్లడిగేను: “నాకు దేవమానవ పూజ్యమగు ఈ యచల సంపద ఆమర సుందరులకంటె మిన్న యగు ఈ పత్ని అల్పతపముతోనే తుష్టుడే బ్రహ్మ ఇచ్చిన ఈ పుష్పయానము చంద్రుని పరివేష్టించిన తారాగణమువలె నా ముందు కాంతిహీనులై నన్ను పరివేష్టించి యుండు చతురంగ బలసమేతులగు ఈ శతకోటి నృపులు - ఇదంతయును కలుగుటకు గత జన్మమున నేనో నా పత్ని యో నౌ తనయులో అ శేష ఫలా ప్రి హేతువగు పుణ్య మేమి చేసియుంటి మో దయార్ద్ర చేత స్కుడవై తెలుపుము.”
ప్రచేత కథిత పుష్పవాహన పూర్వచరితమ్
అనగా ప్రచేతు డిట్లు పలికెను: రాజా! నీ కీ సర్వసంపదలకును హేతువగు నీ పూర్వ జన్మవృత్తమును చూచి తిని. గత జన్మమున నీవు అనుదినము పాపకారియగు లుబ్ధకుడవు. నీ శరీరమును పరుషాంగసంధులు దుర్గంధము కలిగి ప్రాణులకు భయతాపకఠమయియుండెను. పర్వతచరురాలయినను నీయందు విముఖయేనను నీకు అత్యంత ప్రియతమ యగు భార్య, తప్ప, జననీ సుత సుహృద్బంధుజన మెవ్వరును నీకు లేకుండిరి. ఇట్లుండ ఒకప్పుడు రౌద్రమగు అనావృష్టి చే ఆహారము లేక పోగా నీవు ముత్పీడితుడవై ధాన్య ఫలాదికము కూడ దొరుకని తరి నీకు పంకావృత తటము కలిగి అనేక పద్మయుతమగు కొలను కనబడెను. నీవు దానినుండి అనేక పద్మ ములు కోసి వాని నమ్మి లాభ మార్షించుటకై విదిశ యను నగర మేగి అట పగలంతయు తిరిగితివి. వానిని కొనువా రేవ్వ రును దొరుకక నీవు నీ పత్నితో అలసి కుత్పిడితుడవై యొస భవనాంగణమున కూర్చుంటివి. అంత రాత్రి కాగా విసవచ్చిన మంగళ వాద్య ధ్వనీ జాడబట్టి అది వినవచ్చు. చోటికి భార్యతో ఏగితివి. అచట అనంగవతియను వేశ్య చేయుచుండిన విష్ణుపూజను చూచితివి. ఆమె అపుడు తన విభూతి ద్వాదశీ వ్రత సమా పి కె మాఘ శుక్ల ద్వాదశినాడు గురునకు లవణా చలమును సర్వోపసరయు క శయ్యను దాన మిచ్చుచుండెను. అది చూచి మీ రిరువురును భ క్తి కలిగి. 'ఈ కమలము లతో పని యేమి?' అని వానితో విష్ణుని అలంకరించి అర్చించితిరి.
అది చూచి తుష్టయే అనంగవతి వారికి మూడు వందల పాడియావులను మూడు పలముల సువర్ణమును నిమ్మని తన వారి నాదేశించెను. కాని మీరు అధిక సత్వము నవలంబించి అవి తీసికొనకుంటిరి.
అంతట అనంగవతి భక్ష్యభోజ్య లేహ్యచోష్య రూప - చతుర్విధాన్న ములు తెప్పించి మిమ్ము తిసుడన మీరును “అమ్మా! ప్రసంగవశమున అనుకొనకుండగనే ఉపవాసముతో శుభావహమయి రాత్రి గడచినది. కాన రేపు భుజింతుము. మేము జన్మప్రభృతిగా ఓ శుభవతా! దేవీ! పాపిష్టులము. అంటిరి. ఇట్లు ఈ ప్రసంగమున మీ ఇరువురకును ధర్మలేశమును జాగరణానుష్టానఫలమును అబ్బినవి.
ఉదయమున ఆ ఆనంగవతి శయ్యయు లవణపర్వతమును గ్రామములును గురువునకును వస్త్రాలంకార కనక యుత ములై న పండేండు పాడియావులు బ్రాహ్మణులకును దానము చేసెను. సుహృన్మిత దీనాంధకృపణులతోపాటు ఆమె ఈ లుబ్దక దంపతులకును భోజనము పెట్టి వీడ్కొనెను. రాజా! ఆ లుబ్దక దంపతులుగా నుండిన మీరు ప్రత మున చేసిన పూజా మాహాత్మ్యమున మీ పాపములన్నియు నశించి ఈ పద్మ గృహమును కామగమనమును ఈ సంపదాదికమంతయును బ్రహ్మరూపుడగు నారాయణునిచే మీకు ఈయబడినవి. ఆ అనంగవతియను వేశ్యయు ఇపుడు మన్మథుని, రెండవ భార్యయై ప్రీతియను పేర రతీదేవికి సవతిగా నున్న దే లోకానంద జననియు సకలామర పూజిత యునై యున్నది.
కావున నా రాజేంద్రా! నీవును ఈ పద్మ గృహయానమును భూతలమున విడిచి గంగాతీరమున విభూతి ద్వాదశి వ్రతము నాచరింపుము. మోక్షము నం దేదవు.
ఇట్లు ప్రచేతుడు పలికి యంతర్షి తుడు కాగా ఆ రాజును నాతడు చెప్పినది యెల్ల అట్లే ఆచరించెను. ఆ ఫల మును కూడ పొందెను.
కావున నారదా! దీని నాచరించిన యాతడు అఖండఫలము నందును. శ క్తి యున్నంతలో పండ్రెండు ద్వాదశులయం దుపవాస పూజో దక్షిణాదానాదికమును విత్త శాఠ్యము చేయక భక్తితో నాచరించుట చే కేశవుడు - తుష్టు డగును.
కలుష నాశకమగు దేనిని భక్తితో వినినను చదివినను నితరులకు తెలిపినను కోటి శత వత్సరములపాటు దేవలోక మున వసీంచును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున విభూతి ద్వాదశీవ్రత మాహాత్మ్య కథనమను తొంబది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 99 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the Vibhūti-Dvādaśī-Vrata, observed on the twelfth lunar day of the bright fortnight across six key months including Kārtika, Chaitra, Vaiśākha, Mārgaśīrsha, Phālguna, and Āshāḍha. The practitioner worships Bhagavān Nārāyaṇa alongside Goddess Lakshmī, offering fragrant flowers, tulasi leaves, incense, camphor, and elaborate food preparations free from salt. The devotee spends the day and night in spiritual vigil, meditating upon the cosmic glories and Vibhūtis of the Supreme Lord as described in sacred scriptures. The Lord promises that performing this vow bestows supreme spiritual majesty, fulfills all noble desires, frees the family from poverty, and ensures ultimate absorption into the supreme form of Bhagavān Nārāyaṇa.