మత్స్య మహా పురాణము
45 - స్యమంతకోపాఖ్యానము - వృష్ణివంశకథనము
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెనుః వృప్తికి గాంధారి మాద్రి అను ఇద్దరు భార్యలు. అతనికి గాంధారి యందు సుమిత్రుడు మాద్రియందు యుధాజితుడు దేవమీఢుడు అనమితుడు శిబి అను ఐదుమంది కుమారులు కలిగిరి. అన మిత్రునకు నిఘ్నుడు అతనికి ప్రసేనుడు శ క్తి సేనుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి. వీరిలో ప్రసేనుడు రత్న రాజమగు సమంతకమణిని సంపాదించెను. అది అతడు హృదయము న ధరించుట చూచి శ్రీకృష్ణుడడిగినను అతడది అతనికీయ లేదు. శకుడై యుండియు కృష్ణుడు దానిని బలమున హరించలేదు. ఒకమారు ప్రసేనుడు దానిని ధరించి వేటకై పోయి ఒక గుహలో జంతువేదియో చేసిన శబ్దము విని లోనికిపోగా అచటనతని కొక ఎలుగుబంటి కనబడెను. వారొకరినొకరు చూచుకొనిరి. ఋక్షము ప్రసేనుని చంపి మణిని హంచెను. మరణించినందున ప్రసేనుడు గుహలోనికి పోయినవాడు తిరిగిరాలేదు. మణికై గోవిందుడే ప్రసేనుని చంపియుండునని శక్తి సేనాదులు శంకించిరి. నా సోదరుడు మణిని ధరించి అడవికి పోవుట చూచి కృష్ణుడును అటకు వెళ్ళి ప్రసేనుని చంపెను. అనీ శక్తి సేనుడ నేను. తాను చంపలేదని కృష్ణుడు మారుపలి కెను. కాని వృష్టివంశపువారికి శత్రువుగానున్న ఇతనిని చంపుదునని శ క్తి సేనుడ నెను. కొంత కాలమునకు తరువాత యాదృచ్చికముగా శ్రీకృష్ణుడు వేటకై పోవుటయు ఋక్షముండెడి బిలముకడకు చేరుటయు జరిగెను. అతనిని చూచి ఋక్ష రాజు మహాశబ్దము చేసెను. అదివిని శ్రీకృష్ణుడు ఖడ్గపాణియై గుహలోనికి పోగా అతనికి జాంబవంతుడు కనబడెను. కృష్ణుడు క్రోధముతో కం డైరచేసి మహాబల సంపన్న శరీరుడగు జాంబవంతుని పట్టుకొనెను. అతని పనులను బట్టి జాంబవ-తుడు కృష్ణుని విష్ణునిగా గుర్తిం చెను. అందులకు సంతసించి కృష్ణుడు వరము కోరుకొనుమన నీచేతిలో చక్ర ప్రహారముతో నాకు మరణము కావలయునని జాంబవంతుడు కృష్ణుని వరమడిగెను. యుక్తవయస్సు వచ్చిన కుమార్తెను నీవు భార్యగా గ్రహించుము. ప్రసేనుని చంపి నేను గ్రహించిన ఈ మణిని కూడ తీసికొనుము. అని అతడు జాంబవతిని మణిని శ్రీకృష్ణునకర్పిం చెను. తరువాత ఆ ప్రభువు చక్రముతో జాంబవంతుని సంహరించి జాంబవతిని మణిని గ్రహించెను.
తరువాత శ్రీకృష్ణుడు సమంతక మణిని శక్తి సేనునకు (సత్రాజితునకు సాత్వతుల సభయందు సమర్పించెను. ఇట్లు శ్రీకృష్ణుడు మిథ్యా ప్రవాదమునుండి ముక్తుడయ్యెను. ఇంతవరకును నీవే ప్ర సేనుని చంపితివని మేము అనుకొంటామని యాదవులందరును కృష్ణునితో ననిరి.
కేకయ రాజు తన పదిమంది కుమార్తెలను సత్రాజిత్తునకు ఇచ్చి పెండ్లి చే నెను. వారికి సర్వలోక ప్రసిద్ధులు మహా సత్వ సంపన్నులు నగు కుమారులు కలిగిరి. వారిలో భంగ కారుడు పెద్ద పొడు. అతనికి బువతి (వతవతి) అను భార్యయందు సత్యభామ.ప్రతిని.పద్మవతి అను ముగ్గురు కుమార్తెలు కలిగిరి. సత్రాజిత్తు తన ఈ ముగ్గురు కన్యలను శ్రీకృష్ణునికిచ్చి పెండ్లి చే నెను.
వృష్టి కుమారులలో కనిష్టుడగు అనమిత్రునకు శినియను కుమారుడు కలిగెను. అతని కుమారుడు సత్య వంతుడు. అతని కుమారుడు సాత్యకి. అతని కుమారుడు యుయుధానుడు. అతని కుమారుడు అసంగుడు. అతని కుమారుడు ధుని. అతని కుమారుడు అసత్వరుడు. ఇది శిని వంశక్రమము. వృష్టి కుమారుడగు అనమిత్రుని వంశమునిట్లు వివ రించుటయైనది. ఈ అవమిత్రున కే యుధాజితుడు ఋషభుడు క్షత్తుడు జయంతుడు మొదలగు కుమారులుండిరి. కాశి రాజపుతి ఋషభుని భార్య యయ్యెను. జయంతునకు జయంతియందు సదాయజ్వా-అతి వీరుడు -శ్రుతవాన్. అతిథి ప్రియుడు అను కుమారులు కలిగిరి. అతిదక్షిణుడగు సదాయజ్వకు అక్రూరుడు కలిగెను. శైబ్యుని కుమార్తె రత్న అను సొమే అక్రూరుని భార్య.
ఆమెయం దతనికి మహాబలులగు పదునొకండుమంది కుమారులు కలిగిరి. వారు. ఉపలంభుడు.సదాలంభుడు ఉత్కలుడు -ఆర్యుడు సితేతరుడు-సదాపకుడు.శత్రుఘ్నుడు. చారుడు-ధర్మధుక్ -ధర్ముడు-మౌనీ- అనువారు. ఆ కూరునకు ఉగ్రసేనయందు దేవవాన్ -ఉపదేవుడు అనువారును అశ్వినియందు పృథు. పృథు- అశ్వత్థామ. సుబాహు-సుపార్శ్వ గవేషణ ధృష్ణు-నేమి. సుపర్ణ-ధర్మ-ధర్మాతి-(శర్యాతి) , అభూమి-బహుభూమి-శర్మిష్ఠ ఆశ్రవణ అను కుమారులును కలిగిరి,
శ్రీకృష్ణుడు తనకు కలిగిన మిథ్యాపవాదమును పోగొట్టుకొనిన ఈకథ వినినవానికి ఎవరివలనను మిథ్యాధి శాపములు సంభవింపవు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున స్యమంతకోపాఖ్యానము వృష్ణివంశానుకథనమునను నలువదియైదవ అధ్యాయము.
Summary of chapter 45 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the main branches of the Yadu dynasty that expanded into the Sātvata, Andhaka, and Vṛshṇi clans across western and central India. The chapter chronicles the noble lineage of Sātvata and his sons Bhajamāna, Devāvṛdha, Andhaka, and Vṛshṇi, highlighting their extraordinary commitment to truth, sacrificial rites, and charity. Devāvṛdha was celebrated for his spiritual perfection, and his son Babhru was hailed as the greatest among men, under whose protection no citizen suffered disease or premature death. The text documents the heroic figures of the Andhaka branch, including Ugrasena and Kamsa, setting the historical lineage for upcoming divine events.