40 - యయాతి అష్టకునకు గృహస్థాది ధర్మముల నుపదేశించుట

“బ్రహ్మచారి - గృహస్థుడు - సంప్రదాయానుసారముగ ఆ ఆశ్రమపు నియమములందు అభినివేశము కల పానప్రస్థుడు సంన్యాసి.వీరు ఎట్లు నడుచుకొనినచో ఆయా ఆశ్రమ ధర్మముల నాచరించిన పుణ్యమును ఫలమును పొంద గలుగుదురు? ఈ విషయమునందు అనేక విధములగు భేదముల) ఆయా ఋషులు చెప్పుచున్నారు.” అని ఆషకుడడుగ యయాతి ఇట్లు చెప్పెను. “బ్రహ్మచారి గురువు పిలిచినప్పుడు వచ్చి అధ యనము చేయవలెను. అడుగనిదే చెప్పనిదే గురుని పనులు చేయవలెను. గురునికంటే ముందు మేల్కొనవలేను. గురుని తరువాత నిదుర పోవలెను. మృదు స్వభావము ఇంద్రియనిగ్రహము నిబ్బరము హెచ్చరిక స్వాధ్యాయము చేయుట- ఈ గుణములు కలిగియున్న చో ఆతని ఆశ్రమ ధర్మములు సిద్ధించును. ధర్మముచే ధనము నార్జించవలెను. దానితోనే యజ్ఞములు చేయవలెను. దానినే దానము చేయ వలెను. దానితోనే అతిథులను భుజింపజేయవలెను. ఇతరులు తమంత తాము ఈయనిదానిని తీసికొనరాదు. ఇది సంప్ర దాయాగతమయిన గృహస్థ ధర్మము. తన శ్రమతో జీవించవలేను. పాపము చేయరాదు. ఇతరుల కీయవలెను. ఇతరులను నొప్పించరాదు. ఆహారమునందును వేషమునందును నియమముల పాటించవలెను. ఇట్లు వానప్రస్థ ధర్మమును పాటించుముని ఉత్తమ (వానప్రస్థధర్మ సిద్ధిని పొందును. విద్యలతో జీవనము గడుపరాదు. సద్గుణములు కలిగియుండవలెను. ఎల్లప్పుడు ఇంద్రియముల నిగ్రహించుకొనవలెను. అన్ని అనుభవములనుండియు విరక్తుడు కావలెను. ఏ స్థానము నందే నను పడుకొనవలెను. అత్యల్పములైన వానినే కోరవలేను. దేశ ములందంతట తిరుగుచుండవలెను. ఒంటరివాడే యుండవలెను. ఇది సంన్యాన ధర్మము. ఏ రాత్రియందు ఈ లోకములు నాకిక చాలుననియు కామములును సుఖములును నాచే జయింపబడినవి అనియును భావన కలుగునో ఆరాతియే వివేకవంతుడగు మానవుడు మనోనిగ్రహము పూని వానప్రస్థుడగుటకు యత్నించవలయును. తాను వానప్రస్థుడే జీవించి శరీర ధాతువులను - అరణ్యమునందు విడిచిన వాడు తన వంశమువారిలో తనకు ముందరి పదితరములవారికిని తన తరువాత రాబోవు పది తరములవారికిని తనకును తన సుకృతమును పంచగలుగును.” అష్టకుడు: “మునులును మౌనములును ఎన్ని విధములో వినగోరుచున్నాము.” యయాతి! “ఎవడు తాను అరణ్యమునందు నివసించుచున్న ను గ్రామము తన వెనుక నే యుండునో ఎవడు తాను గ్రామమునందున్న ను అరణ్యము తన వెనుకనే యుండునో అతడు ముని యనదగియున్నాడు.” ఇది ఎట్లని అష్ట కుడడుగ యయాతి: “అరణ్యమునందు మునిగా నున్నప్పుడు గ్రామములందు లభించు వానిని వేనిని ఉపయోగించరాదు. అట్టి వానికి గ్రామము తన వెనుక నున్న ట్లగును. గ్రామమునందు తానున్న ను అగ్ని హోత్రములను (కామముతో) ఆరాధించక ఇంటిని పట్టించుకొనక తన గోత్రము వేద శాఖ మొదలగు వానికి ప్రాముఖ్యమీయక కౌపీనమును (రహస్యాంగమును) కప్పునంత మాత్రము వస్త్రమును ప్రాణములు నిలుచునంత మా తమాహారమును ఉపయోగించుచుండు మునికి అరణ్యము తన వెనుక నున్నట్లగును, కామములను కామ్య కర్మములను విడిచి జితేంద్రియుడై మునియై మౌనమును (మనన ధర్మమును) పూనియున్న చో అట్టివాడు లోకమునందుండియు సిద్ధి పొందును. స్వచ్చపరుపబడిన దంతములు కత్తిరించబడిన గోళ్ళు కలిగి ఎల్లప్పుడును స్నానమాడి ఉండుచు అలంకరించుకొనియున్నను ఇవి ఏవియు లేక నల్లనివాడే మలినుడై) యున్న ను నిర్మలములగు నడువడులు కలిగియున్న చో అట్టివానిని ఎవరు అర్చింపడగరు? (ఎల్లవారును పూజింపవలసినదే.) తపస్సుచే కృశించి శుష్కించి మాంసము అస్థులు ర క్షము క్షీణించియుండువాడు ఈలోకమును పర లోకమును కూడ జయించును. సుఖ దుఃఖములు శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను జయించి మౌనము ( మనన రూవమగు తపో ధర్మము)ను ఆశ్రయించి మునియె ఈ లోకమును జయించినవాడు మరి ఎవ్వరిని జయింపవలసియుండును? (అతడు సర్వమును జయించినట్లే.) మానవుడు తాను మునియె గోవువలె నోటితోనే ఆహారమును వెదకువాడగుచో అట్టి స్థితిలో లోక పూర్వుడు (సనాతనుడు) అగు పరమాత్ముడు ఇతనికి అమృతత్వము (మోక్షపదము)ను సిద్ధింపజేయును.”

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున యయాత్యష్టక సంవాదము అను నలువదవ అధ్యాయము.