మత్స్య మహా పురాణము
203 - పితృగాథా వర్ణనము.
మత్సుడు మనువునకు ఇట్లుచే ప్పెను: ఈ చేప్పిన ఋషివంశములందు జనించిన విప్రులయందు శ్రాద్ధము జరుపుట పితృ ప్రీతికరము; శ్రాద్ధములందు ఈ ఋషి గోత్రములందు జనించిన వారిని భోక్తలనుగా నియమించవలయును. ఇక ఇప్పుడు పూర్వము స్వపుర (స్వలోక) మందుండి పితరులీ వియమున కీర్తించిన గాథలను వినిపింతును.
సుశీతల బహుతోయములగు నదులయందు మాకు జలాంజలి నిచ్చువాడును సమాహిత చితుడే తేనేతో నూవు లతో కూడిన జలాంజలి నిచ్చువాడును పాలు - మూలములు ఫలములు భక్ష్యములు తిలజలము ఖడ్గ మృగ మాంసము కాల శాకము త్రయోదశినాడు తేనెతో నేతితో పాయసము వర్షఋతువు నందు మఘానక్షత్ర దినమందు కాలశాక (బలు సుకూర) మహాశాకము (పెరుగు తోటకూర)లు తేనె నీవారాన్న ములు కొమ్ములు లేని ఖడ్గమృగముల మాంసము గ్రహణ కాలమున గయయందు యోగులకు(తద్రూపులగు పితరులకు) ఖడ్గమాంశము గజచ్ఛాయాదినమందు మాంసము వీనితో శ్రాద్ధము జరుపు వాడు మాకులమందు జనించిన ఎంతయో బాగుగనుండును. ఇట్టి శ్రాద్దము వలన మాకు కల్పాంతము వరకును తృప్తి కలుగుననిన అన్ని టితో చేసిన దానివలన ఇం కెంత తృప్తి కలుగునో చెప్పవలయునా?
కృష్ణాజినమును గాని ప్రసవించు ధేనువునుగాని దానమిచ్చువాడును వృషోత్సర్గము చేయువాడును శ్రద్ధతో సువర్ణ దానగోదాన పృథివీ దానములు చేయు వాడును కూపారామ త టాక వాపీ ప్రతిష్టలు చేయువాడను సర్వభావముతో విష్ణువు (సర్వాంతర్యామి) దేవేశుడు మధుసూదనుడునగు హరిని శరణు వేడు వాడును విద్వాంసుడు విచక్షుణుడు (వివేకి) ధర్మ శాస్త్రములను యథావిధిగా విద్వాంసులకు దాన మొసగు వాడును మా వంశమునందు జనించవలయును. అని పితరులు గానము చేసిరి. మనురాజా! ఇది మునులు ఉపదేశించిన శ్రాద్ధకల్పము - పాపహరము; పుణ్యవర్గ నము; లోక ములయందు ప్రధానత్వమును కలిగించును.
ఇదీ శ్రీ మత్స్యమహాపురాణమున పితృగాథాను కీర్తనము శ్రాద్ధ కల్పము అను రెండు వందల మూడవ అధ్యాయము.
Summary of chapter 204 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya provides a vivid description of Pitṛ-loka, the sanctified celestial realm where the divine ancestors reside in eternal peace and radiance. Bhagavān Matsya depicts this subtle realm as filled with wish-fulfilling trees, fragrant lotus lakes, golden assembly halls, and peaceful atmosphere free from disease, old age, and mental anxiety. The ancestors abide in this realm in radiant subtle forms, absorbing the devotional essence of offerings made on earth and continually sending blessings of protection, wisdom, and spiritual progress to their mortal descendants.