మత్స్య మహా పురాణము
80 - శుభ సప్తమీ వ్రతము
ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఉపవాస పూర్వకముగా ఆచరించినచో దుఃఖ విముక్తిని భోగములను కలిగించు శుభ సప్తమీ వ్రతమును తెలి పెదను.
ఆశ్వయుజమాసము పుణ్యప్రదము. దాని శుక్ల సప్తమినాడు స్నానజపములుచేసి శుచియై విప్రులచే పుణ్యాహ వాచనము చేయించవలెను. కపిలగోవును భక్తి పూర్వకముగా గంధమాల్యాను లేపనములతో అర్చించవలెను. “సూర్యుని వలన పుట్టినదియు సర్వ భువనములు నివాసస్థానముగా కలదియు శుభక ల్యాణ శరీరము కలదియు అగు నీకు నమస్కా రము.” అని ఆ గోవును సమస్కరించవలెను. రాగి పక్లెరములో కుంచేడు నూవులుపోసి వాని పై శ్వేతవస్త్రము వేసి వస్త్ర మాల్య-గుడ - నానా విధ ఫల భక్ష్యమృత పాయసములతో కూడ బంగారు వృషభ ప్రతిమనుంచి ‘అర్యమా ప్రీయతామ్’ రవి ప్రీతి నొందుగాక!’ అనుచు సంధ్యా కాలమున విపునకు దానమీయవలెను. ఆ పగ లుపవసించి పంచగవ్యమును ఆహారముగా తీసికొని రాత్రిని గడుపవలెను. మరునాటి యుదయము బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి తానును భుజించవలయును. సంవత్సరము కాలము ఇట్లు చేసి ప్రతాంతమున ఈ చెప్పిన సామగ్రితోపాటు మంచమును పడకను ఈ
(సర్వ పరికములతోను) పాత్రలను ఆసనములను వేదవిదుడగు నిపునకు ‘వివస్వాన్ ప్రీయతామ్’ ‘రవి ప్రీతి నందుగాక ! ఆనేడు మంత్రముతో దానము ఈయవలెను.
ఇట్లు చేయువాడు జన్మజన్మమునందును ఇహమున నిర్మ లైశ్వర్య కీర్తులను పొంది పరమున స్వర్గమునందు ఆప్సరోగణ గంధర్వ గణములచే పూజలందుకొనుచు సుఖించి చివరకు దేవగణాధిపుడై కల్పాంతమువరకు ఉండి మరల కల్పాదియందు సప్త ద్వీపాధిపతియే జన్మించును. ఈ వ్రతకల్పమును చదివినందున కలిగిన పుణ్యము వేయి బ్రహ్మ హత్యలను నూరు భ్రూణ హత్యలను నశింపజేయును. (భ్రూణుడు.షడంగములతో వేదముల నధ్యయనము చేసిన విప్రుడు) దీనిని చదివినను విన్న ను ఇతరులకు తెలిపినను ముహూర్త కాలము ఈ వ్రతాచరణము చూచినను అట్టివాడు సర్వ పాప విముక్తుడై విద్యాధర నాయకుడగును.
దీనిని ఏడేండ్లు ఏడు వేరువేరు విధానములతో ఆచరించిన వాడు క్రమముగా సప్తలోకములకు అధిపతియై తుదకు ము కినందును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున శుభ సప్తమీ వ్రత కథనమను ఎనుబదవ అధ్యాయము.
Summary of chapter 80 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the procedural details of the Śubha-Saptamī-Vrata, a sacred vow observed on the seventh lunar day of the bright fortnight to attract all-encompassing auspiciousness and eliminate hidden obstacles. The practitioner worships Sūrya Deva using fragrant white and red flowers, camphor, lights, and sanctified food preparations free from salt. The devotee spends the day engaging in acts of charity, reciting sacred Vedic hymns, and meditating upon the divine form of the Sun as the soul of the universe. The Lord affirms that observing this vow ensures success in all noble undertakings, protects the practitioner's family from negative energies, bestows righteous progeny, and leads to ultimate union with the Supreme Light.