మత్స్య మహా పురాణము
57 - రోహిణీ చంద్రశయన వ్రతము
నారదుడు ఈశ్వరు నిట్లడిగేను: “చంద్రమౌళీ! మానవుడు ఏ వ్రత మాచరించినచో ఇహలోక మున నిరంతర ముగా దీర్ఘాయురారోగ్య వంశాభివృద్ధి సర్వగుణ సమృద్దులు పొందునో అట్టి వ్రతము నుపదేశింపుము.” అనగా ఈశ్వరు డిట్లు తెలి పెను: నీవు చక్కగా ఆడిగితివి. పురాణ వేత్తలు చెప్పేడి వ్రతము ఒకటి పర లోక మునందు కూడ అక్షయ ఫల ముల నిచ్చునది కలదు. అదీ చెప్పెదను. రోహిణీ చంద్రశయన వ్రత ముత్తమమయినది. ఈ వతమున నారాయణ ప్రతిమను చంద్రనామములతో పూజించవలెను. పూర్ణిమా సోమవారము కాని రోహిణితో పూర్ణిమకాని ఐన నాడు ! ద్విజులు) పంచగవ్యములతో ఆవపిండితో స్నానము చేసి 'ఆప్యాయస్వ సమేతు తే' అను మంత్రమును అష్టోత్తరశతము జపించవలేను. శూద్రులయినచో పాషండ (వేద విరుద్దములగు) వచనములు పలుకక ఇదే స్నానము చేసి వరదుడగు సోమునకును విష్ణున కును నమస్కారమను అర్థ మిచ్చు ఈ మంత్రమును అష్టోత్తరశతము జపించవలెను. పిమ్మట నదీతీరమునుండి స్వగృహ మునకు వచ్చి చెప్పబోవు విధమున చంద్రనామములతో విష్ణుపూజ చేయవలెను.
1. సోమాయ శాంతాయ నమః పాదౌ పూజాయామి; 2. అనంత ధామ్నే నమః జానునీ జం ఫేచ పూజయామి; 8. జలోదరాయ నమః ఊరూ పూజయామి; 4. కామసుఖప్రదాయ నమః-మేడ్రం పూజయామీ; 6. శశాంకాయనమః . కటిం పూజయామి; 6. అమృతోదరాయ నమః . ఉదరం పూజయామి; 7. శశాంకాయ నమః - నాభిం పూజయామి; 8. చంద్రాయనమః - ముఖం పూజయామి; 3. ద్విజానా మధిపాయనమః-దంతాన్ పూజయామి; 10. చంద్రమ సే నమః - ఆస్యం పూజయామి: 11. కుముదషండవన ప్రియాయనమః -ఓషో పూజయామి; 12. ఓషధినాధాయ నమః నాసాం పూజ యామి; 18. ఆనంద బీజాయ నమః-ధ్రువో పూజయామి; 14, ఇందీవర శ్యామక రాయ పద్మ విభంజనాయ నమః - శోతే పూజయామి; 15. ఉదధి ప్రియాయ నమః లలాటం పూజయామి; 16. సుషుమ్నాధిపతయే నమః కేశాన్ పూజాయామి; 17. శశాంకాయ నమః శిరః పూజయామి; 18. విశ్వేశ్వరాయ నమః కిరీటం పూజయామి; అని ఇట్లు చంద్ర నామములతో విషుని అవయవములకు పూజ చేయవలయును. (ఇచట క్రమము లో భుజములను పూజించు మంత్రము మూలగ్రంథములో కనబడుట లేదు. తరువాత 'రోహిణి'ని లక్ష్మిగా భావన చేసి 'సౌభాగ్య సౌఖ్యామృతమయమగు మనోహర శరీరముకల రోహిణీరూపలక్ష్మీ:" అని స్తుతించి దేవిని సుగంధపుష్ప ధూపదీప నైవేద్యాదులతో పూజించవలెను.
వ్రత దినమున హవిష్యాన్ని మును ( ఉప్పుళ్లికారము పులుపు తైలములేని ఆహారము - ఆదియును కేవలము బియ్య ముతోపాటు పెసరపప్పుకాని సాత్వికములగు బీరవంటి కూర ముక్కలు కాని కలిపి ఆ త్రేసరు పెట్టి వండిన అన్న ము) తిని నేల పైనే పండుకొనవలెను. తెల్లవారి లేచిన తరువాత స్నానము చేయవలెను. బ్రాహ్మణునకు బంగారముతో కూడ జలపాత్ర దాన మీయవలెను. (పగలంతయు) ఉపవాసముండి గోమూత్రము మాత్రము ఆహారముగా తీసికొనవలెను. (రాత్రి) మాంసాహారులు) మాంసము ఉప్పు పులుపు కారము లేని ఆహారము ఇరువుదేనీమిది ముద్దలు తినవలెను. ముహూర్తకాలము ఇతిహాసము వినవలెను. చంద్రరూపవిష్ణు ప్రీతిగా కడిమినల్లకలువ. మొగలి జాజి-తామర శతదశ పద్మము- వాడగన్నేరు - పాడని తామర - పేంకణము-మల్లె-తెల్లని కరవీరము (ఎర్ర గన్నేరు ఆకులవంటి ఆకులుకల చెట్టున పూచెడి తెల్లని పూలు) (కరవీరము) ఎర్రగన్నేరు.సం పెగ. ఈ పండేండు విధములగు పూలు శ్రావణము' మొదలుగా ఆయా మాసములం దేమాసమునందు వ్రతము చేయుదుమో ఆ మాసము వంతునకు వచ్చువానీస్ పూజ కుపయోగించుట శ్రేష్టము. ఇట్లోక సంవత్సరము వ్రతము జరుపవలేను. అనగా పూర్ణిమా సోమవారము కాని (కా రికమాసములో ఐనచో పూర్ణిమ రోహిణీ నక్షత్ర దినమునకాని ఆరంభించి తరువాత ప్రతి పూర్ణిమనాడును వరుసగ చేయవలయును. వ్రతము (సంవత్సరము) ముగిసిన తరువాత అద్దములు ఇతర పరికరములు అలంకారములు-వీటితో కూడ మంచము చేయించ వలేను. ఆరంగుళముల చంద్రప్రతిమను నాలుగంగుళము") రోహిణీ ప్రతిమను. బంగారుతో చేయించవలెను. (అంగుళము - ఎనిమిది యవగింజలు అడ్డముగా ఒక దాని ప్రక్కను ఒకటిగా పెట్టుటచే అగు పొడవు-3/4 బ్రిటిషు అంగుళము) ఎనిమిది ము తైములు రోహిణికి కంటి ఆవరణ వస్త్రమును పాల పాత్ర పై అక్షతలు నింపిన కంచుపాత్రము.మంచి వస్త్రముల జత. భూషణము(లు)-శంఖము-భోజనము. తెల్లని బియ్యము- చెరకు పండ్లు - మొగమున బంగారు బిళ్ల వెండి గిట్టలు . వెండి కొమ్ములు పైని వస్త్రము పాలు పిండు పాత్ర.దూడ కల.పాడియావు-ఇవి అన్నియు ఉదయమున మంత్రపూర్వకముగా విప్రదంపతులకు దానమీయవలెను. సర్వ లక్షణములు సర్వ సద్గుణములుకల ఆ విప్రదంపతులను అలంకరించి వారిని లక్ష్మీవిష్ణ్వాత్మకులైన రోహిణీచంది రూపులనుగా భావించవలేను. “విష్ణు: రోహిణీరూపయగు లక్ష్మి చంద్రరూపుడవగు నిన్ను విడిచివెళ్ల నట్లే నాకును ఆయా' ఐశ్వర్యములతో భేదము కలుగకుండు గాక! చంద్రా! నీవు నర్వ భూతములకు పరమానందప్రదుడు. కనుక సంసార భీతుడనై ము క్తికాముడనైన నాకు నీ యందలి దృఢభ క్తిచే భుక్తిముక్తులు కలుగు గాక!” అని ప్రార్థించవలెను. ఇది రూపాయురారోగ్య ప్రదమగు ఊ తమ వతము. పితృదేవతా స్త్రీ ప్రీతికరము. దీని నాచరించినవారు ఇరువది యొక్క వందల కల్పముల కాలము త్రిలి'కాధిపతియై బ్రహ్మజ్ఞానము పొంది ముక్తినందును. స్త్రీలు దీని నాచ రించినను ఇదే ఫలము కలుగును.
దీనిని చదివినను వినినను ఉత్తమ జ్ఞానమును పొంది విష్ణులోకమున దేవతలచే పూజలందుకొనును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున, రోహిణీ చంద్రశయన వ్రతమను ఏబది ఏడవ అధ్యాయము.
Summary of chapter 57 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the Rohiṇī-Chandra-Śayana-Vrata, a sacred vow observed when the moon conjoins the star Rohiṇī on a Monday or an auspicious Tithi, designed to bestow beauty, marital bliss, and domestic harmony. The devotee constructs a consecrated altar, placing a silver icon of Chandra Deva beside a golden icon of Rohiṇī resting upon a decorated couch. The practitioner worships the celestial couple with white lotuses, camphor, sandal paste, and offerings of rice cooked in sweetened milk, maintaining a peaceful and truthful demeanor throughout the day. At the conclusion of the vow, the icons and couch are presented as ritual charity to a pious Brāhmaṇa couple, which grants the worshipper captivating personal radiance, unbroken marital happiness, abundant wealth, and final absorption into the lunar realm.