మత్స్య మహా పురాణము
223 - దానోపాయ విచారము.
శ్రీమత్స్యడు మనువునకు ఇట్లు చెప్పెను; సర్వోపాయములలో దానము శ్రేష్ఠతమమును-గొప్పదియును; అది చక్కగ . ఇచ్చినచో (ఉభయ) ఇహపర లోకముల - జయించగలుగును; రాజా! దానము చే వశవర్తికానీ వాడెవడును లేడు; ఈ లోకము నందలి మానవులకును దేవతలు కూడ దానముతోనే సదా వళగులు అగుచున్నారు; నృపోత్తమాః సర్వ ప్రజలును దానమును అవలంబించియే జీవనము చేయగలుగుచున్నారు; (అందరకును దానమే జీవన సాధనము); ఏలయన దానము చేయు ప్రతియొక డును ప్రతియొకనికి ప్రీతిపాత్రుడగుచున్నాడు. ఆటు లే దానవరుడగువాడు అచిర కాలముననే పరుల జయించగలుగును. దానవంతుడే సుసంహతులగు శత్రువులను కూడ భేదింపగలుగును. (కావున భేద ప్రయోగమున గూడ దానము ఉపయుక్తమగును; అభేద్యులు-అలుబులు-గంభీరులు సాగర సమానులునగు పురుషులు నుండవచ్చును. వారు ఇత రులిచ్చినది తీసికోనని మాట వాస్తవమే; అయినను ఆట్టిపోరు కూడ దానపరుడు ఉదారుడునగు రాజునందు పక్షపాతము వహింతు ; ఇతరుల విషయమున చేసిన దానము కూడ ఆదాన గ్రహీతలనేకాక ఇతరులను కూడ వశీక రించు కోనును. ఆందుచేతనే జనులు ఇతరోపాయములకంటె దానము శేషతమమందురు. దానము పురుషులకు శ్రేయస్కరము. దానము మిగుల శ్రేష్టతమము. దానవంతుడే (ఇహపర) లోకములందు యత్న పూర్వకముగా నిలుపబడును. (దేవతలు అతనికి ఇహపర సుఖములనిచ్చి నినున్నత స్థానము నందు నిలుపుదురు.) దానపదలగు పురుష ప్రవీరులు కేవలము ఒక భూలో కమును మాత్రము జయించరు. రాజా! వారు విబుధుల (దేవతల) అధివాసమును జయింప (పొంద) సులభముగా ఆలవి కానీదీయునగు సురేంద్ర లోకమునుగూడ జయింతురు,
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మమున దానోపాయ కథనమను రెండు వందల ఇరువది మూడవ అధ్యాయము.
Summary of chapter 224 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya provides precise ritual instructions for performing Shānti-karma, sacred fire sacrifices and purification rites designed to pacify inauspicious omens and environmental disturbances. Bhagavān Matsya details Homa rituals using specific sacred woods, samidhs, grains, ghee, and herbal extracts accompanied by Vedic hymns to neutralize negative subtle influences. The text mandates that conducting these rites restores balance, protects the kingdom from plagues, and ensures seasonal rainfall and agricultural abundance.