మత్స్య మహా పురాణము
17 - సాధారణ శ్రాద్ధ విధానము - ఆభ్యుదయిక శ్రాద్ధ విధానము
సూతుడు ఋషులతో ఇంక ను ఇట్లు చెప్పనారంభించెను. (ఇంతవరకు నేను మీకు మూడు విధములగు నైమిత్తిక శ్రాద్దములలో మొదటిదగు పార్వణ శ్రాద్ధపు విధానమును తెలిపితిని.) ఇక మీదట మత్స్యరూప నారాయణుడు మనువునకు చెప్పిన సాధారణ శ్రాద్ధ విధానము తెలి పెదను. ( ఇది నైమిత్తిక శ్రాద్దములలో రెండవది.) . దీని వలన భుక్తి ముక్తులు లభించును.
(ఈ శ్రాద్ధము జరుపవలసిన కాలమును - దేశమును) ఉత్త్రరాయన దక్షిణాయన ప్రవేశ పుణ్య కాలములును రెండు విషువ దినములును (రాత్రింబవళ్ళ పం: మాణము సమముగా ఉండు దినములు సూర్యుడు ఆయా రాశులయందు ప్రవేశించు దినములును అమావాస్య అష్ట కా (మాసమున కృష్ణపక్ష సప్తమీ) కృష్ణపక్ష చతుర్దశి "తిథులును ఆర్గామఖా రోహిణీ నక్షత్ర దినములును శ్రాద్ధమునకు యోగ్యములగు ద్రవ్యములును యోగ్యులగు బ్రాహ్మణులును లభించిన దినములును గజచ్ఛాయా వ్యతీపాత్ విష్టి వై ధృతి యోగములున్న దినములును యుగాది (మన్వంతరాది : దినములును అనేది ఈ దినము లందు జరిపిన శ్రాద్ధము, అక్షయమగును. ( అనంత ఫలమును ఇచ్చును.) : (వీనిలో, గజచ్ఛాయావ్యతీపాత విష్టి వైధృతి యోగములు జ్యోతిశ్శాస్త్రమునుండి తేలియవలెను.) వైశాఖ తృతీయా కార్తిక నవమీ మాఘ.. పంచదశీ బాద్రపద త్రయో దశీ-ఇవి యుగాదులు. అశ్వయుజ శుక్ల నవమీ కార్తిక ద్వాదశీ చైత్ర తృతీయా. భాద్రపద .. తృతీయా ఫాలునామావాస్యా పుష్యైకాదశీ ఆషాఢ దశ మీ మాఘ సప్తమీ శ్రావణ కృష్ణాష్టమీ ఆషాఢ పూర్ణిమా కార్తిక ఫాల్గున చైత జ్యేష్ఠ పూర్ణిమలు మన్వంతరాది దినములు. (ఇచట కొన్ని తిథుల విషయమున పక్ష మును చెప్పలేదు. మరియు పంచాంగములలో మన్వన రాదులు ఈ విధముగా నున్నవి. కార్తిక శుక్ల ద్వాదశీ .. స్వాయంభువ-ఆశ్వయుజ శుక్ల నవమీ స్వారోచిష-పైత్ర శుక్ల తృతీయా-ఉత్త్రమ - భాద్రపద శుక్ల తృతీయా తామస-పుష్య శు కైకాదశీ రైవత-ఆషాడ శుక్ల దశ మీ చాక్షుష-మాఖ శుక్ల సప్తమీ వైణవస్వత శ్రావణమావాస్యా అగ్ని సావర్ణి-ఫాల్గున పూర్ణిమా, బ్రహ్మసావర్ణి-కార్తిక పూర్ణిమా దక్షసావర్ణి భాద్ర పద కృష్ణాష్టమీ సూర్యసావర్ణి.ఆషాడ కృష్ణాష్టమీ.రుద్రసావర్ణి-జ్యేష్ఠ పూర్ణిమా బౌత్య చైత్ర శుక్ల పూర్ణిమా రౌచ్య . వీనిలో వైవస్వత మన్వంతరాదియగు మాఖ శుక్ల సప్తమీ తిథినాడు సూర్యుడు తన రథమును ఆరోహించెను. సంపాదించుకొనెను. కనుక దీనికి రథ సప్తమీయని వ్యవహారము ఏర్పడినది. ఈ దినమున మనుష్యుడు ప్రయతుడై । దేహమున చిత్త్రమున శుచియై తిలలతో మిశ్రితమయిన ఉదకమును మాత్రమైనను పితృ దేవతల నుద్దేశించి అర్పించినచో వేయి సంవత్సరముల కాలము శ్రద్ధతో యథావిధిగ శ్రాద్ధము పెట్టినంత ఫలము కలుగును. వైశాఖామావాస్య నాడును గ్రహణ దినములందును ఉత్సవ దినములందును మహాలయ దినములందును తీర్థములందును క్షేత్రములందును గోవులు నిలుచు ప్రదేశములందును ద్వీపములందును ఉద్యాన గృహములందును (ఉద్యానవనములు వేరు. లేదా ఉద్యాన వసములందును తనకు అనుకూలమయిన గృహములందును వివి క్రమగు (ఎట్టి అపవిత్రతకును కలవరపాటునకును అవ కాశము కలుగనీయని ప్రదేశమునందును చక్కగా అలికి ఆ ప్రదేశమున శ్రాద్ధము జరుపుట శాస్త్రమును సంప్ర దాయమును ఎరిగిన వారు చేయవలసిన పని.
శ్రాద్ధకర్త శ్రాద్ధమునకు ఒక దినము ముందుగా గాని రెండు కాళ్లు ముందుగాగాని మంచిశీలము సత్కర్మాను స్థానము నధుణములు కలిగిన వారిని తగిన వయస్సు రూపము కలవారిని శ్రాద్దమున భోక్తలుగా నియంత్రించవలెను. విశ్వదేవస్థానమున ఇద్దరను పితృ స్థానమున ముగ్గురిని మాత్రమే భుజింపచేయవలెను. లేదా ఒక్కొక్క స్థానమునకు ఒక్కొక్కరై నను చాలును. కర్త తానెంత ధనవంతుడై నను ఆంతకంటే ఎక్కువమందిని పిలువరాదు.
మొదట విశ్వదేవులకు ఆసనమునిచ్చి వారిని యవలతో పుష్పములతో పూజించవలెను. దర్భపవిత్రములను ధరించి రెండు పాత్రలను జలముతో నింపవలేను. 'శన్నో దేవీ?' అను మంత్రముతో నీటిని ఆ పా తలలో పోయవలెను. 'యవోస్" అను మంత్రము తో పాత్రలో యవల వేయవలెను. గంధ పుష్పములతో పాత్రలను పూజించి విశ్వేదేవులముందుంచవలెను. ‘వి శ్వేదేవాసః' అను మంత్రముతో విప్రులయందు వి శ్వేదేవతల నావాహనము చేయవలెను. తరువాత వారిమీద యవలను విదలించవలెను. తరువాత బ్రాహ్మణులను గంధ పుష్పములతో అలం : ఓంచి 'యా దివ్యా?' అను మంత్రముతో వారి చేతుల యందర్యము విడువవలెను. మరల వారిని అర్చించి వారినుండి వీడ్కోలు అనుమతి పొందవలెను. పిమ్మట పితరులను అర్చించుటకు రావలెను. దర్భలతోడి ఆసనములను పితృస్థానమునందలి బ్రాహ్మణులకు వేయవలెను. వీరిముందున్న మూడు పాత్రలను నీటితో నింపవలేను. పవిత్రములను ధరించవలెను. 'శ న్నో దేవీ?' అను మంత్రముతో పాత్రలయందు నీటిని పోయవలెను. 'తిలోసి' అను మంత్రముతో పాత్రలందు తిలలను వేయవలెను. గంధ పుష్పాదులను కూడ పాత్ర లలో వేయవలెను. ఈ అర్య పాతములు రావివంటి వనస్పతుల కొయ్యతో చేసినవి కాని ఆకుల దొన్నెలు కాని సముద్రమునుండి లభించు శంఖము మొదలైనవి కాని అయియుండవలెను. లేదా వెండిదో బంగారపుదో కావచ్చును. రజతము అను మాటయు రజతమును చూపుటయు దానము చేయుటయు పితృ ప్రీతికరము. వెండి పాత్రలతో కాని వెండి కలిసిన లోహపు పాత్రలతో కాని శ్రద్ధతో పితరులకు ఇచ్చినది అక్షయమై అనంతఫలము నిచ్చును. ఆర్యముంచుటకును విడుచుటకును కాని పిండముల నుంచుట మొదలగు పనులలో కాని పితృదేవతలకు వెండి చాల ప్రీతికరమైనది.
వేడి శివుని కంటినుండి పుట్టినది. కనుక నే అది పితృ ప్రీతికరము. అది శుభకరము మా తము కాదు. కనుక దానిని దేవ కార్యములందు ఉపయోగించరాదు.
ఈ విధముగా తనకు లభించునంతలో (శ్రాద్ధమున కై) పాత్రలను సమకూర్చుకొనవలెను. మత్సరము మొదలగు మనోదోషము లేమియు లేక యుండవలెను. ‘యా దీవ్యాః' అను పు తముతో పితరుల సొమ గోత్రములను చెప్పుచు. దర్బలను చేత పట్టుకొని “పితరులను మీయందు ఆవాహనము చేయుచున్నాను.' అను అర్థ, నిచ్చు మంత్రముతో ఆదర్భా లను బ్రాహ్మణుల చేతియందుంచవలెను. ఆసమయములో ' మీయందావాహనము చేయుచున్నాను.' అని కర్త అనగా 'తథా! • అట్లే కానిమ్ము.' అని ఆ విప్రుడ నును. 'ఈ శంతస్త్వా' అను మంత్రముతో కాని 'ఆయంతు' అను మంత్రముతో కాని వారియందు పితరులను ఆ.వాహనము చేయవలెను. 'యా దివ్యా' అను మంత్రముతో వారిచేతిలో అర్యమును విడువవలెను. గంధ పుష్పవస్త్రములీయవలెను. అర్యము మొదట విశ్వేదేవులకు.తరువాత పితరులకు. సంశ్రవ మంత్రము కూడ చెప్పుచుండవలెను. అర్షమును విడిచిన తరువాత న్యుస్టుడే (ముందునకు వ"గినవాడై ! ఆ అర్ఘ్యపాత్రలను భో కకు ఉత్త్రరముగా ఉంచవలెను. 'పితృభ్యః స్థానమసి' అను మంత్రముతో ఆ పాత్రలను భో కకు ఎడమ దిక్కుగా శుచి ప్రదేశమున ఉంచి వాటిని నీటితో పరి షేచనము చేయవలెను.
ఈ సాధారణ శ్రాద్దమందు కూడ పార్వణ శ్రాద్ధమునందు వలేనే నిర్మలచిత్తుడై అగ్నిగౌకరణమును జరుప వలెను. తరువాత ప్రశాస్త్ర చిత్తుడై నిరంతరముగా దర్భలను చేత ధరించియేయుండి రెండు చేతులతోను పదార్థములను అన్నిటిని తెచ్చి భోక్తల పాత్రలయందు వడ్డించవలెను.
పితృ దేవతలను ఉద్దేశించి భోక్తలచే భుజింపజేయు అన్న ము శుచియై రుచికల మంచి ఆహారమునకు ఉండ వలసిన అన్ని గుణములును కలిగి ఉండవలెను. నానా విధములగు భక్ష్యములతో చేరి ఉండవలెను. పప్పు ఆకు కూరలు కాయ గూరలు ఉండవలెను. పదార్థములన్నియు చాల రుచిక లపై ఉండవలెను. ఆవు పాలు ఆవు నేయి శర్కర ఉండ వలేను. ఇటువంటి అన్న మును మాంసమును పితరులకు తృప్తి కలిగించును. అని సాక్షాత్ విష్ణువే చెప్పెను. మాంసము లలో మత్స్య మాంసము రెండు మాసముల పాటు లేడి మాంసము మూడు మాసములపాటు పొట్టేలు మాంసము నాలుగు మాసముల వరకు పాలపిట్ట మాంసము ఐదు మాసముల వరకు మేక మాంసము ఆరు మాసముల వరకు ఎర్ర మేక మాంసము ఏడు మాసముల వరకు ఇట్టి మాంసము ఎనిమిది మాసముల వరకు తెల్లని మచ్చలు గల ఇట్టి మాంసము తొమ్మిది మాసముల వరకు అడవి పంది-అడవి దున్న-మాంసములు పది మాసముల వరకు తాబేటి మాంసములు పదు నొకండు మాసముల వరకు ఆవు పాలతో చేసిన పాయసము సంవత్సరము వరకు రురు మృగపు మాంసము పదునై దు మాసముల వరకు పొడవు చెవులు గల అడవి మేక మాంసము పం డెండు సంవత్సరముల వరకు ఖడ్గ మృగపు మాంసము కానీ బలుసాకు కూర గాని అనంత కాలము వరకు పితరులకు తృప్తి కలిగించును. కాని ఆవు పాలతో వండి తేనె కలిపి ఆవు నేతితో సంస్కరించిన పాయసము పితృదేవతలనుద్దేశించి పెట్టిన చో అక్షయమై యుండును. అని పితృ దేవతలే స్వయముగా చెప్పిరి. (దీనిని బట్టి శ్రాద్ధములయందు ఈ చెప్పిన విధమగు పాయసముతో భోక్తలను భుజింపజేయుట సర్వోత్త్రమమని తేలుచున్నది.] భోక్తలు భుజించు సమయమున వేదము నుండి పితృదేవతా విషయమును ప్రతిపాదించు అనువాకములను మంత్రములను సమ స్తములగు పురాణములను బ్రహ్మ విష్ణు సూర్య రుద్రుల వివిధ స్తోత్రములను ఇంద్రుడు అగ్ని సోముడు దేవతలుగా గల సూక్తములను పవమాన సూక్తములను బృహద్రథంతరము రౌహిణము జ్యేష్టము అనబడు సామవేద భాగములను శాంతికాధ్యాయము (వేదమునందలి భాగము )ను మహాబాహ్మణము మండల బ్రాహ్మణము అను వేద భాగము లను పఠించుచు వారికి వినిపించుచుండవలెను. ఇంతేకాదు. తనకును పితరులకును ఏయే స్తోత్రములు పురాణాదులు వేద భాగములు మొదలైనవి ప్రీతికరములో అవి ఏవై నను పఠించి వినిపించవలెను. (దీనినే అభిశ్రవణము అందురు.. మ-పు-9)
ఇట్లు భోక్తలు భుజించిన తరువాత ఆ భోజన సమీపమున భోజనపు ఆకులలో (పాత్రలలో మిగిలిన అన్నము మొదలగు అన్ని పదార్థముల నుండియు చాల కొంచెము కొంచెము అంశ మును ఎత్తి తీసికొని భోక్తల ముందు భాగమున నేల పై వెదజల్లినట్లు వేసి ఉచ్చిష్ట భాక్కులకొరకై దానిని విడువవలెను. వికిర పిండమును అక్కడ ఉంచ వలెను. ఉంచుచు ఈ ఆర్థమును ఇచ్చు మంత్రమును చెప్పవలెను. “నా వంశమున పూర్వులలో ఎవరైన అగ్నిచే దహింప బడినవారు గాని (మరణానంతరము) ఆగ్ని చే దహన సంస్కారము పొందనివారు గాని తల్లిదండ్రులు, బంధువులు గోత్ర శుద్ధి లేనివారు గాని ఎవరైన నున్న చో వారును కుల స్త్రీలై యుండియు ఎవరును పట్టించుకొనక పోవుటచే మరణించిన .
సాధారణ శ్రాద్ధ విధానము.11 అ. తరువాత ఏ (పైతృక) సంస్కారములను పొందని స్త్రీ లెవరై న నున్న చో వారును నేను భూమి పై వేసిన ఈ వికిరాన్న ముతో తృప్తి చెంది ఉత్త్రమగతిని పొందుదురు గాక !” భోక్తలు తృప్తిగా భుజించినారని తెలిసికొనిన తరువాత వారి చేతులందు ఒక మరుగా మాత్రమే నీరు (ఉత్త్రరాపోశనమున కై) వేయవలెను. తరువాత గోమూత్ర గోమయములతో అలికిన నేల పై దక్షిణపు కొనలుగా దర్బలను పరచవలేను. వాని పై అన్ని పదార్థములతో కలిపి చేసిన పిండములను పితరుల సామగోత్రములతో అవనేజన పూర్వక ముగా (నీటితోను నేతితోను తడిపి శుద్ధి చేసి ఉంచవలయును. అపసవ్యముతో పిండములను దర్భల పై ఉచ వలెను. సవ్యముగా చేసికొని వాటిని ప్రదక్షిణించి నమస్కరించవలెను. ఈ పిండములు ఆయా పితరులకు చెందుగాక అని మంత్రమును చెప్పవలెను. తరు వాత దర్బలను చేత ఉంచుకోని యథావిధిగా పిండములకు ధూపదీవ పుష్ప నైవేద్యము లతో అర్చన చేయవలెను.
పిమ్మట భోక్తలు పాత్రల దగ్గర నుంచి లేచి కాలు చేతులు కడుగుకొని) ఆచమనము చేయుదురు. కర్తయు ఆచమనము చేయవలెను. అపుడు వారికి ఒక్కోక్కమారు మాత్రమే హస్తము పై నీరు వేయవలెను. పూవులను అక్షతలను అక్షయ్వోదక మును వారి చేతులయందు వదలవలెను. తన గోత్ర నామములను చెప్పుచు (ఈ గోత్రమున పుట్టి ఈ నామము గల నేను ఇచ్చుచున్నాను అనుచు తన శ క్తికొలది తనకును ఆ బ్రాహ్మణులకును తన పితరులకును ప్రీతికరమైనవి గోవు-భూమి-బంగారము-వస్త్రములు.మంచి పడకలు- ఏవే నను దక్షిణగా ఈయవలెను. తన శక్తికి తగినట్లు ధన లోపము చేయక దక్షిణలనీయవలేను. ఇచ్చినచో పితరులకు తృప్తి కలుగును. కనుక ఆ విధముగా చేసి పితృ దేవతలను తృప్తి పరచవలయును.
తరువాత పితృదేవతా స్థానమున భుజించిన బ్రాహ్మణుల దగ్గర స్వధావాచనికమును ('స్వదోచ్యతాం' ఇత్యాది . మంత్రమును పఠించుట) విశ్వేదేవస్థానమున భుజించిన బ్రాహ్మణుల దగ్గర ఉదక దానమును జరుపవలెను. తరువాత సంప్రదాయమును ఎరిగి కర్త తూర్పు ముఖముగ కూర్చుండి వారి నుండి ఆశీస్సుల గ్రహీంపవలెను. పితృ దేవతలు మా యందు ప్రీతికల వారగుదురు గాక !' అని క ఁ అనగా ' అగుదురు గాక !' అని ! బ్రాహ్మణులు అందురు. 'అస్మదో త్రం వర్ధ తామ్' 'మా గోత్రము వర్ధిల్లుగాక !' అని కర్త అనగా 'అట్లే అగుగాక !' అని భోక్తలు అందురు. లోగడ చెప్పినట్లు 'మాకు అడుగక యే ఇచ్చు దాతలు ఉందురుగాక !' ఇత్యాది మంత్రమును కర్త చెప్పవలెను. ' ఈ ఆశీస్సులు సత్యములు అగుగాక !' అని భోక్తలు అందురు. పిమ్మట భ క్తితో పిండములను ఎత్తి ఉంచి స్వస్తి వాచ నిక ము జరుపవలెను. భోక్తలగు బ్రాహ్మణులు ఇంటియందు ఉన్నంతవరకును ఎంగిళ్లు తీయరాదు. తరువాత తీయవలెను. అట్లు వారు తినిన ఎంగిళ్లు తీసి పిమ్మట గృహబలిని వైశ్వదేవమును , చేయవలెను. అని ఇట్లు ధర్మ వ్యవస్థ చేయబడియున్నది.
భోక్తలు భుజించునపుడు భూమిపై పడిన ఉచ్ఛేషణము (మిగిలిన పదార్థము) శ్రాద్ధకర్త ఇంటిలో ఊడిగము చేయు వారిలో కపటము కొంటెతనము లేని సేవకులకు పితృ శేషముగా తినుటకు ఈయవలెను. అని పెద్దలు చెప్పుచున్నారు.
ఈ చెప్పిన విధముగా జరిపిన శ్రాద్ధకర్త వంశములోను బంధుమిత్రాది జనములోను పుత్తులున్న వారికిని లేని వారికిని అట్టి స్త్రీలకును (పూర్వము మరణించియున్న వారికి) అందరకును తృప్తి కలిగించును. అని పూర్వము పితృదేవతా గణము వారు వ్యవస్థ చేసియున్నారు.
ఇక ఈ శ్రాద్ధ ప్రక్రియ అంతయు ముగిసిన తరువాత భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పుట ఎట్లనిన) శాబ్దిక ర్త భోక్తలు భుజించిన ప్రదేశమున శ్రాద్ధము జరిపిన ప్రదేశమున నిలువబడి చేత ఉదక పాతమును పట్టుకొని యుండి 'వాజీ వాజే' ఈ మొదలగు మంత్రమును చెప్పుచు దగ్భకొనతో వారిని తాకుచు వారిని విసర్జించ (వీడ్కోలు చెప్ప) వలేను. వారిని ప్రదక్ష్మి ణించి వారి పాదములను స్పృశించవలేను. వారు బయలు దేరి పోవుచుండ వారివెంట కొంత దూరము పుత్ర భార్యా బంధువర్గముతోకూడ పోవలెను. తరువాత వారికొక మారు నమస్కరించి వెనుకకు మరలివచ్చి అగ్ని ని పూజించి వైశ్వదేవమును నిత్యబలిని జరుపవలెను. తరువాత పితృ శేషమును శ్రాద్ధకర్త తన సగోత్రులతో సుతులతో బాంధవులతో ఆతిథులతోపాటుగ తానును భుజించవలెను.
ఈ విధమగు శ్రాద్దము అన్ని పర్వములయందును ఈ పైని చెప్పిన వానిలో ఏ పర్వమునందై నను) జరుప వలెను. జరుపవచ్చును. దీనిని ఉపనయనము కానివాడై నను భార్య లేనివాడై నను విదేశమునందు ఉన్న వాడై నను శక్తి యున్న చో (తనశ క్తికి తగినట్లు) చేయవలెను. శూద్రుడై నను మంత్రహీనముగా ఇదే ప్రక్రియతో శ్రాద్ధము జరుపవలెను. ఇది సాధారణ శ్రాద్ధ విధానము.
మూడవ నైమిత్తిక శ్రాద్దమునకు ఆధ్యుదయికము అని పేరు. దానికే వృద్ధి (శుభ) శ్రాద్దమనియు పేరు గలదు.
ఉత్సవములు మొదలగు ఆనందకరమగు కార్యములు జరుపునపుడును యజ్ఞములు వివాహములు మొదలగు శుభ కార్యముల సమయములందును ముందుగా ఈ ఆభ్యుదయిక శ్రాద్దమును జరుపవలయును.
దీనియందు మాతృపితామహీప్రపితామహ్యాది స్త్రీలను మొదట పూజించవలెను. పితృ పితామహాదులను తరువాత పూజించవలెను. తరువాత మాతామహుడు మొదలగు వారిని పిమ్మట విశ్వేదేవులను పూజించవలెను. ప్రదక్షిణ ముగా (సవ్యముగా ఆయా ఉపచారములు జరుపవలెను. (ఈ వృద్ధి శ్రాద్దమునందు అపనవ్యము చేసికొనకూడదు). పెరుగు అక్షతలు ఫలములు ఉదకము మొదలగునవి వినియోగించవలెను. (తిలలు కూడదు . తూర్పు మొగముతో పిండము లను నిర్వహణము చేయవలెను. (దక్షిణముఖము కూడదు . “సంపన్నం' అనియు ప్రీయతాం' అనియు మాత్రము చెప్ప వలెను. (స్వధా అని చెప్పరాదు), సరి సంఖ్య లోనే (బేసి సంఖ్య కూడదు !. బ్రాహ్మణులను అర్చించ (భుజింపజేయ వలెను. వస్త్రములు బంగారు మొదలగునవి వారికిచ్చుటకును కర్మానుష్టానములోను వినియోగించవలెను. వెండి పాత్రలు -దర్భలు కూడదు.) తిలలకు మారుగా యవలను ఉపయోగించుచు నాందీ శబ్దముతో ఈ కార్యమును జరుపవలెను. శుభమునకు సంబంధించిన మంత్రములను స్తోత్ర ములను పఠించి బ్రాహ్మణులకు వినిపింపవలెను. (పిత్యములగు వేద భాగములు కూడదు. ఇది ద్విజులు వృద్ధి నాందీ-శ్రాద్ధము-జరుపవలసిన విధానము. శూద్రులు కూడ పైవారివలెనే నమస్కారపూర్వక మయిన మంత్రములతోను ఇతర మంత్రములేవియు లేకుండగను ఈ వృద్ది శ్రాద్ధము జరుపవలెను. కాని శూద్రులు భోజనా దికము లేకుండ ఆయా పదార్థములను దానము చేయుటతోనే జరుపవలెనని భగవానుడు ప్రభువు అగు నారాయణుడు చెప్పెను. ఏలయన శూద్రునకు దానమాత్రముతోనే అన్ని కోరికలు ఫలించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్దకల్పమున సాధార ణాభ్యుదయిక శ్రాద్ధ విధాన కథనమను సప్తదశాఽధ్యాయము.
Summary of chapter 17 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya delineates the distinctions between regular ancestral rites known as Nitya-Śrāddha, periodic rites known as Naimittika-Śrāddha, and special auspicious ancestral rites known as Abhyudayika or Vṛddhi-Śrāddha. The Abhyudayika-Śrāddha is performed prior to joyful life events such as the birth of a child, marriage, sacred thread ceremony, or consecration of a home, seeking the blessings of benevolent ancestors. Unlike funereal rites, the Abhyudayika ceremony is conducted facing the east or north during the morning hours, using straight Kusha blades and auspicious unblemished grains, where the ancestors are addressed with joyful salutations rather than mourning. The Lord emphasizes that no major life sacrament or holy enterprise yields full fruit without first invoking and satisfying one's ancestors through this joyful ceremony.