మత్స్య మహా పురాణము
155 - ఆ దానవుడు అంతఃపురము ప్రవేశించి ఈశ్వరునిచే మడియుట॥
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: తపము చేయపోవుచున్న పార్వతీదేవికి అలంకృతమై తన వయిపునకు వచ్చుచున్న కుసుమా మోదిని యను ఆ పర్వతమునందలి యొక దేవత కనబడెను॥ ఆమె పార్వతి తల్లియగు మేనా దేవికి సఖి; ఆమె గిరిపు శ్రీని చూడగనే స్నేహ పరవశ మానసయై గట్టిగ నామెను కౌగిలించుకొని బిడ్డా! ఎక్కడకు పోవుచున్నాననెను॥ ఆ గిరిజయు ఆమెకు శంకరుని వలన తనకు కోప కారణముగా కలిగిన అవమాన విషయము చెప్పి ఇంకను ఇట్లనెను: నీవు దేవతవు మాత్రమే కాక నాకు తల్లి వంటిదానవు; ప్రశంసింపదగిన గుణవతివి; ఆనిందితవు; ఈ శైలాధి రాజమందు ఉండు దేవతవు; ఈ పర్వతమే నీ సన్నిధి; నా పై నీకు వాత్సల్యమధికము; ఇందుచేతనే నీవు బుద్దితో యోజించి చేయవలసిన పనియొకటి చెప్పుచున్నాను॥ అన్యస్త్రీలు ఇట ప్రవేశించకుండ నీవు ప్రయత్నపూర్వ కముగ రక్షించవలయును॥ ఇది రహస్య ప్రదేశ్ ము; ఇతరులు ఇట చొచ్చినను నీకు తెలియక పోవచ్చును; కనుక నీవు ఈ గిరియందు సదా అవధానముతో నుండవలెను॥ ఈ శివాంతఃపురమున ఏ స్త్రీయేన ప్రవేశించినచో పూజ్యురాలా! నీవు నాకు చెప్పవలెను॥ తరువాత నేను తగిన విధమున చేయుదును; అనగా ఆ కుసుమా మోదిని యను శుభరూప సరేయని తన నివాసమగు పర్వత భాగమునకు పోయెను; అది సుతయగు ఉమయు త్వరగ తండ్రి యుద్యానమున కేగెను॥ మేఘమాలతో మలినమగు (నల్లని) కాంతిగల ఆంతరిక్ష భాగమును చేరి ఆమె తన వీభూషణములు చెట్ల నారలు ధరించెను, గ్రీష్మర్తువున పంచాగ్ని నంత ప్తయగుచు వర్షర్తువున నీటితో తడియుచు వన్యాహారములనే తినుచు నిరాహారగానే గడపుచు శుష్కమగు (ఏ పడకలును లేని) నేల పై పండుకొనుచు ఇట్లు దేహమును సాధన చేయుచు తపస్సుతో ఆమె నియమవంతురాలయ్యెను॥
పార్వతీరూపధారిణః ఆడినామకాసురస్య ఈశ్వరాన్తఃపురప్రవేశ॥
ఈ నడుమ కాలములో ఆడి అను దైత్యుడు పార్వతి ఇట్లలిగిపోయిన విషయము తెలిసికొనెను॥ వాడు చాల బలశాలి; అంధకాసురుని కొడుకు; బకునికి ఆన్న ; చాలగర్వి; యుద్ధమున దేవతలనందర జయించినవాడు; యుద్ధమున ఎదురు లేనివాడు; తన తండ్రియగు ఆంధకుని శివుడు చంపుటచే ఆపగబూనినవాడు; చంద్రమౌళిపై కసి తీర్చుకొన వేచియుండెను॥ వాడిపుడిది ఎరిగి శివుని యంతః పురమునకు రాగా వానికి ద్వారమందు వీరకుడు కనబడెను॥ ఆపుడు వానికి మునుపు బ్రహ్మ తనకిచ్చిన వరము గురుతునకు వచ్చెను॥ ఆ వర కథ ఇది; పూర్వము శివుని చేతిలో అంధకుడు చచ్చిన తరువాత ఈ ఆడి పరమదారుణమగు ఉత్తమ తపమాచరించెను॥ బ్రహ్మ మెచ్చి దానవ శేషా! ఆడి! ఈ తపఃఫలముగా నీకేమి కావలయుననెను॥ మృత్యువు నొకుండరాదనీ వాడన బ్రహ్మ దానవాః మృత్యువు లేని ప్రాణి ఏదియు లేదు॥ ఏదో సమయమున ఏదోయొక దానినుండి ప్రాణి మరణించి తీరును॥ అనగా ఆ దైత్య సింహుడు పద్మభవునితో పద్మ నంభవా! నాకు రూప పరివర్తనము కలిగినపుడు నాకు మరణము కలుగవచ్చును॥ లేనిచో నేనమరుడనే కావలయును॥ ఆనేను॥ అది విని తుష్టుడై కమలభవుడు నీకు రూప పరివృత్తిచే రెండవ రూపము కలిగినచో మృత్యువు కలుగును॥ లేనిచో కలుగదు॥ ఆనేను॥ దీనితో తనకు అమరత్వము లభిం చేనని సుమహాబలుడు ఆగు ఆ దైత్యుడు తలచేను॥ ఇపుడు వానికి ఇతరులు తను చంపుటకు ఇది యుపాయమైనదియని తోచియు వీరకుని దృష్టి మార్గమునుండి తప్పించుకొనదలచి సర్పరూపుడై ఒకానొక రంధ్రమునుండి వాడంతఃపుర ములోన ప్రవేశించెను॥ ఇట్లు ఆ గణేశుని దృష్టి మార్గమునుండి తప్పుకొని దేవతలకు జయింపనలవియే కాని ఆ ఆడి దానవుడు వీరకునకు కనబడకుండ లోన ప్రవీషుడే అట భుజంగ రూపమువిడి చేను॥ ఆ మూఢచిత్తుడు శివుని మోసగింపదలచి ఉమా రూపియయ్యెను॥ వాడు ఊహింపనలవి కానీ యంత సరిగా మనోహరమగు ఉమారూపము దాల్చేను॥ అది ఆమెకు గల అన్ని గుర్తులు పైకి కనబడుచున్నది; సర్వావయవ సంపూర్ణము; (అన్ని ఆంశములందును పార్వతిని పోలియుండెను॥) వాడు తన బుది మోహము చే గిరిశుని చంపుట కుద్యతుడై తన రహస్యాంగమున వజ్రమువంటి వాడి మొనలుగల దృఢ దంతముల నమర్చుకొనెను॥
తరువాత ఆదైత్యుడు ఉమరూప సంస్థానము (అమరిక )తో హరుని సమీపమున కేగెను॥ వాడిపుడు చిత్ర (ఆశ్చర్యకర) పస్త్ర భూషణములు భూషించుకోని రమ్యమగు స్త్రీరూపముతోనున్నాడు॥ ఆమెను చూచి గిరిశుడు తుష్టుడే వెంటనే ఆ మహాసురునాలింగనము చేసికొనెను॥ సర్వావయవ లక్షణములబట్టియు ఆమె గిరిసుతయేయని ఆతడు తలచేను॥ గిరిపుత్రీ! ఇపుడు నీ భావము కృత్రిమము కాక (నిర్మలమై)యున్నదీ కదా! వరవర్తినీ: ఉ త్తమసుందరీ! నీవు సొయాశయము గ్రహించుటయే అందులకు ప్రమాణము; నీవు లేక నాకు జగ త్రయమును శూన్యమై తో చెను॥ ఇట్టితి నీవు నాకడకు వచ్చితివి; నీకు ఇది (నా పైఇంత ప్రీతి) తగినదే సుమా! శివుడిట్లు పలుక దానవుడు మెల్లగ నవ్వుచు మాటాడ సాగెను; ఏలయన శివునకు మాత్రమే తెలిసిన పార్వతీ చిహ్నములు కొన్ని వానికి తెలియవు; వాడిట్లనెను: నీ ప్రీతిలభించుట క్రే సాటి లేని తపమాచరించ సాగితినే కాని ఆచ్చట నాకు మనస్సునకు హాయి కలుగలేదు॥ అందుచే నీకడకు వచ్చితిని॥॥ ఈ మాటవినీ శంకరునకు ఒకానొక శంక కలిగి అది నిర్ణయించుకొనదలచి ఆదేవుడు చిన్నగా నవ్వుచున్న మోముతోను దృఢ నిశ్చయముతోను ఇట్లనుకొనెను॥ సుందరియగు పార్వతి నా పైకుపితయై వెళ్లెను॥ స్వభావముచే ఆమె దృఢవ్రత; కావున ఆమె తాను కోరిక తీర్చుకొనియే వచ్చెనా? అని నాకు సంశయము కలుగుచున్నది॥ అనుకోనుచు ఆమెకు ఉండు గుర్తులన్ని యు పరీక్షించి నిర్ణయించుకొన దలచెను॥ పరికించి చూడగా ఆమె ఎడమవైపున ఉండవలసిన పద్మాకారపుసుడి ఈశ్రీకి లేదు, దానితో ఇది దానవ మాయయని శిపుడు గురుతించెను॥ అయినను తన హృదయ గత భావమాకారమున కప్పిపుచ్చుకొని తన రహస్యావయవమున వజ్రాస్తమీముడ్చుకొని ఆ దానవుని సంహరించేను॥ ఈ యంశము లేవియు వీరకు నకు తెలియవు॥॥ హరుడు శ్రీరూపుడు ఆగుదాననేళ్వరుని చంపుట చూచియు పర్వత దేవత తనకు వాస్తవ విషయము (అది దానవుని మోసమనియు పాడు లోనికి పోవుటలో వీర కుని దోషములేదనియు) ఎరుగకయే శీఘ్రగామి కావున వాయుదేవుని దూత గా చేసి ఈ విషయమును శైలపుత్రికి తెలి పెను॥ ఆదివిని పార్వతి క్రోధరక్తాక్షయే మనస్సున నొప్పి పడుచు తన పుత్తుడగు వీర కునీ ఇట్లు శపించెను॥
ఇది శ్రీ మత్స్యమహా పురాణమున దేవాసుర సంగ్రామమున ఆడి దైత్య వధమను నూటఏబదియైదవ అధ్యాయము॥
Summary of chapter 156 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya glorifies the sublime spiritual stature and martial exploits of Goddess Kauśikī as she established her sacred abode in the Vindhya mountains. Accompanied by fierce lions and surrounded by celestial energies, Goddess Kauśikī neutralized the aggressive advance of Asura divisions seeking to capture her. The text details how her terrifying war roars and divine arrows annihilated demon battalions, bringing peace and security to the sages performing fire sacrifices in the holy forests surrounding the Vindhya region.