మత్స్య మహా పురాణము
139 - త్రిపురోపాఖ్యాన సమాప్తి
జలములలో పడిపోయెను. ఆగ్ని చుట్టుకొనగా ఏమియు చేయలేక దానవస్త్రీలు అమ్మా! కొడుకా! నాయనా! మామా! అని ఏడ్చుచుండిరి. కొండల పై మండెడు అగ్ని అచటనున్న తామర కొలకులను కాల్చి సట్లు త్రిపుర ము న క్రమ్మిన శివశ రాగ్ని స్త్రీ, పద్మాకరమును కాల్చివే నెను. ప్రభాత సమయమున మంచు బిందువుల రాసుల సరస్సులందలి పద్మము లను దహించి పాడు చేసినట్లు ఆ అగ్ని యు స్త్రీ జనపు ముఖ నేత్ర పద్మములను దహించెను.
శరాగ్ని తాపమునకు తట్టుకొనలేక అటునిటు పరుగెత్తుచున్న ఆతి కోమలలగు త్రిపుర నగర స్త్రీల ఒడ్డా ణములు అందేలు మొదలగు ఆభరణముల ధ్వనులును ఏడుపుల ధ్వనులును నమ్మి శితమై వినబడుచుండెను. అర్ధ చంద్ర నిర్మాణములతో తోరణ మహాద్వారములతో వేదికలతో కూడి వి సీర్ల హర్మ్యములు నిరంతరముగ దగ్గమగుచు అగ్ని నుండి రక్షణ కొరకేమో అనునట్లు సముద్ర జలములో పడిపోవు చుండెను. ఆగ్ని జ్వాలలు చుట్టుకొనగా మండుచు పడుచున్న గృహములతో సముద్రజలము దుష్పత్తుని దోషములచే సంతాపించి లోక విరోధమును పొందు వంశమువలె ఉడికిపోవుచుండెను. అట్లు ఉడికిపోవు సముద్రజలము తనయందలి తిమి తిమింగల నకాది జల జంతువులకును. చాల బాధ కలిగించుచు వాటిని ఉడికించుండెను. చూచుచు చూచుచుండగనే ఆ త్రిపుర ప్రాకారవర్గము మందర పర్వత పాదమువలే దగ్గమయి పోగా భవనములును దగ్గములయి సముద్రమున కూలగా వాటితోపాటే తానును మహాధ్వని చేయుచు సముద్రమున పడిపోయెను. సహస్ర శిఖరములుక ల పర్వతమువలెనే సహస్ర గోపురములుగల భవనములు దగ్గములు కాగా హుతాశనునకు బలిగా అర్పించిన హవిస్సువలె త్రిపురము నామావ శేషమయ్యెను. ఆ త్రిపురదుర్గమట్లు ప్రదహ్య మానమయి నశించుచుండగా భూలోకమేకాక పాతాళ ద్యులోకములు కూడ పత ప్రమయ్యెను. అంతలో మయుడు దాగియున్న గృహము మహాదుఃఖమునందుచున్న మయునితో కూడ సముద్రజలములలో (కాలకయే) పడిపోయెను.
ఈ విషయము విని వజ్రధరుడగు ఇంద్రుడు ఆ మయ గృహమును మయుని కూడ ఇట్లు శపించేను: “ఇక మీదట ఈ మయ గృహము నిరంతరమును నిలుకడ లేనిదియు ఎవరును ఆశ్రయింపరానిదియు అగ్నివలె భయముతో నిండినదియు అగును. ఏఏ దేశమునకు ఎచ్చ ఔచ్చట పరాభవము (ఓటమి కాని కరవు మొదలగు ఉపద్రవములు కాని సంభవించునో అచ్చట నెల్ల ఆ ఉపద్రవము వలన నాశము పాలగుచు జనులు ఈ త్రిపుర దుర్గ ఖండముగు మయ గృహ మును చూడగలరు (అనగా ఈ ఉపద్రవముల పాలయిన దేశ భాగమే మయగృహము.)
ఇట్లు జనులకు భయ హేతువగు ఈ మయగృహము మాత్రము ఈ నాటికిని ఏ కీడును పొందక యున్నది. దానియందు ఆ స్వగృహమందు మయుడు కూడ సుఖము లనుభవించుచునే యున్నాడు.
ఆన విని ఋషులు సూతునితో ఇట్లనిరి: సూత భగవన్! మయుడు ఏ గృహముతో పారిపోయెనో ఆమయ గృహము గతి ఏమయినది? అది తపశ్శక్తిచే సిద్ధించినది కదా! అనగా సూతు డిట్లనెను: ధుపు డెచ్చట ఎంతవరకు కన బడుచుండునో అంతవరకును ఆచ్చట నెల్ల మయుడు కనబడుచునే యుండును. ఇది ఎట్లు జరిగే ననగా చేప్పెద వినుడు:
దేవ శత్రువగు మయుడు ఆనాటి త్రిపుర దాహము చూచి భయోద్వేగములతో నిండిన మనస్సుతో కూడి దాని నుండి ఎక్కడకును పోలేకయుండగా శివుడు అతనికి నిర్బయమగు ఇల్లోకటియే ఒక పురముగా సృష్టించుకొనునట్లు గృహార్ధియగు మయునకు వర ముగా ఇచ్చెను. దాని ప్రభావమున వాడు వేరోక చోట శిలామయమగు . గృహము నిర్మించు కొనెను. అచ్చటకు కూడ దేవతలు అసురోత్తముడగు మయాసురుని చూడ పోవుచుందురు.
ఇట్లు శివుడు మయుని విషయమున అనుగ్రహము చూపుట చూచి ఇంద్రుడును తానేంత ప్రతాపవంతుడయ్యు మయుని పై పగ చూపుట మానెను. అందులకు మెచ్చి ఎల్లగును ఇంద్రుని ప్రశంసించిరి. దేవత లందరును భూత నాథు డగు ఈశ్వరుని స్తుతించిరి. ఇది చూచుచున్న దేవత లందరును ప్రమథ గణాధిపతులును ఈశ్వరుని సంపూజించిరి. సంతోషముతో దేవతలు గంతులు వేచిరి. ఒకరినొకరు పట్టుకొనిరి. త్రిపురావదానమును (వీరకృత్యమును) గీతములుగా రచించి గానము చేసిరి. చేతులు నృత్య సంబంధి ముద్రలుగా విభజించి (ముద్రా ప్రదర్శన పూర్వకముగా) గొప్పగా నృత్యములు చేసిరి. బ్రహ్మదేవుడును పరమేశ్వరుని నమస్క రించెను. పర మేశ్వరుడును రథమునుండి తన ధనువును తీసికొని దానినుండి క్రిందికి దుమికి దేవతలకు వీడ్కోలిచ్చి పంపెను.
ఈ విధముగా ఎవరికిని చేరుటకై న అలవి కాని త్రిపుర దుర్గమును హరుడు ఒకే ఒక బాణముతో దగ్గ మొనర్చి సముద్రములో పడవేసెను.
ఈ రుద్ర విజయమును పఠించిన_వినిన-వారికి వృషభ ధ్వజుడగు శివుడు యుద్ద విజయము కలిగించును.
దీనిని పితృశ్రాద్ద తర్పణాదికృత్యముల సమయమున వినిపించిన ఎడల సర్వ యజ్ఞము లాచరించినంతగా ఆనంతపుణ్యము లభించును. ఇది స్వ స్యయన (శుభమును కలిగించు)కర్మలలో ఉత్తమము; పుణ్యకరమయినది; పుంసవన కర్మముతో సమానమయినది; దీనిని విన్న ను చదివినను రుద్రలోకప్రాప్తి యగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యాన సమాప్తియను నూట ముప్పది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 140 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a grand narrative of Mahādeva's wedding procession departing from Mount Kailāsa toward Himāvān's capital. Mahādeva rode His sacred bull Nandi, accompanied by the Ekādasha Rudras, the Vasus, Ādityas, Gandharvas, Pramathaganas, and celestial musicians. Bhagavān Brahmā served as the presiding priest, while Bhagavān Vishṇu performed the ceremonial giving away of Goddess Pārvatī amidst Vedic chants and showers of celestial blossoms.