మత్స్య మహా పురాణము
47 - నారాయణుడు అవతారము లెత్తుటకు హేతువును తెలిపెడు కథ
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: ఇది ఇట్లుండ నిండు. దేవుడును మహాదేవుడును ప్రజాపతియు దేవేశుడు నగు నారాయణుడు విహారార్థమయి ఈ లోక మునందు మానవుల నడుమ కృష్ణుడుగా జన్మించును. అని మత్స్యమూర్తి చెప్పినట్లే ఆయన వసుదేవుడు ఆచరించిన తపస్సునకు ఫలముగా దేవకియందు పద్మనేత్రుడు చతుర్భుజుడుగా దివ్యరూపు డుగా కాంతిలో ఉజ్వలుడుగా ఆవత రించెను. శ్రీవత్స లాంఛనము మొదలగు దివ్య లక్షణములు చూచి వసుదేవుడు 'ప్రభూ! నీ రూపము నుపసంహరింపుము. మహావికములగు నా మొదటి కుమారులందరను కంసుడు చం పేను. కనుక నేను వానికి భయపడు చున్నా ను.' అని వసుదేవు డనగా అచ్యుతుడు తన దివ్యరూపము నుపసంహరించెను. తరువాత భగవానుని అనుజ్ఞతో వసుదేవుడు శ్రీకృష్ణుని నందగోపుని గృహమునకు చేర్చి ఇతనిని అతని కిచ్చి ఈ శిశువును కాపాడు మని కోరెను. ఇతని వలన సర్వ యాదవులకును శుభము కలుగును. దేవకీ గర్బ సంజాతుడగు ఈతడు కంసుని చంపును. అనియు వసుదేవుడు నందునితో ననేను.
ఇది విని ఋషులు సూతు నిట్లు ప్రశ్నించిరి : వసుదేవుని కాని నందుని కాని భగవానుడు నాయనా! అని పిలి చేను. దేవకి ఆయనను గర్భమున ధరించి కనెను. యశోద పోషించెను. ఇంత అదృష్టము పొందిన ఈ నలుగురును ఎవరు? అనగా సూతుడు వారి కిట్లు చెప్పెను: ఆది ప్రజాపతి దంపతులు అదితియు కశ్యపుడును మీకు తెలియును గదా! కశపుడు బ్రహ్మాంశము. అదితీ పృథివ్యంశము. మహాబాహుడు అగు నారాయణుడు దేవకి కోరికలను పూరించెను. (ఏల యన కశ్యపుడే వసుదేవుడు. అదితియే దేవకి.) ఎన్నడును జననము నెరుంగని ఆ మహాత్ముడును జనన మందెను. ఆ యోగాత్ముడు యోగమాయచే సర్వభూతములను మోహ పెట్టి తను తాను మానవునిగా చూ పెను. యజ్ఞములును ధర్మ మును నశించగా ఆ ప్రభువు వృష్టివంశమునం దవతరించి ధర్మ సంస్థాపనమును రాక్షస నాశమును జరి పెను. ఆయనకు రుక్మిణి సత్యభామ సత్య నాగ్నజితి సుధామ శైబ్య గాంధారి లక్షణ మీత్రవింద కాళింది దవ - జాంబవతి-సుసీమ-మాద్రి-కౌసల్య-విజయ మొదలగు పదునారువేల మంది భార్య లుండిరి.
రుక్మిణికి రణవిశారదులు మహాశూరులు మహాబలులు నగు చారుదేష్ణుడు ప్రద్యుమ్నుడు సుచరుడు భద్రాచారుడు సుదేష్ణకు భద్రుడు పరశుడు చారుగుప్తుడు రుభద్రులు సుచారుకుడు చారుహాసుడు అను కుమారులును కడ గొట్లుగా చారు మతి అనెడి కన్యయు కలిగిరి. సత్యభామయందు భానుడు భ్రమర వీక్షణుడు రోహితుడు దీప్తిమాన్ తామ్రవక్తుడు జలం ధరుడు అను కుమారులును నల్గురు కుమార్తెలును కలిగిరి. జాంబవతికి యుద్ధ నిపుణుడగు సాంబుడును మిత్రవిందకు మిత్రవాన్ . మిత్రవిందుడు -నాగ్నజితికి మిత్ర బాహు సునీతులు కుమారులైరి. ఈ మొదలగు కుమారులు వేలకొలదిగ శ్రీకృష్ణునకు కలిగిరి. వీరు మొ త్తము ఒక లక్షయు ఎనుబదివేల మంది. వీరిలో ఉపసంగునకు వజుడు సంక్షిప్తుడు, గవేషణునకు భూరీంద్ర సేనుడు భూరి అనువారు-ప్రద్యుమ్ను నకు వై దర్బియందు బుద్ధిశాలియు రణమునం దేదురులేనివాడు నగు అనిరుద్ధుడు యజుడు మృగ కేతనుడు అనువారును సాంబునకు కార్శ్యాశ్వుని కూతువలన బలశాలురు సత్యస్వభావులు వీరులు దేవసదృశులునగు ఐదుగురు కుమారులు కలిగిరి. ఆనాడు యాదవులు మొత్తము మూడు కోట్ల మంది. వీరంద రును దేవాంశ రూపులును మహాబలులును వీర్యవంతులును మహా తేజస్సంపన్నులును. పూర్వము దేవాసుర యుద్ధములందు మరణించిన అసురులు మరల మానవులందు జన్మించి ఇతర మానవుల నందరను బోధింపసాగిరి. వారిని నశింపజేయు టకై విష్ణువు యాదవవంశమున పుట్టెను. అతనికి తోడుగా నున్న ఈ యాదవులు మహాత్ములు నూటొక్క ప్రధానవంశ ముల వారు. ఈ వంశము వైష్ణవ వంశమే. వారికి విష్ణువు నాయకుడై వారిని నడ పెను. ఇటు సర్వ యాదవులును శ్రీకృష్ణుని యాజ్ఞయందు నడచిరి.
ఋషులు సూతునిట్లడిగిరి: కొందరు పెద్దలు “సృష్టులు అన్ని యు సప్తికరూపమయినవి. అవి సప్తర్షులు కుబేరుడు మణిహరుడను యక్షుడు శాలాకి నారదుడు సిద్దుడగు ధన్వంతరి-ఆదిదేవుడగు విష్ణువు అను సప్తదేవతలతోనే సమగ్ర మగుచున్నది.” అని చెప్పుదురు. ఆ సృష్టులు ఎన్ని విధములు? ఆ మహాత్ముని ప్రాదుర్భావములు జరిగిన ఎన్ని ? జరుగ నున్న వేన్ని ? ఆ మహానుభావుడు శాంత స్వభావులగు బ్రహ్మ క్షత్రియ జాతులందును. అందునను వృష్ణ్యంధక వంశ శ్రేష్టుడె యాదవులందును ఏల జన్మించవలసివచ్చెను? మరల మరల మానవులలో ఆయన ఏల జన్మించవలసివచ్చెను? ఇట్లడుగగా సూతుడు ఋషులకిట్లు చెప్పసాగెను: నిజమే! విష్ణువు తన దివ్య దేహమును విడిచి (మరుగుపరచి, ఈలోకమున మానవులందు జన్మించును. హేతువు చెప్పెదను. వినుడు. యుగధర్మము తలక్రిందులు కాగా కాల స్వభావము మిగుల శిథిలము కాగా దేవాసుర యుద్ధములు ప్రవర్తిల్లును. అట్టి సమయములందే ఈశ్వరుడగు హరి అవతరించును. ఎట్లన పూర్వము హిరణ్య కశిపుడును బలియు నను అసురులు లోకత్రయమును పాలించుచుండ ఆయా కాలములందు పది దివ్య యుగముల కాలము దేవాసురులకు మహా యుద్ధము జరిగెను. జగత్తులన్నియు అత్యాకులములయ్యెను. దేవతలు విష్ణుని విదేశమునందును అసురులు బలి హిరణ్యకశిపుల విదేశమునందును నిలిచి యుద్ధమును జరిపిరి. బలిని నశింప జేయుటకై జరిగిన యుద్ధము చాల భయంకరమును దేవతలకును అసురులకును నాశకరమును నయ్యెను. ఆ ప్రసంగమున కలిగిన భృగు శాపము నిమి త్తము కాగా శ్రీ నారాయణుడు మానవులం దవతరించుచుండును.
ఇట్లు చెప్పిన సూత వచనమును విని ఋషలిట్లు ప్రశ్నించిరి: దేవాసురుల యుద్ధము మూలమున విష్ణువు శాపము నేల పొందెను? దేవాసుర యుద్ద మేట్లు జరిగి ఇట్టి స్థితికి హేతువయ్యెను? మాకు తెలుపుడు.
అనగా సూతుడిట్లు చెప్పసాగెను: దాయభాగ నిమిత్తమున (తైలోక్యపాలనాధికారము ఎవరిదను విషయమున) దేవాసురుల నడుమ *శడామర్కాంతరము వరకు పండ్రెండు మారులు యుద్ధము జరిగినట్లు తెలుపబడియున్నది. ఇవి వరుసగా నారసింహము వామనము వరాహము అమృతమంథనము తారకామయము ఆడీవధము తెపురము అంధకారము వృత్రఘాతకము ధాతము హాలాహలము కోలాహలము అనునవి. వీనిలో నారసింహమున హిరణ్యకశిపుడు నరసింహుని చే చంపబడెను. వామనమున త్రివిక్రమమూర్తి యగు వామనునిచే బలి బంధింపబడెను. వరాహమున దేవతలతో హిర ణ్యాక్షుడు చేసిన (యుద్ధమున వరాహమూర్తి వానితో ద్వంద్వ యుద్దమునాచరించి దానిని చంపెను. సముద్రమును రెండుగా చేసెను. అమృతమంథనమున ఇంద్రుడు యుద్ధమునందు ప్రహ్లాదుని జయించెను. తార కామయమున ప్రహ్లాద కుమారుడు విరోచనుడు నిత్యము నింద్రుని చంపు పూనికతో నుండుటయు ఇంద్రుడు విక్ర మించి వానిని జయించుటయు జరిగినది. ఆడివధమున విరోచనుడు వసువులనెడి దేవతల బాణములకు గురియయ్యెను. శ్రీ పురమున త్ర్యంబకుని చేతిలో దానవులు అందరును మరణించిరి. అండ కారమున (అంధక-ఆర) (అంధకవధ యుద్దమున) దేవతలును మనుష్యులును పితరులును అసురులును పిశాచులును దానవులను చాలవరకు చంపిరి. ధాతమను యుద్ధము దేవదానవులకు జరిగినట్టిది. హాలాహలమనెడి యుద్దము ఘోరమయినది. దీనియందు విష్ణుని సహాయునిగాగొని ఇంద్రుడు దీనిని ముగియజేసేను. ఈ యుదముననే ఇంద్రుడు యోగవే త్తయు మాయతో మరుగుపడు శ క్తి కలవాడునగు ధ్వజుడను వానిని జయించెను. ఇక పండ్రెండవదియగు (జయ) కోలాహల యుద్ధమున విప్రచిత్తి ధ్వజుని రూపము ధరించి ధ్వజుని వలెనే మాయాచన్ను డై) తన సోదరులతోను ఇత రులగు దానవులతోను అసురులతోను కూడి యుద్ధము చేసెను. దేవతలు కృష్ణునితో (విష్ణునితో కూడి తమ శత్రువులను బంధించిరి.
ఇట్లు యుద్ధములనెడు యజ్ఞములు ముగిసిన తరువాత దేవతలు అవభృథ (యజ్ఞ దీక్షా శ్ర) స్నానము చేసిరి. ఆ ప్రసంగమున వారు శండమర్కులను దర్శించిరి.
ఇట్లు దేవాసురుల నడుమ జరిగిన పండ్రెండు యుద్ధములును ఈ ఇరుపక్షములవారికిని నాశము కలిగించినను తుదకు దేవతలకు జయము లభించి ప్రజలకు హితకరములయ్యెను.
(*శండా మర్మాంతరము అను పదమున కర్ణము ఇచట ఆస్పష్టము. ఈ శండమరులు శుక్రుని కుమారులో శిష్యులో అని తోచును.)
హిరణ్యకశిపుడు ఒక ఆర్బుదము మీద డెబ్బది రెండు నియుతములమీద ఎనుబదివేల సంవత్సరములు శ్రీ లోక్య పాలకుడయ్యెను. ప్రహ్లాదుడును బలియు ఒక్కొక్కరు ఇరువది నియుతముల డెబ్బదివేల సంవత్సరములు త్రిలోక పాలకులయిరి, మహౌజస్సంపన్ను లగు వీరు అసురులలో నుండి వచ్చిన ఇందులు (అసురులై యుండియు తైలోక్య పాలనము చేసి ఇంద్రులైనవారు.) మరల పది దివ్యయుగముల పాటు ఈ త్రైలోక్యము అసురుల క్రింద నుండుటయు మరి అంతే కాలము అది ఇంద్రుని వశ మయి అతని ఏలుబడిలో నుండుటయు ఇట్లు పర్యాయక్రమమున జరుగుచుండును. ఇట్టి పర్యాయములలో ఒకమారు దేవతలకు తై లోక్యపాలనాధికారము వచ్చినప్పుడు శుక్రుడు (తన శిష్యులగు) అసురులను విడిచి (జయోత్సవ రూపమున యజ్ఞము చేయు చున్న) దేవతలకడకు పోయెను. ఇది చూచి , దైత్యులు శు కుని కడకు పోయి "అయ్యా! మేము జీవించియుండగనే మమ్ములను విడిచి మారాజ్యమును విడిచి దేవతల యజ్ఞమునకు పోవు చున్నా రే! మేము ఇచట నిలువలేము. రసాతలమున ప్రవేశింతుము.”అనిరి. అది విని శుక్రుడు విషజ్ఞులగు దైత్య దానవుల నోదార్చుచు ఇట్లు పలికెను: “మీరు భయపడకుడు. మిమ్ములను నాతేజముచే మరల ఉద్ధరించగలను. మంత్రములు ఓషధులు రసద్రవ్యములు వివిధములగు (బంగారు మొదలగు) ధనములు నా యధీనమున సముద్రముగా నున్నవి. అవి మీ కొరకే నా దగ్గర దాచియుంచితిని. అదియంతయు మీ కిత్తును.” నా దగ్గర నున్న ఈ వస్తు సంచయములో నాలుగవ వంతు మాత్రమే దేవతలకు గలదు. అనేను.
ఈ విషయము తెలిసికొని దేవతలు భయపడిరి. వారందరును దైత్య దానవులకు ఆ ధనాదికము పోకుండ తామే అది గ్రహింపగోరిరి. శుక్రుడు మన కడ నున్న ధనమును కూడ బలాత్కారమున లాగికొనుచున్నాడు. దానిని దైత్య దానవులు తమ ఆధీనము చేసికొనక ముందే ఈ శుక్ర శిష్యులను చావగొట్టి పాతాళమునకు పంపుదము. అని ఆలో చనము చేసిరి. క్రోధావేశముతో వారు దానవుల కడకు పోయి వారిని చావగొట్టసాగిరి. దానవులు తాళలేక శుకుని కడకు పరుగెత్తుకొని పోయిరి. శుక్రు డది చూచి అసురులకు రక్ష కల్పించేను: దానితో అసురులే దేవతల బాధింపసాగిరి. కావు డక్కడనే యుండుటయు అసురులు నిర్బయులుగా నుండుటయు చూచి దేవతలు వారిని విడిచి వెనుకకు మరలి వచ్చిరి.
తరువాత శుక్రుడు పూర్వము బ్రహ్మ చెప్పిన హితకరమగు వచనమును జ్ఞప్తికి దెచ్చికొని పూర్వ వృత్తాంత ములను స్మరించుచు అసురులకును అవి జ్ఞాపకము చేయుచు ఇట్లు పలికెను: “మహా సురు లారా! వామనుడు మూడ డుగులతో మీ త్రైలోక్య రాజ్యమును హరించెను. బలిని బంధించెను. జంభుడును విరోచనుడును చంపబడిరి. పండ్రెండు సంగ్రామములయందును మహాసురులెందరో ఆయా యుపాయములతో సురల చేతిలో మరణించిరి. మీలో కొలది మంది మాత్రము మిగిలినారు. ఇపుడు యుద్ధము చేయరాదు. నీతిమార్గముల ననుసరించవలయును. కాలపు మార్పునకై ఎదురు చూడ వలయును. విజయము ఇప్పింపగలవాడు మహేశ్వరుడు. అతని కడకు పోయి ఆయనను ప్రార్ధింతము. ఎదురులేని మంత్రముల సాయననుండి సంపాదింతము. అప్పుడు దేవతలతో పోరి జయము సంపాదింతము.
[శుక్రుని వచనమును విని ప్రహ్లాదాది దానవులు దేవతలతో ఒడంబడిక యొకటి చేసికొనిరి.] మే మందర మును ఆయుధములను వదలుచున్నాము. రాత్రులయందు ఆహారము కూడ తినము. వల్కలములను ధరించి వనమున తప మాచరింతుము. [మేము మరల వచ్చు వరకు మనకు యుద్ధము ఉండదు.]
ప్రహ్లాదుడు సత్యముతో శపథము చేసి చెప్పిన ఆ మాటను విని దేవతలు సంతాపము వదలి సంతోషము కలిగి యుద్ధ ప్రయత్నములనుండి నివృత్తు లయిరి. ఇట్లు దేవాసురు లిరువురును ఆయుధములు దూరముగా పారవయిచి సంతుష్టులయిరి.
తరువాత శుక్రుడు అసురులతో “మీరు తహతహపడక తపస్సొచరించుచు కొంచెము కాలము ఓపిక పట్టుడు. కాలమే జరుగవలసిన పనులను చక్కపెట్టును. దానవు లందరును మా తండ్రి ఆశ్రమమం దుండి నా కై ఎదురుచూచు చుండుడు,” అని వారిని నెమ్మది పరచి మహాదేవుని కడకు పోయెను. అత డీశ్వరునితో “ఓ దేవా! నాకు బృహస్పతికి తెలి యని మంత్రములు - దేవతలకు పరాజయమును దానవులకు జయమును కలిగించునవి . కావలయును.” అనెను. అది విని మహాదేవుడు ‘భార్గవా! నీవు తలక్రిందులుగా ఉండి వ్రత (నియమ) ముల ననుష్ఠించుము. వేయిఏండ్లు నిండుసరికి నీకు కణధూమము దర్శన మిచ్చినచో నీకు సిద్ధి కలుగును. మంత్రములు లభించును.” అనెను. శుక్రుడును సరే యనెను. దేవా! నీవు ఆదేశించిన వ్రతము నాచరింతును. అని ఆ దేవుని పాదములంటి పలికెను. ఈశ్వరుని అనుమతితో *కుండధారుడై ధూమకృత్-కాక వ్రతము నారంభించెను.
ఇట్లు శుక్రుడు అసురుల వ్రతమునకై మంత్రముల కోరి మ హేశ్వరునికడ బ్రహ్మచర్యము నోచరించుచుండుట దేవత లెరిగిరి. అసురులు శుక్రుని నీతిపూర్వకముగా రాజాధికారమునందు నిలిపిరనియు వారు తెలిసికొనిరి. ఈ అవకాశ ములో దేవతలు బృహస్పతిని ముందుంచుకొని ధనుర్ధరులై అస్త్రాద్యాయుధములు ధరించి అసహనముతో కోపముతో అసురుల పైకి పోయిరి. ఇది చూచీ వారు భయపడి దేవతలతో "దేవత లారా! మే మాయుధముల విడిచి యున్నాము. మా ఆచార్యుడు తపోవ్రతమునకై పోయి యున్నాడు. మీరు మా కభయ మిచ్చియు మమ్ము చంపదలచి వచ్చి యున్నారు. మా ఆచార్యుడు దగ్గర లేడు. మే మాయుధముల వదలి యున్నాము. నారబట్టలు కృష్ణాజినములు ధరించి నిష్కియు లమై ఏ సాధనములును పరివారమును లేక యున్నాము." అనిరి. ఐనను వారు వినలేదు. పా రపుడు 'మనము యుద్ధమున దేవతల జయించజాలము. యుద్దము చేయలేనపుడు మనకు శుకుని మాతయే దిక్కు.' అని తలచి వా రా మెను శరణు వేడిరి. ఆమె వారికి అభయ మిచ్చేను. దానవులారా! మీరు భయపడకుడు. భయపడకుడు. నా సంనిధిలో నుండగా మీరు. భయపడవలసిన పనిలేదు. అనెను. ఆప్పటికిని విడువక దేవతలు బలాబలములు విచారించక బలము నుపయోగించి దానవులను చావగొట్టసాగిరి. అది చూచి దేవియగు శుక్రమాత కోధముతో దేవతలారా! మిమ్ములను ఇంద్రుడు లేనివారినిగా చేయుదు ననెను. సర్వ సంభారములతో సన్నద్ధులయిన దేవతలను ఇంద్రుని కూడ తపోధనయు యోగయుక్తయు ఆగు ఆమె స్తంభింపజేసేను. ఇంద్రుడును స్తంభించి మూగవాడువలే నయ్యెను. ఆది చూచి దేవతలు ఆవశులై ఇంద్రునితో కూడ విష్ణుని కడకు పోయిరి. విష్ణువు దేవ సంఘముల స్థితి చూచి ఇంద్రునితో సురోత్తమా! నీవు నన్ను ప్రవేశించి దాగి యుండుము. నే నసురుల నందర చంపుదు.' ననెను.
(*కుండదారణ యాతన అనుభవించుచుండియు ధూమమును తన స్రోతస్సులలోనికి పోనియక దానిని పరమాణువుల రుపమున దర్శించ యత్నించుట)
ఇంద్రు డట్లే చేసెను. ఇంద్రుడు విష్ణునిచే రక్షితుడగుట చూచి శుక్రమాత కోపించి 'ఇంద్రా! నా తపోబలము ఎట్టిదో తెలియునొ? సర్వభూతములు సాక్షిగా నేను విష్ణునితో కూడ నిన్ను దహింతును.' అనెను. ఇట్లు శుక్రమాత తిర స్కార పూర్వకముగా పలుకగా ఇంద్ర విష్ణు లిరువురును కలవరపడిరి. ఇపు డి మేనుండి ఎట్లు తప్పించుకొనవచ్చును? అని విష్ణు వింద్రునితో సనేను. ప్రభూ! ఆమె నన్ను ను నిన్ను ను దహించక మునుపే ఈ మేను నీవు చంపుము. నేను నీ కంటెను . ఎక్కువగా కలవరపడుచున్నాను. అని ఇంద్రు డనెను. అంతట విష్ణువు బాగుగా ఆలోచించెను. ఇంద్రుడును తానును ఆత్మరక్షణ మొనరించుకొనవలెననిన శ్రీ వధ చేయవలయును. లేనిచో తమకు కీడు తప్పదు. ఇట్టి ఇర కాటములో విష్ణువు పడెను. ఆపదుద్ధరణమునం దు తమమగు చక్రమును వెంటనే విష్ణువు స్మరించెను. అప్పుడును విష్ణువు త్వరపడ సాగెను. చేయదలచిన పని త్వరగా చేయవలెను. లేనిచో తమకు కీడు కలుగునను భయము కలుగుచుండెను. ఆ దేవి చేయదలచిన క్రూరకర్మము ఎరిగి విష్ణువు క్రుద్దుడే ఒక వై పు భయపడుచునే భృగుపత్నీ శిరమును ఖండించెను.
ఘోరమగు ఈ శ్రీ వధమును చూచి భృగుముని క్రోధము చెందెను. అతడు చేతకాని వాడు కాదు. తన భార్యా వధమునకు "కోపించిన అతడు విష్ణుని శపించెను. 'నీవు స్త్రీ అవధ్యురాలను ధర్మము నెరిగియుండియు స్త్రీని వధించితివి. కావున నీవు ఏడుమారులు మనుష్యుల నడుమ మానవుడుగా జన్మింతువు.' అని ఆయన విష్ణుని అధి శపించెను. ఆ శాప ఫలముగా లోకమున ధర్మము నశించి నపుడెల్ల లోక హితమున కై శ్రీవిష్ణువు మనుష్యుడుగా లోకమున జనించుచుండును. .
ఇట్లు పలికి భృగముని వెంటనే తన పత్ని శిరమును తీసికొనెను. దానిని మిగిలిన శరీరముతో చేర్చెను. ఇట్లు పలికేను: “దేవీ! విష్ణుని చేత చంపబడిన నిన్ను ఇదిగో! మరల ఒక టీగా కూర్చుచున్నాను. నేను ధర్మమును సమగ్రముగా ఎరిగినవాడ నైనచో ఆచరించినవాడ నైనచో. నేను పలుకునది సత్యమే యైనచో ఆ సత్యముతో నీవు జీవింతువు గాక!” ఇట్లు పలికి మంత్రములతో శాంతి జరుపబడిన జలములతో ఆమె శ రీరము)ను ప్రోషించి 'జీవించుము.” అనెను. ఆమె అతని ఆ మాటతోపాటే జీవితురాలయ్యేను. నిదుర మేల్కాంచినట్లు లేచిన ఆమెను చూచి సర్వదిశలనుండియు సర్వ భూతములును సాధువాదములు (చాల బాగుగా నున్నది అను పలుకులు పలికిరి. ఇట్లు ఆ దేవిని ఆ సమయమున భృగు మహాముని జీవింపజేసెను. ఇది సర్వ దేవతలును చూచుచుండిరి. ఇది ఎంతయో ఆశ్చర్యకరమగు విషయ మయ్యెను. ఈ సందర్భములో భృగు మహాముని ఏ మాత్రమును కలవరపాటు చెందకుండుట మరియు ఆశ్చర్యకరము. ఇది చూచి ఇంద్రుడు ఇకముందు శుక్రుని వలన మరింకేమి కీడు మూడునోయని మరింత భయపడెను. అతని మనస్సునకు శాంతియే లేకపోయెను.
ఇంద్రునకు నిదుర యే పట్టలేదు. అతడు అదే పనిగా ఆలోచించి ఒక నిర్ణయమునకు వచ్చెను. తన కూతురగు జయంతితో ఇట్లు పలికేను: “బిడ్డా! ఇదుగో! ఈ శుక్రుడు శత్రునాశమునకై దారుణ తపము ఆచరించుచున్నాడు. మహా బుద్దిశా లియగు ఇతని వలన నెంతయో వ్యాకులుడ నగుచున్నాను. కనుక నీవు ఆతని కడకు పొమ్ము. అతని శమమును పోగొట్టు శు శూషలు చేసెదననుము. నీవు ఏ మాత్రమును ఏమరుపాటుగాని సోమరితనము కాని లేక ఆయా ఉపచారము లతో ఇతనిని ఆరాధించుము. ఆ బ్రాహ్మణుని సంతోష పెట్టుము. నేను నిన్న తని కిచ్చు చున్నాను. నీవు వెంటనే పొమ్ము. నొపక్షమున ప్రయత్నము చేయుము.”
ఇట్లు పలికిన ఇంద్రుని వచనము విని జయంతి సరేయని శుక్రుడు తపమాచరించుచున్న చోటికి పోయెను. అతనిని చూచెను. శుక్రుడు ఆవాజ్ముఖుడై కణ ధూమమును త్రాగుచున్నట్లుండెను. యముడు పెట్టుచున్న *కుండధారణ యాతనను అనుభవించుచుండెను. జయంతీ ఇంక పోయి చూచెను. ఇన్నీ బాధలు పడుచుండియు కొవ్యుడు స్వస్వరూపము ఏమాత్రము వికారము పొందక యుండెను. అమె అతనికి తాను చేయవలసిన శుశ్రూష చేయ సాగేను. తన తండ్రి చెప్పిన విధమున ఆమె శుకునరు పరిచర్యలు చేసెను. ఆమె సహజముగనే మధురముగా మాటలాడు స్వభావము గలది. ఆమె శుకుని మనస్సునకు అనుకూలముగా మాటలాడుచుండును. ఆవశ్యకమయిన ఆయా సమ యములందు అతనికి స్పర్శ సుఖము గలుగునట్లు గాత్ర సంవాహనము (కాలు సేతులు వెన్ను మొదలగునవి నొప్పి తీరునట్లు ఒత్తుట) లచే అతనికి హాయి కలిగించుచుండును. అతని వ్రతానుష్టానమున కనుకూలములగు ఆచరణలు ఆచరించుచుండును. ఇట్లు ఆమె చాల సంవత్సములు శుక్రుని సేవించెను.
ఇట్లు వేయి సంవత్సరములు నిండెను. శు! కుని ధూమ వ్రతము ముగిసెను. శివుడు శుకుని వరము కోరు కొమ్మనేను. “ఈ వ్రతమును నీవు తప్ప మరియెవ్వరును ఆచరించలేదు. అందువలన తపస్సుచే కాని బుద్ధిబలముచే కాని శాస్త్ర జ్ఞానముచే కాని బలము చేకాని తేజస్సుచే కానీ నీవు ఒక్కడవే దేవతలనందరను నీక్రింది పొరినిగా చేసికొన గలవు. విప్రా! నీమనస్సునందు ఏఏ అభిలషితములు కలవో అవి ప్రతి యొక్కటియు నీవు పొందెదవు. ఈ విషయము మరియెవ్వరికిని చేప్పకుము. ఈ వరము చే నీవు అందరను మించినవాడవు అగుదువు.”
శివుడు శుక్రునకు ఈ వరములతో పాటు ప్రజాపతిత్వమును కుబేరత్వమును అవధ్యత్వమును కూడ వరములుగా ఇచ్చెను. ఇట్టి వరములు పొందిన శుక్రునకు సంతోషము చే శరీరమున రోమాంచము కలిగేను. హరవశమున అతనికి శివుని విషయమున దివ్య స్తోత్రము చిత్తమున స్పురించెను. అతడట్లు తలక్రిందులుగా ఉండియే శివుని ఈ విధముగా స్తుతించెను.
(*అగ్ని కుండమునందు ఘోరమగు అగ్ని కణములు కాలుచుండ దాని సెగ తగులునట్లు తలక్రిందులుగా వేలాడ పట్టుకొని ఇదిగో దీనియందు పడవేయు చున్నా నని భయ పెట్టుచు ఆ సెగ వేడిమిని భరించునట్లు చేయుట కుండ ధారణ యాతన.)
(ఈ స్తోత్రము శివత్రిశతీ నామాత్మకమయినది. ఇది పర మేశ్వరుని విరాట్స్వరూపమును సమస్త జగదాత్మ కత్వమును సకల జగదధిష్ఠాతృత్వమును ప్రతిపాదించుచున్నది. ఇది సక లోపషత్సారమును నామ త్రిశతీ రూపమే రుద్రాధ్యాయముతో సమానమునునై ఇహపరములందు సకల పురుషార్థములను సులభముగ సమకూర్చ గలిగియున్న ది. దీని యర్థము నెరిగి దీనిని పారాయణము చేయుట సకలాభీష్ట ఫలదాయకము. అనువాదకుడు.) నల్లని కంఠము కలవాడు సూక్ష్మ తమరూపుడు శోభనమగు తేజస్సు కలవాడు లయము చేయువాడు కావ్యస్వరూపుడు. సంవత్సర రూపుడు. అన్నము నకు అధిపతి.జటాజూటము కలవాడు (దుష్టులకు) భయంకరుడు హర్యము (కుబేరు)నకు వరములొసగినవాడు చక్కగా సుతింపబడువాడు స్తుతింపబడిన అన్ని అర్తములును తానై నవాడు - దేవదేవుడు-వేగ రూపుడు.తలపాగ ధరించినవాడు అందమయిన మోము కలవాడు. వేలకొలది ఇంద్రియములు కలవాడు. కోరికలను ఇచ్చువాడు.ధనమునకు బీజము వంటివాడు. దుష్టులను ఏడిపించువాడు తపో రూపుడు చర్మము వస్త్రముగా కలవాడు. బొలపొట్టివాడు. గొరగబడిన వెంట్రుకలు కలవాడు (మహాయతి) సేనాపతిరూపుడు ఎర్రనివాడు సూర్యరూపుడు -రాజవృక్షరూపుడు.తక్షక నాగుని క్రీడింపజేయువాడు. వేలకొలది భుజములు కలవాడు వేలకొలది కన్నులు కలవాడు -వేలకొలది శిరస్సులు కలవాడు అనేక రూపములు కల వాడు. సృష్టి సేయువాడు లోకములను హరించువాడు. అనేక దేహములు కలవాడు. తెల్లనివాడు-సర్వభూతముల దేహముల యందును శయనించువాడు పర్వతమునకు హక్కులకు) ఈ శుడు మనోహరుడు - చి తముకలవాడు.క్షతులకు దెబ్బ తినిన వారికి) మేలు చేయువాడు చక్కగా తృప్తి నొందియుండువాడు.చక్కని హస్తములు కలవాడు ధనువు ధరించిన వాడు- భార్గవ స్వరూపుడునగు వానికి నీకు నమస్కారము.
అమ్ముల పొదులు కలవాడు నక్షత్ర రూపుడు (ప్రణవ రూపుడు) ఇంద్రియములతో కూడినవాడు. లోకములను (దుష్టులను) నశింపజేయువాడు ఎర్రనివాడు భయంకరుడు తీవరూపుడు శుభకరుడు మహాదేవుడు దేవతలందర లో గొప్పవాడు) దుష్టులను హింసించువాడు వికృత రూపుడు శుభరూపుడు ప్రకాశించువాడు గొప్పవాడు పెద్దవాడు మధ్యముడు బభ్రువర్ణము వాడు వసిమీ ఎక్కువ ఎరుపు తక్కువ కలిసిన వన్నె వాడు పసిమి తక్కువ ఎరుపు ఎక్కువ కలిసిన వర్ణమువాడు ఎర్రనివాడు పినాక ధనువు కలవాడు. బాణములు దాల్చినవాడు. అనేక వర్ణములవాడు రోహిత ముదురు ఎరుపు) వర్ణమువాడు దుందుభియందుండువాడు ఒకే పాదము కలవాడు జన్మము లేనివాడు ఆహిర్ బుధ్నియుడు మృగములను వెంటాడు వ్యాధరూపమువాడు ప్రతియొకటియు తానే నవాడు కదలనివాడు భీతిగొలుపువాడు అనేక నేత్రములు కలవాడు హితము కలిగించువాడు శోభన నేత్రములు కలవాడు ఈశ్వరుడు కపాలము ధరించినవాడు ఒకే యొక వీరుడు మృత్యువు.మూడు కన్నులు కలవాడు గృహమున కధిపతియగువాడు పినాక ధనుస్స్వరూపుడు కేవలరూపుడు వాన ప్రస్థుడు గృహస్థుడు యతి బ్రహ్మచారి సాంఖ్య దర్శనము యోగదర్శనము నైనవాడు వ్యాధులు (బోయవారు) తన సేనగా కలవాడు దీక్ష స్వీకరించి యుండువాడు అంతర్ధానము నొందియుండు వాడు హింస కలవాడు శుభమగు ఈశుడు శమస్వరూపుడు అగువానికి నమస్కారము.
రోహితవర్ణుడు చాల తెలివి కలవాడు బ్రహ్మజ్ఞులలో శ్రేష్ఠుడు మహర్షిరూపుడు-చతుష్పాదుడు పవిత్రుడు రక్షించు వాడు శీఘ్రముగా పోవువాడు జుట్టు ముడి కలవాడు నిమ్నోన్నత రూపుడు కోరలు కలవాడు విశ్వముల సృష్టించువాడు కాంతుల నిర్మించువాడు తీవ్రముగా ప్రకాశించువాడు శోభనమగు గ్రంథధారణా సామర్థ్యము కలవాడు (శోభన మేధ కలవాడు) క్రూరుడు వికృతరూపుడు అసహ్యము గొలుపువాడు శుభుడు నెమ్మదితనము కలవాడు పుణ్యరూపుడు ధర్మము నెరిగినవాడు (ధర్మము ననుష్ఠించువాడు) శుభుడు. ఆవధ్యుడు అమృతుడు నిత్యుడు శాశ్వతుడు (సహజరూపుడు) తన లక్షణములు ఇంకేవరియందును లేనివాడు అందరికంటే కడగొట్టువాడు అందర భరించువాడు రక్షఃస్వరూపుడు క్షేమము కలిగించువాడు ఎవరినై నను ఏదై నను సహించువాడు సత్యరూపుడు ఋతరూపుడు ముండ్లతో నిండిన దుర్గమ ప్రదేశములందుండువాడు రాసథరూపుడు శూలి దివ్యనేత్రములు కలవాడు సోమపానము చేయువాడు ఆజ్యమును పానము చేయువాడు ధూమమును పానము చేయువాడు ఊష్మమును పానము చేయువాడు శుచిరూపుడు పరిధాన ధరించు వస్త్రము ) స్వరూపుడు తత్క్షణమే సాక్షాత్కరించువాడు మృత్యువును కలిగించువాడు పిశితము (పచ్చి మాంసము) ఆహా రముగా తినువాడు శర్వుడు మేఘరూపుడు విద్యుదూపుడు అన్ని టినుండియు మరలియుండువాడు శేష్టుడు అందరను పోషించువాడు రక్షించువాడు అగువానికి నీకు నమస్కారము.
త్రిపురములను సంహరించువాడు ప్రకాశించువాడు చక్ర స్వరూపుడు. రోమములతో నిండినవాడు.తీష్టములగు ఆయుధములు కలవాడు సమర్థుడు బాగుగా ప్రజ్వలించువాడు భక్తుల ఎదుట నిలుచువాడు బంగారువలె ప్రకాశించువాడు భయము గొలుపువాడు (భక్తుల నుద్దరించుటకై) నిలువబడి యుండువాడు. ఋషభముని రూపుడు- వేదవతముల ననుష్ఠించువాడు-పూనిక తో నుండువాడు శుచియగువాడు ఊర్ధ్వరేతస్కుడు రాక్షసులను చంపువాడు యజ్ఞమును ధ్వంసము చేయువాడు మృత్యువును సంహరించినవాడు సర్వమును సమాప్తము చేయువాడు అగ్ని స్వరూపుడు ప్రశాంతుడు హవిస్సును మోసికొనిపోవు పొడు కుత్సితములగు శిలలుకల ప్రదేశముల రూపమున నున్న వాడు రక్షస్సుల చంపువాడు పశువుల (దుష్ట జీవుల) చంపువాడు విఘ్న రూపుడు శ్వాసరూపుడు అనాహత నాదస్వరూపుడు సర్వరూపుడు వ్యాపించియుండువాడు తపింపచేయువాడు సూర్యాగ్ని రూపుడు). దేనిని ఆశ్రయించక యుండువాడు దీప్ ధాతువునకు అర్థముగా నుండువాడు సమితులను (యుద్ధములను -సమాజములను) అధిష్టించి యుండువాడు కృష్ణుడు జయంతుడు లోకములకు ఈశ్వరుడు హిరణ్య బాహుడు పాశ రూపుడు సముడు శోభనములగు కన్యలు కలవాడు చక్కని పైరుల రూపమున నుండువాడు జీవాత్మకును అధిష్టాతయగువాడు చక్కని నేత్రములు కలవాడు శీఘ్రముగా పోవు బాణములు కలవాడు శోభనమగు ధనువు కలవాడు మొట్ట మొదటివాడు పరమాత్మరూపుడు కపిలవర్ణుడు పింగళ వర్ణుడు మహాదేవుడు బుద్ధిశాలి గొప్ప సంకల్పములు కలవాడు ప్రకాశింపజేయువాడు. దుష్టుల నేడిపించువాడు. అందరనోడించువాడు దృఢ ధనువు గలవాడు కవచము కలవాడు రథము కలవాడు వరూథము (ఒక విధమగు కవచము.రథభాగము) కలవాడు అగు నీకు నమస్కారము.
భృగువంశ రక్షకుడు శుక్రాచార్యరూపుడు -హృదయ గుహయందుండు వాడు -శాస్త్ర విధానముల చేయువాడు సఫలుడు ప్రశాంతుడు అమృతస్వరూపుడు సర్వభూతములను అమృతముతో తడుపువాడు భగవానుడు గొప్ప పరిమాణము కలవాడు గజచర్మము వస్త్రముగా గలవాడు జీవులకు ఆధిపతి సకల భూతములచే నమస్కరింపబడువాడు ఋగ్యజుఃసామ స్వరూపుడు స్వాహాకార రూపుడు వషట్కార రూపుడు ఆత్మరూపుడు అవధిరూపుడు సృష్టించువాడు నిర్మించువాడు సర్వము చేయువాడు పాపముల హరించువాడు దయాపరుడు దయనీయుడు దీనుల రూపమున నుండువాడు) భూత వర్తమాన భవిష్యకాల రూపముల నుండువాడు కర్మ రూపుడునగు నీకు నమస్కారము.
వసువులు సాధ్యులు రుద్రులు ఆదిత్యులు అశ్వినులు అను దేవతల రూపమున నుండువాడు నిర్గుణుడు త్రిగుణముల నెరిగినవాడు నామరూప విభాగము నొందినవాడు. సృష్టి చేయబడిన ప్రపంచ రూపమున నుండువాడు తనకుతానై యుండువాడు (పుట్టిన) ప్రజల రూపముతో నుండువాడు పూర్వము ఎన్నడు లేనివాడు మొదటివాడు ప్రజాపతిరూపుడు బ్రహ్మరూపుడు తనకుతానే అధిపతియగు వాడు తన అధీనమున తానుండువాడు అన్నిటిని అతిశయించినవాడు సర్వ భూతములకు ఆత్మయగు వాడు భూత రూపుడునగు నీకు నమస్కారము.
నిర్గుణుడు గుణముల తత్వము)ను ఎరిగినవాడు నామరూపాది విభాగము నొందినవాడు వేటిచేతను చేయబడనివాడు (స్వయంసిద్దుడు) వికృతములగు (బేసి సంఖ్యగల) కన్నులు కలవాడు. ఎల్ల భూతములకు మిత్రుడు (ఉదయించు సూర్యరూపమున నున్న వాడు) సాంఖ్య తత్వరూపుడునగు నీకు నమస్కారము. పృథివి అంతరిక్షము ద్యులోకము మహర్లోకము జన స్తపస్సత్యలోకములునను లోకముల రూపముననుండు నీకు నమస్కారము. నామ రూపానీ కముతో వ్యక్తము కానివాడు మహద్ రూపుడు భూతములకు ఆది యగువాడు ఇంద్రియరూపుడు ఆత్మ తత్వము నెరిగిన వాడు అన్ని టికంటెను గొప్పవాడు సర్వతత్వ రూపుడునగు నీకు నమస్కారము. నిత్యుడు ఆత్మలింగరూపుడు. సూక్ష్మడు చేతనరూపుడు బోధము జ్ఞానము పొందినవాడు సర్వవ్యాపియగువాడు మోక్షరూపుడునగు నీకు నమస్కారము. మూడు లోకములయందు ఉండు నీకు నమస్కారము. వీటికి పైగా ఉండు మూడు లోకములయందు ఉండు నీకు నమస్కారము. సత్యలోకముతో ముగియు నాలుగు లోకములయందును మహాలోకముతో ముగియు నాలుగు లోకములయందును ఉండు నీకు నమస్కారము .
బ్రహ్మజ్ఞుడవగు పరమేశ్వరా! ఈ నామస్తోత్రమునందు నేనేదైన పొరబాటులు పలికినను ఇది పలికిన ఇతడు నాభక్తుడేకదా యను దయతో నన్ను క్షమించ ప్రార్థించుచున్నాను.
శుక్రుడు దేవేశుడును ఈశ్వరుడును నీలలోహితుడు నగు శివునితో ఇట్లు పలికి బహువారములు మిగుల ప్రణా మములు చేసి దోసిలియొగ్గి మౌనము వహించెను. భవుడును ప్రీతుడై శుక్రుని శరీరమును స్పృశించి మిక్కిలి స్పష్టముగా తన దర్శనము నిచ్చి అచ్చటనే అంతర్థానమునందెను.
తన అనుచరులతో కూడ ఆ దేవుడంతర్ధానమునందిన పిమ్మట తన సమీపమందున్న జయంతిని చూచి శుకు డిట్లు పలికేను: సుందరీ! ఎవ్వరిదానవు! ఎవరవు? నాదుఃఖములో పాలువంచుకొనుచున్నావు. నేను మహా తపస్సాచ రించుచున్న కాలములో నన్ను కాపాడుచుంటివి. ఇటువంటి భక్తి వినయము ఇంద్రియ నిగ్రహము స్నేహము నా విషయమున చూపుచుండిన నీపై నేను ప్రీతుడనయితిని. నీకేమి కావలయును? చెప్పుము. ఆది ఎంత దుర్లభమయినను నీకోరిక నెరవేర్చెదను. అనగా ఆమే 'అయ్యా! దివ్యమగు తపశ్శక్తిచే కలిగిన జ్ఞాననేత్రముతో చూచి నాకోరిక ను మీరే ఎరుగ ప్రార్థించుచున్నాను.' అనెను. శుక్రుడు దివ్యదృష్టితో చూచి 'భామినీ! పది ఏండ్లపాటు నీవు భూతములకు వేనికిని అదృశ్యురాలవై నాతో కలిసియుండ గోరుచున్నావు. నల్ల కలువపూలవంటి చాయయు ఉత్తమ సుందర రూపమును మనోహర నేత్రములును మధురమగు వాక్కును కలదానవగుటచే నేనును నిన్ను కామించుచున్నాను. నీకోరికను తీర్చెదను. ఇంటికి పోవుదము రమ్ము. అనెను. తరువాత శుక్రుడు స్వగృహమునకు వచ్చి జయంతిని పెండ్లాడెను. అట్లే పదిఏండ్లు ఏ భూతములకును కనబడక జయంతితో కూడి దాంపత్యము ననుభవించుచుండెను.
ఇట్లుండగా దేత్యులును తమ గురువగు శుక్రుడు తపస్సునందు కృతార్థుడే తిరిగి వచ్చేనని ఎరిగిరి. వారు సంతోషమునంది ఆయనను చూడగోరి అతని ఇంటికి పోయిరి. కాని శుక్రుడు మాయచే కప్పువడియున్నందున ఆతడు వారికి కనబడ లేదు. అతడు మాయచే మరుగుపడియున్నొడని గు ర్తెరిగి వారును మరలిపోయిరీ.
కావ్యో వోహంఽగురు రౌత్యా(రుర్దైత్యాః కుహుకో) మద్రూపోయం బృహస్పతిః.
శుక్రుడు శివునివలన వరములను పొంది వచ్చెననియు ఐనను జయంతికి మేలు చేయగోరి పదిఏండ్లపాటు మాయతో ఆవృతుడై మరుగుపడియుండుననియు బృహస్పతి ఎరిగెను. ఈ అవకాశములో అతడు ఇంద్రుని పేరణచే శుక్రుని రూపము ధరించి దైత్యులను తనకడకు పిలిచెను. వారు తనకడకు రాగా ఆతడు వారితో ఇట్లు పలికేను: “నాకు యాజ్యులు (యజ్ఞాదులు చేయింపబడువారు) అగు మీకు స్వాగతము. నేను మీకు మేలు చేయగోరి వచ్చినాను. నేను సంపాదించి తెచ్చిన విద్యలను మీచే అధ్యయనము చేయింతును.” వారును సంతోషముతో విద్యాధ్యయనార్థము బృహ స్పతిని ఆశ్రయించి యుండిరి.
కాలము గడచేను. ప సను నిండెను. ఆ సమయము ముగియుసరికి జయంతీ శు) కులకు దేవయాని జన్మించెనని పరంపరలో వినుచున్నాము.
అంతట శుక్రుడు తన యాజ్యులగు దానవుల మంచి చెడ్డలను విచారించగోరెను. నేను నా యాజ్యులను చూడ బోయెద నని అతడు జయంతితో పలికెను. “మహాతపస్వీ! నీభక్తులను అనుగ్రహించుము. సజ్జనుల ధర్మము ఇదియే కదా! నేను నీ ధర్మమునకు లోపము కలుగనీయను. అని జయంతి పలికెను.
దేవాచార్యుడగు శుక్రుడు పోయి దానవులను దైత్యులను చూ చేను. బృహస్పతి శుక్ర రూపమున వారిని వంచించేనని అతడు ఎరిగేను. “దైత్యులారా! నేను శుక్రుడననీ గురుతించుడు. ఇతడు వివిధ రూపములు ధరించుటలో సమర్థుడగు బృహస్పతి. ఇతడు మిమ్ము వంచించెను. నామాట వినుడు.” అనెను. శుక్రుడు అట్లు పలుకుట విని దైత్యులు తడబాటు చెందిరి. వారు ఆ ఇరువురను చూచుచుండిరి. ఆ ఇరువురును పవిత్రమగు చిరునవ్వుతో స్థిరముగా కూర్చుండి యుండిరి. వారందరును మిగుల మూఢ చిత్తులయిరి. వారికి ఏమియు ఆర్థము కాకపోయెను. అట్టి దైత్య దానవులను చూచి శుకుడు మరల “నేను మీ ఆచార్యుడనగు శుక్రుడను. ఇతడు దేనాచార్యుడు ఆంగిరసుడు (బృహస్పతి). మీరందరు నన్న నుసరించుడు. ఈ బృహస్పతిని విడువుడు.” అనెను. అసురులును శుక్రుని ఈ మాటలు వినిరి. వారు ఇద్దరను గమనించి చూచిరి. ఎంత చూచినను వారికి ఆ ఇద్దరకు గల భేదము ఏమియు గోచరించలేదు. తపోధనుడగు బృహస్పతి ఏమాత్రము తడబడక దానవులతో ఇట్లనెను. “దైత్యులారా! మీ గురుడనగు శుక్రుడను నేనే. ఇతడు (హ సవ శుకుడు) నా గూపము దాల్చిన బృహస్పతి. ఇతడు ఇట్లు మిమ్ములను మోసపుచ్చుచున్నాడు.” అంతట దానవులందరును తమలో తాము సంప్రతించుకొనిరి. అందరు కలిసి గట్టిగా ఇట్లనిరి: “ఇతడు పది సంవ్సరముల నుండి మనలను తన శిక్షణయందుంచుచున్నాడు. ఇతడే మనకు ప్రభువు (యోగ క్షేమము కలిగింపగల సమర్థుడు.) ఇతడే మనకు గురువు. ఈ (రెండవ) బ్రాహ్మణుడు అవకాశము చూచుకొని వచ్చినవాడు.” ఇట్లు పలికిన వారందరును మాయా శుక్రునికి చాగిలపడి నమస్కారము చేసిరి. చాల కాలమునుండి అలవాటు పడియున్నందున వారు సత్యమును గుర్తించలేకపోయిరి. అందుచే వారు బృహస్పతి మాటనే సత్యముగా గ్రహించిరి. వారు క్రోధముతో కం డైర్ర జేసి శుకునితో ఇట్లు అనిరి: ఇతడే మా గురువు. కనుక నీవు వెళ్ళిపొమ్ము. నీవు మాకు గురువవు కావు. ఈతడు శుక్రుడో బృహస్పతి మాకు అక్కరలేదు. ఈ భగవానుడే మాగురువు. మేమందరమును ఇతని ఆజ్ఞయందే ఉంటిమి. ఉన్నా ము. ఉందుము. నీవు ఇటనుండి తిన్నగా వేళ్ళిపొమ్ము. తడవు చేయకుము.”అనిరి. ఇట్లు పలికి దానవులు అందరను బృహస్పతిని గురునిగా ఆశ్రయించి ఉండిరి.
తాను చెప్పిన అంతటి గొప్ప హితవచనమును దైత్యులు వినకపోవుటచేత శుక్రుడు వారి పై చాల కోపించేను. వారి గర్వము కూడ అతనికి కోప హేతువయ్యెను. "మాయాబలమున బృహస్పతి చేసిన బోధనములు విని మీరు నన్నా శయింపకున్నారు. కావున దానవులారా! మీరు తెలివి కోల్పోయి పరాభవముల పాలగుదురుగాక!" అని పలికి శుక్రాచార్యుడు తాను వచ్చిన త్రోవను పోయెను.
శుక్రునిచేత దానవులు శపింపబడినట్లు తెలియగనే బృహస్పతి తాను కృతార్థుడయ్యేనని తలచి హర్షము పొందేను. అసురులు బుద్ధి కోల్పోయినమాట అతనికి సంతోషము కలిగించేను. వెంటనే అతడు స్వరూపము ధరించెను. అంతర్ధానము కూడ పొందేను.
అతడట్లు అంతర్ధానము పొందగా దైత్యులు విభ్రాంతులయిరి. ఆయ్యో! ఛీ! అతడు మనలను మోసగిం చేనే! అని ఒకరితో మరియొకరనసాగిరి. ఈ ఆంగిరసుడు (బృహస్పతి) మనలను వెనుకనుండియు ముందునుండియు దెబ్బ తీ నేనే! అతడు తన మాయ చేష్టలతో మనలను మోసగించెనే! అని చింతించిరి. అంతట వారు చింతచే నోళ్ళెండిపోవు చుండ ప్రహ్లాదుని ముందుంచుకొని శుక్రుని అడుగుల వెంటనే బయలుదేరి అతడు వెళ్ళిన మార్గముననుసరించి పోయిరి. చివరకు శుక్రుని సమీపము చేరిరి. తలవంచుకొని అతని ముందు నిలువబడిరి.
మరల తన ఎదుటికి వచ్చిన తన యాజ్యులైన దానవులను చూచి శుక్రుడు వారితో నేనెంత హెచ్చరించినను “మీరందరును నామాట పై ఆదరము చూపక పోతిరి. నా పై మీరు చూపిన అవమాన దృష్టికి ఫలముగా మీరు అవ మానము పొందితిరి.” అనెను.
శుక్రాచార్యుడు ఇట్లు పలుకుచుండ ప్రహ్లాదుడు బాష్పములు క్రమ్మిన కన్ను లతో ఇట్లు పలికేను: "భార్గవా! మీరు మమ్ములను విడువవలదు. మాకు మీరే ఆశ్రయము. మేము మిమ్ము ఆశ్రయించుచున్నాము. మీకు భక్తులము. ఇట్టి మాకు మీరు ఆశ్రయము ఇండు. మీరు మాకు కనబడనీ సమయములో దేవగురువు మమ్ములను మోసగించేను. మమ్ములను మయలో పడవే నెను. తపస్సుచే దీర్ఘములగు నేత్రములుగల మీరు ఎంతవరకై న మీదృష్టి ప్రసారము చేయగలరు. మీరే మామనస్సలలోనికి చూడుడు. మేము మీ భక్తులము. మమ్ములను విడువవలదు. భృగునందనా! మీరు మమ్ముల ననుగ్రహింపనిచో మీరు మమ్ములను అలక్ష్యముగా చూచినచో.మేము ఇప్పుడే రసాతలమును ప్రవేశింతుము.
శుక్రాచార్యుడు యథార్థమును తెలిసికొనెను. అతడు సహజముగానే కరుణా స్వభావుడు. భూతముల పై అను కంప. కలవాడు. ప్రహ్లాదాది దైత్యులును. తన్నెంతగానో బ్రతిమాలిరి. అందుచే అతడు తన కోపము అణచుకొని ప్రహ్లాదునితో ఇట్లు పలికెను: “మీరు భయపడవలదు. రసాతలమునకు పోవలసిన పనిలేదు. అవశ్యము జరుగవలసిన విషయములు ఏవో మీకును జరిగినవి-నాకును జరిగినవి. దైవనిర్ణయము బలవత్తరము. దానిని మనము మార్చజాలము. నాయాజ్యులగు మీకు దురదృష్టవశమున తెలివి తప్పినది. మరల తగిన కాలమున, మీకు తెలివి వచ్చును. దేవతల చేతిలో మీరు ఓటమి పొంది పాతాళమునకు పోవలసిన అగత్యము ఎప్పటికిని రాదు. ఇప్పుడు మీకు ప్రతికూల నమయము వచ్చి ఇట్లు జరిగినది. అని బ్రహ్మ పలికియున్నాడు. నా యనుగ్రహమున మీరు శక్తి సంపత్సమృద్ధమైన త్రైలోక్యరాజ్యమును అనుభవించితిరి. పది దివ్య యుగ ములపాటు దేవతల శిర స్సుల పై మీ పాదముల నిలుపగలిగితిరి. మీ రాజ్యకాలము ఇంతమాత్రమే. ఆని బ్రహ్మ పూర్వము చెప్పియుండెను. మరల సావర్ణిక మన్వంతరమున నీకు (ప్రహ్లాదు నకు) రాజ్యాధికారము వచ్చును. తరువాత మీ మనుమడు బలి మరల త్రిలోకములకును ఈశ్వరుడగును. ఈ విషయమును రహస్యమున మీ మనుమడై న బలితో స్వయముగా విష్ణువే చేప్పియుండెను. విష్ణువు తాను బలినుండి వంచనచే లోకములను హరించిన సమయమున ఆంతవరకు బలి తన పాలిత ప్రదేశములందన్నీట ప్రవరిల్లజేసిన లోకప్రవృత్తులను గూడ మోసముచే తీసివేసికొనెను. అందుచే ప్రీతుడై విష్ణువు *బలికి ఈ వరముని చ్చెను. అందుచే బలి మరల దేవరాజ పదము నలంకరించి తీరవలయును. అని ఈశ్వరుడే నాతో చెప్పియున్నాడు. అందుచేత బలి అంతవరకును ఏ భూతములకును అదృశ్యుడే మంచి కాలమునకు ఎదురు చూచుచుండును. అట్లే విష్ణువు నీకును అమరత్వమును వర ముగనిచ్చియున్నాడు. అందుచే నీవు ఏమియు తహతహపడక పర్యాయక్రమములో వంతుల ననుసరించి దేవతల అధికారము తరువాత మీ అధికార కాలము వచ్చువరకు ఎదురు చూడవలయును. నేను నీముందు అసత్యము పలుక జాలను. ఈ విషయము నీతో ఇప్పటికే చెప్పవలసియుండెను. కాని బ్రహ్మ చెప్పవలదనుటచే నాకు ఈ భవిష్యత్ తేలిసియుండియు నీకు చెప్పి యుండ లేదు. ఈ నా శిష్యులిద్దరును (శండుడు మర్కుడు అనువారు) బృహస్పతికి ఆదరపాత్రులై యుండి దేవతలతో కలిసియుండి మీకు నాశము కలుగనీయకుండునట్లు దేవతలను వారింతురు.”
అనీ ఇట్లు శుక్రుడు దానవులకు చేప్పేను. అతడు ఎట్టి క్లిష్టమయిన పనులనై నను సునాయాసముగా చక్క పెట్టగలవాడు. తప్పక జరిగి తీరెడి భవిష్యద్విషయములనే శుక్రుడు తమకు చెప్పెను. కనుక ప్రహ్లాదుడు మొదలగు చైత్యులందరును హర్షముతో వెడలిపోయిరి.
(*బలి చక్రవర్తి తన పాలనకాలమున త్రిలోకములందును ఒక ఉత్తమమగు పాలన వ్యవస్థను నిలి పెను. విష్ణువు దేవతలకే బలినుండి త్రిలోకరాజ్యమును హరించెనేకానీ బలి అతఃపూర్వము: లోకములందు నిలిపిన ప్రవృత్తుల కంటే మేలగు ప్రవృత్తులను దేవతలు కాని మానవులుకాని ఎవ్వరును ఏర్పరుపలేరు. కావున - తరువాత దేవతలు బలి అంతకు మునుపు నడుపుచుండిన ప్రవృత్తులతోనే లోక పాలనను సాగించిరి. ఇది బలి గొప్పదనము. బలి ఇట్టి ఉత్తమ పాలకుడు గావున అతని విషయమున విష్ణువు ప్రీతుడై అతనికి ఉత్తమ వరములిచ్చుట. ఆశ్చర్య కరముకాదు.)
శుక్రుడు చెప్పినట్లు తమకు దేవతలవలన భయము రానున్నదని ఎరిగి దానిని వారించుకొనదలచి దైత్యులు కవచములను ఆయుధములను ధరించి దేవతలను యుద్ధమునకు ఆహ్వానించిరి. అది చూచిన దేవతలును ఆయా సామగ్రు లను సమకూర్చుకొని దైత్యులతో తలపడిరి. ఈ దైవాసుర యుద్ధము నూరేండ్లు - జరిగేను. దీనిలో తుదకు దైత్యులే దేవతలను గేలిచిరి. దేవత లోడిరి.
దేవతలు అందరును మంత్రాలోచనము చేసిరి. యజ్ఞముచే (భగవానుని) ఉపాసింతము. ఆ విధముగ దైత్యులను ఓడింతము. అని సంకల్పించిరి.
వారంతట శుక్ర శిష్యులగు శండామర్కులను బ్రాహ్మణులను పిలిచి “మనము యజ్ఞము జరుపుదము. తరువాత ఇప్పటికి యుద్ధమున గాయపడ కుండిన దైత్యులనందరను యుద్ధమునకు పిలిచెదము. మనమందరము కలిసి దానవులను గెలిచి వారి ధనమును గేలిచికొందము. అనిరి. ఇట్లు మోసముతో ఒడంబడిక చేసికొని *శండామర్కులు దేవతల పక్షమునకు పోయిరి. దీనికి ఫలితముగా దేవతలు గెలిచిరి. దైత్యులోడిరి. శండామరులు తమ్ము విడిచి పోయినందున దానవులు బలహీనులై 6. ఇట్లు పూర్వము దైత్యులు శుకుని కోపము మూలమున దేబ్బతిని దేవతల చేతిలో పరాభవము నందిరి. అపుడు మరల వారు శండామర్కుల నాశ్రయించిరి.
దైత్యులు ఇట్లు కావ్యుని కోపముచే వ్యాప్తులై ఎచ్చటను ఏ ఆశ్రయమును లేనివారయిరి. దేవతలచే ముట్టడించ బడి వారి చేతిలో ఓడిపోయి ఎన్నో క్లేశముల పాలయిరి. ప్రహ్లాదుని ఆజ్ఞకు లోబడి నడచుకొనని రాక్షసులందరును మానవుల చేతులలో కూడ మరణింతురని బ్రహ్మ పూర్వమే పలికియుండెను.
(*ఈ సందర్భమున దేవతలు జరిపిన యజ్ఞమును శండామరులు నిర్వహించిన విషయమే ఈ - అధ్యాయమున ఏబది ఐదవ శ్లోకమున చెప్పబడియున్నది.)
తరువాత అది మొదలుకొని భృగు శాపమును నిమిత్తముగా చేసికొని ప్రభువగు శ్రీ నారాయణుడు లోక మున ధర్మము మిగుల శిథిలమయినపుడెల్ల ధర్మవ్యవస్థను రాక్షస నాశమును కలిగించుటకై మరల మరల అవతారములను ఎత్తనారంభించెను. ఇట్లు అతడు అజుడు జన్మము లేనివాడయ్యును జన్మము నందసాగెను.
వీనిలో మొదటిది ధర్మావతారము : చాక్షుష మన్వంతరమున నారాయణుడు ఆంశముతో ధర్ముడుగా అవత రించెను. అతని ప్రాదుర్భావ కాలమునందే ఆ చాక్షుష మన్వంతరమునందే దేవతలు యజ్ఞము నాచరించిరి. ఈ యజ్ఞము నందు బ్రహ్మ అధ్వర్యుడుగా నుండెను.
రెండవది నారసింహావతారము: నాలుగవ దివ్య యుగమునండు అమరులకు ఆపదలు కలుగగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వధించుటకై నారాయణుడు నారసింహుడయ్యెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమున రుద్రుడు పురోహితుడు (అధ్వర్యుడు) అయ్యెను. మూడవది వామనావతారము: స వమ మహాయుగపు త్రేతాయుగమున త్రిలోకములును బలి వశగతములు కాగా నారాయణుడు వామనుడుగా నవతరించెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమున ధర్ముడు (మహాముని) అధ్వర్యుడు అయ్యెను.
ఇవి శ్రీ మహావిష్ణువునకు భృగుశాప నిమిత్తమున కలిగిన జన్మములలో చూడు. ఇవి దివ్యములగు దేవతా తత్వ సంబంధులగు) అవతారములు. ఇవికాక మిగిలిన ఏడును మానుషములు.
నాలుగవది దత్తాత్రేయావతారము. ఇది ప్రథమ త్రేతా యుగమున జరిగెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమునందు మార్కండేయుడు పురోహితుడయ్యెను.
పదునైదవ త్రేతాయుగమున జరిగిన మాంధాతృ చక్ర వర్త్యవతారము ఐదవది. అతనికి రై భ్యుడు పురోహితుడయ్యెను.
పందొమ్మిదవ త్రేతాయుగమున జరిగిన పరశురామావతారము ఆరవది. ఈ విభుడు సర్వక్షతాంత కరుడు. ఇతడు జమదగ్ని కుమారుడు. విశ్వామిత్తు డీతనికి పురోహితుడు.
ఇరువది నాలుగవ త్రేతాయుగమున రావణవధార్థ మై దశరథ కుమారుడుగా జనించిన శ్రీ రాముని అవతారము ఏడవది. ఇతనికి వసిష్ఠుడు పురోహితుడు.
ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగమున పరాశర పుత్రుడుగా జన్మించిన వేదవ్యాసుడు ఎనిమిదవ యవతారము. జాతకర్ణ్యుడు ఈతనికి పురోహితుడు. ఈతడు ధర్మప్రతిష్టాపనమును అసుర నాశమును జరుపుటకు హేతు భూతుడయ్యెను.
పద్మనేత్రుడగు శ్రీ నారాయణుడు ఇదే ఇరువది ఎనిమిదవ ద్వాపరమున దేవకీ వసుదేవుల కుమారుడగు కృష్ణుడుగా నవతరించెను. ఇది తొమ్మిదవ యవతారము. ఇతని పురోహితుడు ద్వైపాయన వ్యాసుడు.
ఈ కల్పమునందే యుగధర్మము క్షీణించగా కల్ప సంధ్యాకాలమున విష్ణు యశుడు అనునాతనికి కల్కి అను పేర కుమారుడుగా శ్రీ నారాయణుడు జనించును. ఇది పదియవ యవతారము. ఇతనికి పారాశర్య వ్యాసుడు అగ్రేసరుడై యుండును. యాజ్ఞవల్క్యుడీతని పురోహితుడు. ఆయుధములు ధరించిన లక్షల కొలది విప్రులీతనికి సేనగా నుందురు. ఈతడు దుష్టులగు అనేక భూతములను పాషండులను వేదములకు విప్రులకు శత్రువులగు నరులను శూద్రులగు వేద ద్వేషులగు రాజులను అంతము నొందించును. సముద్రముల అంచులవరకు గల ఈ భూమండలమునందలి దుష్ట శూద్రులను నశింపజేయును. ఆ కాలమునందే జనులును దుష్టులగు వారు మోహితులై ఒకరిని మరియొకరు వధించు కొందురు. జరుగవలసిన భవితవ్యత పేరించగా ఆ దుష్టులందరు నట్లు నశించగా ఇంతలో కలియుగము గడువగా ఆ కల్కి మూర్తి అంతర్ధానమునందును.
యుగాంతమున ప్రజలను రక్షించు నిమిత్తమయి చివరకు రాజులందరును నశింతురు. వారిని రక్షించు వారెవ్వరును ఉండరు. వారు ఒకరిని మరియొకరు చంపుకొందురు. వారు మిగుల దుఃఖముల పాలగుటయే కాక అవి చెప్పుకొనుటకు దిక్కులేని వారగుదురు. అందరును ఒకరిని మరొకరు హింసించుకొనుచు సమముగా దుర్మార్గులగుటతో వారు తమ ఆస్తులు విడిచి పురములు గ్రామములు విడిచి పోవుదురు. ఆయా ఆశ్రమ ధర్మములకు కావలసిన వస్తువులే దొరుకక పోవును. వర్ణాశ్రమ ధర్మములు నశించును. - జనపదములలో అన్న మును విక్రయింతురు. చతుష్పథము (నాలుగు వీథులును కలియు కూడలు)లలో వేదములు అమ్ముదురు. ధనమునకు ఆశపడి వేద ధర్మములను అందరకును బహిరంగముగా ప్రవచింతురు. స్త్రీలు తమ శీల పవిత్రతను అమ్ముకొందురు. ప్రజలు పొట్టిదేహములు కలవారు అల్పాయుష్కులు అడవులలో నదీ తీరములలో పర్వతములలో నివసించు వారగుదురు. పొరలు చర్మములు ధరింతురు. ఘోరములగు సంకటముల పొందుదురు. అందరును పాదగోండులగుదురు. ఆస్తులు తగ్గిపోవును. బుద్ధి వాదములు చేయుదురు, అల్పబుద్ధులగుదురు. సంకర ప్రధానమగు కలియుగములో ప్రజలు ఇట్లు కష్టముల పొందుదురు. తుదకు కలియుగములో జనులిట్లు కష్టములు పడిపడి ఒకేమారు నాశము పొందుదురు. అంతట కృతయుగమారంభమగును.
ఇట్లు మీకు యదువంశ మును తెలుపు ప్రసంగమున దైవాసుర యుద్ధమును చక్కగా చెప్పితిని. విష్ణుయశమును కూడ తెలిపితినీ. ఇక మీదట తుర్వసు ద్రుహ్య్వనుపూరుల వంశమును తెలిపేదను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యదువంశ కథనమున శ్రీకృష్ణావతార ప్రసంగమున దైవాసుర యుద్దాది కథనము భగవదవతార హేతు కథనమునను నలువది యేడవ అధ్యాయము.
గమనిక
(18వ అధ్యాయమున శ్రీదేవి దక్షప్రజాపతికి తన అష్టోత్తర శతస్థానములను తెలిపెను. వానిని శ్రీదేవీ పూజార్థమయి ఉపయోగించుటకు అనువుగా అవి అష్టోత్తరశతనామావళి రూపమున ఇచట ఈయబడు చున్నవి.
47వ అధ్యాయమున శుక్రుడు చేసిన శివస్తుతి త్రిశతీ నామ రూపమయినది. అవియు త్రిశతీనామావళీ రూపమున ఇచ్చట ఈయబడుచున్నవి. ఇవి రెండును ఉపాసకులకు ప్రయోజనకరములు. - అనువాదకుడు.)
శ్రీదేవ్య ష్టోత్తరశతస్థాన సంపుటితనామావళి
'ఓం' వారాణస్యాం విశాలాక్ష్యే 'నమః' మాయాపుర్యాం కుమార్యై
నైమి శే లింగధారిణ్యై లలితే సంతతాయై
ప్రయాగే లలితాయై ఉత్పలాక్షే సహస్రాక్ష్యై
గంధమాదనే కాముకాయై మహోత్పలే హిరణ్యాక్ష్యై
మాన సే(సరసి కుముదాయై గయాయాం మంగళాయై
విశ్వేశ్వరే విశ్వాయే పురుషోత్తమే విపులాయై
విశ్వకాయాం మాయై(లక్ష్మ్యై) విపాశాయాం అమోఘాక్ష్యై
ఇచ్ఛాయాం మదనోత్కటాయై పుండ్రవర్ధనే పాటలాయై
గోమంతే గోమత్యై సుపార్శ్వే నారాయణ్యే
మందారే కామచారి ణ్యై. త్రికూటే భద్రసుందర్యై.
చిత్రరథే మదోత్కటాయై వీపులే ఏపులాయే
హస్తినాపురే జయంత్యై మలయాచలే కల్యాణ్యే
కన్యాకుబ్జే గౌర్యై కోటితీర్థ కోట్యశ్యై
మలయపర్వతే రమ్యాయై మాగధవనే సుగంధాయై
హిమవత్సానుని సందాయై కుబ్జామ కే త్రిసంధ్యాయే
గోకర్ణ భద్రకర్ణికాయై గంగాద్వారే రతిప్రియాయై
స్థాణ్వీశ్వరే భవావ్యై శివకుండే సునందాయై
బిల్వ కే బిల్వపత్రికాయై దేవికాతటే నందిన్యై
శ్రీశైలే మాధవ్యై ద్వారవత్యాం రుక్మిణ్యే
భద్రేశ్వరే భద్రాయై. బృందావనే రాధాయే.
వరాహ శైలే జయాయై మథురాయాం దేవక్యై
కమలాలయే కంబళాయై పాతాళే పరమేశ్వర్యై
పుష్కరే పురుహూతాయై చిత్రకూటే సీతాయై
కేదారే మార్గదాయిన్యై వింధ్యే వింధ్యనివాసిన్యై
చంద్రకోట్యాం రుద్రాణ్యై సహ్యాద్రౌ ఏకవీరాయై
కాళంజర గిరౌ కాళ్యై హరిశ్చంద్ర చంద్రికాయై
మహాలింగే కపిలాయై రామతీర్థ రమణాయై
మకుటే మకు టేశ్వర్యై యమునాయాం మృగావత్యై
సాలగ్రామే మహాదేవ్యై కరవీరే మహాలక్ష్మ్యై
శివలింగే శివప్రియాయై. వినాయకే ఉమాదేవ్యై.
వైద్యనాథే ఆరోగ్యాయై కపాలమోచనే శుద్ధి
మహాకాళే మ హేశ్వర్యై కాయావరోహణే మాత్రే
శుక్లతీర్థ అభయాయై శంఖద్వారే ధ్వన్యై
వింధ్య కందరే స్మృత్యై పిండార కే ధృత్యై,
మాండ వ్యే మాండ క్ర్యై చంద్రభాగాయాం కలాయే.
మాహేశ్వరే పురే స్వాహాయై
ఛాగలాండే ప్రచండాయై అచ్ఛోదే శూలధారిణ్యే
అమరకంటకే చండికాయై వైణాయాం అమృతాయై
సోమేశ్వరే వరారోహాయై బదర్యాం ఊర్వశ్యై
ప్రభాసే పుష్కరావత్యై . ఉత్తరకురా ఓష్య
సముద్రత పే సర స్వత్యాం దేవమాత్రే కుశ ద్వీ పే కుశోదక్యై
మహాలయే మహాభాగాయై హేమకూటే మన్మథాయై
పయోషే పింగళావత్యై కుముదే సత్యవాదిన్యై
కృతశాచే సింహికాయై అశ్వత్థవృక్షే)వందనీయాయై
కార్తికేయే యశస్కర్యై(శాంకర్యై) వైశ్రవణా(కుబేరా)లయే నిధయే ఉత్పలావరకే లోలాయై వేదవదనే(వేదారంభే) గాయత్యై.
సింధుసంగమే సుభద్రాయై
సిద్దవనే లక్ష్మ్యై మాత్రే శివసన్నిధౌ పార్వత్యై భరతాశ్రమే అనంగాయై దేవలో కే ఇంద్రాణ్యే జాలంధరే విశ్వముఖ్యై, బ్రహ్మశరీరే సరస్వత్యై కిష్కింథపర్వతే తారాయై సూర్యబింబే ప్రభాయై దేవదారువనే పుష్ట్యై మాతృకాసు వైష్ణవ్యై
సతీషు అరుంధత్యై
కాశ్మీరమండలే మేధాయై రామాసు(స్త్రీషు)తిలోత్తమాయై హిమాదౌ ఊ(భీ)మాదేవ్యై సర్వశరీరిణాం చిత్తే బ్రహ్మకలా షష్ఠే వస్త్రేశ్వర్యై నా మ్న్యై శక్తయే.
(ఈ చెప్పిన ఆ యా స్థానములందు ఈ చెప్పిన రూపములలో ఉన్న మహాతత్త్వము భగవ చ్ఛ క్రియే. అను భావనచేయుచు శ్రీదేవిని అర్చించవలయును. ఈ చెప్పినవానిలో తీర్థ క్షేత్రములుగా నున్నవి నేడు ఎచ్చట ఏ పేరులతో నున్న వి- అను విషయము ‘Sakta Pithas' అను గ్రంథమున చూడనగును.
నామమున - వందనీయా - వంద నికా-బదనిక - అను పేరుతో వ్యవహరింపబడు అశ్వత్థ వృక్షా శ్రిత వృక్ష వి శేషము అని తోచుచున్నది. ఇట్టిది ఓషధీ విశేషము కావున శ క్తిరూపమగును. అనదగి యున్నది. అనువాదకుడు.)
ఓం శితికంఠాయ నమః కావ్యాయ కరాఛాయ
కనిష్ణాయ వత్సరాయ హర్యక్షాయ
సువర్చసే ఆంధసస్పతయే వరదాయ
తేలిహానాయ సంస్తుతాయ స్తుతార్థాయ
దేవదేవాయ రంహసే తామాయ
భీమాయ ఉగాయ శ్రీవాయ
మహాదేవాయ శర్వాయ విరూపాయ
శివాయ హిరణ్యాయ విశిష్టాయ
జ్యేష్టాయ మధ్యమాయ బభవే
సువక్తాయ సహస్రాక్షాయ మీడుషే
వసురేతాయ రుద్రాయ తవసే
కృత్తివాససే హ్రస్వాయ వ్యుప్తకేశాయ
సేనాన్యే రోహితాయ కపయే
రాజవృక్షాయ తక్షకక్రీడనాయ సహస్రబాహవే
సహస్రనయనాయ సహస్రశిరసే బహురూపాయ
వేధసే హరాయ బహురూపాయ
శ్వేతాయ పురుషాయ గిరీశాయ
మనోజ్ఞాయ పిశంగాయ పింగళియ
అరుణాయ పినాకినే ఇషుమతే
చితాయ రోహితాయ దుందుభ్యాయ
ఏకపాదాయ అజాయ అహయేబుధ్నియాయ
మృగవ్యాధాయ సర్వాయ ఆరణ్యాయ
గృహస్థాయ యతయే బ్రహ్మచారిణే
సాంఖ్యాయ యోగాయ వ్యాధినే
దీక్ష్మితాయ అంతర్షితాయ శర్వాయ
భవ్వేశాయ శమాయ రోహితే
చేకితానాయ బ్రహ్మిష్ణాయ మహర్షయే
చతుష్పదాయ మేధ్యాయ రక్షిణే
శీఘగాయ శిఖండినే కరాయ
దంషిణే విశ్వవేధసే భాస్కరాయ
ప్రదీపాయ దీప్తాయ సుమేధసే
కూరాయ వికృతాయ బీభత్సాయ
శివాయ సౌమ్యాయ పుణ్యాయ
ధార్మికాయ శుభాయ అవధ్యాయ
అమృతాయ నీత్యాయ స్థాణవే
సుక్షతాయ సంతృప్తాయ సుహస్తాయ
ధన్వినే భార్గవాయ నిషంగిణే
తారాయ సోక్షాయ క్షపణాయ
భీషణాయ బహునేతాయ పథ్యాయ
సునేతాయ ఈశ్వరాయ కపాలినే
ఏకవీరాయ మృత్యవే త్ర్యంబకాయ
వాస్తోష్పతయే పినాకాయ అవధ్యాయ సాక్షాయ ముక్తయే అమృతాయ
క్షవణాయ కేవలాయ నిత్యాయ
Summary of chapter 47 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya delivers a magnificent, extensive chronicle of the major Avatāras of Bhagavān Vishṇu and the cosmic wars known as Devāsura Saṅgrāma. The chapter details Śukrāchārya's departure to perform severe penance to Bhagavān Śiva on Mount Kailāsa to acquire the Mṛta-sañjīvanī mantra. During his absence, the Devas attacked the defenseless Asuras, who sought refuge under Kāvya-mātā who was the mother of Śukrāchārya. When Kāvya-mātā used her yogic power to paralyze Indra and the Devas, Bhagavān Vishṇu severed her head with His Sudarshana Chakra to protect cosmic order, prompting Maharshi Bhṛgu to curse Bhagavān Vishṇu to take seven mortal incarnations among human beings. Bhagavān Vishṇu accepted this curse as part of His divine play to preserve Dharma, giving rise to His prominent incarnations including Dattātreya, Māndhātā, Parashurāma, Rāma, Vedavyāsa, Buddha, and Kalki.