151 -  విష్ణువు గరుడునితో కూడ పారిపోవుట॥

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను సేనాపతియగు గ్రసనుడు నీహతుడు కాగానే దానవులు శ్రీహరితో కూడ మితిమీరిన యుద్దము చేసిరి పట్టనములను ముసలములను ప్రానములను గదలను కుణికములను వాడి మొనలుగల నారాచములను శక్తులను చక్రములను వారు వదలినను చిత్రయోధుడగు జనార్ధనుడు వాటినొక్కొక్క దానిని అగ్ని జ్వాలలవంటి బాణములతోనూ రేసిగా ఖండించెను అంతట దైత్యులు చాలవరకు తమ ఆయుధములు ఆయిపోవుటచే చిత్రములు భ్రాంతినొంది రణమున అస్త్రముల ప్రయోగించుటకు ఆసమర్థులు కాగానే వారు చచ్చిన ఏనుగు లను గుర్రములను గొని గోవిందునితో యుద్ధమాడసాగిరి ఇట్లు అన్ని వైపులనుండి కోట్లకొలదిగ దైత్యులు అన్ని విధముల ఎదిరించి యుద్దమొనర్పగా వారితో పోరిపోరి విష్ణుడు కొంచెము శ్రమచేందిన భుజములు కలవాడై ఆతుముల రణరంగమున గరుడునితో “గరుత్మన్! నీవు ఇంతవరకీ యుద్ధమున శ్రమచెందనేలేదనుకొందును ఇది నిజమైనచో మథనుని రథముకడకు నన్ను తీసికొని) పొమ్ము నీవును అలసితివా ముహూర్తకాలము యుద్దమునుండి తొలగి దూరముగ (నన్ను ను తీసికొని) పొమ్ము” అనెను మహాసమర్థుడగు విష్ణుడిట్లు పలుకగా గరుడుడు ఘోరాకారుడగు మథనుని దగ్గరకు (విష్ణునితో) పోయెను

ఆ దైత్యుడు తన ఎదుట శంఖచక్ర గదాధరుడుండుట చూచి వాడి దరగల భిండివాలముతో అతని వక్షమున కొట్టెను విష్ణువామహాయుద్ధమున ఆప్రహారము లెక్క చేయక యే శుద్ధి చేయబడి లోహపు మొనలుకల ఐదు బాణములను మర ల ఐదు బాణములను ఆకర్ణముగ ధనువు లాగి విడిచి వాని స్తనా న్తరమున ప్రయోగించేను మర్మములందు దేబ్బలు తిని ఆ దై త్యేంద్రుడు హరిని బాణములతో కంపింపజే నెను వాడొక ముహూర్తకాలము విశ్రాంతినొంది అగ్ని తేజస్క మగు పరిఘను గొని జనార్దనుని కొట్టేను విష్ణువా దెబ్బతో కొంచెము దిమ్మరపోయెను

ఆంతట శాశ్వతుడగు మాధవుడు కోపముతో గ్రుడ్లు గిరగిర త్రివ్పుచు గదనుగొని దానితో వాని మేషమును పిండిచే సెను దాన ఆ దై త్యేంద్రుడు ప్రళయకాలమున పర్వతమువలే ఆమేషమునుండి పడెను వీర్యశాలియగు ఆ దానవుడు భూమి పై పడగా దైత్యులు ఆ యుద్ధ కర్మమునందు తా మొంటరివారై పోయినట్టు అవసాదము (శక్తిహీనత) నొందిరి అభిమానవంతులగు దానవులట్లగుటచూచి దానవేశ్వరుడగు మహిషుడు స్వబాహుబల మాశ్రయముగా ప్రకోప వశమున రక్తనేత్రుడయి రౌద్రుడయి ఎదిరించి పోరెను; వాడి వాదర గల శూలముతో హరిని నొప్పించెను; వీరుడాతడు శక్తి ఆయుధము)తో గరుడుని బలముగా కొటైను అంతట దైత్యుడు నుహాపర్వత గుహవలె నోరు తెరచి గరుడునితో కూడ అచ్యుతుని మింగగోరెను అది చూచి హరి వాని తలపునెరిగి మహాబలుడతడు దివ్యాస్త్రములతో వాని నోరు నింపెను పిమ్మట దివ్యాస్త్రములతో అభిమంత్రించిన దివ్య బాణములతో వానిని కొట్టేను వాడాదెబ్బలుతిని పర్వ తమువలే వెల్లకిల పడెను; మరణించనుకూడ మరణించెను మహిషుడు క్రింద పడియుండగా చూచి కేశవుడు వాని నుద్దేశించి ఇట్లు స్పష్టముగా పలికెను *మహిషాసురా! నీవిచట నాయస్త్రములతో మృతినొందదగవు; సాక్షాత్తుగ బ్రహ్మ (పద్మ సంభవుడు) నీవు స్త్రీ చేతిలో మరణింతువని పలికెను కావున జీవితమును కాపాడుకొనుచు రణరంగమునుండి శీఘ్రముగా పొమ్ము

(*మరణించిన తరువాత కొలది సేపటివరకు మృతజీవుడు లింగ శ రీరముతో ఆటనే ఉండును కావున ఇట కేశవుడు మహిషునుద్దేశించి పలి కెను అనుట సమంజసమే)  

ఆ దైత్యుడు మహిషుడు పరాజ్ముఖుడై పోగానే శుంభదైత్యుడు కోపముతో పెదవులను కోరుకుచు కనుబొమల ముడితో వికృతముఖుడై కరముతో కరము పిసికి కొని భయంకర ధనువు పునేను సర్పములవంటి బాణములు గొని వింటసారి ఎక్కించి వాటిని సంధించి చిత్రముగ యుద్ధము చేయు యోధుడును దృఢముష్టితో బాణప్రయోగము చేయగలవాడు నగు ఆ శుంభుడు వాటితో గరుడుని విష్ణుని నొప్పించెను జ్వలించు అగ్ని జ్వాలలతో సమములును శీఘ్రములును సంఖ్యాతీతములును నగు బాణములతో వాడు హరి గరుడులనట్లు చుట్టివేయగా ఆ దైత్యేంద్రుని శరములనొప్పి నందిన విష్ణుడు యమసమానమగు శ క్తి పూని దానితో పర్వత సమానమగు వాని వాహన మేషమును అట్టివాడేయగు ఆ దైత్యుని కూడ పిండిచే సెను మేషము చచ్చెను ఆదనుజాధిపతి చచ్చిన మేషమునుండి దుమికి నేలపయి నిలువబడెను హరి వాని పై ప్రళయాగ్ని వంటి బాణములను ప్రయోగించేను అ హరి గ్రుడ్లు త్రిప్పుచు ఆకర్ణాంతము ధనువు నారి లాగి మూడు బాణములతో వాని భుజమును చీల్చి ఆరింటిని వాని తల పై నాటి పదింటితో ధ్వజమును కో టైను ఆ దేబ్బలతో శుంభ దైత్యుడు రక్త ప్రవాహముతో నిండి వ్యథనొందెను; ధైర్యమునుండి కొంత చలించేనుకూడ; అది చూచి హరి “శుంభాసురా! కొలది దినములలో కుమారి చేతిలో చంపబడెదవు; ఇప్పటికి యుద్ధము మానుము; మూఢా వ్యర్థముగా యుద్దమునకై తహతహ పడెదవేల? నా చేతిలో నీవు చావదగవు” అనెను విష్ణుని నోటినుండి శంభుని చావుమాట విని నీమీ విష్ణుని నేదుర్కొ నేను; పొగాకసమున నిలిచి ప్రచండగద ఎత్తీ గరుడునీ కో టైను జంభుడనువాడు సొన పట్టిన రత్నముల విచిత్ర కాంతులతో వెలుగు పరిఘతో విష్ణుని తలపయి కొట్టెను అట్లు అప్పుడు గరుడుడును హరియు ఆ దానవుల చేతిలో విషమ ప్రహారములు తిని దట్టములగు అగ్నులవలే పడిపోయిరి ఈ కార్యము చూచి దైత్యు లందరును బిగ్గరగా గర్జించిరి సింహనాదములు చేసిరి ప్రచండులై ధనుపుల నారులను వేగముగా సారించి ఆస్పో టించి భూమిని బ్రద్దలు చేసిరి వస్త్రములను విసరిరి; శంఖములు ఆనక ములు గోముఖములు మొదలగు వాద్యములను మోగించిరి కొంత సేపటికి తెలివివచ్చి హరి గరుడునితో కూడి యుద్ధమునకు పెడ మయి మహాజవమున పారిపోయెను

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున గరుడునితో కూడిన హరి పారిపోవుటయను ఏబది యొకటవ అధ్యాయము