మత్స్య మహా పురాణము
271 - భవిష్యద్రాజానుకీ ర్తనము.
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పేను; బృహద్రథులును వీతిహోత్రులును అవంతులును అను రాజవంశములు గడ చిన తరువాత పులకుడను వాడు తన ప్రభుని వధించి తన కుమారుని రాజుగా ఆభి షేకించును; క్షత్రియులందరు చూచుచుండగనే పులకపు తుడగు ఈ బాలకుడు నయవర్జితుడు (రాజధర్మానుసారము యోగ్యత లేని వాడు) అయినను తనకు సామంతు లెల్లరు ప్రణతులు కాగా నరో త్తము డనిపించుకొని ఇరువది మూడేండ్లు పాలించును; తరువాత పాలకుడు ఇరువది ఎనిమిదేండ్లు విశాఖయూపుడు ఏబది మూడేండ్లు సూర్యకుడు ఇరువది యొక్క ఏండ్లు వాని కొడుకు నందివర్ద నుడు ముప్పది ఏండ్లు పొలింతురు; ఇట్లు ఈ ఐదుగురు రాజులును నూట ఏబది రెండు ఏండ్లు (నూట ఏబదియైదేండ్లని యుండవలయును) పాలించి నశింతురు; తరువాత శిశునాగుడు వారి కీర్తి యంతయు నశింపజేసి ఆ వంశము నణచి వారాణసియందు తన కుమారుని రాజుగా నిలిపి తాను గిరివ్రజ మాశ్రయముగా చేసికొని పాలించును; అతడు నలువది ఏండ్లును అతని కుమారుడు కాక వర్ణుడు ఇరువది యా రేండ్లును క్షేమధన్వుడు ఇరువది యారేండ్లును మేమజిత్తు నలువది ఏండ్లును వింధ్య సేనుడు ఇరువది ఎనిమిది ఏండ్లును కాణ్వాయనుడు తొమ్మిది సండ్లును అతని కుమారుడు భూమిమిత్రుడు పదునాలుగేండ్లును అజాతశత్రుడు ఇరువది ఏడు ఏండ్లును వంశ కుడు ఇరువది నాలుగేండ్లును ఉదాసి ముప్పది మూడేండ్లును నందివర్ధనుడు నలువదేండ్లును మహానంది నలువది మూడేండ్లును రాజ్య మేలుదురు; ఇట్లు ఈ శిశునాగక వంశపువారగు క్షత్ర బంధువులు (సుశ త్రియులు కానివారు) మూడు వందల ఆరువది ఏండ్లు పాలింతురు; (ఈ చెప్పినవి కూడగా 350 మాత్రము అగును.)
ఈ శిశునాగులు పాలించుచున్న కాలమందే ఆయా దేశ భాగములందు ఐక్ష్వాకులు ఇరువది నలుగురును పాంచా లురు ఇరువది ఏడుగురును కా శేయులు ఇరువది నలుగురును హైహయులు ఇరువది ఎనిమిది మందియు కళింగులు ఇరువది. ఇద్దరును అశ్మకులు ఇరువది యెదు మందియు గురువులు ఇరువదియారుమందియు మైథిలులు ఇరువది ఎనిమిది మందియు కూర సేనులు ఇరువది ముగ్గురును వీతిహోత్రులు ఇరువది మందియు పాలింతురు; మహానందికి శూద్ర స్త్రీయందు కలి యంశమున మహాపద్ముడను సర్వక్ష తాంతకుడగు కుమారుడు కలుగును; ఆది మొదలు {ఆ వంశపు రాజులు శూద్ర యోనులు (జాతీయులు) అగుదురు; భవిష్యదదృష్ట పేరితుడై సర్వ క్షత్రియులను నశింపజేసి అతడు ఈ పృథివియందు ఏకరాట్టును ఏకచ్చతుడును అగును; అత డట్లు ఎనుబది ఎనిమిదేండ్లు పాలించును; ఆ మహాపద్ముని కుమారులు పండ్రెండు మందియు సుమాల్యుడు మొదలగు వారు (ఏడాది కొకడు చొప్పుననే మో) పందెం డేండ్లు పాలింతురు; అటు తరువాత కౌటిల్యుడు వారిని పెల్లగించి చంద్రగుప్తుని రాజ్యాభిషిక్తుని చేయును; అతడు నూరేండ్లు రాజ్య మేలును; ఆటు తరువాత వారి రాజ్యము మౌర్యులలో అనంతర రాజులకు పోవును; తరువాత చంద్రగుప్తుని పుత్రుడు శతధన్వు డారేండ్లు వాని కుమారుడు బృహద్రథుడు డెబ్బది ఏండ్లు తరువాత శ కుడనువాడు ఇరువది యారేండ్లు వాని ముని మను మడు డెబ్బది ఏండ్లు పాలింతురు.
(షట్త్రింశతి * షట్త్రిశంత్తు)
Summary of chapter 271 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya transitions to historical chronicles, providing a detailed prophetic recount of the royal dynasties that rule Bhāratavarsha during the Kali Yuga epoch. Bhagavān Matsya outlines the succession of royal lines in Magadha, including the Śishunāga dynasty, the Nanda rulers led by Mahāpadma Nanda who subjugated Kshatriya clans, the glorious Maurya dynasty founded by Chandragupta under Chāṇakya's guidance, and Emperor Ashoka. The text documents ruler names, regnal durations, and political shifts, highlighting the continuous flow of historical time across the subcontinent.