మత్స్య మహా పురాణము
256 - గృహ నిర్మాణమునకై దారువుల తెచ్చుట-ఆయవ్యయగణనము.
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇక మీదట గృహనిర్మాణ ప్రక్రియలో ఉత్తము(ముఖ్యాంశమగు దొర్వా హరణము (దారువులను సేకరించి తెచ్చుకొను పద్దతి) చెప్పెదను; దార్వాహరణమున కై బయలుదేరుటలో నక్షత్రములలో ధనిష్టాపంచక మును విష్టిగ భదా) మొదలగు దుష్ట సమయములను విడువవలయును; ఇవి కానిదియు దైవజ్ఞుడు నిర్దేశించినదియు నగు శుభ సమయమున వనమునకు పోవలయును; ఎల్లప్పుడును మొదట తాను నరుక దలచిన వృక్షమునకు పూజాపూర్వకముగా బలిచేయవలయును; గృహనిర్మాణమునకుద్దేశించి నరకిన వృక్షము ఈశాన్యదిశలో పడుట మంచిది: ఇట్లు కాక పడుట ఆంతగా మంచిదికాదు: పాలుగల (మర్రివంటిది - పనులు నివసించుచుండినది .వాయువుతో ఆగ్నితో పీడింపబడునది. ఏనుగు విరుగగొట్టబడినది పిడుగుపడి చెడినది నగము ఎండినది విరిగి ఎండినది చైత్య (ప్రార్థనాపూజాస్థాన) దేవాలయనదీసంగమ శ్మశాన కూపత టాకాది ప్రదేశ ములందలిదియగు వృక్షమునుండి దారువును గ్రహించుట శ్రేయోదాయక ముకాదు; ముండ్ల చెట్లును నీవనింబ విభీతక శ్లేష్మాత కా మ దొరువును - గృహ నిర్మాణమున వాడరాదు: అసనము అశోకము మధుకము సర్జము సాలము చందనము పనసము దేవదారు హరిద్రకములు - వీని దారువులు (కలపలు) మంచివి: ఇండ్ల నిర్మాణము నకై ఒకటి. రెండు లేదా మూడు విధములగు దారువుల మాత్రము వాడవలయును; ఆంతకంటే ఎక్కువ విధములగు దారువులను ఉపయోగించుట భయప్రదము: శింశుపా శ్రీపర్లీ-ఎందుక-స్యందన-పనస-సరళార్జున-దారువులు మరివేనితోను కలుపక ఒకే విధమగునవి వాడుట చాల మంచిది; చెట్టు నరకునపుడు దాని దొరుఖండము పచ్చగానున్న చో ఉడుము. మంజిష్ఠవలే ఎర్రగానున్న చో కప్ప-నీలముగానున్న చో చిలుక ఒక పిలవర్ణ మైనచో ఎలుకలు - వజ్రపువన్నె యైనచో జలము. అందు కలవని తెలియవలయును. చిట్లిన గర్భదారువును గృహనిర్మాణమున నుపయోగించరాదు: మొదట ఇట్లు నరకి. యుంచిన దారువును ఆది ఆరిన తరువాత శుభశకున సమయమందు వచ్చి తీసికొని పోవలయును.
ఆయగణితము.
ఇంటి వెడల్పును పొడవుతో గుణించి వచ్చిన దానిని ఎనిమిదితో భాగించగా (పొxవె%8 ) వచ్చిన శేషములలో 1. ధ్వజ. 2. ధూమ. 3. సింహ; 4, శునక. 5. వృషభ, 6, ఖర. 7. గజ, 8(o) ధ్వాంక్ష-ఆయములను తెలుపును; (పొడవు వెడల్పులు మూరలలో లేక్కకు తీసికొనుటచేత ఈ పొడవు వెడల్పులను పరస్పరము గుణించగాను - దానిని భాగించగాను వచ్చిన సంఖ్యలు చదరపు మూరలను తెలుపును;) ఈ ఎనిమిది ఆయములును వరుసగా తూర్పునుండి ఈశాన్యము వరకు ఎనిమిది దిక్కులయందుండునని తెలియవలయును: వీనిలో ధ్వజాయము అన్ని దిక్కులకును ఆభి ముఖమై-వి శేషించి పశ్చిమాభిముఖమై గృహనిర్మాణ(వాస్తు) స్థానమునందు తూర్పుదికయందుండును: సింహాయము దక్షిణ దిశ యందు ఉత్తరాభిముఖమయి యుండును: వృషభాయము పశ్చిమ దిశ యందు పొగ భీముఖమైయుండును: గజాయము ఉత్తర దిశ యందు డ క్షీణాభిముఖమై యుండును: ఈ ఆయములు మంచివీ: విదిశల (మూలల) యందు వచ్చిన 2.4. 6-8 ఆయములు మంచివి కావు. (ఈ వ్యవస్థను 3x3=9 గడులుగల చక్రము వ్రాసి చూచుకొనునది.)
నక్షత్రగణనము-వ్యయగణనము.
ఇట్లే గృహపు పొడవు వెడల్పులను పరస్పరము గుణించగా వచ్చిన చదరపు హస్తముల సంఖ్యను ఎనిమిదిచే గుణించి ఇరువది ఏడిటిచే భాగించగా పోxవెx8/27 వచ్చు శేషమును నక్షత్రమందురు; ఈ నక్షత్ర సంఖ్యను ఎనిమిదిచే భాగించగా వచ్చు శేషమును వ్యయమందురు; ఇట్లు గణన చేయగా వచ్చిన ఆయవ్యయములలో ఆయమధికమగుట గృహ స్వామికి శుభమునిచ్చును; అని భగవానుడగు హరి చెప్పెను.
ద్విజవర్యులను ముందుంచుకొని పూర్ణకుంభమును దధి అక్షతలు మామిడి చివుళ్ళు పుష్పములు- ఫలములు తీసి కొని శోభాయమానముగా బయలుదేరిపోయి విప్రుంకు హిరణ్య వస్త్రాదికమునిచ్చి మాంగల్యమును శాంతియు కలుగవలే నను తలపుతో గృహస్వామి నూతన గృహమున ప్రవేశించపలయును. గృహ్యోక్త కల్ప విధానానుసారముగ గృహవాస్తు శాంతి విధానమున హోమమును బలి కార్యమును నిర్వర్తించ వలయును; బ్రాహ్మణ శేష్టులను భక్ష్యభోజ్యములతో తృప్తినందించవలయును; శుక్ల వస్త్రములతో గృహమున ప్రవేశించ వలయును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున వాస్తు శాస్త్రమున దార్వాహరణాది కథనమను రెండు వందల ఏబది ఆరవ అధ్యాయము.
వాస్తు శాస్త్రము ముగిసినది.
Summary of chapter 256 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents the precise ecological and ritual guidelines for selecting, harvesting, and processing timber for building construction. Bhagavān Matsya instructs builders to inspect forest trees, prohibiting the cutting of trees residing in cremation grounds, holy shrines, public roads, or those inhabited by birds, sacred spirits, or struck by lightning. Sacred trees like Sāla, Asana, Teak, Chandana, Devadāru, and Khadira are recommended for structural beams and doors. The text outlines preliminary prayers offered to forest Deities before felling selected trees, followed by proper seasoning procedures to ensure durable, pest-resistant timber for long-lasting structures.