మత్స్య మహా పురాణము
191 - శుక్ల తీర్థ మాహాత్మ్యము॥
మార్కండేయుడిట్లు చెప్పెను: తరువాత భార్గవేశ తీర్థము; అచ్చట విష్ణువు మహాబల పరాక్రములగు దానపు లతోడి యుద్ధమున వారి చేతిలో ఓడేను॥ పిమ్మట అతని హుంకారము చే వారు నశించిరి; ఆందు స్నానమాడినచో సర్వ పాప ముక్తుడగును; ఇక శుక్ల తీర్లోత్పత్తి తేలి పెదను వినుము॥ నానా గైరిక ధాతువులతో విచిత్ర రూపమును బాల సూర్య సమానమును కాచిన బంగారు వన్నె కలదియు వజస్పటికమణి సోపానములు కలదియు చిత్ర శిలాతలములతో కట్టిన యరుగులు కలదియు బంగారుతో చేయబడినదియు నాసో పుష్పోప శోభితమునునగు హిమవత్పర్వత శిఖరమునందు సర్వ జ్ఞుడును ప్రభుడును అవ్యయుడును లోకానుగ్రహ కర్తయు శాంతుడును స్కంద నంది మహాకాళ వీర భద్రాది ప్రమథ గణ పతులతోను ఉమతోనుకూడి కొలువు తీరినవాడునగు మహాదేవుని మార్కండేయు డిట్లడిగేను: దేవదేవా! మహాదేవా! బ్రహ్మ విష్ట్వింద్రాదులచే స్తుతించబడువాడా! భగవన్! భూత భవిష్యద్వర్తమాన ప్రభూ! మ హేశ్వరా! సంసార భీతుడనయిన నాకు సర్వపాప నాశమునకు సుఖోపాయమగు ఉత్తమ తీర్థ మేదియో తెలుపుము॥ " అనగా ఈశ్వరుడిట్లనెను: విప్రాః మహాప్రాజ్ఞా! సర్వశాస్త్ర విశారదా! సుందరుడా! (నాకు ప్రియమగువాడా!) మనువు ఆత్రి కశ్యపుడు అంగిరుడు - యాజ్ఞవల్క్యుడు శుక్రుడు యముడు ఆప స్తంబుడు సంవర్తుడు కాత్యాయనుడు బృహస్పతి నారదుడు గౌతముడు ఇట్టి ధార్మికులందరును సేవించునదియు నర్మదా నదియంద లిటియు నగు శుక్ల తీర్థ మునకు ఋషి సంఘములతో కూడిపోయి సేవింపుము; ఇది గంగా కనఖల ప్రయాగ పు రగయా కురు క్షేత్రములవలేనే పుణ్య ప్రదము; సూర్యగ్రహణ సమయమందును పగలుకాని రాత్రి కాని ఎపుడయినను దానిని దర్శించినను స్పృశించినను అందు స్నానమాడినను దాన జపతపములు హోమము ఉపవాసము చేసినను మహా పుణ్య ఫలమబ్బును॥
ఆచట చాణక్యుడను రాజర్షి సిద్ధి పొందెను; యోజన వైశాల్యముతో వృత్తముగా ఈ తీర్థ క్షేత్రమున్నది; ఇది సర్వపాప నాశకమును మహాపుణ్య ప్రదమును॥ ఇందలి చెట్టుకొన చూచినను బ్రహ్మహత్య తొలగును; దీని జలమును చూచినంతనే భ్రూణ హత్యాపాపము తొలగును; వైశాఖ మాఘ కృష్ణ చతుర్దశులందు కైలానమునుండి వచ్చి నేనచట ఉమతోకూడి నన్నిహితుడనై యుందును; ఆపుడు దైత్యదానవ గంధర్వసిద్ద విద్యాధరాప్పరో నాగులందరును సర్వకామ భోగ ప్రదములగు కామ గమన విమానముల పై గగనమున నిలుతురు; ఆ తీర్థము తన కడకు వచ్చిన ధార్మికుల ఆ జన్మ సంచిత పాపములను రజకుడు వస్త్రపు మురికిని కడిగి దానిని శుక్ల మొనర్చినట్లు శుద్ద పరచును; ఇంతకు మించిన తీర్థము ఇది వరకు లేదు; ఇక ముందుండదు; మానవుడు బాల్యమున చేసిన పాపములన్నియు ఇందు ఒక ఆహోరాత్ర ముప వసించినంతనే నశించును; ఇందు తప మోబ్రహ్మచర్యమో యజ్ఞమో దానమో దేవార్చన మో చేయుటచే కలుగు భగవతీతి వేరొక చోట వందల కొలదిగా యజ్ఞములు చేసినను కలుగదు;
పుణ్యకరమగు కార్తిక కృష్ణ చతుర్దశి నాడు ఆ తీర్థ మందుపవసించి పరమేశ్వరునకు నేతితో అభి షేకము॥ జరిపినచో అతని ఇరువది యొక తరములవారు శివలోక ప్రాప్తులగుదురు; మహా పుణ్య ప్రదమును ఋషి సిద్ద ని షేవితము నగు ఈ తీర్థ మున స్నానము చే పునర్జన్మ ముండదు; ఇచట వృషభ ధ్వజునర్చించి అచటనున్న బ్రహ్మకపాలమును పుష్పా దులతో నింపినచో శివుడు సంతుష్టుడగును; వస్త్రము పై ఆర్థనారీశ్వరమూర్తిని లిఖింపజేసి ఆర్చించవలెను; శంఖ తూర్య ధ్వనులతోను బ్రాహ్మణుల వేద ధ్వనులతోను నృత్య గీతాది మంగళములతోను జాగరణము చేయవలయును; ప్రభాత మున ఆ తీర్థమున స్నానమాడి దేవతా పూజలు జరిపి శివవ్రత పరులు శుచులునగు ఆచార్యులను భుజింపజేసి యథాశ క్తిగ వారికి దక్షిణలనిచ్చి వారిని ప్రదక్షిణించవలెను॥ తరువాత దేవుని దర్శింప పోవలెను; ఇట్లు చేసినవారు దివ్య విమానమారో హించి అప్సరోగములు స్తుతించుచుండ శివలోక మేగి శివునితో సమానముగ ఆయా బలగములతో కూడి కల్పాంతము॥ వరకు అందు సుఖింతురు॥ శుక్ల తీర్థమునందు సువర్ణ దానముచేసి శివునకు నేతియభి షేకము జరిపించి కుమారస్వామి నర్చించిన స్త్రీ పదునలుగు రింద్రులున్నంత కాలము స్వర్గమున సుఖించును; పూర్ణిమ చతుర్దశి సంక్రాంతి విషవములు - వీటియందు ఇచట స్నానమాడి ఉపవసించి జీత మనస్కుడే శ్రద్దాయుక్తుడే యథాశక్తిగ దానము చేసినచో హరి శంకరులకు ప్రీతి కలుగును॥ శుక్లతీర్థ ప్రభావమున ఆ పుణ్యఫలము అక్షయమగును: దరిద్రుడును ఆనాధుడో ననాధుడో యగు విప్రునకిచట పెండ్లి జరిపించినచో ఆ విప్రుని శరీరమందును ఆతని వంశము వారి శరీరములందును కల రోమము లన్నీ వేల సంవత్సరములు శివలోకమందు సుఖించును॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున శుక్ల తీర్థ మహిమాను వర్ణనమను నూట తొంబది ఒకటవ అధ్యాయము॥
Summary of chapter 192 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the supreme spiritual efficacy of the Narmadā-Sāgara-Saṅgama, the holy confluence where river Narmadā merges into the western ocean. Bathing at this grand confluence during lunar eclipses or solar transits grants spiritual merit equivalent to performing a hundred Rājasūya sacrifices, wiping away all past sins and granting immediate elevation to the celestial realms.